Employee Recruitment
-
మన విజయగాథకు ఇదే మూలం!
దేశంలోని నాలుగు దిగ్గజ ఐటీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో లక్షమందికి పైగా ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించాయి. యువతీయువకులను కొత్తగా పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నారంటేనే ఈ కంపెనీల లాభాలు వేగంగా పెరుగుతున్నాయని అర్థం. భారతీయ ఐటీ పరిశ్రమ అసాధారణ వేగంతో ముందుకు సాగుతోందనటానికి ఈ నియామకాలు తిరుగులేని సంకేతం. కానీ ప్రతికూల వార్తలకు, నిరాశా నిస్పృహలకు మాత్రమే విలువనిచ్చే మన సమాజం ఇలాంటి అద్భుతమైన సానుకూల వార్తను పట్టించుకోదు. మన ఐటీ కంపెనీలు కోవిడ్ మహమ్మారి కాలంలోనూ ఇంత ఘన విజయం సాధించడానికి బలమైన నాయకత్వం, పోటీతత్వమే కారణమని గ్రహించాలి. దురదృష్టవశాత్తూ, భారతదేశంలో సానుకూల వార్తలకు ఈరోజుల్లో చాలా తక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వాటిగురించి మాట్లాడేది కూడా తక్కువేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అలాంటి వార్తలు కాస్త ముందుకొచ్చినా, అవి వెంటనే మాయమైపోతుంటాయి. మరుగున పడుతుంటాయి. ప్రస్తుతం నిరాశావాదాన్ని ప్రేరేపించే నిస్పృహ కలి గించే వార్తలపై అధికంగా దృష్టి సారించే అలవాటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇదే ఇప్పటి ఫ్యాషన్ అని చెప్పాలి. ప్రస్తుతం దేశ ముఖచిత్రం నుంచి ఒక గొప్ప ఉదాహరణను పరిశీలిద్దాం. దేశంలోని నాలుగు ప్రముఖ ఐటీ సంస్థలు – టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో లక్షమందికి పైగా వృత్తినిపుణులైన యువతను ఉద్యోగాల్లో నియమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 రెట్లు ఎక్కువ. భారతీయ ఐటీ పరిశ్రమ అసాధారణ ముందంజలో సాగుతోందనటానికి ఈ నియామకాలు తిరుగులేని సంకేతం. టీసీఎస్‌లో ప్రస్తుతం 5 లక్షలమంది వృత్తి నిపుణులు పనిచేస్తున్నారు. పైన పేర్కొన్న ఇతర ఐటీ సంస్థలు కూడా లక్షలాదిమందిని ఉద్యోగాల్లో నియమించాయి. వీటిలో పనిచేసిన ప్రొఫెషనల్స్ మంచి అవకాశాలు రాగానే ఇతర కంపెనీలకు కూడా తరలి వెళ్లారు. గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సిబ్బందిలో 20 శాతం మంది రాజీనామా చేశారు. ఇన్ఫోసిస్ వంటి సుప్రసిద్ధ కంపెనీని వదిలి ఉద్యోగులు వెళ్లిపోతున్నారంటే, వారికి మరింత మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అర్థం. మన ఐటీ రంగంలోని కంపెనీలు అభివృద్ధి, పురోగతికి సంబంధించిన అన్ని రికార్డులను ఎలా బద్దలు చేశాయో చూపడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. యువతీయువకులను కొత్తగా పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నారంటేనే ఈ కంపెనీల లాభాలు వేగంగా పెరుగుతున్నాయని అర్థం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టీసీఎస్ ఒక్కటే రూ. 9,624 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ 9,800 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇక ఇన్ఫోసిస్ తన వంతుగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 5,500 కోట్ల లాభాన్ని ఆర్జించగా, విప్రో, హెచ్‌సీఎల్ కూడా అసాధారణమైన ఫలితాలను సాధించాయి. ఇంత భారీ ముందంజ వేసినప్పటికీ ఇలాంటి అద్భుతమైన వార్తల పట్ల దేశం ఎలాంటి ప్రత్యేక స్పందనలను వ్యక్తీకరించడం లేదు. ఈ రోజు హింస ఎక్కడ జరిగింది, దేశం కోలుకోలేని విధంగా ఎక్కడ నష్టపోయింది వంటి వార్తలకే ప్రాధాన్యముండటం విచారకరం. అయితే, టాటా గ్రూప్ ఇటీవలే ఎయిర్ ఇండియాను రూ. 