EMI option
-
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఇది చదవండి
సత్వర నిధులకు అందుబాటులో ఉన్న పలు మార్గాల్లో క్రెడిట్ కార్డ్‌లూ ఒకటి. వినియోగించే విధానం తెలిస్తే క్రెడిట్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిల్లు తేదీ, చెల్లించేందుకు ఉన్న వడ్డీ రహిత గడువు, ఈఎంఐ ఆప్షన్, వడ్డీ రేట్లు, ఆలస్య రుసుములు.. ఇలా ప్రతీ ఒక్కటీ తెలిస్తే నెలవారీ బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా క్రెడిట్ కార్డ్‌ను వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలను వినియోగదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తే క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎలాంటి వడ్డీని వసూలు చేయవు. గడువు తేదీ తర్వాత చెల్లిస్తే మాత్రం అధిక వడ్డీ రేట్లు, అదనపు ఫీజులు వసూలు చేస్తాయి. కనుక కుదిరితే క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించటమే ఉత్తమం. పెద్ద మొత్తంలోని బకాయిలను చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఈఎంఐ విధానాలను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డును మెరుగ్గా నిర్వహించే మార్గాలను చూద్దాం.. ఈఎంఐ ఆప్షన్.. నిర్ణీత గడువు తేదీలోపు చెల్లించని క్రెడిట్ కార్డ్ బకాయిల మీద క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి 23 నుంచి 49 శాతం వరకు వడ్డీ కింద కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. దీంతో పాటు తిరిగి చెల్లింపుల్లో విఫలమైతే ఆలస్య రుసుము కింద రూ.1,300 వరకు కంపెనీలు వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, ఈ తర్వాత క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వడ్డీ రహిత కాల వ్యవధిని రద్దు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించకపోతే మీ రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకు.. బిల్లులను సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, కొంత భాగాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఒక మార్గం. క్రెడిట్ కార్డ్ తిరిగి చెల్లింపుల కాల వ్యవధి (ఈఎంఐ) సాధారణంగా 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీ రేటు 11–24 శాతంగా ఉంటుంది. అది కూడా క్రెడిట్ కార్డ్ వినియోగం, జారీ చేసిన కంపెనీని బట్టి మారుతుంటుంది. నో కాస్ట్ ఈఎంఐతో లాభమే.. ‘నో కాస్ట్ ఈఎంఐ’.. ‘రూపాయి చెల్లించి నచ్చిన ఉత్పత్తిని ఇంటికి తీసుకెళ్లండి.. ఆ తర్వాత ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐ చెల్లించండి’ అనే ప్రకటనలు చూసే ఉంటారు. మర్చంట్ ఈఎంఐ ఆప్షన్లో ఒక రకమే నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్. ఇందులో ఈఎంఐ మీద వడ్డీని వర్తకులు లేదా తయారీదారులు భరిస్తారు. దీంతో ఉత్పత్తి లేదా సేవల ధరను ఈఎంఐల రూపంలో అనుమతించిన కాల వ్యవధి మేరకు కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ మీద వడ్డీ భారం పడకపోయినా.. ఆ వడ్డీపై 18% జీఎస్టీని క్రెడిట్ కార్డ్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆఫర్లు.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ పోర్టళ్లు క్రెడిట్ కార్డ్‌ల కొనుగోళ్లపై ఈఎంఐలను ఆఫర్ చేస్తాయి. తయారీదారులు/వ్యాపారుల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా.. ఈఎంఐ వడ్డీ రేట్లు, కాల వ్యవధులు నిర్ణయించడం జరుగుతుంది. ఆఫర్లలో భాగంగా ఆయా సంస్థలు ప్రకటించే ఈఎంఐ వడ్డీ రేట్లు.. క్రెడిట్ కార్డ్ బకాయిలను ఈఎంఐగా మార్చుకునే వడ్డీ రేట్లతో పోలిస్తే తక్కువగానే ఉండ డం ఆకర్షణీయం. అందుకే భారీ కొనుగోళ్లకు ముందుగా.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ కంపెనీల ఈఎంఐ ఆఫర్లను తనిఖీ చేయాలి. పైగా ఈ ఆఫర్లకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. క్రెడిట్ కార్డులపై రుణాలు.. మంచి సిబిల్ స్కోర్, చెల్లింపుల చరిత్ర ఉన్న వారు క్రెడిట్ కార్డులపై రుణాలనూ తీసుకోవచ్చు. కాకపోతే తీసుకున్న రుణం మేరకు క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. తిరిగి చెల్లించిన తర్వాత మళ్లీ ఆ పరిమితిని అందుబాటులోకి తెస్తారు. రుణాల రీపేమెంట్ కాల వ్యవధి 6 నుంచి 60 నెలలుగా ఉంటుంది. వడ్డీ రేట్లు వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డులపై రుణాల జారీ వేగంగా ఉంటుంది. వీటి వడ్డీ రేట్లు పర్సనల్ లోన్స్ కంటే ఎక్కువ ఉండవని పైసాబజార్.కామ్ డైరెక్టర్ సాహిల్ అరోరా తెలిపారు. -
విమాన టిక్కెట్లకూ ఈఎంఐ ఆప్షన్
