
డబ్లిన్: కరోనా దెబ్బతో అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న వేళ రిటైల్ దిగ్గజం అమెజాన్ మాత్రం నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐర్లాండ్‌లోని అమెజాన్ కార్యాలయంలో 1,000మంది ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. అయితే క్లౌడ్ సేవలకు(డిజిటల్) డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ పేర్కొంది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో నూతన అమెజాన్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.
కాగా కొత్తగా నియమించుకునే వారు బిగ్‌డేటా స్పెషలిస్టులు, ప్రోగ్రామ్ మేనేజర్లు తదితర విభాగాలలో సేవలంధించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అమెజాన్ వెబ్ సర్వీసెస్ విభాగాలలో కూడా ఉద్యోగులను నియమించుకోనున్నారు. కస్టమర్లకు మైరుగైన సేవలను అందించేందుకు అమెజాన్ సాంకేతికతను అద్భుతంగా ఉపయోగించుకుంటుందని ఐర్‌ల్యాండ్‌కు చెందిన అమెజాన్ మేనేజర్ మైక్ బియరీ పేర్కొన్నారు. (చదవండి: అమెజాన్ ఆపిల్ డేస్ సేల్ : తగ్గింపు ధరలు)
Comments
Please login to add a commentAdd a comment