dmitry peskov
-
ట్రంప్‌కు రష్యా షాక్.. హారిస్ వైపే మొగ్గు!
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా తాజా వైఖరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి విషయంలో పుతిన్‌ను సమర్థించే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌వైపు కాకుండా డెమొక్రాట్ అభ్యర్థి కమలాహారిస్వైపు రష్యా మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయమై తాజాగా ఓ టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పోరులో తలపడుతున్న అభ్యర్థుల్లో ట్రంప్ కంటే కమలాహారిసే అంచనా వేయదగ్గ వ్యక్తని చెప్పారు. అయితే తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తిగా అమెరికా అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే రష్యా, ఉక్రెయిన్ సమస్య పరిష్కరిస్తామని ట్రంప్ ఇస్తున్న హామీని పెస్కోవ్ కొట్టిపారేశారు. రష్యా,ఉక్రెయిన్ సమస్య టక్కున పరిష్కరించేందుకు ట్రంప్ దగ్గర మంత్రదండమేమీ లేదన్నారు. కాగా, గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చారు. ట్రంప్ కంటే బైడెనే బెటరని ఓసారి ట్రంప్‌ను కోర్టులను అడ్డుపెట్టుకుని అధ్యక్ష ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని భిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచేలా... రష్యా వ్యూహం
Kremlin called for "pressure" on Kyiv: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి జపోరిజ్జియాలో ఉన్న అణుకర్మాగారంపై రష్యా దాడి చేస్తుందంటూ ఉక్రెయిన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. దీని వల్ల యూరప్ దేశాలకు అత్యంత ప్రమాదమని చెర్నోబిల్ అణుప్రమాదం లాంటిది మరొక విపత్తు ముంచుకొస్తుందని హెచ్చరిచ్చింది కూడా. రష్యా దూకుడుకి అడ్డుకట్టవేయమని పశ్చిమ దేశాలను కోరింది. ఐతే రష్యా తాము అణుకర్మాగారంపై దాడుల జరపలేదని వాదించింది. కేవలం తాము ఆ ప్రాంతాన్ని అధినంలోకి తెచ్చుకున్నాం అని నొక్కి చెప్పింది. అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం రష్యా అణు కర్మాగారంపై క్షిపిణి దాడులు చేస్తుందని, అందుకే ఆ కర్మాగారాన్ని మూసేశామని చెప్పారు. పైగా కర్మాగారం చాలావరకు దెబ్బతిందని ఇక ఏ క్షణమైన రేడియోషన్స్ లీకవుతాయంటూ యూరప్ దేశాలను హెచ్చరించారు జెలెన్స్కీ. రష్యా కూడా ఆయా వ్యాఖ్యలన్నింటిని ఖండిస్తూ వచ్చింది. ఈ విషయం పై ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. దీంతో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రోస్సీ తాను స్వయంగా ఆ ప్లాంట్‌ని పర్యవేక్షించడానికి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తాము చాలాకాలంగా దీని కోసమే ఎదురుచూస్తున్నాం అని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్‌పై ప్రపంచ దేశాల నుంచి మరింత ఒత్తిడి పెరగుతుందన్నారు. యూరోపియన్ ఖండాన్ని ప్రమాదంలోకి నెట్టేయకుండా అన్ని దేశాలు ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. తాము కూడా ఈ అణు కర్మాగారం ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గేలా కీవ్ పై ఒత్తిడి పెంచేందుకు పిలుపునిస్తున్నాం అని చెప్పారు. రాఫెల్ గ్రోస్సీ పర్యటనతో ఐఏఈఏ మాస్కో నియంత్రిత భూభాగాల్లో భద్రతను నిర్ధారించడమే కాకుండా ప్రబలంగా ఉన్న నష్టాలను కూడా పరిగణలోని తీసుకుంటుందని తెలిపారు. -
రష్యా సాధించిందేమీ లేదు: పుతిన్ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
యుద్ధం ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటిదాకా సాధించిందంటూ ఏమీ లేదని ఆయన అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ స్వయంగా అంగీకరించడం విశేషం. సీఎన్ఎన్ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు బదులుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సైనిక చర్య ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక మేరకే సాగుతోందన్నారు. చదవండి: (Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా) మరోవైపు యుద్ధం ద్వారా ఆశించిన మూడు ప్రధాన లక్ష్యాల సాధనలో రష్యా పూర్తిగా విఫలమైందని అమెరికా పేర్కొంది. ‘ఉక్రెయిన్ను లొంగదీసుకోవడం, అధికారాన్ని, ప్రతిష్టను ఇనుమడింప జేసుకోవడం, పాశ్చాత్య దేశాలను విభజించి బలహీనపరచడమే లక్ష్యాలుగా ఈ హీనమైన యుద్ధానికి రష్యా తెగబడింది. కానీ నెల రోజుల యుద్ధంలో జరిగింది అందుకు పూర్తిగా వ్యతిరేకం. అనైతిక యుద్ధంతో ప్రపంచం దృష్టిలో రష్యా ప్రతిష్ట పూర్తిగా అడుగంటింది. ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుదేలై దాని అధికారమూ బలహీనపడింది. రష్యా దుడుకు వైఖరి వల్ల పశ్చిమ దేశాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఐక్యమయ్యాయి’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సలివన్ చెప్పుకొచ్చారు. అమెరికా ముందుచూపే ఇందుకు ప్రధాన కారణమన్నారు. చదవండి: (ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ఆపితే అందుకు మేం సిద్ధం) -
అమెరికా.. రష్యా మధ్య మళ్లీ వార్?
అమెరికా.. రష్యా.. ఒకప్పుడు ప్రపంచంలో ఈ రెండే అగ్ర రాజ్యాలు. తర్వాతి కాలంలో యూఎస్ఎస్ఆర్ పలు దేశాలుగా విడిపోవడంతో రష్యా ప్రాభవం కొంత తగ్గినా, ఇప్పటికీ కొంతవరకు ఆధిపత్యం చూపిస్తూనే ఉంది. అయితే, డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రెండు దేశాల మధ్య సబంధాలు కాస్త మళ్లీ అటూ ఇటూగా కనిపిస్తున్నాయి. అమెరికన్ అధికారులు, అమెరికా మీడియాలో ఉన్న హిస్టీరియా కారణంగా తమ ఇరు దేశాల మద్య సంబంధాలు దెబ్బతింటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కొవ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో రష్యా హ్యాకింగ్‌కు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అసలు ఏ దేశానికైనా వాళ్ల సొంత ఎన్నికల వ్యవస్థలో గానీ, వాళ్ల స్వదేశీ వ్యవహారాల్లో గానీ మరో దేశం జోక్యం చేసుకుంటోందన్న ఆలోచన రావడమే బలహీనతకు నిదర్శనమని పెస్కొవ్ అన్నారు. అమెరికన్ రాజకీయాల్లో తాము వేలు పెట్టేది లేదని, అసలు అలాంటి ఆలోచనే తమకు లేదని స్పష్టం చేశారు. ఇదంతా అమెరికన్ అధికారులు, అమెరికా మీడియాలో వస్తున్న హిస్టీరియా తప్ప మరేమీ కాదని.. దీనివల్ల అనవసరంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలోనే ఉందని.. అక్కడ సుస్థిరమైన ప్రభుత్వంతో తాము సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. చర్చలకు తగిన వాతావరణం లేకపోతే.. అది చాలా దురదృష్టమని పెస్కొవ్ వ్యాఖ్యానించారు. ఇది భావోద్వేగ పరమైన ఉగ్రవాదం అని విమర్శించారు. అతి కొద్ది కాలం పాటు ట్రంప్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న మైక్ ఫ్లిన్‌తో సంబంధాల గురించి అమెరికాలో రష్యా రాయబారి సెర్గీ కిస్లియాక్‌ను అమెరికా క్షుణ్ణంగా పరిశీలించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనల వల్ల పరస్పర విశ్వాసం దెబ్బతింటుందని, అయితే కొన్నాళ్ల తర్వాతైనా కాస్త విశాలంగా ఆలోచించాలని సూచించారు. కనీసం చైనా వాళ్లలాగైనా ఉండాలని చెప్పారు. వాళ్లు దశాబ్దాలు, శతాబ్దాల గురించి ఆలోచిస్తారని.. అందువల్ల వాళ్లతో తమ సంబంధాలు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు.