Durga Rani Singh
-
దుర్గారాణీ.. ఎక్కడున్నావ్?
ఈ ఫొటోలోని మహిళ పేరు దుర్గారాణీ సింగ్ (ఒరిజినల్‌గా అయితే విద్యా బాలనే). వయసు.. 36 ఏళ్లు (ఈ సినిమా లెక్కల్లో రెండేళ్లు దాచేశారు). ఎత్తు.. ఐదు అడుగుల నాలుగు అంగుళాలు (హీల్స్ వేసుకుంటే ఇంకా ఎత్తుగా కనిపించే అవకాశం ఉంది). కిడ్నాపింగ్ అండ్ మర్డర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మోస్ట్ వాంటెడ్ లేడీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘కహానీ 2’ చూడమంటున్నారు దర్శకుడు సుజోయ్ ఘోష్. ఆయన దర్శకత్వంలో విద్యాబాలన్ ముఖ్యతారగా నటిస్తున్న చిత్రమిది. 2012లో విడుదలైన సూపర్‌హిట్ సస్పెన్స్ థిల్లర్ ‘కహానీ’కి సీక్వెల్. ఇందులో విద్యాబాలన్ డీ-గ్లామరస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విద్యా ఫస్ట్ లుక్‌ను ‘వాంటెడ్’ అంటూ టీవీలో న్యూస్ రీడర్ వార్త చదువుతున్నట్టు ఆసక్తికరంగా పోస్టర్ రూపంలో విడుదల చేశారు. అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకూ దుర్గారాణీ సింగ్ కిడ్నాప్ చేసింది ఎవర్ని? హత్య చేసింది ఎవర్ని? అనే వివరాలు సస్పెన్సే. -
దుర్గా రాణీ సింగ్‌గా...
‘జజ్బా’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐశ్వర్యారాయ్ కెరీర్ మంచి జోరు మీద ఉంది. ‘జజ్బా’లో లాయర్‌గా విభిన్నమైన పాత్రలో కనబడ్డ ఆమెను వరుసగా వైవిధ్యమైన పాత్రలే వరిస్తున్నాయి. పాకిస్తాన్ జైలులో మగ్గిన భారతీయ ఖైదీ సరబ్జీత్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలోనూ, కరణ్‌జోహార్ తీస్తున్న ‘‘అయ్ దిల్ హై ముష్కిల్’లోనే ఆమె నటిస్తున్నారు. తాజాగా ఓ పోలీస్ పాత్ర ఆమెను వరించింది. ‘కహానీ’ ఫేం సుజోయ్ ఘోష్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారట. ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆధారంగా నిజజీవిత కథతో రూపొందనున్న చిత్రం ‘దుర్గా రాణీ సింగ్’. మొదట ఈ పాత్ర కంగనా రనౌత్, విద్యాబాలన్ చేస్తారనే వార్తలు వినిపించాయి. కానీ ఈ రోల్ ఐశ్వర్యారాయ్‌ను వరించింది. ఇటీవలే దర్శకుడు సుజోయ్ ఘోష్ ‘ద డివోషన్ ఆఫ్ మిస్టర్ ఎక్స్’, ‘దుర్గా రాణీ సింగ్’ కథలతో నన్ను సంప్రతించారు. కానీ, ‘దుర్గా...’ కథ నాకు బాగా నచ్చింది. అన్నీ కుదిరితే అదే చేసే చాన్స్ ఉంది’’ అని ఐశ్వర్యారాయ్ చెప్పారు. -
ఆ ఇద్దరు వదులుకున్న సినిమాలో కరీనా
ఇటీవలి కాలంలో హిందీ రంగంలో కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమాలు ఎక్కువయ్యాయి. కహానీ, క్వీన్.. ఇలా ఈ మధ్య విడుదలైన లేడీ ఓరియంటెడ్ సినిమాలన్నీ ఘనవిజయాలు సాధించాయి. తాజాగా ‘కహానీ’ దర్శకుడు సుజయ్ ఘోష్ మరో కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమా రూపొందించనున్నారు. పోలీసు అధికారి దుర్గా రాణీసింగ్ జీవితం ఆధారంగా ఆయన ఓ కథ తయారు చేశారు. ఈ సినిమాకి ఆమె పేరునే టైటిల్‌గా పెట్టారు. కాగా, తన ‘కహానీ’ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన విద్యాబాలన్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ కథ రాసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల విద్య ఈ చిత్రాన్ని తిరస్కరించారు. దాంతో ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో విజృంభిస్తున్న కంగనా రనౌత్‌ని అడిగారు సుజయ్. కంగనాకి కథ నచ్చింది కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్‌లో చేరడానికి ముందే ప్లాన్ చేసుకోవడంవల్ల, ఆమె కూడా ఈ చిత్రాన్ని కాదనేశారు. ఆ తర్వాత సుజయ్ మనసులో మెదిలిన నాయిక కరీనాకపూర్. ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించారట. ’కహనీ’ లాంటి మంచి చిత్రాన్ని అందించిన సుజయ్‌తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నా, ఇద్దరు నాయికలు వదులుకున్న సినిమాను తను అంగీకరించాలా? లేదా? అనే ఆలోచనలో పడ్డారట కరీనా. చివరికి ఇలాంటి మంచి సినిమాను వదులుకుంటే, భవిష్యత్తులో మళ్లీ అవకాశం రాదేమోనని భావించి ‘దుర్గా రాణీసింగ్’గా చేయడానికి పచ్చజెండా ఊపేశారు.