Entertainment sector
-
వినోద రంగానికి పైరసీ దెబ్బ
న్యూఢిల్లీ: దేశీ వినోద రంగానికి పైరసీ పెను ముప్పుగా మారింది. పైరసీ దెబ్బతో పరిశ్రమ గతేడాది (2023) ఏకంగా రూ.22,400 కోట్ల మేర నష్టపోయింది. ఈవై, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన ’ది రాబ్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మీడియా వినియోగదార్లలో 51 శాతం మంది పైరసీ అయిన కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అనధికారికంగా కాపీ చేయడం, పంపిణీ చేయడం లేదా కాపీరైట్ హక్కులున్న మెటీరియల్‌ను (సంగీతం, సినిమాలు, సాఫ్ట్వేర్ మొదలైనవి) వినియోగించుకోవడాన్ని పైరసీగా వ్యవహరిస్తారు. ఒరిజినల్ క్రియేటర్ల హక్కులను హరించి, వారిని గణనీయంగా నష్టపరుస్తుంది కాబట్టి దీన్ని ఒక విధంగా దొంగతనంగా కూడా పరిగణిస్తారు. ‘భారత మీడియా–వినోద పరిశ్రమలో సెగ్మెంట్లవారీ ఆదాయపరంగా చూస్తే 2023లో పైరసీ ఎకానమీ రూ. 22,400 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో సినిమా థియేటర్ల నుంచి పైరసీ చేసిన కంటెంట్ పరిమాణం రూ. 13,700 కోట్లుగా, ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి జనరేట్ చేసినది రూ. 8,700 కోట్లుగా ఉంటుంది. పైరసీ కంటెంట్ వల్ల రూ. 4,300 కోట్ల మేర ప్రభుత్వానికి జీఎస్టీ నష్టాలు వాటిల్లి ఉంటుందని అంచనా‘ అని నివేదిక వివరించింది. సబ్ర్స్కిప్షన్ ఫీజులు భారీగా ఉండటమే కారణం పైరేటెడ్ కంటెంట్‌ను చూడటానికి నిర్దిష్ట కారణాలున్నాయని యూజర్లు చెబుతున్నారు. సబ్స్క్రిప్షన్ ఫీజులు అధికంగా ఉండటం, కోరుకునే కంటెంట్ అందుబాటులో లేకపోవడం, ఒక్కో సబ్ర్స్కిప్షన్ను నిర్వహించుకోవడమనేది సమస్యగా మారడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. పైరసీ ఎక్కువగా 19–34 ఏళ్ల ఆడియన్స్‌లో ఉంటోందని, మహిళలు ఓటీటీ షోలను ఇష్టపడుతుండగా, పురుషులు క్లాసిక్ సినిమాలను వీక్షిస్తున్నారని నివేదిక తెలిపింది. పైరేటెడ్ కంటెంట్‌ను చూసే వారు, దాన్ని ఉచితంగా అందిస్తే, ప్రకటనలపరంగా అంతరాయాలు వచి్చనా, అధికారిక చానల్స్‌కి మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. కంటెంట్ ప్రొవైడర్లు ధరల విధానాలను, కంటెంట్‌ను అందుబాటులో ఉంచే వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. పైరేటెడ్ కంటెంట్ వినియోగదారుల్లో 70 శాతం మంది తాము ఏ ఓటీటీ సబ్ర్స్కిప్షన్నూ తీసుకోదల్చుకోలేదని తెలిపారు. ప్రథమ శ్రేణి నగరాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పైరసీ ఎక్కువగా ఉంటోంది. అధికారికంగా కంటెంట్‌ను వీక్షించేందుకు అవకాశాలు తక్కువగా ఉండటం, పైరేటెడ్ కంటెంట్ సులువుగా లభిస్తుండటం, పైరసీ వల్ల వచ్చే నష్టాలపై అవగాహన లేకపోవడం, ఆదాయాల్లో వ్యత్యాసాలు, థియేటర్లు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కూడా పైరసీ విస్తృతికి కారణంగా ఉంటున్నాయి. ప్రథమ శ్రేణి నగరాల్లోని యూజర్లు సాధారణంగా పాత సినిమాలను వీక్షించేందుకు పైరేటెడ్ కంటెంట్‌ను ఆశ్రయిస్తుండగా, ద్వితీయ శ్రేణి నగరాల్లోని వారు టికెట్టు కోసం ఖర్చు చేయడం ఇష్టం లేక ఈమధ్యే విడుదలైన కొత్త సినిమాలను చట్టవిరుద్ధంగా చూసేందుకు ఉపయోగిస్తున్నారు. సమిష్టిగా పోరాడాలి.. పైరసీ వల్ల వాటిల్లుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని, దాన్ని కట్టడి చేసేందుకు అన్ని వర్గాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఐఏఎంఏఐ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్ రోహిత్ జైన్ చెప్పారు. ‘దేశీయంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ గణనీయంగా వృద్ధి చెందుతోందనేది కాదనలేని వాస్తవం. 2026 నాటికి ఫిలిం ఎంటర్టైన్మెంట్ రూ. 14,600 కోట్లకు చేరుతుందని అంచనా. అయితే, విచ్చలవిడిగా విజృంభిస్తున్న పైరసీ నుంచి దీనికి పెను ముప్పు పొంచి ఉంది. కాబట్టి, ప్రభుత్వం, పరిశ్రమ, వినియోగదారులు అందరూ కూడా కలిసికట్టుగా దీనిపై పోరాడాల్సి ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. -
మల్టీప్లెక్స్‌ను దాటనున్న ఓటీటీ
ముంబై: దేశీ ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్ త్వరలో మల్టీప్లెక్స్ పరిశ్రమను అధిగమించనుంది. 2018లో రూ. 2,590 కోట్లుగా ఉన్న ఓటీటీల మార్కెట్ 2023 నాటికి రూ. 11,944 కోట్లకు పెరగనుంది. ఏటా 36 శాతం వృద్ధి సాధించనుంది. తద్వారా ఒకప్పుడు వీసీఆర్‌లు, వీసీపీ, వీసీడీలను కనుమరుగయ్యేలా చేసిన మల్టీప్లెక్స్‌లను దెబ్బతీయనుంది. ఎస్బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 1980లలో తెరపైకి వచ్చిన వీసీఆర్, వీసీపీలు ఆ తర్వాత డీవీడీల్లాంటివి .. 2000ల తొలినాళ్లలో మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌లు కుప్పతెప్పలుగా వచ్చే వరకూ హవా కొనసాగించాయి. ఆ తర్వాత సాంకేతికాంశాలు, మల్టీప్లెక్స్‌ల ధాటికి అవి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవాతో మల్టీప్లెక్స్‌లకు కూడా అదే గండం పొంచి ఉందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఓటీటీలు ఇప్పటికే వినోద రంగంలో 7–9 శాతం వాటాను దక్కించుకున్నాయని, అన్ని భాషల్లోనూ ఒరిజినల్ కంటెంట్ అందిస్తూ 40 పైచిలుకు సంస్థలు నిలకడగా వృద్ధి చెందుతున్నాయని వివరించింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 45 కోట్ల పైచిలుకు ఓటీటీ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారని, 2023 ఆఖరు నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరవచ్చని గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. స్మార్ట్ టీవీలు, క్రోమ్‌కాస్ట్ వంటి ఆప్షన్లు సంప్రదాయ సినీ వినోదంపై గణనీయంగా ప్రభావం చూపాయని పేర్కొన్నారు. చౌక ఇంటర్నెట్ .. డిస్కౌంట్ల ఊతం.. ఇంటర్నెట్ వినియోగించే వారు పెరుగుతుండటం, చౌకగా వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ లభిస్తుండటం, డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలు ఓటీటీల వృద్ధికి దోహదపడుతున్నాయి. ఆయా సంస్థలు డిస్కౌంటు రేటుకే సర్వీసులు అందిస్తుండటం కూడా ఇందుకు తోడ్పడుతోంది. డిస్నీ+హాట్‌స్టార్ (14 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్), అమెజాన్ ప్రైమ్ వీడియో (6 కోట్ల మంది), నెట్‌ఫ్లిక్స్ (4 కోట్లు), జీ5 (3.7 కోట్లు), సోనీలివ్ (2.5 కోట్లు) తదితర సంస్థలు అమెరికాతో పోలిస్తే 70–90 శాతం చౌకగా తమ ప్లన్స్ అందిస్తున్నాయి. వూట్, జీ5, ఆల్ట్‌బాలాజీ, హోయ్‌చోయ్ లాంటి స్థానిక, ప్రాంతీయ ఓటీటీలకు కూడా డిమాండ్ బాగా ఉంటోంది. 50 శాతం మంది ఓటీటీలను నెలకు 5 గంటల పైగా వినియోగిస్తుండటంతో ఆ మేరకు థియేటర్ల లాభాలకు గండిపడనుంది. సాంప్రదాయ విధానాల్లో సినిమాల నిర్మాణంతో పోలిస్తే ఓటీటీల కోసం స్ట్రీమింగ్ సిరీస్‌లు, సినిమాలను తీయడమే లాభసాటిగా ఉంటోందని పెద్ద నిర్మాణ సంస్థలు గుర్తించాయి. తమ సొంత ఓటీటీలు ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా లేని విధంగా కోవిడ్ కాలంలో థియేటర్లు మూతబడటం.. ఓటీటీలకు లాభించింది. ఈ వ్యవధిలో 30 పైగా హిందీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ జరుపుకున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ వెబ్ సిరీస్‌లు, సినిమాలపై అంతర్జాతీయ సంస్థలు కూడా మరింతగా దృష్టి పెడుతున్నాయి. ►ఇప్పటికీ ఉచితంగా సర్వీసులు అందిస్తున్న ఓటీటీలే (యాడ్ ఆధారిత) ముందంజలో ఉంటున్నాయి. 2017లో వీటి వినియోగదారుల సంఖ్య 18.4 కోట్లుగా ఉండగా ఇది ఈ ఏడాది 35.1 కోట్లకు, 2027 నాటికి 46.6 కోట్లకు చేరనుంది. ►పే–పర్–వ్యూ సెగ్మెంట్లో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018లో 3.5 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది 8.9 కోట్లకు, 2027లో 11.7 కోట్లకు చేరనుంది. ►రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫాంలు విద్య, ఆరోగ్యం, ఫిట్నెస్ తదితర రంగాల్లోకి కూడా విస్తరించనున్నాయి. తద్వారా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. ఓటీటీలతో కంటెంట్ క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి -
సినిమా చూపిస్త మావా.. వడివడిగా ఓవర్ ది టాప్ అడుగులు
కంటికి కనిపించని కరోనాను తీసుకువచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన 2020.. మానవాళి జీవన శైలిని సమూలంగా మార్చివేసింది. అనేక అలవాట్లను, పోకడలను పరిచయం చేసింది. వర్క్ ఫ్రం హోంలు, ఆన్లైన్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్‌లు లాంటి వాటన్నింటినీ అలవాటు చేసింది. అదే సంవత్సరం మరో పరిణామానికి నాంది పలికింది. అది స్ట్రీమింగ్ సర్వీసుల వెల్లువ. మనం ఓటీటీ సర్వీసుగా పిలుచుకునే ఈ సేవల విజృంభణకు కరోనా కూడా ఓ ప్రధాన కారణమయ్యింది. థియేటర్ల మూత, బయట తిరగలేని పరిస్థితి, వర్క్ ఫ్రం హోంలతో ఇంటికి పరిమితమైన జనాభాకు వినోదం అందించేందుకు ఓ కొత్త మార్గాన్ని ఆవిష్కరించిందీ ఓటీటీ సర్వీసు. కేబుల్ కనెక్షన్, బ్రాడ్కాస్ట్ పరికరాలు, శాటిలైట్ కనెక్షన్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ద్వారా మన దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ లాంటి ఎలాంటి పరికరం ద్వారా అయినా వినోదాన్ని అందించేదే ఈ స్ట్రీమింగ్ సర్వీసు. సినిమాతో మొదలై టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్ట్రీమింగ్ల వరకు విస్తరించిన ఈ ఓటీటీ రంగం త్వరలో టెలివిజన్ రంగాన్ని మించి పోయే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పేరుకు తగ్గట్టుగా ఓటీటీ (ఓవర్ ది టాప్) అన్ని వినోద రంగాల్ని అధిగమించబోతోంది. వీడియో వచ్చి రేడియోను మరిపించినట్లుగా ఓటీటీ ఇప్పుడు డిష్ చానళ్లను కనుమరుగు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కేబుల్ కనెక్షన్లకు స్వస్తి చెప్పి ఓటీటీ సర్వీసుల్లో సభ్యులుగా చేరిపోయారు. ఓటీటీ సేవల విస్తృతి గమనిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. 2019 నాటికి 190 కోట్ల మంది సభ్యులు కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ 2020కి 210 కోట్లు, 2021 నాటికి 220 కోట్లు లెక్కన 2025 నాటికి 270 కోట్ల సభ్యులను సమకూర్చుకోబోతోంది. ఇది ఆఫ్రికా ఖండం జనాభాకు దాదాపుగా రెట్టింపు కాబోతోంది. సభ్యత్వ రుసుము ద్వారా ఈ సంస్థలు ఆర్జిస్తున్న ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. 2019లో 8,300 కోట్ల డాలర్లు ఉండగా 2020 నాటికి అది 9,900 కోట్ల డాలర్లకు పెరిగి 2025 నాటికి 16700 కోట్ల డాలర్లకు పెరగనున్నట్లు అంచనా. అంటే శ్రీలంక, నేపాల్ జీడీపీలను కలిపినా ఈ మొత్తం ఎక్కువే. దీనంతటకూ కారణం బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ పెరగడం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, చెల్లించే రుసుము తక్కువ కావడం కొన్ని కారణాలైతే విపరీతంగా పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు మరో పెద్ద కారణం. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడున్నా నచ్చిన సినిమా లేదా సీరియల్‌ను వీక్షించే వీలుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 664 కోట్లు స్మార్ట్ ఫోన్లు అంటే.. 83.89 శాతం మంది వద్ద ఫోన్లు ఉన్నట్లు జోరాం అనే సంస్థ నివేదిక. 2026 నాటికి 130 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ కనెక్షన్ పొందనున్నట్లు మొబైల్ ట్రేడింగ్ సంస్థ జీఎస్ఎమ్ఏ అంచనా. లెక్కలేనన్ని చానల్స్ సినిమా, మ్యూజిక్, వెబ్‌సిరీస్, స్పోర్ట్స్ లాంటి అన్ని రకాల వినూత్న వినోద క్రీడా రంగాలకు సంబంధించి ఓటీటీ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని చానెల్స్‌లో చిన్న పిల్లలకు కూడా వినోదం అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 300కుపైగా ఓటీటీ చానెల్స్ ఉన్నాయి. అమెరికా జనాభా 75శాతం మంది రెండు లేదా ఆపైన ఓటీటీ చానల్స్ సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఒక్క నెట్‌ఫ్లిక్స్‌కే అమెరికా జనాభాలో 30శాతం మంది సభ్యులు. కోవిడ్ పుణ్యమా అని కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. జర్మనీలోని బూట్సాస్ అనే మ్యూజిక్ నైట్ క్లబ్ ఏకంగా బాట్సాస్ లైవ్ అనే ఓటీటీ చానెల్ ప్రారంభించి సభ్యుల కోసం లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. పికాక్ అనే సంస్థ టోక్యో ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ చానెల్ ప్రారంభించి అన్ని రకాల క్రీడా పోటీలను లైవ్‌గా ప్రసారం చేసింది. ఎన్ని చానెల్స్ ఉన్నా ఓటీటీ రంగంలోకి తొలి అడుగు వేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ టాప్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కి నెలవారీ ఫీజు చెల్లించే 22.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియోకు 20.5 కోట్లు, స్పాటిఫైకి 18 కోట్లు , డిస్నీ ప్లస్‌కి 13 కోట్లు, హెచ్‌బీవో మ్యాక్స్‌కి 8.5 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అక్కడ ఫ్లాప్.. ఇక్కడ హిట్... పాత సినిమాలు, టీవీ సీరియల్స్ కొనుగోలు చేసి ప్రసారం చేయడం ద్వారా వ్యాపారం ప్రారంభించిన ఈ స్ట్రీమింగ్ చానల్స్ ఇప్పుడు సొంత సినిమాలు, సీరియల్స్ నిర్మిస్తు న్నాయి. టీవీలో ఫ్లాప్ అయిన సీరియల్స్ ఓటీటీలో బంపర్‌హిట్ అవుతున్నాయి. స్పానిష్ థ్రిల్లర్‘మనీహైస్ట్’ టీవీలో ఫ్లాప్ షోగా ముద్ర వేయించుకుని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ చానల్లో ప్రత్యక్షమై బ్రహ్మాండంగా హిట్టయ్యింది. నెట్‌ఫ్లిక్స్ 2020లో సొంత సినిమాలు, సీరియల్స్ కోసం 1,700 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ సంస్థ దగ్గర ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ కలిపి 6,000 టైటిల్స్ ఉన్నాయి. అందులో 40 శాతం సొంత ప్రొడక్షనే. డిస్నీ దగ్గర అయితే 2500 టీవీ సీరియల్స్‌కు సంబంధించిన 55,000 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత టామ్ హంక్స్, ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ కలసి రెండో ప్రపంచయుద్ధంపై హెచ్‌బీవో కోసం సిరీస్ నిర్మిస్తున్నారు. దీనికోసం బ్రిటన్‌లో ఇప్పటికే ఒక కృత్రిమ వైమానిక స్థావరాన్ని నిర్మించారు. విలీనపర్వం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో పోటీ పడేందుకు వివిధ టీవీ, ఓటీటీ సంస్థలు విలీనబాట పడుతున్నాయి. మీడియా రంగంలో మెగా సంఘటనగా పేర్కొంటున్న అతి పెద్ద విలీనం ఈ ఏడాది చివరికి జరగబోతోంది. ఏటీ అండ్ టీ, హెచ్‌బీవో, సీఎన్ఎన్, వార్నర్ మీడియా, డిస్కవరీ, యానిమల్ప్లానెట్, టీఎల్సీ కలసి ఒకే గొడుగు కిందకి రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే హాలీవుడ్ మెగా సంస్థ ఎంజీఎంను కొనుగోలు చేసింది. బ్రిటన్‌లో బీబీసీ, ఐటీవీ, చానెల్ఫోర్ కలసి ‘బ్రిట్బాక్స్’ అనే స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. జర్మనీలో డిస్కవరీ, మరో మాస్ మీడియా సంస్థతో కలసి జోయిన్గా అవతరించాయి. స్పెయిన్‌లో అట్రెస్ మీడియా, మీడియా సెల్, ఆర్టీవీ కలసి లవ్స్ టీవీనీ ఏర్పాటు చేశాయి. నెట్‌ఫ్లిక్స్ వీడియో, గేమింగ్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు నైట్స్కూల్ స్టూడియోను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
సోనీకి ‘జీ’ హుజూర్!
న్యూఢిల్లీ: దేశీ ఎంటర్టైన్మెంట్ రంగంలో నయా డీల్‌కు తెరలేచింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా(ఎస్పీఎన్ఐ)తో లిస్టెడ్ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్) విలీనం కానుంది. ఒప్పందంలో భాగంగా విలీన సంస్థలో సోనీ 1.575 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా 52.93 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. మిగిలిన 47.07 శాతం వాటాను జీ పొందనున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. డీల్ ప్రకారం విలీన సంస్థ నిర్వహణ పగ్గాలను జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా చేపట్టనున్నారు. దీంతో ఇటీవల కొద్ది రోజులుగా జీ యాజమాన్య మార్పుపై చెలరేగిన వివాదాలకు చెక్ పడే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. విలీన సంస్థలో మెజారిటీ బోర్డు సభ్యులను సోనీ నియమించనుంది. ఓఎఫ్‌ఐగ్లోబల్ చైనా ఫండ్‌తో కలిపి 17.9 శాతం వాటా కలిగిన ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ గత వారం పునీత్ గోయెంకాతోపాటు.. జీ బోర్డులోని మరో ఇద్దరు సభ్యులను తప్పించమంటూ అత్యవసర సమావేశం కోసం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్ నేపథ్యంలో జీలో తలెత్తిన సంక్షోభం ముగియడంతోపాటు.. దేశీయంగా సోనీ బిజినెస్ మరింత విస్తరించనుంది. 90 రోజులు.. ఎస్‌పీఎన్‌ఐతో తప్పనిసరికాని(నాన్‌బైండింగ్) కాలానుగుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జీల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. డీల్ ద్వారా రెండు సంస్థల నెట్వర్క్స్, డిజిటల్ ఆస్తులు, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రోగ్రామ్ లైబ్రరీలు ఏకంకానున్నట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థ 70 టీవీ చానళ్లు, 2 వీడియో స్ట్రీమింగ్ సరీ్వసులు(జీ5, సోనీ లివ్), రెండు స్టూడియోల (జీ, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా)ను కలిగి ఉంటుంది. వెరసి దేశంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా ఆవిర్భవించనుంది. దీంతో దేశీ మార్కెట్లో సమీప ప్రత్యర్థి సంస్థగా స్టార్ డిస్నీ నిలవనుంది. ఒప్పందాన్ని తప్పనిసరి చేసుకునేందుకు 90 రోజుల గడువుంటుందని జీల్ వెల్లడించింది. వినియోగదారులకు మేలు జీల్, ఎస్‌పీఎన్‌ఐల విలీనంతో దేశీయంగా అతిపెద్ద మీడియా నెట్వర్క్ బిజినెస్ ఏర్పాటుకానుందని సోనీ పిక్చర్స్ పేర్కొంది. తద్వారా కంటెంట్, సినిమాలు, క్రీడలు తదితర విభాగాలలో వినియోగదారులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలియజేసింది. విలీన ముందస్తు ఒప్పందాన్ని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జీల్ వెల్లడించింది. వాటాదారులందరికీ ఇది మేలు చేయగలదని తెలియజేసింది. అధిక వృద్ధి, లాభదాయకతలను సాధించేందుకు ఈ డీల్ ఉపయుక్తం కాగలదని పేర్కొంది. మరోవైపు డీల్ ప్రకారం జీల్లో 4 శాతం వాటాగల ప్రమోటర్ సుభాష్ చంద్ర కుంటుంబం వాటాను పెంచుకునేందుకు వీలు చిక్కనుంది. నిబంధనల ప్రకారం ప్రస్తుత 4 శాతం నుంచి 20 శాతానికి పెంచుకునేందుకు అవకాశముంటుందని జీల్ పేర్కొంది. ప్రస్తుత ఈక్విటీ విలువల ఆధారంగా విలీన నిష్పత్తి జీల్‌కు అనుగుణంగా 61.25 శాతంగా ఉండవచ్చని అంచనా. షేర్ల దూకుడు యాజమాన్య మారి్పడి తదితర అంశాలపై ఇటీవల చెలరేగిన వివాదాలకు చెక్ పడటంతోపాటు.. సోనీ పిక్చర్స్‌తో విలీనంకానున్న నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్(జీల్) కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఎన్ఎస్ఈలో జీల్ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 334 వద్ద ముగిసింది. ఒక దశలో గరిష్టంగా రూ. 355ను సైతం అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా..రూ. 281 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో బీఎస్ఈలోనూ 39 శాతం జంప్‌చేసి రూ. 355 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 7,824 కోట్లు ఎగసి రూ. 32,379 కోట్లకు చేరింది. గ్రూప్ షేర్లు: జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ ఎస్‌పీఎన్‌ఐతో విలీన వార్తల నేపథ్యంలో జీ గ్రూప్‌లోని ఇతర కౌంటర్లకూ డిమాండ్ పెరిగింది. జీ లెర్న్ 13 శాతంపైగా ఎగసి రూ. 16 వద్ద నిలవగా.. జీ మీడియా 5 శాతం బలపడి రూ. 12.30 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
ఐపీఎల్ తర్వాత ధోని చేసేదేంటో తెలుసా?
ఆగస్టు 15, 2020.. ఎంఎస్ ధోని అభిమానులకు బ్యాడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అదే రోజు సాయంత్రం 7.30 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు బిగ్‌షాక్ ఇచ్చాడు. అయితే సెప్టెంబర్ 19నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కావడంతో ధోని మళ్లీ బిజీ అయ్యాడు. సీఎస్కేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని జట్టుకు మరోసారి టైటిల్ అందించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని ఏం చేస్తాడనేది అతని అభిమానుల్లో ప్రశ్న మెదులుతూ వస్తుంది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని ఎంటర్టైన్మెంట్ రంగంలో బిజీ కానున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ధోని భార్య సాక్షి ధోని పర్యవేక్షిస్తుంది. (చదవండి : ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ : చెరో 10 విజయాలు) కాగా ధోనీ ఎంటర్టైన్మెంట్ పేరుతో 2019లోనే సొంత బ్యానర్‌ను స్థాపించిన జార్ఖండ్ డైనమేట్ రోర్ ఆఫ్ ది లయన్ అనే డాక్యుమెంటరీని రూపొందిస్తున్నాడు. దీనికి సంబంధించి న్యూ ప్రాజెక్ట్స్‌ను కూడా రూపొందించనున్నాడు. ఇదే విషయమై ధోని ఎంటర్టైన్మెంట్కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సాక్షి సింగ్ ధోని స్పందించారు. ఒక డెబ్యూ రచయిత రాసిన బుక్ పబ్లిషకాకపోవడంతో దాని హక్కలు తాము కొనుగోలు చేశామని.. దానిని ఒక వెబ్ సిరీస్‌గా మలవనున్నాం. ఇది ఒక పురాణ సైన్స్ ఫిక్షన్ కథ.. ఇది ఒక రహస్యమైన అగోరి ప్రయాణాన్ని అన్వేషించనుంది. కథకు సంబంధించి పాత్రలు, డైరెక్టర్‌ను త్వరలోనే ఫైనలైజ్ చేస్తాం. ఐపీఎల్ తర్వాత ధోని కూడా నాతో పాటు నిర్వహణ బాధ్యతలు పంచుకోనున్నాడు. ధోనికి క్రికెట్ తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగాన్ని చాలా ఇష్టపడుతాడు. అందుకే రిటైర్మెంట్ తర్వాత ధోని ఏరికోరి ఈ రంగాన్ని ఏంచుకున్నాడు. ధోని ఎంటర్టైన్మెంట్ పేరు మీద మంచి కార్యక్రమాలను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటూ చెప్పుకొచ్చారు. (చదవండి : ఐపీఎల్ 2020: అయ్యర్‌కు భారీ జరిమానా) కాగా ఐపీఎల్ 13వ సీజన్లో ధోని సారధ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్ తడబడుతూనే ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి రెండు ఓడిపోయింది. రైనా, హర్బజన్ దూరమవడం.. రాయుడు గాయంతో ఆడకపోడం చెన్నై జట్టుకు శాపంగా మారింది. -
ఎంటర్టైన్మెంట్లో ‘హంగామా’
♦ కంటెంట్‌ను విస్తృతం చేస్తున్న కంపెనీ ♦ పిల్లల కోసం త్వరలో యానిమేషన్ వీడియోలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న హంగామా.కామ్ మరింత వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది. వేలాది సినిమాలు, పాటలను నిక్షిప్తం చేసిన ఈ సంస్థ కొద్ది రోజుల్లో పిల్లల కోసం యానిమేషన్ వీడియోలను పరిచయం చేయనుంది. అలాగే టీవీ సీరియళ్లను సైతం పొందుపరుస్తామని హంగామా.కామ్ సీఈవో సిద్ధార్థ రాయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రానున్న రోజుల్లో సొంతంగా టీవీ సీరియళ్లు, యానిమేషన్ కంటెంట్‌ను రూపొందిస్తామని చెప్పారు. తెలుగు కంటెంట్ కోసం ఇటీవలే మా టీవీతోపాటు సన్ టీవీ నెట్వర్క్తోనూ ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. తమ నెట్‌వర్క్‌లోకి లాగిన్ అయిన కస్టమర్ సగటున 47 నిముషాలు వీడియోలను చూస్తున్నట్టు చెప్పారు. 4జీ నెట్వర్క్ విస్తృతమైతే పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. డేటా చార్జీలు త గ్గడం, నాణ్యమైన సేవలు అందుతాయి కాబట్టి కస్టమర్ల సంఖ్య అధికమవుతుందని పేర్కొన్నారు. మార్చికల్లా 2.5 కోట్లమంది.. వీడియో ఆన్ డిమాండ్ సేవలందిస్తున్న హంగామా ప్లే కస్టమర్లు నెలవారీ చందా రూ.199 చెల్లించాలి. ఎన్ని సినిమాలనైనా అపరిమితంగా చూడొచ్చు. చందాదారుగా కొనసాగినంత కాలం సినిమాలను డౌన్లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో వీక్షించే వీలుంది. ఒక కస్టమర్ తన ఖాతా కింద అయిదు ఉపకరణాల్లో ఈ యాప్‌ను వాడొచ్చు. హంగామా, హంగామా ప్లే వినియోగదార్లు 6.7 కోట్ల మందికిపైగా ఉన్నారు. వీరిలో 1.75 కోట్లకుపైగా ప్రీమియం చందాదారులున్నారు. చిన్న వీడియోలను చూసే వారి సంఖ్య ఏడాదిలో 16 నుంచి 34%కి ఎగసింది. డిసెంబరుకల్లా ఇది 55 శాతానికి చేరడం ఖాయమని సిద్ధార్థ రాయ్ వెల్లడించారు. 2017 మార్చికల్లా మొత్తం చందాదారుల సంఖ్య 20 కోట్లకు, ప్రీమియం చందాదారులు 2.5 కోట్లకు చేరొచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంత కస్టమర్ల వాటా 30% ఉంటుందని వివరించారు. -
జోరుగా వినోద, మీడియా రంగం
న్యూఢిల్లీ: భారత వినోద, మీడియా రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2018 కల్లా ఈ రంగం రూ.2.27 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని సీఐఐ-పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ప్రకటనలు, టీవీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వృద్ధి దీనికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ఇండియా ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2014 పేరుతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), ప్రైస్‌వాటర్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) రూపొందించిన నివేదిక ముఖ్యాంశాలు.. 2013లో భారత వినోద, మీడియా రంగం టర్నోవర్ రూ.1.12 లోల కోట్లని అంచనా. 2013-18 కాలానికి 15 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందన్నది నివేదిక అంచనా. టెలివిజన్ పరిశ్రమలో వృద్ధి జోరు కొనసాగుతుంది. చందా ఆదాయాలు భారీగా పెరిగే అవకాశాలుండడమే(ఏడాదికి 15 శాతం వృద్ధి) దీనికి ఒక కారణం. ఇంటర్నెట్ అందుబాబులోకి రావడం, ఇంటర్నెట్లో ప్రకటనల ఆదాయం.. వీటి జోరు బాగా ఉంది. మొదటిది 47 శాతం, రెండోది 26 శాతం చొప్పున వార్షిక వృద్ధిని సాధిస్తాయి. భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే. 2013లో రూ.35,000 కోట్లుగా ఉన్న ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 2018 నాటికి 13% చక్రగతి వృద్ధితో రూ.60,000 కోట్లకు పెరుగుతుంది. {పింట్ మీడియాను ఇంటర్నెట్ అధిగమిస్తుంది. {పకటనల ఆదాయం అధికంగా టీవీ, ప్రింట్ మీడియాలకే అందుతుంది. 2013 నాటికి రూ.12,600 కోట్లుగా ఉన్న చిత్ర పరిశ్రమ టర్నోవర్ 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. దేశీయంగా, విదేశాల్లో కూడా సినిమా హాళ్ల ద్వారానే కాకుండా కేబుల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం కూడా పెరుగుతుంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌ల వినియోగం పెరుగుతుండడంతో గేమింగ్ రంగం ఆదాయం కూడా పెరుగుతుంది.