దుర్గాదేవి నిమజ్జనం.. చిన్నారులకు తీవ్రగాయాలు
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : మండలంలోని పైడిభీమవరం పంచాయతీ వరిసాం గ్రామంలో దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా బాణసంచా పేలి ఐదుగురు చిన్నారు లు తీవ్రంగా కాలిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బాణసంచా పేలుడు సంభవించి కె.వసంత్, ఎం.శ్రీను, ఎం.బాలకృష్ణ, డి. శ్యామ్, ఎ.తేజ తీవ్రంగా గాయపడ్డారు. ఇందు లో కె.వసంత్‌కు ముఖం పూర్తిగా కాలిపోవడం తో గుర్తుపట్టలేని విధంగా తయారైంది. తొలుత విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంలో విశాఖపట్నంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వసంత్ ముఖానికి సర్జరీ చేయాలంటే సుమారు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఎం.శ్రీనుకు కాలు పూర్తిగా కాలిపోవ డంతో పరిస్థితి విషమంగా ఉంది.
వీరు నిరుపేద కుటుంబాలకు చెందినవారు కావటంతో దా తల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సహాయం చేయాలనుకునే దాతలు 99630 89699, 6301997993 నంబర్లను సంప్రదించా లని చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రవీణ్ గ్లాస్ వుడ్ యాజమాని కిల్లారి పైడినాయుడు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. దీనిపై జె.ఆర్.పురం ఎస్ఐ బి.అశోక్ బాబును వివరణ కోరగా ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.