e-commerce websites
-
ఈ–కామర్స్ సైట్ల నుంచే డేటా లీక్.. ఇంటి దొంగల పనే ఇదంతా..!
ఈ రోజుల్లో సరుకులు, కూరగాయల నుంచి దుస్తుల వరకూ ప్రతీది ఆన్లైన్లో కొనేయడం అలవాటైపోయింది. అయితే ఆన్లైన్ షాపింగ్‌లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయింది. కస్టమర్ల పేరు, చిరునామా, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, కొనుగోలు చేసిన వస్తువులు.. ఇలా ప్రతీ ఒక్కటీ బహిరంగ మార్కెట్లోకి అలవోకగా వచ్చేస్తున్నాయి. భద్రంగా ఉండాల్సిన కస్టమర్ల వ్యక్తిగత వివరాలు అంగట్లో సరుకులుగా విక్రయిస్తున్నట్లు ఇటీవలసైబరాబాద్ పోలీసులు డేటాలీక్, విక్రయం కేసు విచారణలో గుర్తించారు. అమెజాన్, బిగ్‌బాస్కెట్, జొమాటో వంటి పదుల సంఖ్యలోని ఈ–కామర్స్ సైట్లలోని కస్టమర్ల డేటాను నేరస్తులు అమ్మకానికి పెట్టారు. – సాక్షి, హైదరాబాద్ ఇంటి దొంగల పనే.. ఆయా ఈ–కామర్స్ వెబ్సైట్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు డబ్బులు చెల్లించి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆర్డర్ చేసిన వస్తువులతోపాటు కస్టమర్ల డేటా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలో డేటాను డెలివరీ పాయింట్స్ నుంచి సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత టెలికాలర్స్తో కస్టమర్లకు ఫోన్ చేయిస్తున్నారు. ఫలానా సైట్ ద్వారా మీరు వస్తువు కొనుగోలు చేశారు.. కంపెనీ తీసిన లక్కీడీప్‌లో మీరు ఖరీదైన కారు, అందుకు సమానమైన నగదు బహుమతి గెలుచుకున్నారంటూ ఫోన్లో నమ్మిస్తున్నారు. జీఎస్టీ, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ ఇలా రకరకాల చార్జీలు చెల్లించాలని, అవన్నీ తిరిగి రీఫండ్ చేస్తామంటూ బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేసి ఫోన్లు స్విచాఫ్ చేస్తున్నారు. ఇలా సైబర్ నేరస్తులు దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అప్రమత్తత అవసరం నిందితులు విక్రయానికి పెట్టిన వాటిలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్‌పే, బిగ్ బాస్కెట్, బుక్‌మై షో, ఇన్‌స్ట్రాగామ్, జొమాటో, పాలసీ బజార్, ఓఎల్ఎక్స్, బైజూస్, వేదాంతు వంటి సంస్థల వినియోగదారుల డేటా కూడా ఉంది. యూజర్ల సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ (ఎస్పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఈ–కామర్స్ సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో వ్యక్తిగత వివరాల నమోదు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
ఆన్లైన్ షాపింగా.. జరభద్రం!
సాక్షి, న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, మింత్రా, షాప్క్యూస్ లాంటి ఈ కామర్స్ సంస్థలతో ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్న ఉత్పత్తుల్లో ఎక్కువగా నకిలీ ఉత్పత్తులే ఉంటున్నాయని ప్రతి ముగ్గురిలో ఇద్దరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మొబైల్, కంప్యూటర్లలో ఎక్కువగా నకిలీ ఉత్పత్తులు వస్తున్నాయని, ఆ తర్వాత ఫ్యోషన్ ఉత్పత్తులు, ఆ తర్వాత టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఈ మోసం ఎక్కువగా జరుగుతోందని వినియోగదారులు ఆరోపించారు. ముంబైకి చెందిన మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘వెలాసిటీ మిస్టర్’ తమ సర్వేలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలియజేసింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణె నగరాలకు చెందిన దాదాపు మూడువేల మంది ఆన్లైన్ వినియోగదారుల అభిప్రాయలను ఏప్రిల్ మొదటి వారంలో సేకరించడ ద్వారా ఈ సర్వేను నిర్వహించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో జషల్ షా తెలియజేశారు. అవకతవకలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ కామర్స్ మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నప్పటికీ ఇలా నకిలీ సరుకులు వెల్లువెత్తడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మకం దారే ఒరిజనల్ అంటూ నకిలీ సరకులను సరఫరా చేస్తే తామేమి చేయలేమని, మార్గమధ్యంలో సరకులు మారకుండా మాత్రమే తాము కట్టడి చేయగలమని ఈ కామర్స్ సంస్థలు తెలియజేస్తున్నాయి. తమ వ్యాపారం నమ్మకంపైకే ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ఆ నమ్మకం వమ్ముకాకుండా ఉండేందుకే ఎక్కువ కృషి చేస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి. 2026 నాటికి 20.000 కోట్ల రూపాయలకు ఈ కామర్స్ వ్యాపారం చేరుకుంటుందని అంచనా వేస్తున్న సమయంలో నకిలీ ఉత్పత్తులు పెరిగిపోవడం నిజంగా విచారకరమే. నకిలీ ఉత్పత్తులను గమనించి వాటిని తిప్పి పంపితే, డబ్బు వెనక్కి వస్తున్న సందర్భాలు చాలా తక్కువని, నకిలీ స్థానంలో మరో ఉత్పత్తిని తీసుకోవడమే ఎక్కువ సార్లు జరుగుతోందని వినియోగదారులు చెబుతున్నారు. ఒరిజనల్ కన్నా తక్కువ ధరకు వస్తే నకిలీ ఉత్పత్తులనైనా తీసుకునేందుకు తాము సిద్ధమేనని ప్రతి నలుగురిలో ఒకరు చెబుతుండగా, ఒరిజనల్‌తో సమానమైన నాణ్యత కలిగి ఉన్నట్లయితే వాటిని తీసుకునేందుకు తాము సిద్ధమని 20 శాతం మంది వినియోగదారులు చెప్పారు. -
‘ఆన్లైన్’ టపాసు పేలింది!
