with draw
-
విమానంలో మూత్ర విసర్జన: రాజీ కుదిరిందని ఫిర్యాదు చేయలేదు
ఎయిర్ ఇండియాలోని బిజినెస్ క్లాస్‌లో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్‌కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై డైరక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఇండియాని వివరణ కోరగా..వారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. తమ విమాన సిబ్బంది బాధిత మహిళకు సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించినట్లు తెలిపింది. అంతేగాక సదరు వ్యక్తి తాను ఫ్యామిలీ మ్యాన్నంటూ అరెస్టు చేయొద్దని ఆమెను వేడుకోవడంతో ఆమె ఫిర్యాదు ఉపసంహరించుకున్నారని, అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా...నవంబర్ 27ను న్యూయార్క్ నుంచి ఢిల్లీ విమానంలో జరిగిన ఘటనపై బాధిత మహిళ లేఖ రాయడంతో.. ఎయిర్ ఇండియా జనవరి 4న మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఫిర్యాదు చేసింది. పైగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ముంబై వ్యాపారవేత్త శంకర్ మిశ్రాగా వెల్లడించింది. ఆ వ్యక్తి విషయమై ఎయిర్‌పోర్ట్‌లో ఎలర్ట్ ప్రకటించిడమే గాకుండా పోలీసులు ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాదు ఎఫ్ఐఆర్లో భాగమైన ఆ లేఖలో భాధిత మహిళ.. విమాన సిబ్బంది సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ అతనితో మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపింది. పైగా అతన్ని సిబ్బంది తన వద్దకు తీసుకువచ్చారని...అతను ఏడుస్తూ..క్షమాపణలు చెప్పడమే గాక తనకు కుటుంబం ఉందని, తన భార్య, బిడ్డ బాధపడకూడదంటే.. మీరు ఫిర్యాదు చేయకూడదంటూ తనని వేడుకున్నాడని తెలిపారు. వికృత ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తితో చర్చించేలా చేయడంతో.. తాను దిక్కుతోచని స్థితిలో పడిపోయానని చెప్పింది. అతను అలా కన్నీళ్లు పెట్టుకోవడంతో..తాను అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేయలేకపోయానని లేఖలో తెలిపింది. ఐతే అతను చేసింది క్షమించరాని నేరం అని, అలాగే విమాన సిబ్బంది సరైన అవగాహన లేనివారని, అందువల్లే ప్రయాణికుల భద్రత కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపణలు చేశారు. అంతేగాదు విమానంలో ప్రయాణికులకు ఎంత మోతాదు వరకు ఇవ్వాలే సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఈ సున్నితమై ఘటనపై క్రియాశీలకంగా వ్యవహరించడంలో కూడా విఫలమైందటూ ఆమె లేఖలో వివరించారు. (చదవండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!) -
సైబరాసురులు దోచేస్తున్నారు..కంపెనీల పేరులో వల
‘ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఇంట్లోనే కూర్చుని నెలకు లక్షలాది రూపాయల్ని స్పందించే అవకాశం’ అంటూ విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఫోన్‌కు రెండు నెలల క్రితం మెసేజ్ వచ్చింది. ఆశతో మెసేజ్ కింద ఉన్న వెబ్‌లింక్‌ను క్లిక్ చేయగా.. ఓ ప్రముఖ కంపెనీ పేరిట వెబ్సైట్ తెరుచుకుంది. కంపెనీలో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు పంచుతామని అందులో పేర్కొనడంతో.. ఆమె రూ.వెయ్యి పెట్టుబడి పెట్టింది. మరుసటి రోజున రూ.15 వేలు లాభం వచ్చినట్టు ఆమె పేరిట ఉన్న ఆ కంపెనీ వాలెట్లో ఆ మొత్తాన్ని జమ చేసినట్టు చూపించారు. వాలెట్లోని నగదు విత్‌డ్రా చేయాలంటే మరో రూ.5 వేలు పెట్టుబడి పెట్టాలనే మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె రూ.5 వేలను పెట్టుబడి పెట్టింది. ఇలా ప్రతి రోజూ ఆమె పేరిట ఉండే వాలెట్లోని నగదు పెరగడం.. ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే మరికొంత నగదు జమ చేయాలనే ఆంక్షల రూపంలో మెసేజ్‌లు రావడం పరిపాటిగా మారింది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే ఆమె వాలెట్లో 1,13,42,181 రూపాయలు చేరాయి. ఈ నగదు తీసుకునే నిమిత్తం విడతల వారీగా రూ.9 లక్షలు సమర్పించాక మోసపోయానని గ్రహించిన ఆ మహిళ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోవడంతో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. డబ్బులు వస్తే పిల్లల చదువుకు ఉపయోగపడతాయనే ఆశతో బంగారాన్ని అమ్మేసి మరీ సైబర్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతోంది. విజయవాడ నగరంలో ఇలాంటి మోసాలకు సంబంధించి నెలకు సగటున 10 వరకు కేసులు నమోదవుతుండటంతో సైబర్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆశ చూపి లూటీ చేస్తున్నారు అమెజాన్, ఈబే, లవ్ లైఫ్, క్రి΄్టో, స్నాప్ డీల్, ఫ్లిప్‌కార్ట్, ఓలా తదితర బడా కంపెనీల్లో స్వల్ప పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయంటూ పలువురి ఫోన్లకు మెసేజ్‌లు పంపించి సైబరాసురులు ఆకర్షిస్తున్నారు. ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చంటూ మెసేజ్‌ల ద్వారా సూచిస్తారు. నమ్మకం కుదరకపోతే రూ.లక్షలు సంపాదించిన వారి వీడియోలు చూడండి అంటూ.. వారే తయారు చేసిన కొన్ని వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా లింక్‌లను పంపుతారు. మొత్తం ఆన్లైన్ అయిపోయిందని, భవిష్యత్ వ్యాపారం పూర్తిగా ఆన్లైన్ వేదికగానే జరుగుతుందంటూ ముగ్గులోకి దించుతారు. ముందుగా రూ.100 పెట్టుబడి పెట్టి పరీక్షించుకోండంటూ బంపర్ ఆఫర్ ఇస్తారు. వారు పంపిన వెబ్‌లింక్ క్లిక్ చేయగానే వారే రూపొందించిన ఆయా కంపెనీల నకిలీ వెబ్సైట్లోకి తీసుకెళ్తారు. తరువాత ఒక యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. అక్కడ మన కోసం ఒక వాలెట్‌ను రూ΄÷ందించి పెట్టుబడులను పలు రకాలైన ఆఫర్లతో ఆకర్షిస్తారు. రూ.100 పెట్టుబడి పెట్టిన 24 గంటల్లోపే లాభం రూ.1,500లకు పైగా వచ్చిందని వాలెట్లో చూపిస్తారు. ఆ నగదు మీ బ్యాంక్ ఖాతాకు చేరాలంటే మరో రూ.500 పెట్టుబడి పెట్టాలంటూ ఆంక్షలు విధిస్తారు. ఇలా వాలెట్లో నగదు అంకెలను పెంచుకుని΄ోతూ ఆశను పెంచేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు గుంజుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి క్యాష్ ఇన్వెస్ట్మెంట్ తరహా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కేసులు నమోదు చేసి సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నాం. ఈ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలు అవసరం లేని వెబ్‌లింక్‌ల జోలికి ;పోకూడదు. – యేలేటి శ్రీరచన, ఎస్ఐ, సైబర్ క్రైం, విజయవాడ (చదవండి: భారతీయ చిన్నారులు బాగా ‘స్మార్ట్’ ) -
ఆగస్టు 31ని పండగలా జరుపుకుంటున్న తాలిబన్లు... అంబరాన్నంటిన సంబరాలు
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాలబన్లు తమ ఇష్టా రాజ్యంగా రకరకాల నిబంధనలు, ఆదేశాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజగా తాలిబన్లు ఆగస్టు 31 బాణా సంచా కాలుస్తు పెద్దగా సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆగస్టు 31 అనేది యూఎస్ నేతృత్వంలోని దళాలను ఉపసంహరించుకున రోజు. ఈ సందర్భంగా తాలిబన్లు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ పై గత 20 ఏళ్లుగా దారుణమైన యుద్ధం సాగించింది. దీంతో అఫ్గాన్ నిరంతరం యుద్ధం భయంతో మునిగిపోయింది. అంతేకాదు ఈ యుద్ధంలో వేలాది మంది అఫ్గాన్ వాసులు చనిపోవడం, లక్షలాది మంది గాయాలపాలవ్వడం వంటి విధ్వంసాన్ని చవిచూసింది అఫ్గాన్. ఈ విధ్యంసకర దాడికి ముగింపు పలకి ఆగస్టు 31న యూఎస్ తన బలగాలను అప్గనిస్తాన్ నుంచి వెనుక్కు రప్పించింది. అందువల్ల తాలిబన్లు ఈ రోజును స్వాతంత్య్ర దినోత్సవంగా పేర్కొంటూ ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. ఈ వార్షికోత్సవంను తాము వివిధ రంగుల బానసంచా కాల్పులతోనూ, వైమానిక కాల్పులతో అట్టహాసంగా జరుపుకుంటామని చెప్పారు. అంతేకాదు తాలిబన్లు అఫ్గనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన రోజైన ఆగస్టు 15 జాతీయ సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
సొంతంగా స్పేస్ స్టేషన్‌ని నిర్మించనున్న రష్యా...యూఎస్‌తో మరో ఆరేళ్లు...
