‘ఆన్‌లైన్’ టపాసు పేలింది!
సొమ్ము చేసుకున్న చోటా ఇ-కామర్స్ వెబ్‌సైట్లు
సాక్షి సెంట్రల్‌డెస్క్: ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, దుస్తులు, ఇతర వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుక్కోవడం అలవాటుగా మారిన ప్రభావం ఇప్పుడు దీపావళి టపాసులపైనా పడింది. ఎన్నడూ లేని స్థాయిలో ఈ ఏడాది క్రాకర్స్ బిజినెస్ ఆన్‌లైన్ మయం అయ్యింది. మొత్తంగా టపాసుల వ్యాపారంలో గణనీయమైన తరుగుదల నమోదైందని వ్యాపారవర్గాలు ఒకవైపు చెబుతున్నా ఆన్‌లైన్‌లో మాత్రం రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
పెద్ద పెద్ద వెబ్‌సైట్లు కాకుండా, ఆన్‌లైన్‌లో టపాసుల అమ్మకాల్లో యువ ఎంటర్‌ప్రెన్యుయర్ల హవా నడిచింది. ఒకవైపు ఆఫ్‌లైన్‌లో కూడా టపాసులు దొరుకుతున్నా.. నగర, పట్టణ ప్రాంతాల వాళ్లు ఆన్‌లైన్ అమ్మకాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముం దస్తుగా వెబ్‌సైట్లను ప్రారంభించి వాటి ద్వారా బాణసంచాను అమ్మకానికి పెట్టిన వారి పంట పండింది.
కుప్పలు తెప్పలుగా వెబ్‌సైట్లు..!
ఇప్పటికే బాణసంచా వ్యాపారంలో ఉన్నవారు, ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్న టెక్కీలు... వెబ్‌లో టపాసుల వ్యాపారానికి దిగారు. రంగురంగుల హోంపేజీలతో, ఆకట్టుకునే ఆఫర్లతో టపాసుల ధరల వివరాలను అందుబాటులో ఉంచారు. టపాసులను కొనుక్కోవడానికి ఆన్‌లైన్‌ను ఆశ్రయించిన వారిని ఈ సైట్లు ఆకట్టుకున్నాయి. ఒక్కసారి గూగుల్‌లో ‘ఆన్‌లై న్ క్రాకర్స్ సేల్’ అనే కీ వర్డ్‌ను కొడితే కొన్ని వందల సైట్లు ప్రత్యక్షం అవుతాయి. బయట మార్కెట్‌తో పోలిస్తే ఈ వెబ్‌సైట్లు తక్కువ ధరలోనే టపాసులను అందుబాటులో ఉంచడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. మొత్తం టపాసుల అమ్మకాల్లో 15% వీటి వాటా ఉంటుందని విశ్లేషకుల అంచనా. రూ.వేల కోట్ల వ్యవహారం అయిన దీపావళి టపాసుల వ్యాపారంలో ఇదీ పెద్ద మొత్తమే.
పోటీలోలేని పెద్ద సైట్లు..
ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో ప్రధానంగా కొన్ని వెబ్‌సైట్ల గుత్తాధిపత్యం ఉందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే దీపావళి సందర్భంగా కూడా ఆ సైట్లు.. స్మార్ట్‌ఫోన్ల పై ఆఫర్లు, సోఫాలు ఇతర గృహావసరాల అమ్మకాల మీదే దృష్టిపెట్టాయి. అవి ఆ సందడిలో ఉండగానే చిన్నచిన్న వ్యాపారస్తులు బాణసంచా మార్కెట్‌లో ఆన్‌లైన్‌ను మార్కెట్‌ను ఆక్రమించేశారు. అమెజాన్‌డాట్‌కామ్ వంటి సైట్లు ఈ ఆన్‌లైన్ టపాసుల వ్యాపారాన్ని చేస్తున్నా వెనుకబడ్డాయి.
ముందుస్తుగానే క్లోజ్ అవుతుంది!
నవంబర్ 11న దీపావళి. ఆ రోజు సాయంత్రానికల్లా డెలివరీ ఇవ్వగలిగిన ఆర్డర్లనే వెబ్‌సైట్లు తీసుకుంటున్నాయి. టపాసుల రవాణాకు పరిమితులున్న నేపథ్యంలో కొన్ని వెబ్‌సైట్లు అప్పుడే ఆర్డర్లను తీసుకోవడాన్ని ఆపేస్తున్నాయి.
ఇది ఆరంభం మాత్రమే..
ఈసారి రికార్డుస్థాయి ఆర్డర్లను తీసుకున్నట్లు ఛఠడౌజ్ఛీఛిట్చఛిజ్ఛుటట.జీ అనే వెబ్‌సైట్ నిర్వాహకుడు తెలి పారు. ఆన్‌లైన్‌లో కొనుక్కోవడంలో చాలా సౌలభ్యాలున్నాయని ఛిట్చఛిజ్ఛుటటఝ్ఛ్చ.ఛిౌఝ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. షాప్‌కు వెళితే ఒక్కోసారి బడ్జెట్ రెట్టింపు కావొచ్చని, అదే ఆన్‌లైన్‌లో అయితే బడ్జెట్ పరిమితులతో కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.