doctors neglegance
-
ఆర్జీ కర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి!
బెంగాల్ వైద్యురాలిపై హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో.. ఘటన జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఓ యువకుడు మరణించాడు. అయితే తన కొడుకు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అతడి తల్లి ఆరోపిస్తోంది.వివరాలు.. కోల్‌కతాకు 25 కి. మీ దూరంలో ఉన్నహుగ్లీలోని కొన్నాగర్‌లో 28 ఏళ్ల యువకుడు విక్రమ్ భట్టాచాజీ నివాసముంటున్నాడు. ఇటీవల అతడిని ట్రక్కు ఢీకొట్టడంతో ఆర్జీకర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం బిక్రమ్ మరణించాడు. అయితే ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు అందుబాటులో లేరని, కొడుక్కి చికిత్స అందించడంలో ఆలస్యం చేయడం వల్లే మరణించినట్లు అతని తల్లి ఆరోపించింది.ఆసుపత్రికి వచ్చిన సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. చాలా సమయం వృధా అయింది. ఆ లోపు అతని సర్జరీ పూర్తి కావాల్సి ఉంది. కనీసం అత్యవసర వైద్యుడు కూడా లేడు’ అని ఆమె వాపోయింది. అయితే, ఆర్జి కర్ ఆసుపత్రి అధికారులు మాత్రం మృతుడి కుటుంబ వాదనలను తోసిపుచ్చారు. శుక్రవారం ఉదయం విక్రమ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వెంటనే ట్రామా కేర్‌కు తీసుకెళ్లారని వైద్య సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సప్తర్షి ఛటర్జీ పేర్కొన్నారు. అతని శరీరంపై తలపై పెద్ద గాయం అయ్యిందని, సీటీ స్కాన్ కోసం తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే సీటీ స్కాన్ చేస్తున్నప్పుడు విక్రమ్ ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు తెలిపాడు.కాగా గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై ఆర్జీ కర్ హాస్పిటల్ వైద్యులు నిరంతరం నిరసనలు చేస్తున్న తరుణంలో.. ఈ ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం
అనంతపురం న్యూసిటీ : అనంతపురం సర్వజనాస్పత్రిలో రోగులకు అందించే వైద్యసేవల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒకరి విధులు మరొకరు నిర్వర్తిస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది కూడా రోగుల సహాయకులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హీనంగా మాట్లాడుతూ గొడవలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పోకముందే అధికారులు మేల్కోవాలి. పాలనను గాడిలో పెట్టి.. వైద్యసేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యం ప్రశ్నార్థకం ♦ రెండ్రోజుల క్రితం ప్రమాదంలో గాయపడి ఎమర్జెన్సీ వార్డుకొచ్చిన రోగికి ఎంఎన్ఓ (మేల్ నర్సింగ్ ఆర్డర్లీ) కుట్లు వేస్తున్నాడు. సాధారణంగా కుట్లు మెడికల్ ఆఫీసర్/హౌస్‌సర్జన్ వేయాలి. కానీ ఎంఎన్ఓ కుట్లు వేసే సమయంలో ఎటువంటి సూది వాడుతున్నారో తెలియని పరిస్థితి. ఒకరికి వాడిన సూది మరొకరికి వాడితే ఆ రోగి ఆరోగ్యం ప్రశ్నార్థకమే. ఎంతసేపు వేచి ఉండాలో.. ♦ ఇక్కడ కనిపిస్తున్నది సర్వజనాస్పత్రిలోని జనన, మరణ రిజిస్ట్రేషన్ గది. బుధవారం ఉదయం 12 గంటలకే రిజిస్ట్రేషన్ గదితోపాటు రికార్డు రూంకు తాళాలు వేశారు. దీంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఎవరిది వారే తెచ్చుకోవాలి ♦ ఆస్పత్రిలో అడ్మిషన్లో ఉన్న మహిళలే మంచాలపై వేసుకోవడానికి బెడ్షీట్లు తెచ్చుకోవాలి. వాస్తవంగా ఆస్పత్రి సిబ్బందే పాత బెడ్సీట్లను తీసి కొత్త వాటిని రోజూ మార్చాలి. కానీ అటువంటి పరిస్థితి లేదు. రిపోర్టు కచ్చితమేనా..? ♦ రోగికి ఈసీజీ తీస్తున్న వ్యక్తి పేరు సుధాకర్. ఈయన ఎల క్ట్రీషియన్. రెండు నెలలుగా ఆస్పత్రి యాజమాన్యం ఈసీజీ టెక్నీషియన్ బాధ్యతలను ఈయనకు అప్పగించింది. గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి కచ్చితమైన రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. అర్హతలేని వ్యక్తులకు ఇటువంటి బాధ్యత అప్పగించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. మందులు తారుమారైతే.. ♦ ఆస్పత్రిలో మందులిస్తున్న వ్యక్తి ఫార్మసిస్టు అనుకుంటే పొరపాటే. ఇతను గతంలో అడ్మిషన్ కౌంటర్లో విధులు నిర్వర్తించే వారు. ఇటువంటి వ్యక్తిని తీసుకువచ్చి కీలకమైన మందులిచ్చే ప్రాంతంలో పని చేయిస్తున్నారు. రోగులకు ఒక మందుపోయి మరొకటి ఇస్తే ఏంటి సంగతని ఆస్పత్రి సిబ్బందే చర్చించుకుంటున్నారు. నోటి దురుసు ♦ సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తున్న వ్యక్తి నార్పలకు చెందిన నారాయణ, వారి బంధువులు. బుధవారం లేబర్‌వార్డులో తమ బంధువులను చూసేందుకు వెళ్లగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు. ‘గొర్రెల మంద’లా వెళ్తారనడంతో నారాయణ కుటుంబీకులు సెక్యూరిటీపై తిరగబడ్డారు. సెక్యూరిటీల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. -
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి
నార్నూర్(ఆసిఫాబాద్): ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు అన్నిరకాల వైద్యసౌకర్యాలు కల్పిస్తున్నాం.. ప్రతీకాన్పు సర్కారు దవాఖానాలో జరిగేలా చర్యలు తీసుకోవాలని గొప్పలు చెప్పుకోనే వైద్యశాఖ అధికారులు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని గుండాల గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మి (30) 9నెలల గర్భిణి శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మికి జైనూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన సుందర్షావ్తో గతేడాది వివాహమైంది. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. శనివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు స్కానింగ్ చేశారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్లు రిపోర్టు రావడంతో ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సైతం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రమాదమని భావించిన వైద్యులు ఆపరేషన్ కోసం తరలిస్తుండగా మహిళ మృతి చెందింది. సకాలంలో వైద్యం అందించి ఉంటే లక్ష్మి ప్రాణాలు దక్కేవని, వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సర్కారు ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
కాలు విరిగిందని ఆస్పత్రికి వెళ్తే..
