'ఎన్టీఆర్ భావాలను గౌరవించండి'
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గురించి గొప్పగా మాట్లాడుతున్నారు గానీ.. కనీసం ఆయన భావాలను గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాజీ ఐఏఎస్ అధికారి శర్మ సూచించారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకుని నడిచే ప్రభుత్వ పాలన రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన అన్నారు. మద్యపానం, నాలుగు డిస్టిలరీ కంపెనీలకు అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ లేఖ రాసినట్లు శర్మ చెప్పారు.
జూన్ రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలంటూ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని, ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని తెలిపారు. అంతేతప్ప ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు.