Ellanthakunta
-
‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్నా’
జమ్మికుంట(హుజూరాబాద్): నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగు నెలల కిందట భర్త ఆత్మహత్య చేసుకుంటే.. నేడు అతని జ్ఞాపకాలు మరువలేక భార్య ఉరేసుకుంది. నిరుద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని విధి వెక్కిరించడాన్ని తల్చుకుంటూ జమ్మికుంట వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సీఐ రాంచందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్, జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన రేష్మ(26) 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన షబ్బీర్ అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. చదవండి: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి, భార్యతో కలిసి జమ్మికుంట వచ్చాడు. స్థానిక హౌజింగ్‌బోర్డు కాలనీలో గది అద్దెకు తీసుకున్నారు. కానీ ఇక్కడా అతనికి పని దొరకలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే సన్నద్ధం అవుదామనుకుంటే రాలేదు. ప్రైవేటు ఉద్యోగాలకు ప్రయత్నించినా దొరకలేదు. గది అద్దె చెల్లించేందుకు, భార్యను పోషించుకునేందుకు డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సూసైడ్ నోట్ రాసి, ఈ ఏడాది ఆగస్టు 1న జమ్మికుంట రైల్వేస్టేషన్లో రైలు కింద పడి, ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందినప్పటి నుంచీ రేష్మ అంబేద్కర్ కాలనీలోని తల్లిగారింట్లో ఉంటోంది. చదవండి: ప్రముఖ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యం, ఏకే రావు మృతదేహం లభ్యం ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సీఐ రాంచందర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ సూసైడ్ నోట్ లభించింది. ‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్న.. షబ్బీర్ జ్ఞాపకాలు ప్రతీ క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఇలా క్షణక్షణం చస్తూ బతకడం నా వల్ల కావట్లేదమ్మా.. అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను.. చింటు, పప్పుగా అమ్మను, నాన్నను జాగ్రత్తగా చూసుకోండి.. నన్ను క్షమించండి’ అని అందులో రాసిందని సీఐ పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు గోపీచంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టేది హుజురాబాద్ ఎన్నిక: ఈటల
ఇల్లందకుంట (హుజురాబాద్): హుజూరాబాద్‌లో జరుగనున్నది కేసీఆర్ దొరతనాన్ని, అహంకారాన్ని బొందపెట్టే ఉప ఎన్నిక అని.. కేసీఆర్ నిరుంకుశ పాలన గెలుస్తుందా.. ప్రజలు గెలుస్తారా అని యావత్ తెలంగాణ హుజూరాబాద్ వైపు చూస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఈటల సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వయం పాలన కోసం కొట్లాడితే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో లిక్కర్ మీదనే సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలు వస్తాయని, ఇప్పుడు సర్కార్ ఇచ్చే ప్రతీ పైసా మనదే అని పేర్కొన్నారు. చైతన్యాన్ని, ప్రశ్నించే వాడిని రక్షించుకోపోతే సమాజం బానిసత్వంలోకి జారిపోతుందన్నారు. మూడు నెలలుగా కేబినెట్‌ను ఏర్పాటు చేయకుండా కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని విమర్శించారు. ఉద్యమంలో తనతో పాటు లెఫ్ట్ రైట్‌గా పనిచేసిన వాళ్లు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, గతాన్ని మరిచి మాట్లాడవద్దని హితువు పలికారు. ముఖ్యమంత్రి మొదటిసారిగా జై భీమ్ అంటూ దళితులతో కలిసి భోజనం చేస్తూ కపట ప్రేమ చూపిస్తున్నారని.. ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌కు పోలీసుల బెదిరింపులు కొత్తకాదని, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు. చదవండి: రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది -
పోలీసన్న నీకు సెల్యూట్.. మానవత్వం చాటుకున్న ఎస్సై!
సాక్షి,ఇల్లందకుంట(హుజురాబాద్): కరోనా సోకిన వ్యక్తి చెరువులో పడి మృతిచెందగా పోలీసులు బయటకు తీసి, అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఇల్లందకుంట మండలంలోని సిరిసేడులో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలను ట్విట్టర్లో, ఫేస్బుక్, వాట్సాప్‌లలో చూసిన వారు పోలీస్.. సెల్యూట్ అంటూ అభినందిస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసేడు గ్రామానికి చెందిన యాంసాని అమృతమ్మ, సంపత్, సతీష్‌లకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో సంపత్(38) మంగళవారం బహిర్భూమికి స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. శ్వాస సరిగా అందకపోవడంతో చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలిసినా గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు ఎవరూ దగ్గరికి వెళ్లలేదు. ఎస్సై ప్రవీణ్‌రాజ్ సమాచారం రావడంతో సిబ్బంది రజనీకాంత్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయం చేయాలని కోరినా స్పందన లేకపోవడంతో వారిద్దరే బయటకు తీశారు. అనంతరం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రతిఒక్కరూ పోలీసులకు సెల్యూట్ అంటూ ట్వీట్ పెట్టారు. ఈ విషయం రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలియడంతో ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. చదవండి: తెలంగాణ: లాక్డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే -
గ్రామ కార్యదర్శులకు కొత్త బాధ్యతలు
సాక్షి, ఇల్లందకుంట: గ్రామపంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మరో 30 కొత్త బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే 6 బాధ్యతలను నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం మరో 30 అదనపు బాధ్యతలను వీరిపై పెట్టింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అసలే కొరతగా ఉన్నారు. ఒక్కో గ్రామ కార్యదర్శి రెండు మూడు గ్రామాలకు ఇన్‌చార్జీలుగా నెట్టుకొస్తున్నారు. ఆ బాధ్యతలనే మోయలేకుండా ఉన్న గ్రామ కార్యదర్శులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. ప్రతీ గ్రామపంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ కార్యదర్శుల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రకియ కూడా పూర్తయినా కొంతమంది ఎంపికలో తప్పులు దొర్లాయని కోర్టుకు వెళ్లడంతో గ్రామ కార్యదర్శుల నియామకానికి బ్రేక్ పడింది. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలన బాధ్యతలను చూసుకోవడంతో పాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని సూచించింది. పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, తాగునీరు, వీధిదీపాలు, రోడ్లు, డ్రెయినేజీలు మొక్కలు నాటడం, పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–42, సెక్షన్–286, సెక్షన్–43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు విధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్ 6(8) ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కా>ర్యదర్శిదేనని గ్రామ పాలకవర్గం అమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది. 24 గంటల్లో అనుమతులు.. భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతి ఇవ్వాలని సూచించింది. అంతేకాకుండా లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7 రోజుల్లో అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. లేఅవుట్ల అనుమతితో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లే అవుట్లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. గ్రామంలో తీసుకునే నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు గ్రామస్తులకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతో పాటు వివాహా రిజిస్ట్రేషన్ల నిర్వహణ గ్రామ కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. ఇవీ మార్గదర్శకాలు కార్యదర్శి ప్రభుత్వానికి సబార్బినేట్గా వ్యవహరించాలి గ్రామసభకు ఎజెండా తయారు చేసి అందులోని అంశాలు సభ్యులందరికి తెలిసేలా ప్రచారం చేయాలి. ప్రతీ మూడు నెలలకొకసారి ఖర్చుకు సంబంధించి లెక్కలను పంచాయతీ అమోదానికి సమర్పించాలి. వరదలు, తుఫాన్లు, అగ్ని, రోడ్లు ప్రమాదాలు సంభవించిన సందార్భాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలి. గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు సమాచారమివ్వాలి. గ్రామాల్లోని అవసరాలను గుర్తించి గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారీలో పాలు పంచుకోవాలి. అలాగే ఎంపీపీ, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ నిర్వహించే నెలవారి సమావేశాలకు హాజరు కావాలి. గ్రామసభలో లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాల వసూళ్లకు సహకరించాలి. అంశాల వారీగా ఎజెండాలను సిద్ధం చేసి గ్రామపంచాయతీ అమోదం పొందాలి. ఎజెండాను ప్రదర్శించడం దండోరా వేయించడం, గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నోటీసులను అంటించి ప్రజలకు సమాచార చేరేలా చూడటం. బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాల పంచాయతీ ఫలాలు అందేలా చూడాలి. వార్షిక పరిపాలన నివేదికను రూపొందించి గ్రామ పంచాయతీ అమోదం తీసుకోవడం. నెలవారీ సమీక్షలు, ప్రగతి నివేదికల రూపకల్పన ఉన్నతాధికారులకు నివేదికను అందించడం. మూడు నెలలకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ అమోదించడంతో పాటు ఈవోపీఆర్డీలకు సమాచారం ఇవ్వడం. సమస్యలతో బాధపడుతున్నాం మూడు నుంచి నాలుగేసి గ్రామాలకు ఇన్‌చార్జీలుగా పని చేయడం ద్వారా పనిభారం పెరుగుతోంది. వారంలో నాలుగు గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు రూపొందించాలంటే ఇబ్బందవుతుంది. జిల్లా కేంద్రాల్లో అనుకోకుండా నిర్వహించే మీటింగ్‌లకు హడావిడిగా వెళ్లాల్సి వస్తోంది. – వాణి, కార్యదర్శి, శ్రీరాములపల్లి పాలనాపరమైన బాధ్యత తప్పదు కార్యదర్శులు తమ బాధ్యతలను నేరవేర్చాలి ఉంటుంది. పాలనపరమైన బాధ్యతలను చూసుకోవడంతో పాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. త్వరలోనే కార్యదర్శుల నియామకం జరుగుతుంది. – జయశ్రీ, ఎంపీడీవో -
రసమయికి మరోసారి చేదు అనుభవం
-
రసమయికి మరోసారి చేదు అనుభవం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు, మానకొండూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామంలో రసమయి ఆదివారం ప్రచారం నిర్వహిస్తుండా గ్రామస్తులు ఆయన్ను అడ్డుకున్నారు. గత నాలుగేళ్లలో తమకేం చేశారంటూ ఆయనను నిలదీశారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మహిళలు రసమయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇరువర్గాల ఘర్షణకు దిగడంతో కంది కట్కూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో కూడా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రసమయికి ఇదే రకమైన అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. -
తండ్రీకొడుకుల ఘర్షణ: తండ్రి మృతి
జమ్మికుంట: తండ్రీకొడుకుల తోపులాటలో గాయపడిన తండ్రి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన కరీంనగర్జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాచర్ల ఓదెలు(70)కు, అతని కుమారుడికి మధ్య బంగారం విషయంలో గొడవ జరిగింది. ఈ సందర్భంగా తోపాలాటలో గాయపడిన ఓదెలు మృతిచెందాడు. -
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం
- టన్నెల్లో పేలుడు.. ఏడుగురు కూలీల మృతి సాక్షి, ఇల్లంతకుంట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ప్రాజెక్టు టన్నెల్ మార్గంలో బుధవారం పని జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణహిత-చేవేళ్ల 10 వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనుల వద్ద ఎయిర్ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అప్డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్లో పేలుడు ఘటనలో గాయపడి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5:30కు మరో కూలీ చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. చికిత్స పొందుతున్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.