exciting
-
ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది: రామ్‌గోపాల్ వర్మ
‘‘సగిలేటి కథ’ సినిమా ట్రైలర్ నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ‘ఏదో జరిగే..’ పాటని అందంగా తీశారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నటుడు నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఏదో జరిగే..’ వీడియో సాంగ్‌ని రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి వర్మగారే’’ అన్నారు దేవీప్రసాద్ బలివాడ. ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్ సుద్మూన్. ‘‘ఏదో జరిగే..’ పాట అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అశోక్ మిట్టపల్లి. సి స్పేస్ కో ఫౌండర్ పవన్ మాట్లాడారు. -
వైరస్‌లను భోంచేస్తుంది
వాషింగ్టన్: వైరస్లు. ఈ పేరంటేనే మనకు హడల్. కరోనా వంటి పలు రకాల వైరస్లు మనకే గాక ఇతర జీవ జాతులకూ ప్రాణాంతకాలు కూడా. అలాంటి వైరస్‌లనే లంచ్‌లోకి నమిలి మింగేసే ఒక వింత జీవి ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నీళ్లలో తమ పరిధిలో ఉన్న నానా రకాల క్లోరో వైరస్‌లనూ అదీ ఇదీ అని లేకుండా ఇది భారీ సంఖ్యలో తినేస్తుందట! ఈ సూక్ష్మ జీవిని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా–లింకన్స్ పరిశోధకులు తొలిసారిగా కనిపెట్టారు. దీన్ని స్వచ్ఛమైన నీటిని కలుషితం చేసే హాల్టేరియా అనే సూక్ష్మజీవుల్లో ఓ జాతికి చెందినదిగా గుర్తించారు. ఇది మరో భోజనంతో పని లేకుండా కేవలం వైరస్‌లను మాత్రమే తిని సుష్టుగా పెరుగుతుందని, తమ సంతతినీ వృద్ధి చేసుకుంటోందని వారి పరిశోధనల్లో తేలడం విశేషం. పరిశోధనలో భాగంగా ఓ మంచినీటి కొలను నుంచి నీటిని సేకరించారు. అందులోకి క్లోరో వైరస్‌లను వదిలారు. కొంతకాలానికి వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతుండటం వారిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో మరో రకం సూక్ష్మజీవులు పరిమాణంలో మామూలు కంటే ఏకంగా 15 రెట్లు పెరిగిపోతున్న వైనమూ కంటబడింది. వాటిని హాల్టేరియాగా గుర్తించారు. తినడానికి మరేమీ అందుబాటులో లేకపోవడంతో అవి హాయిగా క్లోరో వైరస్‌లనే తిని అరాయించుకుని అంతలా పెరిగాయట! ఈ పరిశోధన ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడెమీ సైన్సెస్’లో పబ్లిషైంది. దీని ఫలితాలు ఆహారచక్రం గురించిన మన అవగాహనను విప్లవాత్మకంగా మారుస్తాయని పరిశోధన బృందానికి చెందిన డాక్టర్ డిలాంగ్ అంటున్నారు. -
అందంగా ఉన్నానా!
అద్దం కనిపిస్తేచాలు చూసుకోవడం అందరికీ అలవాటు. అయితే పక్షులు కూడా అద్దం కనిపిస్తే ఓ లుక్ వేస్తున్నాయి. జహీరాబాద్‌లోని అతిథి గృహం వద్ద పార్కింగ్ చేసిన బైక్పైఓ టర్కీ కోడి అద్దం కనిపించగానే కొద్ది సేపు అలాగే ఉండిపోయింది. అద్దంలో తన ముఖం చూస్తూ తలను అటుఇటు తిప్పుతూ చూసింది. - జహీరాబాద్ టౌన్