Errakota flag hosting
-
PM Narendra Modi: లౌకిక పౌరస్మృతి!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మతపరమైన పౌరస్మృతి అమల్లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దాన్ని 75 ఏళ్లుగా భరిస్తున్నాం. ఆ స్మృతికి చరమగీతం పాడి దాని స్థానంలో దేశ ప్రజలందరికీ సమానంగా వర్తించే ‘లౌకిక’ పౌరస్మృతిని రూపొందించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే. దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ఉండాలని ఆదేశిక సూత్రాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ఆవశ్యకతను సుప్రీంకోర్టు కూడా పలుమార్లు నొక్కిచెప్పింది. ఆ మేరకు తీర్పులు వెలువరించింది’’ అని గుర్తు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం మోదీ ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా పదకొండోసారి కావడం విశేషం. బీజేపీ ఎజెండా అంశాల్లో, ప్రధాన ఎన్నికల ప్రచార నినాదాల్లో ఒకటైన యూసీసీని వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తామని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ‘‘ప్రస్తుత పౌరస్మృతి ఒకవిధంగా మతపరమైనదన్న అభిప్రాయం సమాజంలోని మెజారిటీ వర్గంలో ఉంది. అందులో వాస్తవముంది. ఎందుకంటే అది మతవివక్షతో కూడినది. అందుకే దాన్నుంచి లౌకిక స్మృతివైపు సాగాల్సి ఉంది. తద్వారా రాజ్యాంగ నిర్మాతల కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అది తక్షణావసరం కూడా’’ అని పేర్కొన్నారు. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ కూడా దేశానికి చాలా అవసరమని మోదీ అన్నారు. ‘‘2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసుకుందాం. అందుకు 140 కోట్ల పై చిలుకు భారతీయులంతా భుజం భుజం కలిపి కలసికట్టుగా సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. రంగాలవారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు పంద్రాగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డు (94 నిమిషాల)నే అధిగమించారు. కొత్తగా 75,000 వైద్య సీట్లు ‘‘వైద్య విద్య కోసం మన యువత విదేశీ బాట పడుతోంది. ఇందుకోసం మధ్యతరగతి తల్లిదండ్రులు లక్షలు, కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అనామక దేశాలకు కూడా వెళ్తున్నారు’’ అని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ‘‘ఉన్నత విద్య కోసం యువత భారీగా విదేశాలకు వెళ్తోంది. దీన్ని సమూలంగా మార్చేస్తాం. విదేశాల నుంచే విద్యార్థులు మన దగ్గరికొచ్చే స్థాయిలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అలనాటి నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తితో 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతాం. నూతన విద్యా విధానానిది ఇందులో కీలక పాత్ర కానుంది.కిరాతకులకు వణుకు పుట్టాలి మహిళలపై హింసకు తక్షణం అడ్డుకట్ట వేయాల్సిందేనని మోదీ అన్నారు. ‘‘మహిళలపై అకృత్యాలకు తెగించేవారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ఉరి తప్పదన్న భయం రావాలి. మహిళలను ముట్టుకోవాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి కలి్పంచడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసుల్లో పడ్డ శిక్షల గురించి అందరికీ తెలిసేలా మీడియాలో విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. అప్పుడే ప్రజల్లో తిరిగి విశ్వాసం పాదుగొల్పగలం’’ అన్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై దారుణ హత్యాచారం దేశమంతటినీ కుదిపేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘మహిళల భద్రత బాధ్యత కేంద్రంపై, రాష్ట్రాలపై, ప్రజలందరిపై ఉంది. కోల్‌కతా ఘోరంపై దేశమంతా తీవ్రంగా ఆక్రోశిస్తున్న తీరును అర్థం చేసుకోగలను. నాదీ అదే మనఃస్థితి. నేనెంత బాధ పడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఆ కేసు విచారణను సత్వరం ముగించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నీచకృత్యాలు పదేపదే జరుగుతుండటం బాధాకరం’’ అన్నారు. బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరం కల్లోల బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో ఆందోళన నెలకొందని మోదీ అన్నారు. అక్కడ త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వెలిబుచ్చారు. అందుకు భారత్ అన్నివిధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.లక్ష మంది యువత రాజకీయాల్లోకిరాజకీయ రంగంలో కుల, కుటుంబవాదాలకు అడ్డుకట్ట వేయాలని మోదీ అన్నారు. అందుకోసం ఏ రాజకీయ నేపథ్యమూ లేని లక్ష మంది యువతీ యువకులు ప్రజా జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘‘వారికి నచి్చన పారీ్టలో చేరి అన్ని స్థాయిల్లోనూ ప్రజాప్రతినిధులుగా మారాలి. కొత్త ఆలోచనలతో కూడిన ఆ కొత్త రక్తం మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయగలదు’’ అన్నారు.ప్రతికూల శక్తులతో జాగ్రత్త దేశ ప్రగతిని కొందరు ఓర్వలేకపోతున్నారని విపక్షాలనుద్దేశించి మోదీ విమర్శించారు. ‘‘ప్రతిదాన్నీ ధ్వంసం చేయాలని వాళ్లు కలలుగంటున్నారు. అవినీతిని ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రతికూల శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారు. అంతర్గతంగా, బయటి నుంచి భారత్ లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.రాజస్తానీ రంగుల తలపాగా ఎప్పట్లాగే ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా మోదీ ప్రత్యేక తలపాగాతో మెరిసిపోయారు. పసుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన రాజస్తానీ సంప్రదాయ లెహరియా తలపాగాతో ఆకట్టుకున్నారు. తెల్ల కుర్తా, చుడీదార్, నీలిరంగు బంద్గలా ధరించారు. -
76 వ ఇండిపెండెన్స్ డే: తొలిసారి మేడిన్ ఇండియా గన్
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్ర్య దినోత్సవం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 15న ఎర్రకోట వద్ద గౌరవ వందనం కోసం మేడ్-ఇన్-ఇండియా తుపాకీని తొలిసారి ఉపయోగించారు. ఇప్పటి వరకు సెర్మోనియల్ సెల్యూట్ కోసం బ్రిటీష్ తుపాకులను ఉపయోగించారు. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తొలిసారిగా ఎంఐ-17 హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపించాయి. స్వదేశీ అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ హోవిట్జర్ గన్ను కేంద్రం ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించింది. ఈ గన్‌తోనే స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రాత్మకమైన ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి 21-షాట్ల గౌరవ వందనం లభించింది. "మనం ఎప్పటినుంచో వినాలనుకునే శబ్దాన్ని 75 ఏళ్ల తర్వాత వింటున్నాం. 75 ఏళ్ల తర్వాత ఎర్రకోట వద్ద తొలిసారిగా భారత్‌లో తయారు చేసిన తుపాకీతో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం లభించింది" అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ మేడ్-ఇన్-ఇండియా తుపాకీ గర్జనతో భారతీయులందరూ స్ఫూర్తి పొంది, మరింత శక్తివంతం అవుతారని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు సాయుధ దళాల సిబ్బందిని ప్రధాని ప్రశంసించారు. #WATCH | Made in India ATAGS howitzer firing as part of the 21 gun salute on the #IndependenceDay this year, at the Red Fort in Delhi. #IndiaAt75 (Source: DRDO) pic.twitter.com/UmBMPPO6a7 — ANI (@ANI) August 15, 2022 For the first time, MI-17 helicopters shower flowers at the Red Fort during Independence Day celebrations. #IDAY2022 #IndependenceDay2022 #स्वतंत्रतादिवस pic.twitter.com/j1eQjIoZAn — PIB India (@PIB_India) August 15, 2022 -
ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ
-
కరోనా వాక్సిన్ : ప్రధాని మోదీ గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ నివారణకు సంబంధించి మూడు వ్యాక్సిన్లు వివిధ దశల పరీక్షల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు ఆమోదం, అనుమతి లభించి వెంటనే ప్రతి భారతీయుడికి లభించేలా ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికతో ఉన్నామనీ, దానికోసం రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నానంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ దేశ ప్రజలకు ఈ శుభవార్త అందించారు. దేశానికి సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, నర్సులు ,ఇతర కరోనా యోధులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఒక విపత్కర సమయంలో ఉన్నాం. ఈ మహమ్మారి కారణంగా తాను పిల్లలను ఎర్రకోటవద్ద చూడలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 130 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో, ఈ మహమ్మారిని ఓడిస్తామని ప్రధాని మోదీ అన్నారు. (జెండా పండుగ : బోసిపోయిన చిన్నారులు) అలాగే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేలా ఓ యూనిక్ ఐడీని తీసుకొస్తున్నామని చెప్పారు. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకంలో భాగంగా ఆధార్ కార్డు తరహాలో హెల్త్ కార్డు జారీ చేయనున్నామని చెప్పారు. దీంతో సంబంధిత వ్యక్తి చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతా డిజిటల్ రూపంలో ఈ కార్డులో భద్రపరుస్తామన్నారు. ఫలితంగా దేశంలో ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన వివరించారు. దశలవారీగా అమలు చేయనున్న ఈ పధకానికి 300 కోట్ల రూపాయలను కేటాయించినట్టు ప్రధాని తెలిపారు. -
చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలి: మోదీ
సాక్షి, ఢిల్లీ : ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. అనంతరం త్రివిధ ధళాల గౌరవ వందనం స్వీకరించారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ' రక్షణ దళాలు నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయి. దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులకు వందనం. ప్రపంచంతో పాటు దేశం కూడా విపత్కర పరిస్థితిలో ఉంది. కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం. వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు అందరూ కృషి చేస్తున్నారు. కరోనా వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నా.కరోనా ఒక్కటే కాదు.. వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చాయి. కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై విపత్తులను ఎదుర్కొంటున్నాయి అంటూ తెలిపారు.' అంటూ మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్ మనందరి సంకల్పం కావాలి : '75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో సాధించాం. ప్రాణత్యాగం చేసి మన పూర్వీకులు స్వాతంత్ర్యం తెచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ మనందరి సంకల్పం కావాలి.ఆధునిక కావాల్సిన వస్తు ఉత్పత్తే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన రైతులు నిరూపించి చూపారు. భారత్‌ను ఆకలిరాజ్యం నుంచి అన్నదాతగా మార్చారు. మన రైతులే స్ఫూర్తిగా అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ సాధిద్దాం. భారత్ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. మన శక్తిని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలి. చైనా వస్తువులను నిషేధిద్దాం : 'చైనా వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇతర దేశాల వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అని నిరూపిద్దాం. ఒక నాడు భారత వస్తువులు అంటే ప్రపంచ వ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం. కరోనా కష్టకాలంలో కూడా మనం కొత్తదారులు వెతుక్కుందాం. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందాం. భారత్‌లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఎఫ్‌డీఐల విషయంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టాం.' అంటూ పేర్కొన్నారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం : నేటి నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించనున్నాం.ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ ఐడీ ఇచ్చేలా ఏర్పాట్లు. కరోనా వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాం. మూడు వ్యాక్సిన్లు తుది పరీక్షల దశలో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తల కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఇతర దేశాల వస్తువులను పూర్తిగా నిషేధించాలి. మన ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం కల్పిద్దాం. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తీసుకొద్దాం. మేకిన్ ఇండియాతో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకెళ్లాలి. దేశ వ్యాప్తంగా 22 కోట్ల మంది మహిళలకు జన్‌థన్ ఖాతాలు ఉన్నాయి. మహిళల వివాహ వయస్సుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఒకే కార్డు.. ఒకే దేశం లాంటి పథకాలు తీసుకొచ్చాం. 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లో మహిళలకు హక్కులు లభించాయి. సరిహద్దులు దాటేవారికి సైన్యం గుణపాఠం నేర్పింది. దేశ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఒకటే సమాధానం 'అంటూ మోదీ ప్రసంగించారు. కాగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం. కరోనా నేపథ్యంలో 150 మందిని మాత్రమే వేడుకలకు అనుమతించారు. ఈ సందర్భంగా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఇక, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందే.. శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాలి'
ఢిల్లీ: దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తొలుత రాజ్‌ఘాట్ వద్ద బాపూజీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటపై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని జాతీని ఉద్దేశించి ప్రసంగం చేశారు. 125 కోట్ల మంది భారతీయులకు నా శుభాకాంక్షలు' అని తెలిపారు. స్వరాజ్యాన్ని (స్వరాజ్యం అంటే సుపరిపాలన) సురాజ్యంగా మార్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు అని కొనియాడారు. స్వాతంత్ర్యం వెనక లక్షలాది మహానుభావుల త్యాగఫలం ఉందని గుర్తు చేశారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని సంకల్పిద్దామని సూచించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. కృష్ణుడి నుంచి గాంధీవరకు, భీముడి నుంచి భీంరామ్ అంబేద్కర్ వరకు భారతదేశానికి సనాతన చరిత్ర ఉందని ప్రధాని మోదీ ప్రసంశించారు. ముక్కలైన దేశాన్ని సర్దార్ వల్లభాయి పటేల్ ఏకం చేశారని మోదీ గుర్తు చేశారు. ప్రధాని ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ♦ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, గ్రామ కార్యదర్శి నుంచి ప్రధాని వరకు అందరూ తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి ♦ టెక్నాలజీతో జనజీవనంలో మార్పులు తేవాలి ♦ సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం ♦ ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత కోసమే ఆన్లైన్ విధానం ♦ ఒకటి, రెండు వారాల్లోనే పాస్‌పోర్ట్ పొందగలుగుతున్నాం ♦ ఒక్క నిమిషంలో 15 వేల టిక్కెట్లు ఇచ్చేలా రైల్వేను ఆధునీకరించాం ♦ నిరుపేదలకు రైలు ప్రయాణమే ఆధారం ♦ పారిశ్రామిక విధానాల్లో అనేక మార్పులు చేశాం ♦ ఎల్ఈడీ బల్బుల వినియోగంతో విద్యుత్ ఆదా ♦ వైద్య వ్యవస్థలో సమూల మార్పులు చేశాం ♦ జన్‌ధన్ యోజన పథకంతో 21 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ♦ రైతులకు నీళ్లిస్తే మట్టిలో బంగారం పండిస్తారు ♦ రెండేళ్లు కరువు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం -
స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాలి