dry fish
-
ఎండు చేపకు ఎంత కష్టం!
కోడూరు(అవనిగడ్డ) : ఎండు చేపకు కష్టం వచ్చింది. రోడ్డుపైనే ఎండాల్సి వస్తోంది. ఎండబెట్టుకునేందుకు వసతులు లేవు. వేటకు వెళ్లి తెచ్చుకున్న సంపద కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. రోడ్లనే కల్లలుగా మార్చుకున్నారు. ఈ ప్రాంతంలో ఏ రోడ్డు చూసినా ఎండు చేపలతో నిండిపోయాయి. వివరాలు.. మండల పరిధిలో పాలకాయతిప్ప, హంసలదీవిల్లో 300 మత్స్యకార కుటుంబాలున్నాయి. గంగపుత్రులు తమకు సముద్రంలో దొరికిన మత్స్యసంపదలో పెద్దవాటిని విక్రయించి, చిన్న చేపలు, రొయ్యలను ఆరపెట్టి, అవి ఎండిన తరువాత విక్రయిస్తుంటారు. అయితే పాలకాయతిప్పలో సరుకును ఎండపెట్టుకునేందుకు ఏ విధమైన ప్లాట్‌ఫాంలు నిర్మించకపోవడంతో గ్రామస్తులు ప్రధాన రహదారి పక్కనే ఇలా ఆరబెడుతున్నారు. దీంతో ప్రస్తుతం దింటిమెరక బైపాస్ రహదారి దగ్గర నుంచి కరకట్ట వరకు సుమారు కిలోమీటరన్నరకు పైగా ప్రధాన రహదారి ఒకవైపు పూర్తిగా ఎండిన సరుకుతో నిండిపోయింది. సాగర సంగమానికి వచ్చే యాత్రికులు ఈ రోడ్డు మీదగానే ప్రయాణం చేయాల్సి ఉండడంతో కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు. ఎండు చేపలు, రొయ్యల వాసనతో ఇక్కట్లు పడుతున్నట్లు వాపోతున్నారు. ఇప్పటకైన పాలకులు స్పందించి తమ సంపదను ఎండపెట్టుకొనేందుకు అవసరమైన ఫ్లాట్‌ఫాంలను నిర్మించాలని పాలకాయతిప్ప గ్రామస్తులు కోరుతున్నారు. -
పప్పుచారు.. ఉప్పు చేప.. ఓ మంత్రి!
గోదావరి జిల్లాల్లో పప్పుచారు - ఉప్పుచేప కాంబినేషన్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ ఖర్చులు భరించలేని వాళ్లు, వ్యవసాయ కూలిపనులకు వెళ్లేవాళ్లు కాస్త రుచికరమైన ఆహారం తీసుకోవాలంటే.. ఎక్కువగా ఈ కాంబినేషన్నే ఇష్టపడుతుంటారు. అందరికీ అందుబాటులో ఉండే మాంసాహారం కావడంతో అన్ని తరగతుల వాళ్లు కూడా దీన్ని ఇష్టపడుతుంటారు. ఉప్పు చేపలు నిల్వ ఉండే పదార్థం కావడంతో ఏడాది పొడవునా ఇంట్లో ఉంచుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుచారు చేసుకుని దాంట్లోకి దీన్ని నంజుకుని తింటారు. స్వతహాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గోదావరి జిల్లాలకు వచ్చిన సందర్భంగా తొలిసారి ఈ పప్పు చారు - ఉప్పు చేప కాంబినేషన్ రుచి చూశారు. అద్భుతః అంటూ ఇష్టపడ్డారు. మరికొంత కావాలంటూ అడిగి తీసుకుని మరీ తిన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మల్యే అనంతలక్ష్మి, రూరల్ ఎంపీపీ పుల్లా సుధాచంద.. వీళ్లంతా వ్యవసాయ కూలీలతో కలిసి కళ్లంలోకి దిగి నాట్లు వేశారు. కలెక్టర్ సహా అందరికీ మంత్రి రఘునాథ రెడ్డే తన చేత్తో నారు అందించారు. ఆ తర్వాత కూలీలు తెచ్చుకున్న అల్పాహారాన్ని మంత్రి తీసుకుని తాను తింటూ వాళ్లకు కూడా తినిపించారు. తలపాగా చుట్టుకుని కాసేపు ఎడ్లబండి నడిపించారు. తర్వాత కూలీలతో మాట్లాడారు. -
చేపా.. చేపా! ఎందుకెండలేదు?
