Elite
-
అక్రమాల టై‘టానిక్’
సాక్షి, హైదరాబాద్: ఎలైట్ పేరుతో మద్యం వ్యాపా రంలోకి ప్రవేశించిన టానిక్ గ్రూపు ఏకంగా రాష్ట్రంలోని లిక్కర్ దందాను కబ్జా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండు షాపులు పెడతామని, విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముతామని నమ్మబలికి ఎంట్రీ ఇచ్చిన ఆ సంస్థ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఏకంగా గొలుసు వ్యాపారానికి (చైన్ బిజినెస్) సిద్ధమైంది. నాటి ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలక వ్యక్తుల (ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక మాజీ ఉన్నతాధికారి) సాన్నిహిత్యం, సంపూర్ణ సహకారంతో నిబంధనలను తన కనుసన్నల్లో రూపొందించుకుని, తనకు మాత్రమే సాధ్యమయ్యేలా రూల్స్ పెట్టి ఇంకెవరూ ఎలైట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న టానిక్ సంస్థ గత ఆరేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్నాయంటూ ‘టెండర్’ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.... రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో భాగంగా 2016–18 సంవత్సరాల్లో లాటరీ పద్ధతిన 2,216 ఏ4 షాపులకు లైసెన్సులిచ్చే ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టానిక్ గ్రూపు రంగంలోకి దిగింది. అప్పట్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 70 వరకు షాపులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించింది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ అండ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామంటూ లిక్కర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలైట్ స్టోర్ పేరుతో కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముకునేందుకు వీలుగా తమకు మాత్రమే సాధ్యమయ్యేలా నిబంధనలను రూపొందించేలా మరీ అడుగుపెట్టింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారే ఎక్సైజ్ శాఖ అధిపతిగా ఉండడం, టీఎస్బీసీఎల్కూ ఆయనే బాస్ కావడంతో ఆయన్ని మచ్చిక చేసుకుని ఎలైట్ స్టోర్ ఏర్పాటు కోసం ప్రత్యేక జీవోను వచ్చేలా చేసింది. కనీసం ఎక్సైజ్ శాఖకు సమాచారం లేకుండానే ఆ జీవో ముసాయిదాను బయట తయారుచేయించి ఆ ముసాయిదాతోనే ఫైల్ నడిపించిందని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారంటే టానిక్ సంస్థ ముందస్తు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎలైట్ షాపు ఏర్పాటు చేసేందుకు గాను ప్లింత్ ఏరియా 10వేల చదరపు అడుగులు ఉండాలనీ, సదరు షాపును సూపర్మార్కెట్లు, మాల్స్‌లో ఏర్పాటు చేయాలంటే ఆయా మాల్స్ మొత్తం వైశాల్యం 25వేల చదరపు అడుగులు ఉండాలని, కనీసం 100 ఇంపోర్టెడ్ బాటిళ్లు ఎప్పుడూ డిస్ప్లే ఉండాలని... ఇలా తమకు మాత్రమే సాధ్యమయ్యే నిబంధనలను జీవోలో పెట్టించి ఇంకెవరూ ఈ ఎలైట్ షాపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వీలులేకుండా చూసుకుంది. 2016, అక్టోబర్ 26న వచ్చిన జీవోనెం:271 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం, వారం రోజుల్లో అనిత్‌రాజ్ లక్ష్మారెడ్డి పేరిట లైసెన్సు ఇవ్వడం కూడా పూర్తయిపోయాయి. చైన్ బిజినెస్ స్థాయికి ప్రణాళిక.. ముందుగా రెండు షాపులు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న టానిక్ సంస్థ తొలుత ఒక్క దుకాణాన్ని మాత్రమే తెరిచింది. కొన్నిరోజుల పాటు విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మిన తర్వాత ఇండియన్ ప్రీమియం లిక్కర్ కూడా అమ్ముతామంటూ ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంది. టానిక్ అడిగిందే తడవుగా ఎక్సై జ్ శాఖ అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో ఈ ఒక్క షాపు ద్వారానే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుండడం, ఎప్పుడో వస్తుందని ఊహించిన ఆదాయం తొలి ఏడాది నుంచే రావడంతో గొలుసు వ్యాపారం చేయాలనే ఆలోచన టానిక్ యాజమాన్యానికి తట్టింది. పుల్లారెడ్డి