Export sector
-
ఎగుమతుల వృద్ధికి రంగాల వారీ ప్రాధాన్యత
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి రంగాల వారీ వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్– బెంగళూరు (ఐఐపీఎంబీ)డైరెక్టర్ రాకేష్ మోహన్ జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇతర హైటెక్ పరిశ్రమల కోసం ఈ తరహా వ్యూహం అవసరమని పేర్కొన్నారు. భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతుల లక్ష్యాన్ని చేరడానికి ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు వార్షిక వృద్ధి రేటు 14.5 శాతంగా నమోదుకావాలనీ అంచనావేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► పాలిష్ చేసిన వజ్రాలు, ఆభరణాలు, ప్యాసింజర్ కార్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు వంటి రంగాలు ఎగుమతుల భారీ పెరుగుదలలో దోహదపడతాయి. ► దేశాల పరంగా చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), హాంకాంగ్, జర్మనీ, వియత్నాం, బ్రిటన్, ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఇటలీ, థాయ్‌లాండ్, టర్కీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, బెల్జియంలకు మన ఎగుమతులను పెంచుకోడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ► ఎగుమతిదారులు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమాచార, సమన్వయ అంతరాన్ని తగ్గించడం ప్రస్తుతం అవసరం. రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించడం, సమీకరించడం, ప్రాసెసింగ్ చేయడం, సంబంధిత వ్యక్తులకు ఆ సమాచారాన్ని సకాలంలో అందేలా చేయడం, ఆధునిక సాంకేతికతను అవలంబించడం చాలా ముఖ్యమైన అంశాలు. ► అమెరికా, యూరోపియన్ యూనియన్ తదితర అభివృద్ధి చెందిన దేశాలలో సెమీకండక్టర్ తయారీని సులభతరం చేయడానికి చిప్స్ చట్టం వంటి రక్షణవాద విధానాల పునరుద్ధరణను భారతదేశం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ► పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ► వ్యవసాయం, తోటల పెంపకం, ఉద్యానవన అనుబంధ రంగాల పురోగతికి ఐఐపీఎంబీ కీలక సహకారాన్ని అందిస్తోంది. విద్య, ఎగుమతులు, సామర్థ్యం పెంపుదల, శిక్షణ, విధాన పరిశోధన, అభివృద్ధి వంటి వివిధ కోణాల్లో పురోగతికి వ్యూహాలు రూపొందిస్తుంది. -
‘రాడ్‌టెప్’కు మరిన్ని నిధులు కేటాయించాలి
ఎగుమతిరంగం 2022–23 బడ్జెట్లో తమకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతోంది. రీయింబర్స్మెంట్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్ (రాడ్‌టెప్) పథకానికి కేటాయింపులు పెంచాలని కోరింది. ప్లాస్టిక్ తుది ఉత్పత్తుల దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు సుంకాలు పెంచాలని.. దేశీ తోలు పరిశ్రమకు ప్రోత్సాహకంగా ముడి సరుకుల దిగుమతులకు సుంకాల మినహాయింపు కావాలని డిమాండ్ చేసింది. లాజిస్టిక్స్ సవాళ్లను పరిష్కరించేందుకు ద్రవ్యపరమైన ప్రోత్సాహకాల అవసరాన్ని తెలియజేసింది. ఎంఎంస్ఎంఈలకు ప్రోత్సాహకంగా పార్ట్నర్షిప్ సంస్థలు, ఎల్ఎల్పీలపై పన్నును తగ్గించాలని బడ్జెట్ ప్రతిపాదనల కింద కేంద్ర ఆర్థిక శాఖకు భారతీయ ఎగుమతి దారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) సూచించింది. భారత్ కోసం ప్రత్యేకంగా షిప్పింగ్ లైన్‌ను ఏర్పాటు చేసేలా పెద్ద సంస్థలను ప్రోత్సహించాలని, అప్పుడు విదేశీ సంస్థలపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది. రవాణా వ్యయ భారం ‘‘ఎగుమతుల రంగం పెరిగిపోయిన రవాణా వ్యయాల రూపంలో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. విదేశీ మార్కెటింగ్ అన్నది పెద్ద సవాలుగా మారింది. ఎంఎస్ఎంఈలకు ఈ వ్యయ భారం మరితంగా ఉంటుంది. ఎగుమతిదారుల కోసం ద్వంద్వ పన్ను మినహాయింపు పథకం తీసుకురావాలి. కాకపోతే రూ.5 లక్షల వరకు పరిమితి ఇందులో విధించొచ్చు’’అని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్‌సహాయ్ తెలిపారు. ఎగుమతి మార్కెట్‌కు రాడ్‌టెప్ పథకం కీలకమైనదని, దీనికింద ప్రస్తుతం కేటాయింపులు రూ.40,000 కోట్లుగానే ఉన్నట్టు ముంబైకి చెందిన ఎగుమతిదారు, టెక్నో క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ శారదా కుమార్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈ వాస్తవాన్ని గుర్తించి మరిన్ని కేటాయింపులు చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తులపై (ఫినిష్డ్ గూడ్స్) కనీసం 5 శాతం సుంకాన్ని విధించాలని ప్లాస్టిక్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి చైర్మన్ అరవింద్ గోయెంకా అభిప్రాయపడ్డారు. ‘‘ఉదాహరణకు పీవీసీ రెజిన్‌పై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. వ్యాల్యూ యాడెడ్ పీవీసీ ఉత్పత్తులపైనా ఇంతే మేర సుంకం అమల్లో ఉంది’’ అని వివరించారు. తోలు రంగానికి చేయూత.. తోలు వస్త్రాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల దిగుమతులపై పన్ను మినహాయింపును తిరిగి ప్రవేశపెట్టాలని కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ (సీఎల్ఈ) చైర్మన్ సంజయ్‌లీఖ డిమాండ్ చేశారు. దీంతో ముడిసరుకుల ఆధారితంగా ఉత్పత్తులు దేశీయంగానే తయారయ్యే అవకాశాన్ని ఏర్పాటు కల్పించినట్టు అవుతుందన్నారు. ఫరీదా గ్రూపు చైర్మన్ రఫీఖ్ అహ్మద్ కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేవారు. కార్మిక ఆధారిత తోలు రంగానికి ప్రోత్సాహంతో మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు. -