=ప్లాట్‌ఫారాలు లేక నాణ్యత కోల్పోతున్న ఎండు చేపలు =ఇసుక దిబ్బల్లో ఎండబెట్టి నష్టపోతున్న గంగపుత్రులు =స్టోర్ రూం లేక ఒడ్డునే వలల మరమ్మతులు ఈ ప్రశ్నకు జవాబు కోసం పెద్దగా శ్రమపడక్కర్లేదు. దానికి సమాధానం ఇదిగో.. సముద్రంపై ఆటుపోట్లతో వేటసాగిస్తూ అరకొరగా చేపలు దక్కించుకుంటున్న అడుగడుగునా అష్టకష్టాలే. తీరప్రాం తాల్లో మౌలిక సదుపాయాల కల్పన అల్లంత దూరంలోనే ఉంటోంది. నిద్రాహారాలు మాని, ప్రాణాలకు తెగించి వేటాడి తెచ్చుకున్న చేపలను ఎండబెట్టుకోవడానికి ప్లాట్‌ఫారాల కొరత వేధిస్తోంది. తీరం వెంబడి ఉన్న ఇసుకతిన్నెలే వీరికి ఆధారమవుతున్నాయి. నక్కపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో 11 మండలాల్లో 132 కిలోమీటర్ల తీరం ఉంది. 62 మత్స్యకార గ్రామాల్లోని 30 వేల మంది రోజూ వేటకు వెళతారు. వీరిలో 30శాతం మందికి వేట లేకుంటే పూట గడవదు. సుమారు లక్ష మంది వేట ఆధారంగా జీవిస్తున్నారు. మరో లక్ష మంది పరోక్షంగా అనుబంధరంగాలపై ఆధారపడి బతుకుతున్నారు. మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలను ప్లాట్‌ఫారాలపై ఎండబెడితే నాణ్యత బాగుంటుంది. వాటికి మంచి ధర పలుకుతుంది. ఇసుకపై ఎండబెట్టిన చేపలకంటే ప్లాట్‌ఫారాలపై ఎండిన వాటికి కిలోకు రూ.20-30ల ధర అధికంగా ఉంటుంది. తీర ప్రాంతంలో చేపలను భద్రపరచుకోవడం, ఎండబెట్టుకోవడానికి ప్లాట్‌ఫారాలు, వేలాది రూపాయలు విలువైన వలలు దాచుకోవడం, మరమ్మతులు చేసుకోవడానికి స్టోర్‌రూంలు నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా మత్య్సకారులు చేస్తున్న డిమాండ్ సాగర రోదనే అవుతోంది. జిల్లాలో తీరప్రాంతం వెంబడి 11 మండలాల్లో సుమారు 1800కి పైగా మోటారు బోట్లు, తెప్పలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎండుచేపలకు గిరాకీ ఉంది. చేపలను ఇసుకతిన్నెల్లో ఎండబెట్టి పూరీ, పారాదీప్, నాగార్జునసాగర్, కోల్‌కతా, శ్రీశైలం, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. 50 బోట్లకు పైగా ఉన్న తీర ప్రాంత గ్రామంలో చేపలు ఎండబెట్టుకోవడానికి కనీసం రెండు ప్లాట్ఫారాలుండాలి. కానీ చాలా గ్రామాల్లో ఒకటి కూడా లేదు. పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట, కొర్లయ్యపేట, వెంకటనగరం, నక్కపల్లి మండలం రాజయ్యపేట తదితర పెద్ద గ్రామాల్లో ఒక్కో ప్లాట్ ఫారం ఉంది. పెదతీనార్ల, చినతీనార్ల, రాజవరం,కేశవరం గ్రామాల్లో లేనేలేవు. ఎస్. రాయవరం మండలం రేవుపోలవరం, బంగారయ్మపాలెం, అచ్చుతాపురం మండలంలో పూడిమడక, తదితర గ్రామాల్లో 4-5 ప్లాట్‌ఫారాలు నిర్మించాలి. కానీ ఎక్కడా ఒకటికి మించి లేవు. దీంతో జోరుగా వేటసాగే సమయంలో దొరికిన చేపలను ఇసుక తిన్నెలపైనే ఉంచాల్సి వస్తోంది.తీరప్రాంతం నుంచి మత్య్ససంపదను మార్కెటింగ్ చేసేందుకు సరైన రహదారి సదుపాయాలు లేవని వీరు వాపోతున్నారు. గ్రామాల నుంచి సముద్రపు ఒడ్డుకు పక్కా రోడ్డు లేక ఆటోలో చేపలు తరలించడానికి రవాణా చార్జీలు తడిసిమోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ీతీరప్రాంతాల్లో తగినన్ని ప్లాట్‌ఫారాలు నిర్మించాలని కోరుతున్నారు.