వాషింగ్టన్: రష్యా అంతరిక్ష కేంద్రం చీఫ్ బోరిసోవ్ సంచలన ప్రకటన చేశారు. 2024 నాటికల్లా రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఐతే ఇరు దేశాల మాజీ ప్రచ్ఛన యుద్ధ వ్యతిరేకులు రెండు వారాల కిందటే క్రూ ఎక్స్ఛేంజ్ ఒప్పందంపై సంతకాలు చేసిన తరుణంలో ఆయన ఈ అనుహ్య ప్రకటన వెల్లడించారు. ఇది భవిష్యత్తులో యూఎస్ వ్యోమోగాములు, రష్యన్ వ్యోమోగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విమానాలు పంచుకునేలా వీలు కల్పించే ఒప్పందం. అదీగాక నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్నెల్సన్ రష్యా ఐఎస్ఎస్ భాగస్వామ్యాన్ని 2030 వరకు పొడిగించేలా నాసా, రోస్కోస్మోస్ చర్చలు జరుపుతున్నాయని అన్నారు. పైగా ఈ చర్చలు సఫలం అయ్యేవరకు కూడా రష్యా కొనసాగేలా నాసా ప్రణాళికను అమెరికా శ్వేతసౌధం అమోదించిందని చెప్పారు. అంతేకాదు రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తమ సొంత అంతరిక్ష ఔట్‌పోస్ట్‌ను నిర్మించి, పనిచేసేంత వరకు తమతో కలిసి పనిచేయాలని నాసా అధికారులు కోరినట్లు తెలిపారు. పైగా రష్యా కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేసింది కూడా. దీంతో అమెరికాతో రష్యా తన భాగస్వామ్యాన్ని మరో ఆరేళ్లు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. 1998లో ప్రారంభించబడిన ఐఎస్ఎస్ యూఎస్-రష్యన్ నేతృత్వంలోని భాగస్వామ్యం నవంబర్ 2020 నుంచి నిరంతరంగా కొనసాగింది. దీనిలో కెనడా, జపాన్‌తో సహా సుమారు 11 యూరోపియన్ దేశాల భాగస్వామ్యాం కూడా ఉంది. ఐతే రష్యా తమ భాగస్వామ్యంలో భాద్యతలన్నింటిని నెరవేర్చి 2024 తర్వాత నుంచి వైదోగాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు బోరిసోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. కానీ ఐఎస్ఎస్ డైరెక్టర్ రాబిన్ గాటెన్స్ ఈ విషయం గురించి రష్యన్ సహచరులు తనకు తెలియజేయలేదని ఆమె అన్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు వైట్ హౌస్ ప్రతినిధి కరీన్ జీన్-పీటర్స్ కూడా మాస్కో ఐఎస్ఎస్ నుంచి వైదొలగాలనే ఉద్దేశాన్ని అమెరికాకు అధికారికంగా తెలియజేయలేదని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతోనే యూఎస్, రష్యా దేశాల మధ్య సంబంధాలు కొంత మేర దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధాన్ని విరమించుకోమని యూఎస్ పదేపదే హెచ్చరించడమే కాకండా ఆంక్షలు విధించేందుకు కూడా యత్నించింది. దీంతో ఇరు దేశాల మధ్య కాస్త విభేదాలు తలెత్తాయి. ఐతే అమెరికాలోని నాసా అధికారులు మాత్రం ఇరు దేశాల మధ్య అంతరిక్ష కేంద్రంలో ద్వైపాక్షిక సహకారం అలాగే ఉంటుందని చెప్పడం గమనార్హం. అంతేకాదు అమెరికా కాలిఫోర్నియా విశ్యవిద్యాలయం ప్రస్తుత వ్యోమోగామీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారెట్ రీస్మాన్, రిటైర్డ్ వ్యోమగామీ తాము కలిసే ఉన్నామని, తమ భాగస్వామ్య సహకారం అలాగే కొనసాగుతుందని చెప్పడం విశేషం. (చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా... యూఎస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్) -
ఊహించని పరిణామం: వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: సరిహద్దు దేశం చైనా కవ్వింపు చర్యలతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. సరిహద్దులో గుంటనక్కలా వేచి చూస్తున్న చైనా చివరకు ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. సరిహద్దు వివాదంపై చైనా రక్షణ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. భారత్‌లోని తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీ అయ్యింది. భారత బలగాలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని చైనా తెలిపింది. కమాండర్ల స్థాయి చర్చలు ఫలించాయి. ఆ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ మొదలు.. ఇప్పటి వరకు సరిహద్దుల వెంట తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారడం.. ఎప్పుడైనా యుద్ధం జరుగుతుందేమో అనే దాక పరిస్థితి వచ్చింది. చివరకు అకస్మాత్తుగా చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ఘటన నుంచి ఇరు దేశాల సైనికాధికారులు చేస్తున్న చర్చలు ఇప్పటికీ ఫలించాయి. కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఇరు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుల్లోంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. -
టాటాపై వాడియా కేసు వెనక్కి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. రూ. 3,000 కోట్ల నష్టపరిహారం దావా కూడా వీటిలో ఉంది. వాడియా ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశమేదీ తమకు లేదంటూ టాటా సహా మిగతా వర్గాలు న్యాయస్థానానికి తెలియజేశారు. హైకోర్టు విచారణలో కూడా ఇదే తేలినందున పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడానికి వాడియాను అనుమతిస్తూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో టాటా గ్రూప్ కంపెనీ బోర్డుల నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ రతన్ టాటాతో పాటు టాటా సన్స్‌లోని పలువురు డైరెక్టర్లపై వాడియా క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై 2018 డిసెంబర్ 15న ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు.. టాటా, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశమేదీ లేదంటూ టాటా, తదితరులు ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ వాడియా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, ఇరు వర్గాలు కూర్చుని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ జనవరి 6న సుప్రీం కోర్టు సూచించింది. దీనికి అనుగుణంగా వాడియా తాజాగా కేసును ఉపసంహరించుకున్నారు. -
మిస్త్రీ వివాదం: వాడియా సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంలో టాటాపై నమోదుచేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసును ఉపసంహరించుకోవాలని బాంబై డైయింగ్ చైర్మన్ నస్లీ వాడియా నిర్ణయించారు. రతన్ టాటా సహా ఇతరులపై రూ. 3వేల కోట్ల విలువైన పరువు నష్టం దావాలున్నింటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో వాడియా - టాటా యుద్ధానికి తెరపడింది. పరిణతి చెందిన వ్యక్తులుగా ఇద్దరూ కేసులను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే టాటా, వాడియాలను ఇటీవల కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. రతన్ టాటాపై పరువు నష్టం దావాను వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. వాడియాపై పరువు తీసే ఉద్దేశం లేదని టాటా సుప్రీంకోర్టుకు చెప్పడంతో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్సీ వ్యాపారవేత్త ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా సన్స్ నుంచి ఆయన మిత్రుడు మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం వాడియా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌లో అత్యంత సీనియర్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఉన్న నస్లీ వాడియాను తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో రూ .3,000 కోట్లు పరిహారం కోరుతో 2016 డిసెంబర్లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇందులో వాడియా బోర్డు సభ్యులు అజయ్ పిరమల్, రణేంద్ర సేన్, విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ఫ్ స్పేత్ , ఎఫ్ఎన్ సుబేదార్లతో పాటు మిస్త్రీ తరువాత వచ్చిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కూడా చేర్చారు. 2019 జూలైలో బాంబే హైకోర్టు ఈ కేసును కొట్టివేయడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కాగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తన తొలగింపుపై సూరస్ మిస్త్రీ దాఖలు చేసుకున్న కేసులో మిస్త్రీని తిరిగి నియమించాలని కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఉత్తర్వులిచ్చింది. అయితే జనవరి 10న ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపి వేసిన సంగతి తెలిసిందే. -
25 లక్షలు డ్రా చేసి.. ఇంటి నుంచి గెంటేశాడు!
సాక్షి, ఒంగోలు: అనారోగ్యం ఆమెను పట్టి పీడిస్తుంది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకు కనీసం కట్టుకున్న ఇంటిలో కూడా ఉండకుండా వెళ్లగొట్టాడు. తప్పనిస్థితిలో బతుకుజీవుడా అనుకుంటూ కూతురి ఇంటివద్ద తలదాచుకుంటూ మాకు న్యాయం చేయండయ్యా అంటూ ఓ వృద్ధురాలు జిల్లా ఎస్పీని కలిసి స్పందనలో వేడుకుంది. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదుపై వన్‌టౌన్ జియో సోమేపల్లి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాది ఆసియా బేగం స్థానిక విజయనగర్ కాలనీ వాసి. ఆమె భర్త మత్స్యశాఖలో అటెండర్‌గా పనిచేసేవాడు. 2019 జూలై 31న రిటైరయ్యాడు. ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో డబ్బులు వచ్చాయి. వాటన్నింటిని బ్యాంకులో దాచుకోగా అతని కుమారుడు షేక్ జావెద్ కన్ను దానిపై పడింది. తిరుపతి రావు అనే వ్యక్తి సహకారంతో కొడుకు జావెద్ తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏటీఎం కార్డు, బ్యాంకు చెక్కు ద్వారా ఏకంగా రూ. 25లక్షలు కాజేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు కొడుకుని ప్రశ్నించడంతో ఇళ్లు నాది అంటూ తల్లిదండ్రులను ఇద్దరిని ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అంతే కాకుండా తిరుపతిరావు, గురు, కోమల్ అనే వారితో కలిసి మరలా వస్తే చంపేస్తామంటూ బెదిరించినట్లు ఆసియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాము చీమకుర్తిలోని కుమార్తె ఇంటివద్ద తలదాచుకున్నామని పేర్కొంది. వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిన కొడుకు నుంచి న్యాయం అందేలా చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు కోసం దర్యాప్తు ప్రారంభించారు. -
చెక్కుతో అక్రమంగా సొమ్ము డ్రా
విజయనగరం , ఆనందపురం(భీమిలి) : బ్యాంకు నుంచి వ్యక్తి గత రుణం పొందిన అనంతరం హామీగా ఇచ్చిన చెక్కుల ద్వారా బ్యాంకు కార్యకలాపాల ప్రతినిధులు వేలాది రూపాయలు డ్రా చేసిన వైనంపై సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుడు పి.వి.వి.ప్రసాదరావు అందించిన వివరాల ప్రకారం... విజయనగరంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి ప్రసాదరావు రూ.2 లక్షలు వ్యక్తిగత రుణం పొంది ఈ ఏడాది ఫిబ్రవరి 10న బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ప్రతినిధికి హామీగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఐదు చెక్కులు అందజేశాడు. అప్పటి నుంచి ప్రసాదరావు క్రమం తప్పకుండా వాయిదాలను బ్యాంక్‌కు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రసాదరావు సెప్టెంబర్ 7న కొత్తగా కారు కొనుగోలు చేసి విజయనగరం వరుణ్ మోటార్స్ వారికి రూ.21 వేల చెక్కును అందజేశారు. అయితే ఖాతాలో డబ్బులు లేవని వరుణ్ మోటార్స్ వారు ప్రసాదరావుకు తెలపడంతో ఖాతా లావాదేవీలను పరిశీలించారు. దీంతో తాను ఇండస్ ఇండ్ బ్యాంక్‌కు హామీగా ఇచ్చిన చెక్కు నంబరు 000030 ద్వారా పి.కుసుమ హరనాథ్ అనే వ్యక్తి ఈ ఏడాది ఆగస్ట్ 29న రూ.90 వేలు డ్రా చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు సోమవారం స్థానిక సీఐ ఆర్.గోవిందరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో కుసుమ హరనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ సిబ్బందే తనకు చెక్కు అందించినట్టు హరనాథ్ విచారణలో వెల్లడించారు. సీఐ గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఖాతాల నుండి భారీగా విత్ డ్రాయల్స్
-
బ్యాంకుల్లో పైసల్లేవ్...మరో ఐదు రోజులింతే..!
-
పెళ్లి కోసం మనీ విత్‌డ్రాకి నిబంధనలు
-
బ్యాంకుల్లో పైసల్లేవ్!
ఉన్నదంతా డిపాజిట్ చేసి విత్‌డ్రాకు నోచుకోని జనం ♦ చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితితో సామాన్యుల ఆందోళన ♦ ఉన్న నగదునే సర్దాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన ♦ గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో కార్యకలాపాలు బంద్ ♦ మధ్యాహ్నానికే నోక్యాష్ బోర్డులు తగిలిస్తున్న వైనం ♦ రుణం మంజూరైనా నగదుకు నోచుకోని రైతాంగం ♦ జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ♦ రూ. రెండు వేలు కూడా ఇవ్వలేమంటున్న సిబ్బంది ♦ ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో చిరు వ్యాపారులు ♦ మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి: బ్యాంకింగ్ వర్గాలు ♦ హైదరాబాద్‌కు కొత్త రూ. 500 నోట్లు రాకపోవడంపై అనుమానాలు సాక్షి, హైదరాబాద్ ‘ఉన్న పెద్ద నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశా.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు.. బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు.. నిత్యావసరాలకు కూడా సొమ్ము లేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు..’