సిద్దిపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి వైద్యులు లేక, సిబ్బంది పట్టించుకోక మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అడవిదాచారం గ్రామానికి చెందిన మిందె కనకయ్య(35) శనివారం రాత్రి జిల్లెల్ల క్రాస్ రోడ్డు నుంచి దాచారం బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో చిన్నలింగాపూర్ శివారులో జవహర్‌నగర్‌కు చెందిన గౌరవేని మహేశ్ బైకు ఇతని బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో కనకయ్య కాలు విరిగింది. దీంతో కనకయ్యను బంధువులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో దగ్గరలోని సిద్దార్ధ ఆస్పత్రికి రాత్రి 11 గంటల సమయంలో తీసుకువచ్చారు. పరీక్షించిన సిబ్బంది ఎక్స్‌రే, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి ఉదయం డాక్టర్ రాగానే చికిత్స చేస్తారని చెప్పి ఇంజక్షన్ ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత కనకయ్యకు ఇబ్బంది పడుతుండడంతో ఆస్పత్రి సిబ్బందిని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు పిలిచినా పట్టించుకోలేదు. ఉదయం వరకు చికిత్స అందించలేమని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాత్రి కనకయ్య పొట్ట బాగా ఉబ్బడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బందిని మరోసారి పిలిచారు. అప్పుడు బలవంతంగా వచ్చిన సిబ్బంది పేషెంట్ కండీషన్ సీరియస్‌గా ఉందని వెంటనే ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. రాత్రి 3 గంటల సమయంలో ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే కనకయ్య మృతిచెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కనకయ్య కుటుంబ సభ్యులు సిద్దార్ధ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే కనకయ్య మృతి చెందాడని ఆరోపించారు. ఉదయం ఆస్పత్రికి వచ్చిన డాక్టర్ పరిహారంగా రూ. 4 లక్షలు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ Ððవెళ్లిపోయాడని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై సిద్దిపేట వన్ టౌన్ పోలీసులను వివరణ కోరగా రోడ్డు ప్రమాదం జరిగిన విషయంపై ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని చెప్పారు. దీనిపై విచారణ చేసి అక్కడి పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు. -
వైద్యం కరువై నవజాత శిశువు మృతి
వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతోనే: బాధితులు శోకసంద్రంలో దంపతులు నీరుగారుతున్న మార్పు పథకం బంగారంపేట (పెళ్లకూరు): గర్భిణులపై ప్రత్యేక దృష్టిసారించి, వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడేందుకు, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ‘మార్పు’ కింద ఏఎన్ఎంలను నియమించింది. కానీ ప్రభుత్వం గర్భిణులపై చూపుతున్నామన్న శ్రద్ధ వాస్తవ విరుద్ధంగా ఉంది. బంగారుపేటలో శుక్రవారం తాజాగా చోటుచేసుకున్న సంఘటనతో మరోసారి ఇది రుజువైంది. వైద్యారోగ్య సిబ్బంది సరైన పోషకాహారం, ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడంతో బంగారుపేట గ్రామానికి చెందిన సమాధి శ్రీలక్ష్మికి పుట్టిన నవజాత మగబిడ్డ శుక్రవారం మరణించింది. నెలకిందటే తాళ్వాయిపాడుకు చెందిన ముస్సరత్జహకి సరైన వైద్యం అందక మగబిడ్డ మృతిచెందిన విషయం మరువక ముందే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో గర్భిణుల ఆరోగ్యంపై సిబ్బంది ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారో అర్థంచేసుకోవచ్చు. స్థానిక బీసీ కాలనీకి చెందిన శ్రీలక్ష్మికి తొలి, మలి కాన్పుల్లో ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మూడోసారీ శ్రీలక్ష్మి గర్భం దాల్చడంతో ఈ సారైనా మగబిడ్డ పుడతాడేమోనని భర్త బాలాజీ ఆశపడ్డాడు. అతను అనుకున్న విధంగానే ఈ సారి మగబిడ్డ జన్మించాడు.. అయితే ఎనిమిది నెలలకే ప్రసవం కావడంతో ఆ పిల్లాడు పుట్టిన వెంటనే మరణించాడు. దీంతో ఆ దంపతులిద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావడంతో 108 అందుబాటులో లేకపోవడంతో ఆటోలోనే నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మార్పు పథకం నీరుగారడంతోనే పుట్టిన పిల్లలు మృత్యువాత పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ‘మార్పు’ కింద తన పేరు రికార్డుల్లో నమోదైనా, వైద్యసిబ్బంది ఎలాంటి సదుపాయాలు కల్పించడం, ప్రతినెలా ఆస్పత్రుల్లో చూపించడం చేయలేదని బాధితులు తెలిపారు. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సాయిబాబాని వివరణ కోరగా.. దీనిపై ఎలాంటి సమాచారం లేదని, విచారించి చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.