Employee salaries
-
ఉద్యోగం పోతుందని హెచ్చరిక!
చెన్నైలోని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా పరిధిలో నిరసనకు దిగిన ఉద్యోగులకు కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగులకు వేతనాలు అందజేయమని, ఉద్యోగంలో నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. చెన్నై ప్లాంట్‌లోని సామ్సంగ్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని, తమ యూనియన్‌కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9 నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించింది.‘నో వర్క్..నోపే ప్రాతిపదికనను కంపెనీ పాటిస్తుంది. సమ్మె ప్రారంభమైన సెప్టెంబర్ 9 నుంచి నిరసనలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనాలు ఉండవు. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలి. నిరసన కొనసాగిస్తే ఉద్యోగాల నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉంది. నాలుగు రోజుల్లోగా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరకపోతే, వారిని సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలి’ అని కంపెనీ హెచ్ఆర్ విభాగం అధికారులు ఈమెయిల్ పంపించారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకంభారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉద్యోగులు వేతనాలు పెంచాలని, తమ యూనియన్ను కంపెనీ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కార్మికులను సమీకరించడంలో సహాయపడిన సీఐటీయూ వివరాల ప్రకారం సామ్సంగ్ ఉద్యోగులు నెలకు సగటున రూ.25,000 వేతనం అందుకుంటున్నారు. మూడేళ్లలో రూ.36,000కు పెంచాలని డిమాండ్ ఉంది. -
స్వల్ప వేతన జీవులే సింహభాగం!
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగుల జీతాలు అరకొరగానే ఉంటున్నాయని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. దేశంలో నెల జీతం మీద ఆధారపడుతున్న వారిలో దాదాపు 68 శాతం మంది నెలకు రూ.20 వేల లోపు జీతగాళ్లేనని కూడా తెలిపింది. కేంద్ర గణాంక శాఖ ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) తాజా నివేదిక దేశవ్యాప్తంగా నిరుద్యోగిత పెరుగుతోందని కూడా పేర్కొంది. ఉద్యోగుల జీతాలపై కీలక అంశాలను వెల్లడించింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత రంగాల్లో కలిపి దేశం మొత్తం మీద 8.50 కోట్ల మంది నెల జీతం మీద ఆధారపడి జీవిస్తున్నారని ఆ నివేదిక తెలిపింది. దేశంలో నెలకు రూ.70 వేలకు పైగా జీతం తీసుకుంటున్నవారు కేవలం 2.6 శాతం మందే ఉన్నారంది. అలాగే, దేశంలో నిరుద్యోగిత క్రమంగా పెరుగుతోందని పీఎల్ఎఫ్ఎస్ నివేదిక తెలిపింది. దేశంలో 27 రంగాల్లో ఉద్యోగ కల్పన పరిస్థితులను విశ్లేషించి నివేదిక వెల్లడించింది. ఆ ప్రకారం 2022–23 కంటే 2023–24లో దేశంలో 4.66 కోట్ల మంది నిరుద్యోగులు పెరిగారు. 2022–23లో దేశంలో 59.67 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా... 2023–24లో 64.33 కోట్లకు చేరారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 1 శాతం తగ్గగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిరుద్యోగిత 3శాతం పెరిగింది. -
కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు.. ఏపీ ఆర్థికశాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పింఛన్లను ఫిబ్రవరిలో చెల్లించాలని, అందుకు అనుగుణంగానే వీటికి సంబంధించిన బిల్లులను రూపొందించాలని ఆర్థిక శాఖ మరోసారి స్పష్టం చేసింది. వాస్తవానికి జనవరి నెల నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. కొత్త జీతాలు వస్తే ఈ వాస్తవం బయటపడుతుందన్న కారణంతోనే కొందరు కొత్త జీవోల ప్రకారం జీతాలు విడుదల కా కుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులు జారీచేసింది. నిర్దేశించిన సమయంలోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ మెమో జారీ చేసింది. జీవోలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది. ► ప్రభుత్వశాఖలు, విభాగాలు, విశ్వవిద్యాలయా లు, సొసైటీలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన మినిమమ్ టైమ్‌స్కేల్ మేరకు జనవరి వేతనాలు చెల్లించాలని తెలిపింది. ► ఫుల్ టైమ్, ఎన్ఎంఆర్, రోజువారీ వేతనాలు, కన్సాలిడేటెడ్, పార్ట్ టైమ్ ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం మినిమమ్ టైమ్‌స్కేల్ మేరకు జనవరి వేతనాలను చెల్లించాలని స్పష్టం చేసింది. ► ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలపై జారీ చేసిన జీవో ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని పేర్కొంది. -
మతి పోయి 'రివర్స్' రాతలు
సాక్షి, అమరావతి: ‘చదివితే ఉన్న మతి పోయింది’ అన్నట్లుగా.. రాన్రాను ఎల్లో మీడియా విష ప్రచారం పిచ్చికి పరాకాష్టగా మారింది. నిద్దర లేస్తే ప్రభుత్వంపై విష ప్రచారం చేయాలి, ప్రజలను రెచ్చగొట్టే రాతలతో పబ్బం గడుపుకోవాలన్న యావలో వాస్తవాలకే మసి పూస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి కార్యదర్శుల కమిటీ నివేదికపై ఆ మీడియా రాసిన రాతలే నిదర్శనం. కార్యదర్శుల కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగకపోగా తగ్గిపోతాయని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఈ విష ప్రచారంపై ఉద్యోగుల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. ఈ నివేదికతో ఒక్కో ఉద్యోగి జీతంలో రూ.10 వేలు తగ్గిపోతాయని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తించడం కోసం వండినదేనని ఆగ్రహం వ్యక్టం చేస్తున్నారు. దానికి టీడీపీ వంతపాడటంపై మండిపడుతున్నారు. అదంతా విష ప్రచారమే తప్ప వాస్తవాలు వేరుగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. 14.29 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగుల జీతాలు రివర్స్లోకి వెళ్తున్నాయన్న ప్రచారం పచ్చి అబద్ధమని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ అమలు చేస్తోందనే విషయాన్ని గుర్తించాలని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఏడాదికి సుమారు రూ.7,200 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై ఇప్పటికే పడుతోందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. సీఎస్ కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏడాదికి సుమారు రూ.11,200 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించాయి. అంటే ఐఆర్‌కన్నా ఫిట్మెంట్ అమలు వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.4 వేల కోట్ల భారం పడుతుంది. ఇది రివర్స్ ఎలా అవుతుందో ఎల్లో మీడియానే చెప్పాలని పలువురు ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ.4 వేల కోట్లలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు రెగ్యులర్ స్కేలులోకి రావడంవల్ల, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల పడుతున్న భారం రూ.2 వేల కోట్లని నివేదిక చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. దీన్ని కూడా మినహాయించినా ఫిట్మెంట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న అదనపు భారం దాదాపు రూ.2 వేల కోట్లు. ఈ వాస్తవాలకు మసి పూసి ఉద్యోగులను రెచ్చగొట్టేలా తోక పత్రిక విషం కక్కడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలో కూడా 2019 జులైలో ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ 10 శాతమేనని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు సైతం కేంద్ర ప్రభుత్వ సిఫార్సులనే అమలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ 14.29 శాతమే. వీటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా, టీడీపీ రక రకాల వక్రీకరణలతో విష ప్రచారం చేయడం ఏమిటనే ప్రశ్నలు సామాన్యుల నుంచి కూడా వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి అంగన్వాడీ, ఆశా వర్కర్లు, శానిటరీ వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, కుకింగ్ హెల్పర్లకు జీతాలు పెంచిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులకు 70 శాతం మేర జీతాలు పెంచడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇవేమీ పీఆర్సీ పరిధిలోకి రావు. వాళ్లకు పెంచిన జీతాల వల్ల కలగుతున్న భారం, ఫిట్మెంట్ అమలు వల్ల కలుగుతున్న భారానికి అదనంగా ఉన్నదేనని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. -
యాపిల్ ఉద్యోగుల శాలరీ ఎంతో తెలిస్తే షాకే..!
How Much Salary Apple Pays Engineers Developers: ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు క్రేజ్ మాములుగా ఉండదు. అదే క్రేజ్ యాపిల్‌ను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించడానికి ఎంతగానో దోహదం చేసింది. యాపిల్ ఎక్కడ రాజీ పడకుండా ఉత్పత్తులను రెడీ చేస్తోంది. ప్రపంచంలో నెంబర్ వన్ టెక్ దిగ్గజంగా నిలిపేందుకు కృషి చేస్తోన్న ఉద్యోగులకు యాపిల్ అదిరిపోయే రేంజ్లో శాలరీను అందిస్తుంది. చదవండి: జెట్ స్పీడ్‌లా దూసుకుపోతున్న ట్రూకాలర్..! కంపెనీలో పనిచేస్తోన్న సుమారు వెయ్యికిపైగా టాప్ ఇంజనీర్స్, డెవలపర్స్‌కు అందించే జీతాల సమాచారాన్ని యూఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్-2021లో యాపిల్ పొందుపర్చింది. కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఏడాది గాను దాదాపు 95 లక్షల నుంచి రూ. 1.63 కోట్ల జీతాన్ని పొందుతున్నారు. ముఖ్యమైన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్లు గరిష్టంగా రూ. 1.78 కోట్ల జీతాన్ని దక్కించుకుంటున్నారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏకంగా రూ. 1.86 కోట్ల ప్యాకేజ్‌ను పొందుతున్నారు. టెస్ట్‌ల నిర్వహణ కోసం వాడే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్లకు, ప్రొడక్షన్ సర్వీసెస్ ఇంజనీర్స్ వరుసగా రూ. 1.02 కోట్లు, రూ. 1.11 కోట్లను యాపిల్ ముట్ట చెపుతోంది. యాప్లికేషన్ డెవలప్ చేసే ఇంజనీర్లు ఏడాదికి సుమారు రూ. 93 లక్షలను పొందుతున్నారు. చివరగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ఇంజనీర్స్కు ఏడాదిగాను సుమారు రూ. 89 లక్షలు నుంచి రూ. 1.83 కోట్లను ప్యాకేజ్‌ను యాపిల్ అందిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. అమెరికాలో పనిచేసే ఉద్యోగులు మాత్రమే ఈ స్థాయిలో జీతాలను పొందుతున్నారు. మిగతా ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలను యాపిల్ వెల్లడించలేదు. చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై స్మార్ట్‌ఫోన్ కంపెనీల దండయాత్ర! -
‘పీఆర్సీ’ అభిప్రాయ సేకరణ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి తుది గడువును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 5 వరకు పొడిగించినట్లు సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) బుధవారం తెలిపింది. ప్రభుత్వ శాఖలు, వర్సిటీలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, సర్వీస్ అసోసియేషన్లు, పెన్షనర్లు, ఉద్యోగుల నుంచి నిర్దేశిత ప్రొఫార్మాలో అభిప్రాయాల సేకరణ కోసం ప్రకటన జారీ చేశామని తెలిపింది. పొడిగించిన గడువులోగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు ఆ సమాచారాన్ని అందజేయాలని కోరింది. సమాచార సేకరణ కోసం రూపొందించిన ప్రొఫార్మా, ప్రశ్నావళిని రాష్ట్ర ఆర్థిక శాఖ వెబ్సైట్ http://finance.telangana.gov.in నుంచి పొందవచ్చని సూచించింది. -
జీతాల్లేవ్.. జీవనమెలా?
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర కోసం సమరశంఖం పూరించిన ఉద్యోగులకు ఆగస్టు మాసం పెను సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులకు ఒక నెల జీతాలు ఆగిపోయాయి. ‘జీతాలు లేక జీవితాలు గడిపేది ఎలా’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ‘పస్తులైనా ఉంటాం.. ఉద్యమాన్ని వీడేది లేదు’ అని మొక్కవోని ధైర్యంతో చెబుతున్నారు. జిల్లాలోని ఖజానా (ట్రెజరీ) శాఖకు చెందిన 18 సబ్ ట్రెజరీల్లోని 175 మంది ఉద్యోగులు గత నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. అదేరోజు నుంచి జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు అన్ని ప్రాంతాలకు చెందిన 135 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సైతం సమ్మెబాట పట్టారు. ట్రెజరీల్లో స్తంభించిన కార్యకలాపాలు.. మచిలీపట్నంలోని ట్రెజరీ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాలోని 18 సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఉద్యోగుల వేతనాల బిల్లులు, పంచాయతీ, మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు అవసరమైన బిల్లుల చెల్లింపునకు ట్రెజరీ శాఖ ఆమోద ముద్ర తప్పనిసరి కావడం ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని అత్యవసర, అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు జాప్యం చేసినా అంత ఒత్తిడి లేదు. అత్యవసర పనులు, బిల్లుల మాట ఎలా ఉన్నా ఉద్యోగుల జీతాల బిల్లులు సైతం మంజూరు కాలేదు. ఈసారి ట్రెజరీ ఉద్యోగులు సైతం సమ్మెబాట పట్టడంతో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపు రూ.85 కోట్ల మేర జీతాల బిల్లులు నిలిచిపోయాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగ కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నెలాఖరున వచ్చే జీతంపై ఆశపెట్టుకుని.. కారు, ఇల్లు, విద్య, వ్యక్తిగత రుణాలు చెల్లించుకునేలా అప్పులు చేస్తారు. వాటిని వాయిదా సమయానికి చెల్లించకపోతే వడ్డీ భారం పెరిగే ప్రమాదం ఉంది. ఇది చాలదన్నట్టు ఇంటి అద్దెలు, నెలవారీ పచారీ, ఇతర ఖర్చులు తప్పవు. ఆగస్టు జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు సైతం అప్పులపాలుకాక తప్పని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పోలీసులు మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖమ్మం జిల్లాలో జీతాల బిల్లులు చేయించుకోవడం చర్చనీయాంశమైంది.