స్వీట్లు, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లు, నారాయణ, చైతన్య కళాశాలల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ దుకాణాలు తెరుస్తామని ప్రతిపాదించింది. కానీ అప్పటికే ఏ4 షాపుల టెండర్లు పూర్తి కావడంతో సదరు షాపుల లైసెన్సీల నుంచి ప్రతికూలత వస్తుందని, న్యాయపరంగా అడ్డంకులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గింది. క్యూ/టానిక్‌గా పేర్లుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళిక దెబ్బతినడంతో వైన్స్‌షాపుల వైపు టానిక్ దృష్టి మళ్లింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లాటరీ పద్ధతిలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. అడపాదడపా షాపులు వచ్చినా టెండర్ ఫీజు భారీగా కట్టాల్సి వస్తుండడంతో లైసెన్స్ పొందిన ఏ4 షాపులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోనికి వచ్చే దాదాపు 10 షాపుల్లో భాగస్వామ్యం తీసుకుంది. తమ వాటా ఉన్న వైన్‌షాపులకు క్యూ/టానిక్‌గా పేర్లు మార్చుకుంది. అచ్చం మాతృ టానిక్ షాపులాగానే ఎలైట్గా వీటిని తయారు చేసి విదేశీ మద్యంతో పాటు ఇండియన్ ప్రీమియం లిక్కర్‌ను మాత్రమే విక్రయించేది. చీప్ లిక్కర్‌తో పాటు తక్కువ ధర ఉండే బ్రాండ్లు అమ్మేందుకు వైన్స్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ఈ టానిక్ చైన్షాపుల్లో మాత్రం లభించేవి కావు. ఇలా భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియలో, తనిఖీల విషయంలో తమకు సహకరించిన ఆరుగురు అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మంచి పోస్టింగులే కాదు... ఆమ్యామ్యాలను కూడా సమర్పించుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న ఒకరి బంధువులు కూడా ఈ టానిక్ చైన్షాపుల్లో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఏకంగా ఐదేళ్లకు లైసెన్సు... ఆ తర్వాత రెన్యువల్ సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏ4 షాపులు (వైన్స్), వాకిన్ స్టోర్లకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులిస్తారు. బార్లకు కూడా రెండేళ్లకే లైసెన్స్ ఇచ్చినా గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, టానిక్ ఎలైట్ వాకిన్ స్టోర్‌కు ఏకంగా ఐదేళ్ల లైసెన్సు మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలా ఐదేళ్ల పాటు లైసెన్సు ఇవ్వడమే కాదు మళ్లీ ఆ లైసెన్సును రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇదే కాదు... రాష్ట్రంలోని అన్ని వైన్స్‌షాపులకు ఉన్న టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ)లోనూ ఈ ఎలైట్ షాపునకు మినహాయింపులిచ్చారు. మూడేళ్ల పాటు ఎంత వ్యాపారం చేసినా టీవోటీ వసూలు చేయవద్దన్న వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనతోనే రూ.వందల కోట్ల వ్యాపారాన్ని యథేచ్ఛగా టానిక్ చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్ శాఖకు అదనపు పన్ను చెల్లించే పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఈ పన్నుల కోసమే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ఎక్సైజ్ శాఖ కూడా నోటీసులు జారీ చేస్తూ గత తప్పిదాలను సవరించుకునే పనిలో పడింది. -
గ్రేటర్లో మరిన్ని ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మరిన్ని ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్లు అందుబాటులోకి రానున్నాయి. మద్యం ప్రియులను ఆకట్టుకొనేలా.. అన్ని సదుపాయాలతో ఆధునికత ఉట్టిపడేలా ఏర్పాటు చేసే బార్లకు అనుమతినిచ్చేందుకు ఆబ్కారీ శాఖ సన్నాహాలు చేపట్టింది. విధివిధానాలను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటి వరకు ఎలైట్ బార్లకు ఎలాంటి టెండర్లు లేకుండానే అనుమతిస్తుండగా.. కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటికి టెండర్లను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. లిక్కర్ ధరలను పెంచకుండా ఎకై ్సజ్ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతుల ప్రతిపాదనను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. 