దుబాయ్ : ఈఎంఐ ఆప్షన్ ఇన్ని రోజులు నిత్య వాడుకలో మనం కొనుగోలు చేసే ఉత్పత్తులకు మాత్రమే చూసేవాళ్లం. కానీ తాజాగా విమాన టిక్కెట్లకు ఈఎంఐ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. యూఏఈ విమానయాన సంస్థ ఇతిహాద్ ఎయిర్వేస్ 'ప్లై నౌ అండ్ పే లేటర్' స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఈ స్కీమ్ కింద నెలవారీ ఇన్స్టాల్మెంట్లలో టిక్కెట్ ఛార్జీలను చెల్లించుకునే ఆప్షన్‌ను ఈ విమానయాన సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కుటుంబ సభ్యులు తమ విమాన టిక్కెట్లను వారి సౌలభ్యం మేరకు బుక్ చేసుకోవచ్చని, అవసరాలకు అనుగుణంగా చెల్లింపు ప్రణాళికలను ఎంచుకోవచ్చని ఇతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది. పేఫోర్ట్తో భాగస్వామ్యం ఏర్పరచుకున్న అనంతరం గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా ఆటోమేటెడ్ ఆన్లైన్ ఇన్స్టాల్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా ఇతిహాద్ పేరులోకి వచ్చింది. అరబ్ వరల్డ్‌లో పేపోర్టు, దిగ్గజ పేమెంట్ సర్వీసు ప్రొవైడర్. ఈ స్కీమ్‌ను పొందడం కోసం ప్రయాణికులు ఇతిహాద్ విమానయాన సంస్థ వెబ్సైట్లో 'పే బై ఇన్స్టాల్మెంట్' ఆప్షన్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం తమ దగ్గర క్రెడిట్ కార్డుంటే బ్యాంకును ఎంపికచేసుకుని, చెల్లింపు కాలాన్ని నమోదుచేయాలి. మూడు నెలల నుంచి 60 నెలల వరకు చెల్లింపు ఇన్స్టాల్మెంట్లను ఎంచుకోవచ్చు. 17 బ్యాంకుల కస్టమర్లకు అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రయాణం ఎంత ఖర్చుతో కూడుకున్నదో తమకు తెలుసని, ముఖ్యంగా కుటుంబసభ్యులకు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఎయిర్‌లైన్ డిజిటల్ స్ట్రాటజీ, ఇన్నోవేసన్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్బై చెప్పారు. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించే దిగులు అవసరం లేకుండా.. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇదొక గొప్ప మార్గమని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ను డిజైన్ చేసేముందు తక్కువ, మధ్య తరగతి ప్రయాణికులను, కుటుంబ సభ్యులను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ స్కీమ్ యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. -
విమాన ప్రయాణానికీ.. ఈఎంఐ ఆప్షన్..
జెట్ ఎయిర్వేస్ వినూత్న సేవలు న్యూఢిల్లీ: కార్లు, టీవీలు, ఏసీలు, స్మార్ట్ఫోన్లే కాదు.. ఇప్పుడు విమాన టికెట్‌ను కూడా ఈఎంఐ ఆప్షన్లో పొందొచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ తాజాగా విమాన ప్రయాణానికి ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ దీనికోసం పలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ విధానంలో జరిగే లావాదేవీలు పెరుగుతున్నాయి. అందుకే ప్రయాణికులకు మేం కూడా ఈఎంఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం’ అని జెట్ ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ అధికారి జయరాజ్ వివరించారు. సంస్థ వెబ్సైట్, మొబైల్ యాప్‌లో విమాన టికెట్‌ను బుకింగ్ చేసుకునే సమయంలో యాక్సిస్, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, కొటక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులను కలిగిన వారికి ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈఎంఐ చెల్లింపుల గడువు 3, 6, 9, 12 నెలలుగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఫైనాన్షియల్ బేసిక్స్...
క్రెడిట్ కార్డు.. ఈఎంఐ ఆప్షన్.. క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వీటిని కోరుకుంటున్నారు. చేతిలో డబ్బులు లేనప్పుడు అత్యవసర ఆర్థిక లావాదేవీల చెల్లింపులకు క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అందుకే వీటికి ఆదరణ పెరిగిపోతోంది. చాలా మంది క్రెడిట్ కార్డుతో పెద్ద మొత్తంలో వస్తు కొనుగోలు జరిపి దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. మనం ఎలాగైతే రుణం తీసుకొని వడ్డీ, అసలు చెల్లించి రుణాన్ని తీర్చుకుంటామో.. క్రెడిట్ కార్డు ఈఎంఐ కూడా అలాగే పనిచేస్తుంది. ఇక్కడ అసలు, వడ్డీ రెండూ చెల్లిస్తాం. చెల్లించే ఈ వడ్డీ క్రెడిట్ కార్డు కంపెనీకి ఆదాయం అవుతుంది. అలాగే నిర్ణీత గడువులోగా కార్డు బిల్లులను చెల్లించకపోతే మనకు పెనాల్టీ రూపంలో మళ్లీ వడ్డీ పడుతుంది. ఈ వడ్డీ కూడా క్రెడిట్ కార్డు కంపెనీలకు రాబడి అవుతుంది. మనం సరైన సమయంలోనే బిల్లులు చెల్లిస్తే పర్వాలేదు. ఆలస్యంగా చెల్లిస్తే మాత్రం ఆయా కంపెనీల రాబడికి మన వాటా జమవుతుంది. అన్ని క్రెడిట్ కార్డులకు ఈఎంఐ సౌలభ్యం ఉండకపోవచ్చు. ఇక కొనుగోలు మొత్తాన్ని ఈఎంఐకి మార్చుకోవాలని భావిస్తే.. ముందుగా వడ్డీ రేటు ఎంత ఉందో చూసుకోండి.