exotic birds
-
జూబ్లీహిల్స్ పబ్‌లో పాములు, తొండలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పబ్ అంటే అందరికీ గుర్తొచ్చేది మ్యూజిక్, డ్యాన్స్, మందు.. వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులో యూత్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు కానీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని ఓ పబ్ వినూత్నంగా ఆలోచించింది. ఇవన్నీ రొటీన్ అనుకొని ఏకంగా జంతువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పాములు, తొండలు, కుక్కలు వంటి వైల్డ్ జంతువులను పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని క్సోరా (Xora) నైట్ క్లబ్ ఇటీవల తమ పబ్‌లో విదేశీ వన్యప్రాణులను చేర్చింది. ట్విట్టర్ ద్వారా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. క్సోరా నైట్‌క్లబ్ ఈ వారాంతంలో తమ పబ్‌లో అన్యదేశ వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారని. దీనికి సంబంధించిన ఫోటోలు వారి ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉన్నాయని, దయచేసి చర్యలు తీసుకోండంటూ ఆశిష్ అనే వ్యక్తి పోలీసులను కోరారు. Taking it up with @TelanganaDGP @CVAnandIPS @TelanganaCOPs and PCCF The audacity is shameful & shocking https://t.co/JADNkZLMAL — Arvind Kumar (@arvindkumar_ias) May 29, 2023 దీనిపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లబ్బుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రీట్వీట్ చేస్తూ.. ఇది సిగ్గుచేటు సంఘటన అని వర్ణించారు. దీనిని తెలంగాణ డీజీపీ,సీపీ సీవీ ఆనంద్, తెలంగాణ పోలీస్, పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు జూబ్లీహిల్స్ పోలీసులు సమాచారం అందజేశారు. కాగా నెల క్రితం కూడా సైబరాబాద్‌లోనూ ఇదే రీతిలో పబ్ లో జంతువులను ప్రదర్శనకు పెట్టారు నిర్వాహకులు. పాత బస్తీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి జంతువులను తీసుకొచ్చినట్టు నిర్వహకులు చెబుతున్నారు. అయితే పబ్‌లో జంతువులను ప్రదర్శించడంపై క్సోరా నైట్ క్లబ్ నిర్వాహకులు స్పందించారు. పబ్‌లో ఉపయోగిస్తున్న ఎక్సోటిక్ అనిమల్స్ లైసెన్స్‌తో పాటు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపింది. సదరు జంతువుల వల్ల ఏ హాని ఉండదని పేర్కొంది. చదవండి: Aksha: ఆరేళ్ల క్రితం విడిపోయిన అమ్మానాన్నలను ఒక్కటి చేసిన చిన్నారి! Here's video footage of the wildlife on display from the Instagram page of Xora Bar & Kitchen, Jubilee Hills Rd#36 @cyberabadpolice. pic.twitter.com/XF56uI1keh — Ashish Chowdhury (@ash_chowder) May 29, 2023 Lol okay. pic.twitter.com/TdRQByEQQU — Ashish Chowdhury (@ash_chowder) May 30, 2023 -
పెట్స్.. అదో స్టేటస్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల స్టేటస్ సింబల్ మారింది. లగ్జరీ వాహనాలు, హై ఎండ్ గృహాలు, విదేశీ ఫర్నీచర్, లైఫ్ స్టయిల్ జాబితాలో విదేశీ పెంపుడు జంతువులు కూడా చేరిపోయాయి. సినీ ప్రముఖులు, బడా వ్యాపారులు తమ వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్‌లు, లగ్జరీ విల్లాలలో విదేశీ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. తాజాగా క్యాసినోవాలా చికోటి ప్రవీణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎగ్జోటిక్ పెట్స్‌ను అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. విదేశాల్లోని అడవి జాతి పెంపుడు జంతువులను ఎగ్జోటిక్ పెట్స్ అంటారు. మన దేశంలో వీటి రవాణా వైల్డ్‌లైఫ్ యాక్ట్–1972 ప్రకారం చట్ట వ్యతిరేకం. అమెరికా, ఆ్రస్టేలియా, మెక్సికో వంటి విదేశాల నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకొని, విక్రయిస్తుంటారు. ఇటీవల కోల్కత్తా నుంచి హైదరాబాద్‌కు కంగారులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వెస్ట్ బెంగాల్‌లోని కుమార్గ్రామ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో అధిక డిమాండే అక్రమ రవాణాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇండియన్ బ్రీడ్ ఎగ్జోటిక్ పెట్స్ పెంపకానికి మన దేశంలో అనుమతి ఉంది. కానీ, ఆయా జంతువులను అటవీ శాఖ వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఈ తరహా వన్యప్రాణులు 150–200 రకాలుంటాయని అంచనా. నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు.. ప్రస్తుతం నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు ఉంటాయని బహుదూర్‌పల్లిలోని జూ అధికారి ఒకరు తెలిపారు. చేవెళ్ల, శంకర్పల్లి, కందుకూరు, శామీర్‌పేట, భువనగిరి వంటి పలు ప్రాంతాలలోని విశాలమైన ఫామ్ హౌస్‌లు, వ్యవసాయ క్షేత్రాలలో చిన్న పాటి జూలను ఏర్పాటు చేసి, వీటిని పెంచుతున్నారు. అలాగే పలువురు బడా డెవలపర్లు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో పెట్ పార్క్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. క్యాసినో వాలాగా పేరొందిన చికోటి ప్రవీణ్‌కు కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొండచిలువలు, ఊసరవెల్లి, మకావ్ చిలుకల వంటి వన్యప్రాణులున్నట్లు అధికారులు గుర్తించారు. అధ్యయనం చేశాకే పెంపకం.. ఎగ్జోటిక్ పెట్స్ జీవన విధానంపై అవగాహన ఉంటేనే పెంచుకోవాలి. లేకపోతే స్వల్పకాలంలోనే అనారోగ్యం పాలై చనిపోతాయని కూకట్‌పల్లిలోని ఎగ్జోటిక్ పెట్ విక్రయదారుడు, వెటర్నరీ స్టూడెంట్ యుగేష్ తెలిపారు. అవి ఏ జాతికి చెందినవి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, వాటి ఆహారం, వాటికి వచ్చే రోగాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. సల్కాటా, ఆల్డాబ్రా టార్టాయిస్: ప్రారంభ ధర రూ.2.5 లక్షలు. ఇగ్వానా: ఆకుపచ్చ, నీలం, పసుపు రంగుల ఇగ్వానాల ప్రారంభ ధర రూ.15 వేలు. స్నో, థానోస్ రంగులవైతే రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటాయి. బాల్ పైథాన్: వీటిని రాయల్ పైథాన్స్ అని కూడా పిలుస్తారు. ధర రూ.35–40 వేలు. డెడ్ బియర్డ్ డ్రాగన్: తెల్ల గడ్డంలాగా ఉంటాయి. వీటిని వెనక్కి తిప్పినా ఎలాంటి చలనం ఉండదు. వీటి స్పర్శ చల్లగా, గట్టిగా ఉంటుంది. తెలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లోని డ్రాగన్స్ ప్రారంభ ధర రూ.80 వేలు. కార్న్ స్నేక్: నార్త్ అమెరికాకు చెందిన ఈ కార్న్ స్నేక్స్ విషపూరితం కావు. జన్యురకం, రంగులను బట్టి వీటి ధరలు రూ.25–35 వేల మధ్య ఉంటాయి. మార్మోసెట్ కోతులు: సౌత్ అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు చెందిన ఈ కోతులు ఆలివ్ గ్రీన్, గోధుమ రంగుల్లో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5 లక్షలు.. మీర్కట్: దక్షిణాఫ్రికాకు చెందిన మీర్కట్స్ గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.1.5 లక్షలు. రామచిలుకలు: బ్లాక్పామ్ కాకాటూ, విక్టోరియా క్రౌన్, గోల్డెన్ కోనూర్, అమెరికన్ క్రౌ వంటి రంగురంగుల రామచిలుకలు ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 30 వేలు. యార్కి టెర్రియర్ డాగ్: అచ్చం బొమ్మలాగా నలుపు, గోధుమ రంగులలో ఈ కుక్క వీటి ప్రారంభ ధర రూ.85 వేలు. జోలో అనే రకం కుక్కలకు శరీరంపై వెంట్రుకలు ఉండకపోవటం వీటి స్పెషాలిటీ. గ్రే కలర్లో వీటి ధర రూ.లక్ష. (చదవండి: ‘ఫీజు’ లేట్.. మారని ఫేట్!) -
అటపాకలో విహంగ సోయగం
కైకలూరు: అరకేజీ బరువున్న చేపను అమాంతంగా మింగేసే పక్షిని మీరెప్పుడైనా చూశారా? వివిధ రంగుల కలబోత పక్షి ఉన్నట్లు మీకు తెలుసా.. చేపలను చిన్న చిన్న ముక్కలు చేసి పిల్లల నోటిలో పెట్టి మాతృత్వ ఆనందాన్ని పొందే అతిథి గురించి విన్నారా.. సహజత్వం ఉట్టిపడే పక్షుల బొమ్మలు, ముట్టుకుంటే మధురంగా వినిపించే ధ్వనులు ఇలా ఒకటేంటి అటపాక పక్షుల కేంద్రంలో.. ప్రతి దృశ్యాన్ని కనులారా చూసి ఆస్వాదించాల్సిందే. పెలికాన్ ప్యారడైజ్.. రాష్ట్రంలో పెలికాన్ ప్యారడైజ్‌గా పేరుపొందిన అటపాక పక్షుల విహార కేంద్రానికి శీతాకాలపు వలస విదేశీ పక్షుల రాక ఊపందుకుంది. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ప్రకృతి తన సహజసిద్ధ వాతావరణాన్ని సంతరించుకోవడంతో.. 188 రకాల విదేశీ అతిథి పక్షులకు ఆవాసంగా మారి ప్రకృతి ప్రేమికులను పులకరింపజేస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మైళ్ల దూరాన్ని ఛేదించి పక్షులు కొల్లేరుకు చేరుకుంటున్నాయి. ఇకపోతే.. అటపాక పక్షుల కేం ద్రం వద్దకు వచ్చిన పర్యాటకుల పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఊయల వం టివి రారమ్మని పిలుస్తుంటాయి. మ్యూజియంలో ఏర్పాటు చేసిన పక్షుల నమూనా బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి. కొల్లేరులో బోటుపై వెళుతూ పక్షులను దగ్గర నుంచి చూడడం జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టంగా నిలిచిపోతుంది. ఆలనా..పాలనా అటవీశాఖదే.. అటపాక పక్షుల కేంద్ర నిర్వహణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ పక్షుల విహారానికి అనువుగా 280 ఎకరాల చెరువు ఉంది. అందులో 162 స్టాండ్లు ఉన్నాయి. వీటిపై పెలికాన్, పెయింటెడ్ స్టా్కక్, వైట్ ఐబీస్, కార్బొనెంట్ పక్షులు కొలువుదీరాయి. ఇప్పటికే పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి చేశాయి. పక్షుల పిల్లల వయసు నెల రోజులు దాటింది. వాటి కేరింతలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బోటు షికారుకు రెండు బోట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు. -
Kolleru Lake: పక్షుల ‘కొంప కొల్లేరు’
చుట్టూ కిక్కిస పొదలు.. వాటి నడుమ అందమైన జలదారులు.. ఏదో అత్యవసర పని ఉన్నట్టు నీటి అడుగున అటూ ఇటూ రయ్యిన పరుగులు తీసే పిల్ల చేపలు.. ఎటు చూసినా ఒంటి కాలి జపం చేసే కొంగలు.. దూరతీరాల నుంచి వలస వచ్చే అతిథి విహంగాల విడిదులు.. కిలకిల రావాలు ఆలపించే బుల్లి పక్షులు. కొల్లేరు సరస్సు వైపు తొంగి చూస్తే.. ఇలాంటి రమణీయ దృశ్యాలెన్నో కనువిందు చేసేవి. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా కానరావడం లేదు. ఆకివీడు (పశ్చిమ గోదావరి): స్వదేశీ పక్షులతోపాటు విదేశీ పక్షి జాతులకు ఆలవాలమైన కొల్లేరు సరస్సులో వాటి సందడి తగ్గిపోతోంది. పశ్చిమ గోదావరి, కృష్ణా డెల్టాల నడుమ విస్తరించి ఉన్న కొల్లేరుపై ఆధారపడి 30 ఏళ్ల క్రితం వరకు 2 కోట్ల పక్షులు మనుగడ సాగించేవి. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా తగ్గిపోతోంది. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొల్లేరులో పక్షిజాతి గణాంకాలను అభయారణ్య శాఖ సేకరించింది. ఆ మూడు నెలల్లో 3.05 లక్షల పక్షులు విహరించినట్టు అంచనా వేసింది. సహజంగా శీతాకాలంలో కొన్ని రకాల విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి విడిది చేస్తుంటాయి. ఈ ఏడాది ఆ పక్షుల రాక కూడా తగ్గింది. సరస్సులో ప్రస్తుతం సుమారు 1.20 లక్షల మేర పక్షులు మాత్రమే సంచరిస్తున్నాయని అభయారణ్య శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. అంటే రెండు నెలల వ్యవధిలో వాటి సంఖ్య 60 శాతం మేర తగ్గిపోయినట్టు అంచనా వేశారు. ఆక్రమణలు, కాలుష్యమే కాటేస్తున్నాయి వేసవిలో సహజంగానే కొల్లేరులో సంచరించే పక్షుల సంఖ్య తగ్గుతుంది. కానీ.. శీతాకాలంలోనూ వాటి సంఖ్య విపరీతంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సరస్సులో ఆక్రమణలు, కాలుష్యమే కారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. మరోవైపు విదేశీ పక్షులు సరస్సులో విడిది చేసే రోజులు సైతం తగ్గిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. గతంలో వలస పక్షులు 120 నుంచి 150 రోజుల వరకు ఇక్కడ విడిది చేసేవి. ప్రస్తుతం వాటి విడిది రోజులు సగటున 60 రోజులకు పడిపోయింది. సరస్సులో వాటి సహజసిద్ధ మనుగడకు అవకాశాలు లేకపోవడం, పక్షుల ఆవాసాలు తగ్గిపోవడమే దీనికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. గత ప్రభుత్వాలు కొల్లేరు పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సరస్సు కుంచించుకుపోయిందని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడి పక్షుల సంఖ్య విషయంలో అటవీ శాఖ చెబుతున్న గణాంకాలకు, వాస్తవ గణాంకాలకు చాలా వ్యత్యాసం ఉంటోందని పేర్కొంటున్నారు. సరస్సును, దీనిపై ఆధారపడిన పక్షి జాతులను కాపాడటం ద్వారా ఇక్కడి జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఆటపాకలోని పక్షుల కేంద్రం ఈ చర్యలు చేపడితే మేలు కొల్లేటి సరస్సులో పక్షుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన చర్యలపై పర్యావరణ వేత్తలు చేస్తున్న సూచనలు ఇలా ఉన్నాయి. ► కొల్లేరు ప్రక్షాళన అనంతరం సరస్సు అభివృద్ధి జరగలేదు. సరస్సులో మేటవేసిన పూడికను, పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలి. ► సరస్సులో ఆక్రమణల్ని తొలగించాలి. నీటిమట్టాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ► సరస్సు వెంబడి పలు ప్రాంతాల్లో పక్షుల ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సహజ సిద్ధ ఆవాసాలు పెరిగేలా చూడాలి. చిత్తడి నేలల్లో పెరిగే వృక్ష జాతిని అభివృద్ధి చేయాలి. ► పక్షుల వేట నిషేధాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలి. నామమాత్రంగా ఉన్న చెక్‌పోస్టులను పటిష్టపరచాలి. ► స్థానిక గార్డులను బదిలీ చేసి, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని గార్డులుగా నియమించాలి. కారు చీకట్లో కాంతి పుంజం కొల్లేరులో సంచరించే పక్షి జాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో కారు చీకట్లో కాంతి పుంజంలా ఇటీవల నాలుగు రకాల కొత్త పక్షులు ఇక్కడ సంచరిస్తున్నట్టు అభయారణ్య అధికారులు గుర్తించారు. వీటిలో సీగల్ (బ్రౌన్ హెడ్), ఎల్లో లాఫింగ్ (తీతు పిట్ట జాతి), స్నైఫ్ (మగ ఉల్లంగి పిట్ట), స్పాటెడ్ రెడ్ షాంక్ (ఉల్లంగి పిట్ట జాతి) పక్షులు ఉన్నాయని వెల్లడించారు. కొల్లేరు స్వరూపం ఇదీ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 250 నుంచి 340 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. దీని సరాసరి లోతు 0.5 నుంచి 2 మీటర్ల వరకు ఉంటుంది. ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సు ఇది. 2,22,600 ఎకరాల్లో చేపల చెరువులు విస్తరించి ఉండగా.. 1,66,000 ఎకరాలు అభయారణ్యం (వైల్డ్ లైఫ్ శాంక్చురి) పరిధిలో ఉంది. ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలమైన ఈ సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలస వచ్చే పక్షుల్లో అతి ముఖ్యమైనవి పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుంచి కూడా ఇక్కడకు పక్షులు వలస వస్తూ ఉంటాయి. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వాగులతోపాటు డెల్టా ప్రాంతం నుంచి వచ్చే 67 మేజర్, మైనర్ కాలువలు ఈ సరస్సులోకి నీటిని చేరుస్తున్నాయి. కొల్లేరులోని ముంపు నీరు 62 కిలోమీటర్ల పొడవైన ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలోకి చేరుతుంది. ఈ సరస్సును 1999 నవంబర్‌లో అభయారణ్య ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొల్లేరు సరస్సుకు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోటలో ప్రసిద్ధ పెద్దింట్లమ్మ సమేత జలదుర్గ అమ్మవారి ఆలయం ఉంది. శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయంలో 9 అడుగుల పైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని కొలిచేందుకు ఒడిశా, అసోం, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. పక్షి జాతులు తగ్గాయి కొల్లేరు సరస్సులో విహరించే, విడిది చేసే పక్షుల జాతులు బాగా తగ్గిపోయాయి. పక్షి సంతతి వృద్ధి కూడా భారీగా క్షీణించింది. ఇక్కడి పక్షుల సంఖ్య విషయంలో అటవీ శాఖ చెబుతున్న లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేదు. ప్రస్తుతం కొల్లేరులో పక్షుల సంఖ్య లక్షల్లో కాదు వేలల్లో మాత్రమే ఉంది. ఆక్రమణలు, వేటగాళ్ల వల్ల పక్షుల సంచారానికి త్రీవ విఘాతం కలుగుతోంది. దీనిపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. పక్షుల వృద్ధికి కచ్చితమైన చర్యలు చేపట్టాలి. – పతంజలి శాస్త్రి, పర్యావరణవేత్త కొల్లేరు పక్షుల్ని రక్షించాలి కొల్లేరులో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. చేలు, చెరువుల నుంచి వచ్చే రసాయనాలతో కూడిన నీరు కొల్లేరులో పక్షి జాతి పాలిట మృత్యుపాశంగా మారింది. పక్షుల వేటను పకడ్బందీగా నిర్మూలించాలి. సరస్సులో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్కను తొలగించాలి. దీనివల్ల పక్షులకు ఆహారం తగ్గిపోయింది. పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. – భూపతిరాజు చిదానంద మూర్తిరాజు, భారతీయ కిసాన్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, సిద్ధాపురం, ఆకివీడు మండలం పక్షి జాతుల వృద్ధికి చర్యలు కొల్లేరు సరస్సులో పక్షి జాతుల వృద్ధికి చర్యలు చేపట్టాం. నాలుగైదు రకాల కొత్త పక్షులు కొల్లేరు సరస్సులోకి వచ్చాయి. సరస్సులో గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు చేస్తున్నారు. వేసవి కావడంతో పక్షుల విహారం తగ్గింది. ఆటపాకలోని పక్షుల ఆవాస కేంద్రంలో స్టాండుల సంఖ్య పెంచాం. వచ్చే ఏడాదికి మరిన్ని వసతులు కల్పించే ప్రతిపాదనలున్నాయి. – ఎస్ఎన్ శివకుమార్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (అభయారణ్యం), ఏలూరు -
విహంగాల విడిది.. విజయవాడ
సాక్షి, అమరావతి బ్యూరో: వివిధ రకాల పక్షులకు బెజవాడ ప్రాంతం చిరునామాగా మారింది. విదేశీ పక్షులు సైతం విజయవాడకు వచ్చి సేద తీరుతున్నాయి. వేలాది కిలోమీటర్ల దూరంలోని శీతల దేశాల నుంచి సైతం అతిథి పక్షులు వలస వచ్చి ఇక్కడ బస చేస్తున్నాయి. తాత్కాలిక ఆవాసాల్ని నిర్మించుకుని కొంతకాలం పాటు ఇక్కడే ఉండి ఆ తర్వాత స్వస్థలాలకు పయనమవుతున్నాయి. శీతాకాలంలోనే అనేక పక్షులు ఇక్కడ విడిది చేస్తున్న విషయాన్ని విజయవాడ నేచర్ క్లబ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తొలిసారిగా వీటి గణనకు కసరత్తు మొదలు పెట్టారు. విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 20 చిత్తడి నేలలతో ఉన్న చెరువులు ఈ పక్షులకు ఆవాసాలుగా మారినట్టు ప్రాథమికంగా కనుగొన్నారు. వీటిలో విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు, జి.కొండూరు మండలం వెలగలేరు, గన్నవరం మండలం కొండపావులూరు, బ్రహ్మలింగయ్య చెరువు, కవులూరు (జి.కొండూరు), పెనమలూరు మండలం ఈడ్పుగల్లు చెరువులతో పాటు నున్న బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న చెరువుల్లో ఈ పక్షులు శీతల విడిది చేస్తున్నాయని గుర్తించారు. 120 జాతుల పక్షులు.. 6 విదేశీ పక్షి జాతులు విజయవాడ, పరిసర ప్రాంతాల్లో సుమారు 120 జాతుల పక్షులు ఉంటున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీటిలో విదేశాలకు చెందిన ఆరు పక్షి జాతులున్నట్టు కనుగొన్నారు. వీటిలో సిట్రిన్ బర్డ్, వైట్ వాగ్ టైల్, ఉడ్ శాండ్‌పైపర్, నార్త్రన్ పింటైల్, బ్లిత్స్ రీడ్ వార్బర్ వంటి పక్షులను ఇదివరకే గుర్తించారు. ఇప్పుడు కొత్తగా ఏయే పక్షులు వస్తున్నాయన్న దానిపై గణన చేయనున్నారు. ఇక్కడకు ఎందుకొస్తాయంటే.. యూరప్, సెంట్రల్ ఆసియా దేశాలు, ఉత్తరార్థ గోళం నుంచి వలస పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. అక్కడ శీతాకాలంలో మంచు పేరుకుపోయి ఈ పక్షులకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అవి అక్కడ కంటే ఒకింత ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే చిత్తడి నేల ప్రాంతాలను వెతుక్కుంటాయి. అలా అవి ఏటా ఒకసారి వచ్చిన ప్రాంతానికే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. చిత్తడి నేలల్లో దొరికే పురుగులు, కీటకాలు, చేపలు, కప్పలు, ధాన్యం గింజలు వంటి వాటిని ఆహారంగా తింటాయి. డిసెంబర్ నుంచి వలసలు మొదలవుతాయి. దాదాపు మూడు నెలలు అంటే వేసవి ఆరంభానికి ముందు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత తమ స్వస్థలాలకు పయనమవుతాయి. ఆధిపత్య పోరు ఉండదు విచిత్రమేమిటంటే.. విదేశాల నుంచి వచ్చే పక్షులకు ఇక్కడి పక్షులు ఆతిథ్యమిస్తాయి తప్ప లోకల్, నాన్ లోకల్ అన్న భేదాలు చూపవు. వాటిపై స్వదేశీ పక్షుల ఆధిపత్యమూ ఉండదు. ఇక్కడ ఉన్నన్ని రోజులూ విదేశీ విహంగాలకు ఎలాంటి హానీ తలపెట్టవు. పది గ్రాముల పక్షి వలస వచ్చే విదేశీ పక్షుల్లో బ్లిత్స్ రీడ్ వార్బర్ పక్షికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పక్షి బరువు కేవలం పది గ్రాములే. ఇవి తూర్పు యూరప్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాల్లో ఉంటాయి. విజయవాడకు వచ్చే పక్షుల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి రోజుకు 12 నుంచి 14 గ్రాముల ఆహారాన్ని తింటాయి. ఇవి గొంగళి పురుగులనే ఎక్కువగా ఆరగిస్తాయని ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్ రాజశేఖర్ బండి ‘సాక్షి’కి తెలిపారు. గణన మొదలు పెట్టాం.. విజయవాడ పరిసరాల్లోని చెరువుల్లోకి ఏటా శీతాకాలంలో వచ్చే విదేశీ పక్షుల (వింటర్ వాటర్ బర్డ్స్) గణనను చేపట్టాం. ఇలాంటి పక్షుల గణన ఇదే తొలిసారి. ఇక్కడ సుమారు 20 చిత్తడి నేలల్లోకి 120 జాతుల పక్షులు వస్తున్నాయి. వీటిలో కొత్తగా ఆరు రకాల విదేశీ జాతుల పక్షులు వస్తున్నట్టు ఇప్పటికే గుర్తించాం. ఇంకా కొత్త పక్షులు వచ్చే అవకాశం ఉంది. రానున్న రెండు నెలలు ఈ గణనను కొనసాగిస్తాం. – డి.రాజేష్‌వర్మ, వ్యవస్థాపక సభ్యుడు, విజయవాడ నేచర్ క్లబ్ -
వేటగాడి చేతికి చిక్కి..
► ఎక్కడ నుంచో వలస వచ్చి ఇక్కడ ►ప్రాణాలు కోల్పోతున్న విదేశీ పక్షులు ► అతిథి విహంగాలకు కనీస రక్షణ ►కరువవుతున్న వైనం కాశీబుగ్గ : ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన విదేశీ విహంగాలు వేటగాళ్లకు బలైపోతున్నా రుు. అతిథి విహంగాల విషయంలో కొన్ని ప్రాంతాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే పలాస-కాశీబుగ్గలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్ర దర్శిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంతరకుడ్డ చెరువులో సైబీరియా దేశానికి చెం దిన విదేశీ పక్షులు (రత్తకన్న) వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారుు. విచక్షణారహితంగా వాటి ని చంపి సంచుల్లో వేసుకుని దర్జాగా వెళ్లిపోతున్నా అడిగే వారు లేకపోయారు. చెరువుల్లో పంటపొలాల్లో మాటువేసి దొరికిన గువ్వపిట్టను పాదంతో తొక్కిపట్టి చంపుతున్న వైన సా క్షి కెమేరాకు చిక్కింది. దీన్ని చూసిన స్థానికులు చింతాడ మాధవరావు, పైల చిట్టి, ప్రతాప్‌కుమార్‌లు పక్షిని పరిశీలించి వారిని మందలిం చారు. వారంతా దీన్ని రత్తకన్న పక్షిగా గుర్తిం చారు. అప్పటికే వేటగాళ్లు నాలుగు గువ్వపిట్టల పీక నులిపి చంపారు. టెక్కలి మండలం తేలి నీలాపురం ప్రసిద్ధ విదేశీపక్షులు కేంద్రం నుంచి ఆహారం కోసం సముద్ర తీరం గుండా కొన్ని వివిధ ప్రాంతాలకు వస్తుంటారుు. ఇప్పుడిప్పుడే పలాస, పూండి వంటి ప్రాంతాలకు చల్లని వాతావరణం కోసం వలస వస్తున్నారుు. ఈ పరిస్థితి గమనించిన వేటగాళ్లు వీటిని వేటాడి చంపేస్తున్నారు. వీరు పలాసలోనే నివాసముం టున్నట్లు సమాచారం. పూర్తిగా తుప్పు పట్టిన, గుర్తింపులేని ద్విచక్రవాహనాలను నడుపుతున్నారు. పక్షుల వేటనే వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న ఈ కుటుంబాలు ప్రతి నెలరోజులకు ప్రాంతాలు మారుతుంటారు. ఇకనైనా అధికారులు స్పందించి పక్షులను కాపాడాలని, పక్షిజాతిని కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు. -
ప్రకృతి పరవశం