150 బార్లకు అనుమతులు.. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 550కి పైగా రెగ్యులర్ బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని సాధారణ జనతా బార్లు కాగా మరికొన్ని కనీస సదుపాయాలతో సేవలందిస్తున్నాయి. ఇక ఎలైట్ బార్ల సంఖ్య 100 లోపే ఉన్నట్లు అంచనా. ఇప్పుడున్న ఎలైట్ బార్లకు అదనంగా మరో 150కి పైగా కొత్త బార్లకు అనుమతినివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఇప్పటి వరకు రూ.లక్షల లైసెన్స్ ఫీజుతో అనుమతులిచ్చారు. కొత్తగా అనుమతించనున్న ఎలైట్ బార్లకు టెండర్లను నిర్వహించడం ద్వారా మరింత ఆదాయాన్ని ఆర్జించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం 150 వరకు బార్లకు అనుమతించాలని ప్రతిపాదించినప్పటికీ వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయమే లక్ష్యం.. ఆదాయం పెంచుకొనేందుకు గత ప్రభుత్వం లిక్కర్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. మరోసారి లిక్కర్ ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం వాటి ధరల జోలికి వెళ్లకుండా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం ఎకై ్సజ్శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఎలైట్ బార్ అండ్రెస్టారెంట్లకు 2017లోనే జీఓ విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రస్తుతం ఈ జీఓను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.రెగ్యులర్ బార్లకు రూ.40 లక్షల చొప్పున ఫీజు వసూలు చేస్తుండగా, ఎలైట్ బార్ల ఫీజు రూ.50 లక్షల వరకు ఉంటాయి. అలాగే ఏటా 25 శాతం చొప్పున ఫీజు పెంచుతారు. ఎలైట్బార్లు రెగ్యులర్ బార్ల కంటే అదనపు సదుపాయాలతో ఉంటాయి. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలైట్బార్లను ఏర్పాటు చేస్తారు. లిక్కర్ బాటిళ్ల కోసమే సుమారు 2000 చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. బార్ మొత్తం పూర్తిగా సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయంతో ఉంటుంది. వినియోగదారులకు శుచిగా, శుభ్రంగా, అత్యంత నాణ్యమైన పద్ధతుల్లో ఆహారాలను, స్నాక్స్‌ను వండి వడ్డించేందుకు చక్కటి ఆల్ట్రామోడరన్ కిచెన్ ఉంటుంది. విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ ప్రమాణాల మేరకు ఏర్పాటు చేసే బార్లకే ఎలైట్ అనుమతులను ఇస్తారు. ఎలైట్ వైన్స్ సైతం.. ఎలైట్ బార్ల తరహాలోనే ఎలైట్ వైన్‌షాపులకు కూడా అనుమతులనిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 750కి పైగా వైన్‌షాపులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని వాక్ ఇన్ వైన్స్గా నిర్వహిస్తున్నారు. మద్యం ప్రియులను ఆకట్టుకొనేవిధంగా ఏర్పాటు చేసే వాక్ ఇన్ వైన్స్ కోసం అదనంగా రూ,5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ వైన్స్ కంటే ఈ వైన్స్‌లో ఎక్కువ రకాల బ్రాండ్లకు చెందిన లిక్కర్ అందుబాటులో ఉంటుంది. కొన్ని చోట్ల వివిధ రకాల విదేశీ బ్రాండ్లను కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు నగరంలో ఎలైట్ వైన్స్ లేవు. జూబ్లీహిల్స్‌లో ఉన్న టానిక్ లిక్కర్‌మాల్ మాత్రమే ఎలైట్ వైన్ షాపుగా అనుమతిని కలిగి ఉంది. టానిక్ తరహాలోనే మరిన్ని ఎలైట్ షాపులకు అనుమతులను ఇవ్వనున్నట్లు సమాచారం. ఉన్న బార్లే దివాలా తీస్తున్నాయి కోవిడ్ కాలం నుంచి బార్లు నష్టాల్లో నడుస్తున్నాయి. గతంలో కొత్తగా అనుమతించిన 150 బార్లలో కనీసం 70 బార్లను ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. వైన్‌షాపులలో పర్మిట్ రూమ్‌లకు అనుమతినివ్వడంతో బార్లకు నష్టం వస్తోంది. ఈ పరిస్థితుల్లో మరిన్ని ఎలైట్ బార్లకు అనుమతినివ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. –శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ రెస్టారెంట్స్ అండ్ బార్ ఓనర్స్ అసోసియేషన్ కోశాధికారి -
మహిళా స్టార్టప్‌లకు నిధుల సాయం, ఎవరు? ఎలా?
హైదరాబాద్: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్స్ గ్రూప్ ‘స్కేల్ యువర్ స్టార్టప్’ పేరుతో క్తొత కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.10 లక్షలకు మించిన ఆదాయం గడించే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వనుంది. స్టార్టప్‌లకు ఆర్థిక సాయం, మార్గదర్శకం అందించాలన్నది ఎలైట్ గ్రూప్ చైర్మన్, ఎండీ టీఆర్ రఘులాల్ కలల ప్రాజెక్టు అని తెలిపింది. మహిళల ఆధ్వ ర్యంలో నడుస్తూ, వారి వాటా కనీసం 51 శాతం ఉంటే, ఏప్రిల్ 10 వరకు ఎలైట్కనెక్ట్ డాట్ ఇన్ఫో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. (చదవండి: ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) స్టార్టప్‌ల ఎంపిక ప్రమాణాలు టీం, మార్కెట్, వ్యాపార నమూనా ,సామాజిక ప్రభావం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.. వివిధ పరిశ్రమల రంగాలకు చెందిన నిపుణుల బృందం ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. "మహిళా పారిశ్రామికవేత్తలు వారి కలలను సాధించడానికి , వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి తోడ్పాటు అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దానేసా రఘులాల్ . (యాక్సెంచర్ సంచలనం: ఏకంగా 19వేల మందికి ఉద్వాసన) ఇదీ చదవండి: ‘నాటు నాటు’ ఫీవర్: నా వల్ల కావడం లేదు..ఇదే లాస్ట్! ఆనంద్ మహీంద్ర -
Elite Indoor Track Miramas: జాతీయ రికార్డుతో జ్యోతికి రజతం
సాక్షి, హైదరాబాద్: మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ 60 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించింది. అంతేకాకుండా 60 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ మీట్లో విశాఖపట్నంకు చెందిన జ్యోతి ఫైనల్ రేసును 8.17 సెకన్లలో ముగించింది. సైప్రస్ అథ్లెట్ డాఫ్నీ జార్జియు కూడా 8.17 సెకన్లలోనే రేసును ముగించింది. అయితే రియాక్షన్ టైమ్ ఆధారంగా డాఫ్నీ (0.145 సెకన్లు) స్వర్ణ పతకం దక్కించుకోగా... జ్యోతి (0.175 సెకన్లు) ఖాతాలో రజతం చేరింది. అంతకుముందు హీట్స్‌లో జ్యోతి 8.18 సెకన్లతో జాతీయ రికార్డును సృష్టించగా... ఫైనల్లో తన రికార్డును ఆమె మరోసారి సవరించింది. -
Vijay Hazare Trophy: సమర్థ్ 200
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. ఇక్కడి జామియా మిలియా యూనివర్సిటీ మైదానంలో మణిపూర్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు పరుగుల వరద పారించింది. ఏకంగా 282 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ సమర్థ్ వ్యాస్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 131 బంతులు ఆడిన సమర్థ్ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో సరిగ్గా 200 పరుగులు సాధించి అవుటయ్యాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36.3 ఓవర్లలో 282 పరుగులు జోడించడం విశేషం. సమర్థ్, హార్విక్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్‌ను సౌరాష్ట్ర ఎడంచేతి వాటం స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా తిప్పేశాడు. 32 ఏళ్ల ధర్మేంద్రసింగ్ 10 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో మణిపూర్ 41.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. -
Ranji Trophy: ఆరు వికెట్లతో అదరగొట్టిన రవితేజ
భువనేశ్వర్: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్ క్రికెట్ జట్టు ఘనవిజయంతో ప్రారంభించింది. చండీగఢ్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 217 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. 401 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చండీగఢ్ రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 21/2తో చివరిరోజు ఆట కొనసాగించిన చండీగఢ్‌ను హైదరాబాద్ మీడియం పేసర్లు తెలుకుపల్లి రవితేజ, రక్షణ్ రెడ్డి హడలెత్తించారు. ఫలితంగా ఆట చివరిరోజు చండీగఢ్ 162 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రవితేజ తన రంజీ కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. 27 ఏళ్ల రవితేజ రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి చండీగఢ్‌ను దెబ్బతీశాడు. మరో పేస్ బౌలర్ రక్షణ్ రెడ్డి 62 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ గెలుపుతో హైదరాబాద్ ఖాతాలో 6 పాయింట్లు చేరాయి. ఈనెల 24న కటక్‌లో మొదలయ్యే రెండో లీగ్ మ్యాచ్‌లో బెంగాల్‌తో హైదరాబాద్ ఆడుతుంది. -
నిప్పులు చెరిగిన శాంత మూర్తి
ముంబై: ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆదివారం సంచలన ఫలితం నమోదైంది. ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో భాగంగా పుదుచ్చేరి ఆరు వికెట్ల తేడాతో పటిష్ట ముంబై జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. శుక్రవారం ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అబ్బురపరిచిన పుదుచ్చేరి... ఆదివారం ముంబై జట్టును 19 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్ చేసి ఆశ్చర్యపరిచింది. 41 ఏళ్ల 129 రోజుల వయస్సున్న పుదుచ్చేరి మీడియం పేస్ బౌలర్ శాంత మూర్తి నిప్పులు చెరిగే బంతులతో ముంబై బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. శాంత మూర్తి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దాంతో ముంబై 42 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్, ఆదిత్య తారే, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేశ్ లాడ్, సుజీత్ నాయక్‌లను శాంత మూర్తి అవుట్ చేశాడు. శాంత మూర్తి స్పెల్ ముగిశాక ముంబై మరో 52 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. 95 పరుగుల లక్ష్యాన్ని పుదుచ్చేరి 19 ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకొని అందుకుంది. ఈ టోర్నీలో ముంబైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. 19న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో ముంబై ఆడుతుంది. టి20 క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన పెద్ద వయస్కుడిగా శాంత మూర్తి ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కెనూటి టులోచ్ (కేమన్ ఐలాండ్స్–41 ఏళ్ల 7 రోజులు) పేరిట ఉండేది. 2006 జూలైలో స్టాన్‌ఫర్డ్ టి20 టోర్నీలో భాగంగా సెయింట్ లూసియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టులోచ్ 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
అదిగో నవలోకం
-
వెదురే.. అదిరే..
సాక్షి, హైదరాబాద్: శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కన్పించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. ఇలాంటి అనేకానేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూట్టానికి చక్కగా కన్పించడం.. తదితర కారణాల వల్ల వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. రెండు రకాలు.. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథేన్ కోటింగ్ వేస్తారు. ధర ఎంత? ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీనితో ఇంటిని అలంకరించాలంటే... చదరపు అడుగుకి రూ. 200-350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ వంద చదరపు అడుగుల గదికి సుమారు రూ. 20,000 అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కోసం చదరపు అడుగుకి రూ. 300 దాకా అవుతుంది. వెదురు కలపను ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ. 15 దాకా తీసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా.. దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్‌ను సులువుగా వేసుకోవచ్చు. పైగా ఒక్కరోజులో పని పూర్తవుతుంది. -
బ్యాంబూ ఫ్లోరింగ్‌తో అదిరే అందం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూడ్డానికి చక్కగా కన్పించడం.. తదితర కారణాల వల్ల వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. ధర ఎంత?: ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీనితో ఇంటిని అలంకరించాలంటే... చదరపు అడుగుకి రూ. 200-350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ వంద చదరపు అడుగుల గదికి సుమారు రూ. 20,000 అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కోసం చదరపు అడుగికి రూ. 300 దాకా అవుతుంది. వెదురు కలపను ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ. 15 దాకా తీసుకుంటారు.