.. ప్రస్తుతం ఎక్కడ, ఎవరి నోట విన్నా ఇదే మాట. పాత నోట్లు చెల్లవనడంతో జనమంతా చేతిలో ఉన్న డబ్బును బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పుడు డ్రా చేసుకుందామనుకుంటే బ్యాంకులన్నీ ఖాళీ. రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. అన్ని చోట్లా వాణిజ్య బ్యాంకులు ‘నో క్యాష్’ బోర్డులు తగిలిస్తున్నాయి. రోజూ మధ్యాహ్నం నుంచే కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. రద్దయిన పెద్ద నోట్లను మాత్రం జమ చేసుకుంటున్నాయి. ఎవరైనా నగదు కోసం వస్తే వారి పేరు, ఫోన్ నంబర్ రిజిస్టర్లో రాసి వెళ్లాలని, నగదు రాగానే ఫోన్ చేస్తామంటూ బ్యాంకుల సిబ్బంది తిప్పిపంపుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం అత్యవసరంగా నగదు కోసం బ్యాంకులకు వెళుతున్న కొందరు నగదు లేదంటుండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలైతే ఆవేదనతో శాపనార్థాలు పెడుతున్నారు. జ్వరం వచ్చిన పిల్లాడిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లడానికి కూడా డబ్బులు లేవంటూ సోమవారం బంజారాహిల్స్ యాక్సిస్ బ్యాంకుకు వచ్చిన ఇందిరాదేవి అనే గృహిణి కంటతడి పెట్టారు. ‘‘ఇలాంటి పరిస్థితి నా పాతికేళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదు. అత్యవసరంగా నగదు కోసం వచ్చేవారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కానీ మేమేం చేయగలం..’’ అని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివాహం జరుగనున్న కుటుంబాలకు రూ.2.5 లక్షలు, ఇతర ఖాతాదారులకు వారానికి రూ.24 వేలు ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని బ్యాంకులు మాత్రం పెళ్లి కార్డులు పట్టుకుని వచ్చేవారికి అతికష్టం మీద రూ.లక్ష వరకు ఇవ్వగలుగుతున్నాయి. ఇక మరో చిత్రమైన పరిస్థితి ఏమిటంటే రిజర్వుబ్యాంకు నలిగిపోయి చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న రూ.100 నోట్లను కూడా బ్యాంకులకు సరఫరా చేస్తోంది. అత్యవసరంగా కావాలని వెళ్లిన వారికి ఈ నోట్లు ఇస్తున్నారు. బయట ఆ నోట్లు చెల్లుబాటు కావడం లేదు. మామూలు రోజులకంటే తగ్గిన పంపిణీ రిజర్వుబ్యాంకు మామూలు రోజుల్లోనే ఒక్క హైదరాబాద్ నగరంలోని బ్యాంకులకు తన నగదు కేంద్రాల నుంచి రూ.2,500 కోట్ల విలువైన నోట్లను సరఫరా చేస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పంపేది మరో రూ.1,700 కోట్లు. కానీ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసిన మొత్తం రూ.1,200 కోట్లు మాత్రమే. ఇందులోనూ వెయ్యి కోట్ల రూపాయలు రూ.2 వేల నోట్లుకాగా.. వంద రూపాయల నోట్లు రూ.200 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. రిజర్వుబ్యాంకు అధికార వర్గాల సమాచారం ప్రకారం... హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిని కూడా కలుపుకొంటే బ్యాంకులు, ఏటీఎంల ద్వారా నిత్యం రూ.12 వేల కోట్ల కార్యకలాపాలు జరిగేవి. కానీ గత పది రోజుల్లో మొత్తంగా కూడా జరిగిన లావాదేవీలు సుమారు రూ.1,750 కోట్లు మాత్రమే. ఇక కొత్త నోట్లు పెట్టేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 40 శాతం ఏటీఎంలను సరిచేయడం పూర్తయిందని కేంద్రం చెబుతోంది. కానీ హైదరాబాద్‌లో 15 శాతం ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. ఏటీఎంల కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ అధికారి చెప్పిన ప్రకారం.. హైదరాబాద్‌లోని 78 శాతం ఏటీఎంలలో నగదు లేదు. ఈ నెల 9వ తేదీ నుంచి పనిచేయని ఏటీఎంలు 71 శాతం దాకా ఉన్నాయి. అయితే మరో పది రోజుల్లో 75 శాతం ఏటీఎంల సాఫ్ట్వేర్ అప్డేషన్ పూర్తవుతుందని ఆ అధికారి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య బ్యాంకులకు గత వారం రోజులుగా నగదు పంపిణీ కావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అన్ని రకాల వ్యాపారాలు మూతపడ్డాయని తెలంగాణ లీడ్ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) రిజర్వుబ్యాంకుకు నివేదించింది. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం వ్యాపారాలు బ్యాంకింగ్ లావాదేవీలతో నిమిత్తం లేకుండా జరుగుతాయని.. నోట్ల రద్దుతో నగదు చలామణీలో లేకపోవడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కూడా రిజర్వుబ్యాంకు దృష్టికి తెచ్చింది. ఇక నగదు లేని కారణంగా ఉపాధి హామీ పనులు దాదాపు అన్ని చోట్లా నిలిచిపోయాయి. గృహ, భవన నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో కూలీలకు పనిలేకుండా పోయింది. ప్రాజెక్టుల నిర్మాణాలూ నిలిచిపోయాయి. ‘మేం రోజూ రూ.10 కోట్ల మేర నగదును కూలీలకు పంపిణీ చేస్తాం. కానీ బ్యాంకు నుంచి నగదు లభించకపోవడంతో.. మూడు రోజులుగా పనులన్నీ నిలిపివేశాం..’’ అని నిర్మాణ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. నగదు లేక పడిపోయిన అమ్మకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నగదు అందుబాటులో లేని కారణంగా అన్ని రకాల ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయాయి. కాయగూరలకు ధరలు లేక రైతులు తమ గ్రామాల్లో ఉచితంగా పంచిపెడుతున్నారు. పట్టణాలకు కాయగూరల సరఫరా ఆగిపోయింది. వచ్చిన కాయగూరలను కూడా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సైకిళ్ల మీద తెచ్చి విక్రయించేవారు అరువుపై ఇస్తున్నారు. మండల కేంద్రాల్లో వ్యాపారం లేక అన్ని రకాల దుకాణాలూ మూతపడ్డాయి. జనం ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. ఆటోలు నడపుకొని జీవించే వారికి ఉపాధి దెబ్బతిన్నది. చిన్న చిన్న శుభకార్యాలకు వెళుతున్న వారు కూడా చిల్లర లేక రూ.500, రూ.1,000 పాత నోట్లనే బహుమతులుగా ఇస్తున్నారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి నగదు కొరత సమస్య మరో నాలుగైదు రోజులపాటు తప్పదని రిజర్వుబ్యాంకు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో బ్యాంకులు డోలాయమానంలో పడ్డాయి. రూ.10, 20, 50, 100 నోట్లు తెచ్చి బ్యాంకులో జమ చేయాలంటూ వ్యాపారం చేసే తమ ఖాతాదారులను కోరుతున్నాయి. అవసరమైతే కొంత మొత్తంలో కమీషన్ ఇస్తామని కూడా కొన్ని బ్యాంకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ బంకులకు చిల్లర నోట్లు వస్తున్నా వాటి సిబ్బంది కమీషన్ ప్రాతిపదికన అమ్ముకుంటున్నారు. హైదరాబాద్‌కు కొత్త రూ.500 నోటు రాలేదేం? కొత్త రూ.500 నోట్లు దేశవ్యాప్తంగా విడుదలైనా... హైదరాబాద్ బ్యాంకులకు మాత్రం ఇంకా రాలేదు. చిల్లర కొరతకు ఇదే ప్రధాన కారణమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నా.. రేపు, మాపు అంటూ రిజర్వుబ్యాంకు సాగదీస్తూనే ఉంది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా రూ.500 నోట్లు సరఫరా చేసినా.. తెలంగాణకు అందకపోవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వు బ్యాంకు కావాలనే పంపడం లేదని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. -
కడప రైతుబజార్లో SBI ప్రత్యేక ఏర్పాట్లు
-
ఏటీఎం కార్డు రెన్యువల్ పేరుతో మోసం
కుక్కునూరు : ఏటీఎం కార్డు రెన్యువల్ చేస్తామని చెప్పి ఖాతాలో డబ్బును దొంగిలించిన ఘటన శనివారం జరిగింది. బాధితుని కథనం ప్రకారం.. కుక్కునూరుకు చెందిన నక్కా కృష్ణ భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం సమయంలో అతనికి ఒకరు ఫోన్ చేసి తాము బ్యాంకు నుంచి చేస్తున్నామని, మీ ఏటీఎం కార్డు రెన్యువల్ చేయాలని, ఆ కార్డు ఏ సంవత్సరంలోదో చేప్పాలని హిందీలో అడిగారు. దీంతో కృష్ణ ఆ వివరాలు చెప్పాడు. వెంటనే అతని సెల్‌కు ఖాతా నుంచి రూ.7,000 డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో అవాక్కయిన కృష్ణ స్థానిక ఆంధ్రా బ్యాంక్ మేనేజర్‌తో తనకు ఫోన్ చేసిన నంబర్‌కు మాట్లాడించాడు. అవతల వ్యక్తి ఇంకా ఏమైనా నంబర్లు ఉంటే ఇవ్వాలని మేనేజర్‌ను కోరాడు. మీ చేతనైంది చేసుకోవాలని సవాల్ విసిరాడు. దీంతో లబోదిబోమనడం కృష్ణ వంతైంది. -
మా బ్యాంకు.. మా ఇష్టం
అనుమతి లేకుండా డబ్బు డ్రా చేసుకున్న అధికారులు అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నిర్వాకం ప్రశ్నించిన డ్వాక్రా మహిళలపై మేనేజర్ చిందులు పత్రికల్లో వార్తలొస్తే ఇబ్బంది పడతారంటూ హెచ్చరిక మీకు అనవసరం అంటూ విలేకరులపై ఆగ్రహం వైఎస్ఆర్ జిల్లా(ప్రొద్దుటూరు) : డ్వాక్రా సంఘం సభ్యుల అనుమతి లేకుండా వారి ఖాతా నుంచి బ్యాంకు అధికారులు ఇష్టానుసారం డబ్బు డ్రా చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మహిళలపై సదరు బ్యాంకు మేనేజర్ చిందులు వేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన విలేకరులనూ కేసు పెడతానంటూ బెదిరించారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు మండలంలోని కానపల్లె గ్రామానికి చెందిన వీరాంజనేయ స్వయం సహాయక సంఘానికి పట్టణంలోని అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు ఈ ఏడాది మే 18న రూ.5 లక్షలు రుణం మంజూరు చేశారు. జూన్ 1న 10 మంది గ్రూపు సభ్యులు కలిసి తీసుకున్న రుణానికి రూ.25 వేలు కంతు కట్టాల్సి ఉంది. ఈ విషయంపై