![Vladimir Putin Has Achieved Nothing so far Through War: Dmitry Peskov - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/24/russia.jpg.webp?itok=WHsyzAom)
యుద్ధం ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటిదాకా సాధించిందంటూ ఏమీ లేదని ఆయన అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ స్వయంగా అంగీకరించడం విశేషం. సీఎన్‌ఎన్ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు బదులుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సైనిక చర్య ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక మేరకే సాగుతోందన్నారు.
చదవండి: (Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా)
మరోవైపు యుద్ధం ద్వారా ఆశించిన మూడు ప్రధాన లక్ష్యాల సాధనలో రష్యా పూర్తిగా విఫలమైందని అమెరికా పేర్కొంది. ‘ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవడం, అధికారాన్ని, ప్రతిష్టను ఇనుమడింప జేసుకోవడం, పాశ్చాత్య దేశాలను విభజించి బలహీనపరచడమే లక్ష్యాలుగా ఈ హీనమైన యుద్ధానికి రష్యా తెగబడింది. కానీ నెల రోజుల యుద్ధంలో జరిగింది అందుకు పూర్తిగా వ్యతిరేకం. అనైతిక యుద్ధంతో ప్రపంచం దృష్టిలో రష్యా ప్రతిష్ట పూర్తిగా అడుగంటింది. ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుదేలై దాని అధికారమూ బలహీనపడింది. రష్యా దుడుకు వైఖరి వల్ల పశ్చిమ దేశాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఐక్యమయ్యాయి’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సలివన్ చెప్పుకొచ్చారు. అమెరికా ముందుచూపే ఇందుకు ప్రధాన కారణమన్నారు.
చదవండి: (ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ఆపితే అందుకు మేం సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment