EGMM
-
సమ్మె విరమించండి
ఉపాధి హామీ ఉద్యోగులకు కేటీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్లామని మంత్రి పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఉపాధిహామీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) కార్యక్రమాల అమలు గురించి ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగులతో సమ్మె విరమింపజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. పథకం అమల్లో పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని తగ్గించే ందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉపాధి హామీ పనులపై కేంద్రం విధించిన పరిమితి గురించి రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ రాయాలని ఆదేశించారు. పథకం అమలుకు ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్య(ప్రత్యేక సాఫ్ట్వేర్, సోషల్ ఆడిట్..తదితర)లను కేంద్రానికి రాసే లేఖలో పేర్కొనాలని మంత్రి సూచించారు. -
‘ఈజీఎంఎం’లో సమూల మార్పులు
అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ‘ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం)’లో సమూల మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఈజీఎంఎం శిక్షణ కార్యక్రమాల రూపకల్పనపై శనివారం ఆయన ఆ విభాగం ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈజీఎంఎం శిక్షణ కేంద్రాల పనితీరును మెరుగు పర్చేందుకు వివిధ రంగాల్లో పేరుపొందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశిం చారు. నిరుద్యోగ యువతకు అందించే శిక్షణలో, వృత్తి నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కు అధిక ప్రాధాన్యమిచ్చేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఈజీఎంఎంను ఉపాధి, వృత్తినైపుణ్య వనరుల సంస్థగా జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించిందని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుసంధానం: ఈజీఎంఎం శిక్షణ కేంద్రాలను పరిశ్రమలతో నేరుగా అనుసంధానం చేసి, శిక్షణ పొందే యువత కు ఉద్యోగావకాశాలు మెరుగయ్యేలా ప్రణాళికలు రూపొందిం చాలన్నారు. శిక్షణ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను పేరున్న సంస్థలకే అప్పగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈజీఎంఎం కార్యక్రమాల రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. కాంట్రాక్టు ఉద్యోగులు కొనసాగింపు.. ఎం ప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆయా ఉద్యోగాల్లో మరో ఏడాదిపాటు కొనసాగించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతను గుర్తించి వారి వివరాలను ఈజీఎంఎంకు అందించే జాబ్ రిసోర్స్ పర్సన్ల(జెఆర్పీ)ను కూడా కొనసాగిస్తామన్నారు. ఉద్యోగ భద్రత గురించి ఉద్యోగులెవ్వరూ ఆందోళన చెందనక్కర్లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఈజీఎంఎం ముఖ్య కార్యనిర్వహణాధికారి మురళీధర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉపాధికి..చేటుకాలం
‘ముందుంది మంచికాలం’ అంటూ గత ‘ముఖ్య’ నేత హడావుడి చేశారు. రాజీవ్ యువకిరణాలు పేరుతో యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి, ఏటా లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పారు. అది మొక్కుబడి తంతుగానే ముగిసింది. ఆ కాలంలో శిక్షణ ముగించుకొని, గౌరవప్రదమైన జీతాలు పొందినవారు చాలా తక్కువే. ఆయన తరువాత ‘బాబు వస్తేనే జాబు’ అంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఆయన హయాంలో.. ఉన్న ఉపాధి శిక్షణ కేంద్రాలు కూడా ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. సాక్షి, రాజమండ్రి :ఇంటర్, డిగ్రీ చదివిన యువకులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు 2005-06లో అప్పటి ప్రభుత్వం ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) పేరుతో వృత్తి శిక్షణ కేంద్రాలు ప్రారంభించింది. యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి, కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగావ కాశాలు కల్పించడం ప్రారంభించారు. పేద, మధ్య తరగతి యువతలో ఈ పథకం ఆత్మవిశ్వాసం నింపింది. కానీ తర్వాత ఈ పథకానికి రాజకీయ రంగు పులిమారు. గత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి ‘రాజీవ్ యువకిరణాలు’గా పేరు మార్చింది. ఏటా లక్ష ఉద్యోగాలన్న నినాదంతో పథకాన్ని కొనసాగించింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 45 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ శిక్షణ పొందిన ఏ ఒక్కరికీ రూ.10 వేలు వేతనం వచ్చే ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారు. సుమారు ఐదు వేల మంది రూ.8 వేల లోపు వేతనం వచ్చే ఉద్యోగాలే పొందారు. కానీ, నానాటికీ పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం చాలకపోవడంతో చాలామంది మధ్యలోనే ఉద్యోగాలు వదులుకున్నారని తెలుస్తోంది. అంకెల్లో పథకం.. రాజీవ్ యువకిరణాల్లో భాగంగా 2012-13లో జిల్లాలో 155 శిక్షణ కేంద్రాలు పెట్టేందుకు ప్రతిపాదించగా, 45 మాత్రమే ఏర్పడ్డాయి. 2012 నుంచి 2014 తొలి త్రైమాసికం వరకూ మొత్తం 1.45 లక్షల మంది శిక్షణకు పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరిలో 13,676 మందికి శిక్షణ ఇవ్వగా ఉపాధి పొందినవారు కేవలం 5 వేల మంది మాత్రమే. 2012-13లో 265 బ్యాచ్‌ల్లో 7,725 మందికి శిక్షణ ఇవ్వగా 2,686 మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. 2013-14లో 211 బ్యాచ్‌ల ద్వారా 5,710 మందికి శిక్షణ ఇవ్వగా వీరిలో 2,151 మంది మాత్రమే ఉపాధి పొందారు. 2014-15 తొలి త్రైమాసికంలో కేవలం మూడు సెంటర్ల ద్వారా మూడు బ్యాచ్‌లలో కేవలం 241 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఆరంభం మాత్రం అదుర్సే 2006-09 మధ్య సుమారు 15 వేల మందికి శిక్షణ ఇవ్వగా, వీరిలో 12 వేల మంది ఉపాధి పొందారు. తర్వాత 2010-11లో 1500 మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో 1250 మంది ఉపాధి పొందారు. 2011-12లో 4800 మంది శిక్షణ పొందగా, వారిలో 3850 మందికి ఉపాధి లభించింది. అంటే శిక్షణ పొందినవారిలో సుమారు 82 శాతం ఉపాధి పొందారు. ఆ తర్వాత 2012-14 మధ్యకాలంలో శిక్షణ పొందినవారిలో 35 శాతం మందికి కూడా ఉపాధి దక్కలేదు. కుంటుబడిన శిక్షణ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు పూర్తిగా కుంటుబడ్డాయి. పథకం దాదాపు మూలన పడింది. ఒకటొకటిగా శిక్షణ కేంద్రాలు మూత పడడంతో వాటి సంఖ్య 45 నుంచి మూడుకు పడిపోయింది. యువతకు జాబు రావాలంటే బాబు అధికారంలోకి రావాలని స్వయంగా చంద్రబాబునాయుడే ప్రచారం చేసుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి శిక్షణలను మూలనపడేశారు. ఇలాగైతే జాబు వచ్చేదెలా అని విద్యావంతులైన నిరుద్యోగ యువత ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.