ఎగుమతుల వృద్ధే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవం-2021
-
వాణిజ్య ఉత్సవం-2021: ఎగుమతి దారులకు ప్రోత్సహాలు
-
వాణిజ్య ఉత్సవం-2021: అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఎగుమతుల శాతం వృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర పోషించిన పలువురు వ్యాపారవేత్తలకు ఇండస్ట్రి చాంపియన్, ఎక్స్పోర్ట్ చాంపియన్ పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవార్డులు ప్రదానం చేశారు. ఇండస్ట్రి చాంపియన్ అవార్డ్.... పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి(ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సియాంట్ ), కాప్ డాంగ్లి (చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) అనిల్ చలమశెట్టి (మేనేజింగ్ డైరెక్టర్, గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్) అవినాశ్ చాంద్రయ్,(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదాని కృష్ణపట్నం పోర్టు), జీజే రావు(డైరెక్టర్, అదాని కృష్ణపట్నం పోర్టు) ఈశాన్ రెడ్డి ఆళ్ల (ప్రమోటెడ్ డైరెక్టర్, రాంకీ గ్రూప్) సీవీ రాజులు(వైస్ ప్రెసిడెంట్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్) కే మదన్‌మోహనరెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అరబిందో ఫార్మ లిమిటెడ్) ఎక్స్పోర్ట్ చాంపియన్ అవార్డు... సి. శర్వానంద్ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ ప్రైవేట్ లిమిటెడ్) లీ ఈ సీ (జనరల్ మూనేజర్, అపాచి ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బీవీ కృష్ణారావు (మేనేజింగ్ డైరెక్టర్, పట్టాభి అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్) వంక రాజకుమారి(మేనేజింగ్ డైరెక్టర్, ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్) పాండవ ప్రసాద్ (జనరల్ మేనేజర్, ఎస్ఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) సింగలూరి శారదా దేవి (పార్టనర్, ఆర్వీ కాప్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎగుమతులు పడ్డాయ్!
* జనవరిలో 11 శాతం క్షీణత * దిగుమతులదీ ఇదీ పరిస్థితి * వాణిజ్యలోటు 8.32 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2015 జనవరిలో నిరుత్సాహం కలిగించాయి. 2014 ఇదే నెలతో పోల్చితే విలువలో అసలు వృద్ధి లేకపోగా 11.19 శాతం తగ్గిపోయాయి (క్షీణత). 2015 జనవరిలో ఎగుమతుల విలువ 23.88 బిలియన్ డాలర్లు. 2014 ఇదే నెలలో ఈ పరిమాణం 26.89 బిలియన్ డాలర్లు. ఇంత తక్కువ స్థాయికి ఎగుమతుల రేటు పడిపోవడం రెండున్నర సంవత్సరాల కాలంలో (2012 జూలైలో 14.8 శాతం) ఇదే తొలిసారి. ఇక దిగుమతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. 11.39 శాతం క్షీణించి 32.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల పడిపోవడం వరుసగా ఇది రెండవనెల. దీనితో ఎగుమతులు-దిగుమతులు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 8.32 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు గడచిన తొమ్మిది నెలల్లో మొదటిసారి ఇంత తక్కువ స్థాయిని నమోదుచేసుకుంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విలువ తగ్గడం దీనికి (తక్కువ స్థాయి వాణిజ్యలోటు) ప్రధాన కారణం. చమురు దిగుమతుల బిల్లు 37.46 శాతం పడిపోయి కేవలం 8.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. నిరాశలో కీలక రంగాలు కాటన్ యార్న్ (- 9.15 శాతం), రసాయనాలు(-10.52), ఫార్మా(-0.16 శాతం), రత్నాలు, ఆభరణాల (-3.73 శాతం) రంగాల నుంచి ఎగుమతులు భారీగా లేకపోవడం మొత్తం ఈ విభాగంపై ప్రతికూల ప్రభావం చూపింది. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు కూడా నిరాశగానే ఉన్నాయి. అమెరికా మార్కెట్ మెరుగుపడినప్పటికీ, యూరోపియన్ యూనియన్, జపాన్‌లో మందగమన పరిస్థితులు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి. బంగారం దిగుమతులు ఇలా...: కాగా 2015 జనవరిలో బంగారం దిగుమతులు 8.13 శాతం పెరిగి 1.55 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-జనవరి మధ్య...: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య ఎగుమతులు 2.44 శాతం వృద్ధితో 265.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 2.17 శాతం పెరుగుదలతో 383.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 118.37 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 340 బిలియన్ డాలర్ల ఎగుమతులను కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రోత్సాహకాలు అవసరం: ఎఫ్ఐఈఓ ఎగుమతుల రంగం పునరుత్తేజానికి తగిన విధాన చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టాలని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ దిశలో విదేశీ వాణిజ్య విధానాన్ని త్వరలో ఆవిష్కరించాలని సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరేలా కనబడ్డం లేదని అన్నారు.