exchange old notes
-
రూ.200, 2వేల నోట్లు.. కొత్త సమస్య
సాక్షి, ముంబై: పెద్ద నోట్లు రద్దు తరువాత దేశీయ బ్యాంకులను మరో కొత్త తలనొప్పి వేధిస్తోంది. డీమానిటైజేషన్ తరువాత చలామణిలోకి తీసుకొచ్చిన కరెన్సీ వ్యవహారంలోనే ఈ కొత్త చిక్కు. పాడైపోయిన, లేదా చిరిగిపోయిన 200, 2000 రూపాయల నోట్ల మార్పిడి బ్యాంకర్లకు తాజాగా పెద్ద సమస్యగా పరిణమించింది. దీనికి సంబంధించిన ఆర్బీఐ చట్ట నిబంధనలను త్వరితగతిన సవరించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బ్యాంకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజా కరెన్సీ నోట్లకు అనుగుణంగా ఆర్బీఐ ‘నోట్ రీఫండ్’ చట్ట నిబంధనల్లో కొత్తగా మార్పులు చేపట్టకపోవడంతో ఈ నోట్ల మార్పిడికి అవకాశం లేదు. దీంతో ఎక్స్చేంజ్ కౌంటర్లలో ఇలాంటి (పాడైపోయిన, మాసిన) నోట్లు పేరుకుపోతున్నాయి. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం రూ .5, రూ 10, రూ .50, రూ 100, రూ .500, 1,000, రూ .5,000, రూ. 10,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన 200 రూపాయలు, 2,000 నోట్లు ఈ జాబితాలో ఇంకా చేర్చలేదని, దీంతో సదరు నోట్ల మార్పిడి కష్టంగా మారిందని వివిధ బ్యాంకులు వాపోతున్నాయి. అయితే, ఈ చట్ట సవరణ అవసరంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే నివేదించామని ఆర్బీఐ చెబుతోంది. మరోవైపు చలామణిలో రూ.500, రూ.200, రూ.100 నోట్లు చాలినన్ని ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఇటీవల( ఏప్రిల్,17న) ప్రకటించారు. సుమారు రూ.7 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపి వేసిందని కూడా స్పష్టం చేశారు. కాగా 2016, నవంబర్ 8వ తేది రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం, వీటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2,000, 200 నోట్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ గేటుముందు అవాక్కయ్యే ఘటన
-
ఆర్బీఐ గేటుముందు అవాక్కయ్యే ఘటన
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు విషయం ఓ మహిళకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తన పాత నోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లు ఇవ్వనందుకు చుట్టుపక్కలవారు, ఆర్బీఐ అధికారులు అవాక్కయ్యేలా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అధికారుల తీరును నిరసిస్తూ ఆర్బీఐ గేటుముందే అందరూ చూస్తుండగా ఆ మహిళ తన బట్టలు విప్పేసి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని ఆర్బీఐ భవనం ముందు బుధవారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇళ్లల్లో పనిచేసి కాలం దీసుకుంటున్న ఆ మహిళ నాలుగేళ్ల పాపను తీసుకొని గత రెండు రోజులుగా ఆర్బీఐ వద్దకు వస్తోంది. ఆమె దగ్గరున్న రూ.నాలుగువేల పాత నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇవ్వాలంటూ కోరుతుంది. అయితే, బ్యాంకు అధికారులు మాత్రం నగదు మార్పిడి గడువు నవంబర్ 24తోనే ఆఖరు అని, మార్పిడి ఇప్పుడు సాధ్యం కాదంటూ ఆమెకు చెప్పారు. అయినప్పటికీ ఆమె అలాగే క్యూలో నిల్చొని తనకు డబ్బు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతోంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే, వారి నుంచి విడిపించుకున్న ఆమె అనంతరం ఆర్బీఐ గేటు ముందు నిల్చుని అక్కడ క్యూలో ఉన్న జనం, ఎదురుగా పోలీసులు, లోపల సెక్యూరిటీ గార్డులు చూస్తుండగానే తీవ్ర అసహనంతో తన బట్టలు మొత్తం విప్పేసింది. చివరికి ఆమెకు తిరిగి బట్టలు అందించి బ్యాంకు అధికారుల వద్దకు తీసుకెళ్లగా ఆమె వద్ద కనీసం గుర్తింపు కార్డు లేదు. పైగా ఆమె తీసుకొచ్చిన నోట్లు చిరిగిపోయి ఎలుకలు కొరికి ఉన్నాయి. దీంతో ఆమెకు డబ్బు ఇవ్వకుండా, కేసు పెట్టకుండా పోలీసులు విడిచిపెట్టారు. -
860 పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. గురువారం బ్యాంకుల నుంచి కొత్త కరెన్సీ చేరుకోవడంతో పోస్టాఫీసుల్లో మధ్యాహ్నం నుంచి మార్పిడికి అవకాశం కల్పించారు. హైదరాబాద్ జీపీవోతో పాటు ప్రధాన పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి కోసం ప్రత్యేకంగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. కొత్త కరెన్సీ అలస్యంగా రావడం, రూ.2,000 నోట్లను మాత్రమే జారీ చేయడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని సుమారు 860 పోస్టాఫీసుల్లో ఈ నెల 24 వరకు వరకు కరెన్సీ మార్పిడికి అవకాశం కల్పించినట్లు రాష్ట్ర తపాలా సేవల సంచాలకులు వెన్నం ఉపేందర్ తెలిపారు. మొత్తంమీద 35 హెడ్ పోస్టాఫీసులు, 825 సబ్ పోస్టాఫీసుల్లో పాత కరెన్సీ మార్పిడికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోస్టాఫీసుల్లో వినియోగదారులు నిర్ణీత నమూనా దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పాన్‌కార్డు, ప్రభుత్వరంగ సంస్థళు జారీ చేసిన ఐడీ కార్డుల్లో ఏదైనా ఒకదాని జిరాక్స్ జతచేసి, రోజుకు రూ.4 వేల వరకు పాత నోట్లు అందజేసి కొత్త కరెన్సీ డ్రా చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గల 5,832 పోస్టాఫీసుల్లో డిసెంబర్ 31 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్నారు.