18 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడానికి దాని కీలక సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆర్జించిన అపారమైన లాభాలే కారణమని జనాం తికంగా చెప్పుకుంటున్నారు. టీసీఎస్ రెండు త్రైమాసికాల ఫలితాల దన్నుతో టాటా గ్రూప్ సులువుగా ఎయిర్ ఇండియాను కొనేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు సాధించిన అద్భుత విజయాల వెలుగులో, ఏ కంపెనీ లాభాలు ఆర్జించడంలో అగ్రస్థానంలో ఉంది, మార్కెట్లో ఏ కంపెనీకి ఎక్కువ పరపతి ఉంది అనే అంశాలపై మీరెన్నడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఏమంత కష్టమైన పని కాదు. ఉత్తమ నాయకత్వం, సరైన మార్గదర్శకత్వం కారణంగానే ఇంతటి పురోగతి సాధ్యపడింది. ఇప్పుడు టీసీఎస్‌ని ఉదాహరణగా తీసుకుందాం. ప్రస్తుతం ఆ కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గోపీనాథ్ టీసీఎస్ పగ్గాలు చేపట్టడానికి ముందే టీసీఎస్ ప్రపంచస్థాయి కంపెనీగా మారింది. ఈ ఘనత మొత్తంగా ప్రస్తుత టాటా కంగ్లామరేట్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కే దక్కాల్సి ఉంది. ఈయన 2009లో టీసీఎస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. వృత్తిపరంగా తన కెరీర్‌ను కూడా టీసీఎస్‌తోనే మొదలెట్టారు. టీసీఎస్ వ్యవహారాలను అద్భుతంగా పర్యవేక్షించి, నిర్వహించారు. నాయకత్వ నైపుణ్యాలను టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, టీసీఎస్ వ్యవస్థాపక చైర్మన్ ఫకీర్‌చంద్ కోహ్లీ నుండి చంద్రశేఖరన్ నేర్చుకున్నారు. ఈరోజు సమాచార సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ఒక నిగూఢ శక్తిగా యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. భారత ఐటీ రంగం విలువ 190 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఘనత మాత్రం ఫకీర్ చంద్ కోహ్లీకే దక్కాలి. దేశంలోనే ఐటీ రంగానికి పునాది వేసిన వ్యక్తి ఈయన. అలాంటి కోహ్లీ, రతన్ టాటాలతో కలిసి పనిచేసిన చంద్రశేఖరన్ ఒక సృజనాత్మక సంస్కృతిని, ప్రతిభాపాటవాలను నేర్చుకున్నారు. ఇకపోతే శివ్ నాడార్ గురించి మాట్లాడుకుందాం. ఈయన తమిళనాడు లోని తంజావూర్ నుంచి వచ్చారు. ఒంటిచేత్తో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ని ఏర్పర్చారు. తన సుదీర్ఘ నాయకత్వంలో హెచ్‌సీఎల్‌ని అతి గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీగా మార్చారు. తమ గుహల్లోంచి బయటకు వచ్చి ఏదైనా విభిన్నంగా ఆలోచించాల్సిందిగా తన కంపెనీ సీఈఓలను, మేనేజర్లను ఆయన ప్రభావితం చేశారని ప్రతీతి. నాడార్ ఎల్లప్పుడూ తన ఉద్యోగులకు దన్నుగా నిలిచారు. అందుకే ఆయన కింద పనిచేసే మేనేజర్లు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఈ రోజు ఈ కంపెనీ కనీసం అరడజన్ పైగా దేశాల్లో ఉనికిలో ఉంటూ వంద ఆఫీసులను తెరిచింది. లక్షమంది ప్రొఫెషనల్ ఇంజనీర్లు ఈ సంస్థతో ముడిపడి ఉన్నారు. జేఆర్డీ టాటాలోని పోరాటస్ఫూర్తి, చురుకైన వ్యాపార తత్వం శివ్ నాడార్లో కనిపిస్తాయి. విద్య, జాతీయ నిర్మాణం పట్ల వీరిద్దరి విశ్వాసాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇక ఇన్ఫోసిస్ లిమిటెడ్. దీని ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్. చరిత్ర ప్రసిద్ధుడైన నారాయణమూర్తి ఈ సంస్థకు పునాది వేశారు. ఈ క్రమంలో నందన్ నీలేకని వంటి సహచరుల సహాయం ఈయనకు లభించింది. నందన్ నీలేకని ఇప్పటికీ ఇన్ఫోసిస్ వర్కింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అర్థవంతంగా మల్చుకోవడంలో నారాయణ మూర్తి తీరిక లేకుండా ఉంటారు. మానవ జీవితం క్షణభంగురమే కావచ్చు, కానీ మనం చేసే సత్కార్యాల ద్వారా మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు అందిస్తాడు. అంధకారమనే సామ్రాజ్యం ఎంత పెద్దదైనా కావచ్చు కానీ చిన్న దీపం తాను ఆరిపోయేంతవరకు ఆ అంధకారంతో పోరాటం సాగిస్తూనే ఉంటుంది. అలాగే పూల జీవిత కాలం చాలా చిన్నదే కావచ్చు కానీ తమలోని పరిమళాన్ని చివరివరకూ వెదజల్లే ధర్మాన్ని నిర్వరిస్తూనే ఉంటాయి. నారాయణమూర్తి తెలిసిగానీ, తెలీకగానీ తన జీవితాన్ని పైన పేర్కొన్న దీపం, పూవుల్లాగే మలుచుకున్నారు. మునుపెన్నడూ చేయని మంచిపనులను చేస్తూ పోవాలని ఆయన ఆకాంక్ష. అందుకే ఆయన జీవితం మచ్చలేకుండా నడిచింది. తన కంపెనీకి కొత్త దిశను కల్పిస్తూ సామాజిక శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున విరాళాలు ఇస్తూపోయారు. అందుకే తనతోపాటు తన కంపెనీ ఇన్ఫోసిస్ నిరంతరం విజయసాధనను కొనసాగిస్తూ వచ్చింది. వీరందరి లాగే విప్రో లిమిటెడ్ చైర్మన్ అజీం ప్రేమ్‌జీ జీవితం కూడా. తనది అసాధారణ స్వభావం. అత్యున్నత విద్యాప్రమాణాలు, ర్యాంకింగ్ కలిగిన గొప్ప మేనేజర్లను ఆయన సంస్థలో చేర్చుకున్నారు. ప్రతిభాపాటవాల ప్రాతిపదికనే విప్రోలో కీలకమైన స్థానాల్లో ప్రొఫెషనల్స్‌ని నియమించుకున్నారు. ఈ ప్రతిభా మార్గదర్శకత్వ ఫలితంగానే విప్రో దేశంలోనే అగ్రగామి కంపెనీగా అవతరించింది. కాబట్టే, భారత ఐటీ కంపెనీల శరవేగ పురోగతితో అసంఖ్యాక యువతకు ఉద్యోగ అవకాశాలు రావడమే కాదు, దేశం భారీ మొత్తంలో ఆదాయ పన్నును, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. అయితే ఈ కంపెనీలు అసాధారణ విజయాన్ని పొందటానికి బలమైన, స్ఫర్ధాస్వభావం కలిగిన నాయకత్వమే కారణమని గ్రహించాలి. -ఆర్కే సిన్హా వ్యాసకర్త సీనియర్ ఎడిటర్, మాజీ రాజ్యసభ సభ్యుడు -
నిరుద్యోగులకు అమెజాన్ శుభవార్త
డబ్లిన్: కరోనా దెబ్బతో అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న వేళ రిటైల్ దిగ్గజం అమెజాన్ మాత్రం నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐర్లాండ్‌లోని అమెజాన్ కార్యాలయంలో 1,000మంది ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. అయితే క్లౌడ్ సేవలకు(డిజిటల్) డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ పేర్కొంది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో నూతన అమెజాన్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. కాగా కొత్తగా నియమించుకునే వారు బిగ్‌డేటా స్పెషలిస్టులు, ప్రోగ్రామ్ మేనేజర్లు తదితర విభాగాలలో సేవలంధించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అమెజాన్ వెబ్ సర్వీసెస్ విభాగాలలో కూడా ఉద్యోగులను నియమించుకోనున్నారు. కస్టమర్లకు మైరుగైన సేవలను అందించేందుకు అమెజాన్ సాంకేతికతను అద్భుతంగా ఉపయోగించుకుంటుందని ఐర్‌ల్యాండ్‌కు చెందిన అమెజాన్ మేనేజర్ మైక్ బియరీ పేర్కొన్నారు. (చదవండి: అమెజాన్ ఆపిల్ డేస్ సేల్ : తగ్గింపు ధరలు) -
క్రమబద్ధీకరణ కుదరదు!
సాక్షి, అమరావతి: గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ, న్యాయపరమైన అంశాలను సాకుగా చెబుతూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ కుదరదని తేల్చేసింది! రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. ఈ అంశం ముగిసిన అధ్యాయమని, దీని గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదని తాజాగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయించారు. 2014 ఎన్నికల సందర్భంగా తమను దశలవారీగా క్రమబద్ధీకరణ చేస్తామంటే చంద్రబాబు ఓటు వేశామని, కానీ ఇప్పుడు మాట మార్చి కుదరదని చెప్పడం దుర్మార్గమని కాంట్రాక్టు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ తమకు హామీ ఇచ్చే నాటికే కోర్టుల్లో కేసులు ఉన్నాయని, ఆ విషయం తెలిసి కూడా తమను క్రమబద్ధీకరిస్తామనే హామీని ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మంత్రులు యనమల, కాల్వ భేటీలో నిర్ణయం సోమవారం నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సందర్భంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి ఇక చర్చించాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, గృహనిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇతర సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే చర్చించాలని, క్రమబద్ధీకరణపై ఇక ఆలోచించాల్సిన పనిలేదనే నిర్ణయానికి వచ్చారు. అలాంటప్పుడు 16 సార్లు భేటీ ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 50 వేల మంది దాకా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు. అసలు కాంట్రాక్టు విధానాన్ని అమల్లోకి తెచ్చిందే చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు వారిని క్రమబద్ధీకరించడానికి ఏ కేసు అడ్డొస్తోందో, న్యాయపరమైన చిక్కులు ఎక్కడ ఎదురవుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఈ కేసులు, కోర్టుల్లో వ్యాజ్యాల గురించి చంద్రబాబుకు తెలియదా? అని ఉద్యోగులు మండిపడుతున్నారు. కేసులున్నాయంటున్న మంత్రివర్గ ఉపసంఘం మరి క్రమబద్ధీకరణ అంశంపై 16 సార్లు ఎందుకు భేటీ అయిందో చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. క్రమబద్ధీకరణపై కోర్టులు ఏమన్నాయంటే.. సుప్రీంకోర్టు: క్రమబద్ధీకరణకు సంబంధించి ఉమాదేవి వర్సెస్ కర్నాటక గవర్నమెంట్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. శాంక్షన్డ్ (మంజూరు) పోస్టులు అయి ఉండి, అర్హత ప్రకారం నియమించి, 10 సంవత్సరాలు పనిచేసి ఉంటే వారందరినీ క్రమబద్ధీకరించవచ్చని తెలిపింది. రాజ్యాంగబద్ధంగా విధి విధానాలు పాటించిన ఉద్యోగాలు క్రమబద్ధీకరణ హక్కు కలిగి ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది. రాజస్థాన్ హైకోర్టు: క్రమబద్ధీకరణకు సంబంధించి రాజస్థాన్‌లో ఏఎన్ఎంలు (డబ్లు్యపీ నెం.2329/2014) హైకోర్టును ఆశ్రయించారు. వైద్య అధికారులు ఇచ్చిన ప్రకటనల మేరకు దరఖాస్తు చేసుకుని, మెరిట్ ప్రాతిపదికన నియామకం చేసి ఉంటే వారిని క్రమబద్ధీకరించాలని కోర్టు సూచించింది. బాంబే హైకోర్టు: మహారాష్ట్రలో కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ విషయంలో బాంబే హైకోర్టు (డబ్లు్యపీ నెం.2046/10)ను ఆశ్రయించగా... మూడేళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. ఏపీ ఉమ్మడి హైకోర్టు: 2010 నవంబర్ 2న ఉమాదేవి వర్సెస్ సుప్రీం కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుంటూ.. బీసీ సంక్షేమశాఖలో పదేళ్లు అనుభవం పూర్తిచేసుకున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏపీ ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. -
కొత్త జిల్లాలకు ఉద్యోగుల నియామకాలు సిద్ధం
11న ఉత్తర్వులు జారీ! సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించే ప్రక్రియ దాదాపు అన్ని విభాగాల్లో పూర్తయింది. ఏయే జిల్లాల్లో ఏ కేడర్‌లో ఎవరెవరిని నియమించవచ్చన్న వివరాలు తెలుపుతూ ఆయా విభాగాల అధిపతులు సాధారణ పరిపాలన శాఖకు ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనల మేరకే ఉద్యోగుల నియామకాలకు ప్రభుత్వం యథాతథంగా ఆమోదం తెలుపుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. కొత్త జిల్లాల్లో కొత్త పోస్టింగులు ఎవరెవరికి దక్కనున్నాయోనన్న విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులు, అధికారులకు తెలియజేసినట్లు పంచాయతీరాజ్, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నెల 11న కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నందున, నియామక ఉత్తర్వులు కూడా అదే రోజున జారీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. అన్ని శాఖల్లోనూ ఈ ప్రక్రియ పూర్తయినప్పటికీ రెవెన్యూశాఖలో పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లు తమకు ఎటువంటి సమాచారం అందలేదంటూ సచివాలయం చుట్టూ ప్రద క్షిణలు చేస్తున్నారు. -
పోస్టులన్నీ ఖాళీ... ఏం చేయాలి?
ఐదు నెలలుగా జేసీ పోస్టు ఖాళీ ఇన్చార్జి జేసీగా ఏజేసీ సంజీవయ్య నాలుగు శాఖలకు జిల్లా అధికారులు లేరు అనేక విభాగాల్లో ఖాళీ కుర్చీలు {పజలకు సక్రమంగా అందని సేవలు సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా ... ప్రభుత్వ అధికారులు... ఉద్యోగుల పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.దీంతో అనేక శాఖలు ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నాయి. పాలన గాడి తప్పింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. జిల్లా అధికారులు లేక.. జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్ పోస్టు ఐదు నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్చార్జిగా ఏజేసీ సంజీవయ్య అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో రెవెన్యూ సమస్యలు అధికం. భూ వివాదాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో జేసీ పోస్టు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏజేసీ సంజీవయ్యకు కీలకమైన సంక్షేమ శాఖలతో పాటు అదనంగా జేసీగా ఇన్చార్జి బాధ్యతలు ఉన్నాయి. కలెక్టర్ సెలవుపై వెళ్లినపుడు ఇన్చార్జి బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అప్పగించినా... పనులు మాత్రం ఏజేసీయే చూసుకోవాల్సి వస్తోంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి (డీబీసీడబ్ల్యూఓ), జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అధికారి, డీసీఓ వంటి కీలకమైన బాధ్యతలూ ఇన్‌చార్జిలే చూస్తున్నారు. ఉద్యోగుల ఖాళీలు ఇలా... జిల్లా విద్యాశాఖలో 24 మంది డీప్యూటీ ఐఓఎస్‌లకు గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. 12 మంది డీప్యూటీ ఈఓలు ఉండాల్సి ఉండగా... ముగ్గురే ఉన్నారు. జిల్లాలో 790 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్వీఎంలో 24 ఇంజినీర్ పోస్టులు అవసరం కాగా...12 మంది మాత్రమే ఉన్నారు. ఐదు ఏబీసీడబ్ల్యూఓ, 13 హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.