సొమ్ము చేసుకున్న చోటా ఇ-కామర్స్ వెబ్సైట్లు సాక్షి సెంట్రల్‌డెస్క్: ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, దుస్తులు, ఇతర వస్తువులను ఆన్లైన్లో కొనుక్కోవడం అలవాటుగా మారిన ప్రభావం ఇప్పుడు దీపావళి టపాసులపైనా పడింది. ఎన్నడూ లేని స్థాయిలో ఈ ఏడాది క్రాకర్స్ బిజినెస్ ఆన్లైన్ మయం అయ్యింది. మొత్తంగా టపాసుల వ్యాపారంలో గణనీయమైన తరుగుదల నమోదైందని వ్యాపారవర్గాలు ఒకవైపు చెబుతున్నా ఆన్లైన్లో మాత్రం రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. పెద్ద పెద్ద వెబ్సైట్లు కాకుండా, ఆన్లైన్లో టపాసుల అమ్మకాల్లో యువ ఎంటర్ప్రెన్యుయర్ల హవా నడిచింది. ఒకవైపు ఆఫ్‌లైన్‌లో కూడా టపాసులు దొరుకుతున్నా.. నగర, పట్టణ ప్రాంతాల వాళ్లు ఆన్లైన్ అమ్మకాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముం దస్తుగా వెబ్సైట్లను ప్రారంభించి వాటి ద్వారా బాణసంచాను అమ్మకానికి పెట్టిన వారి పంట పండింది. కుప్పలు తెప్పలుగా వెబ్సైట్లు..! ఇప్పటికే బాణసంచా వ్యాపారంలో ఉన్నవారు, ఆన్లైన్ మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్న టెక్కీలు... వెబ్‌లో టపాసుల వ్యాపారానికి దిగారు. రంగురంగుల హోంపేజీలతో, ఆకట్టుకునే ఆఫర్లతో టపాసుల ధరల వివరాలను అందుబాటులో ఉంచారు. టపాసులను కొనుక్కోవడానికి ఆన్‌లైన్‌ను ఆశ్రయించిన వారిని ఈ సైట్లు ఆకట్టుకున్నాయి. ఒక్కసారి గూగుల్‌లో ‘ఆన్లై న్ క్రాకర్స్ సేల్’ అనే కీ వర్డ్‌ను కొడితే కొన్ని వందల సైట్లు ప్రత్యక్షం అవుతాయి. బయట మార్కెట్‌తో పోలిస్తే ఈ వెబ్సైట్లు తక్కువ ధరలోనే టపాసులను అందుబాటులో ఉంచడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. మొత్తం టపాసుల అమ్మకాల్లో 15% వీటి వాటా ఉంటుందని విశ్లేషకుల అంచనా. రూ.వేల కోట్ల వ్యవహారం అయిన దీపావళి టపాసుల వ్యాపారంలో ఇదీ పెద్ద మొత్తమే. పోటీలోలేని పెద్ద సైట్లు.. ఆన్లైన్ మార్కెటింగ్‌లో ప్రధానంగా కొన్ని వెబ్సైట్ల గుత్తాధిపత్యం ఉందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే దీపావళి సందర్భంగా కూడా ఆ సైట్లు.. స్మార్ట్ఫోన్ల పై ఆఫర్లు, సోఫాలు ఇతర గృహావసరాల అమ్మకాల మీదే దృష్టిపెట్టాయి. అవి ఆ సందడిలో ఉండగానే చిన్నచిన్న వ్యాపారస్తులు బాణసంచా మార్కెట్లో ఆన్‌లైన్‌ను మార్కెట్‌ను ఆక్రమించేశారు. అమెజాన్‌డాట్‌కామ్ వంటి సైట్లు ఈ ఆన్లైన్ టపాసుల వ్యాపారాన్ని చేస్తున్నా వెనుకబడ్డాయి. ముందుస్తుగానే క్లోజ్ అవుతుంది! నవంబర్ 11న దీపావళి. ఆ రోజు సాయంత్రానికల్లా డెలివరీ ఇవ్వగలిగిన ఆర్డర్లనే వెబ్సైట్లు తీసుకుంటున్నాయి. టపాసుల రవాణాకు పరిమితులున్న నేపథ్యంలో కొన్ని వెబ్సైట్లు అప్పుడే ఆర్డర్లను తీసుకోవడాన్ని ఆపేస్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమే.. ఈసారి రికార్డుస్థాయి ఆర్డర్లను తీసుకున్నట్లు ఛఠడౌజ్ఛీఛిట్చఛిజ్ఛుటట.జీ అనే వెబ్సైట్ నిర్వాహకుడు తెలి పారు. ఆన్లైన్లో కొనుక్కోవడంలో చాలా సౌలభ్యాలున్నాయని ఛిట్చఛిజ్ఛుటటఝ్ఛ్చ.ఛిౌఝ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. షాప్‌కు వెళితే ఒక్కోసారి బడ్జెట్ రెట్టింపు కావొచ్చని, అదే ఆన్లైన్లో అయితే బడ్జెట్ పరిమితులతో కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.