మహిళలు సమావేశం నిర్వహించగా.. రుణం పొంది 12 రోజులే అయింది.. నెల పూర్తయ్యాక జూలై నుంచి కంతులు చెల్లిస్తే సరిపోతుందని ఆరుగురు మహిళలు చెప్పారు. దీంతో సభ్యులు జూన్ కంతు చెల్లించలేదు. గ్రూపు అధ్యక్షురాలు ఖాతాలోని డబ్బు తీసుకునేందుకు జూలై 3వ తేదిన బ్యాంక్‌కు వెళ్లగా ఖాతాల్లోంచి రూ.69 వేలు డ్రా చేసినట్లు ఆన్లైన్లో వెల్లడైంది. ఆందోళన చెందిన సభ్యులు బ్యాంక్ అధికారులను సంప్రదించగా మీకు బ్యాంక్ నిబంధనలు తెలియవని చెప్పారు. తమ గ్రూపు.. బ్యాంక్‌కు ఎలాంటి బాకీ లేదని, ఎందుకు కట్ చేశారని ప్రశ్నించారు. రుణం తీసుకుని 10 రోజులే కావడంతో జూన్ కంతు కట్టలేదని సభ్యులు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఏ లెక్క ప్రకారం రూ.69 వేలు కట్ చేశారో ఎవరికీ అర్థం కాలేదు. - కానపల్లె గ్రామానికి చెందిన మరో గ్రూపునకు సంబంధించి గత ఏడాది బకాయిలు చెల్లించలేదని ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించిన మూలధనం రూ.30 వేలు ఏడీబీ అధికారులు డ్రా చేసుకున్నారు. ఖాతాలో మరోమారు కూడా డబ్బు డ్రా చేసుకున్నారని సభ్యులు తెలిపారు. - ఖాదర్‌బాద్ గ్రామానికి చెందిన షేక్షావల్లి డ్వాక్రా గ్రూపునకు సంబంధించి మూలధనం రూ.30 వేలతో పాటు కొత్తగా మంజూరు చేసిన రుణంలో రూ.69 వేలు డ్రా చేసుకున్నారు. అగ్రికల్చల్ డెవలప్మెంట్ బ్యాంక్ పరిధిలో సుమారు ఆరేడు వందల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మున్సిపాలిటీతోపాటు రూరల్ పరిధిలోని గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల డ్వాక్రా గ్రూపులకు రుణాలు మంజూరు చేసిన బ్యాంక్ అధికారులు ఇష్టారాజ్యంగా బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బు డ్రా చేసుకున్నారు. చాలా ఖాతాలదీ ఇదే పరిస్థితి. మాకో నిబంధన.. మీకో నిబంధనా? 'డ్వాక్రా గ్రూపు మహిళలు డబ్బు తీసుకోవాలంటే పది మంది సభ్యులు వచ్చి బ్యాంక్ అధికారులకు కనబడితేకానీ రుణం ఇవ్వడం లేదు. అలాంటపుడు మా సంతకాలు లేకుండా, మాకు తెలియకుండానే డబ్బులు ఎలా డ్రా చేసుకుంటార'ని పలువురు మహిళలు ఏడీబీ మేనేజర్ అనంతకుమార్‌ను ప్రశ్నించారు. ఖాతాల్లోంచి పెద్ద ఎత్తున డబ్బులు బ్యాంక్ అధికారులు డ్రా చేశారని తెలియడంతో మంగళవారం మహిళలంతా బ్యాంక్‌కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మేనేజర్ కార్యాలయంలోకి వెళ్లారు. అంత డబ్బు ఎలా డ్రా చేసుకున్నారని ప్రశ్నించగా.. తమకు సర్వ హక్కులు ఉన్నాయని తెలిపారు. ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీరు ఏమైనా ఆస్తులు తనఖా పెట్టారా.. కేవలం మిమ్మల్ని చూసి రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ఈ తతంగం జరుగుతుండగా విలేకరులు మేనేజర్ చాంబర్ వద్దకు వెళ్లి ఫొటో తీసుకున్నారు. అనుమతి లేకుండా లోపలకు వచ్చారని, కేసు పెడతానని మేనేజర్ బెదిరించారు. మీరే విలేకరులను తీసుకు వచ్చారని మహిళలపై మండిపడ్డారు. పత్రికల్లో వార్తలు వస్తే చాలా ఇబ్బందులు పడతారని వారినీ బెదిరించారు. కాసేపటి తర్వాత విలేకరులు మళ్లీ వెళ్లి ఆయన్ను సంప్రదించగా.. వాళ్లు (మహిళలు), మేము మాట్లాడుకున్నాం. ఈ సమస్య మీకు అనవసరం అని చెప్పారు. -
బోల్ట్ తప్పుకున్నాడు
కింగ్ స్టన్: పరుగుల చిరుత, జమైకా స్ప్లింటర్ ఉస్సేన్ బోల్ట్ మెల్లగా వెనుకబడి పోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. అతను ఈరోజు జమైకాలో జరగుతున్న జాతీయ పరుగు పందెం బరి నుంచి తప్పుకున్నాడని ఓ మీడియా సంస్థ తెలిపింది. ఈ పరుగు పందెం జాబితా చూస్తే అందులో బోల్ట్ పేరు లేదని, దాని గురించి వాకబు చేయగా ఆయన పరుగు పందెం నుంచి తప్పుకున్నాడని స్పష్టమైందని తెలిసింది. వచ్చే ఆగస్టు బీజింగ్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్ షిప్ పోటీకి ట్రయల్ ల్లాంటి ఈ పోటీ నుంచి బోల్ట్ అనూహ్యంగా తప్పుకోవడం అందరినీ ఆలోచింపజేస్తుంది. గతంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ పేరిట అరుదైన రికార్డులు(100 మీ-10.12 సెకండ్లు), (200 మీ-20.13 సెకండ్లు) ఉన్నాయి. కాగా, గతవారం న్యూయార్క్‌లో జరిగిన డైమాండ్ లీగ్‌లో 200 మీటర్ల పరుగు పూర్తి చేసేందుకు 20.29 సెకన్ల సమయం తీసుకున్నాడు. దీంతో బోల్ట్ ఫిట్ నెస్‌పై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ బోల్ట్ అందుకోస్తాడా అని ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారట.