FAC
-
ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..
హిందూపురం/లేపాక్షి: కేంద్ర ఆహార భద్రత చట్టం–13 అమలు బాధ్యత అధికారులదేనని ఆహార భద్రత కమిషన్ సభ్యురాలు కృష్ణమ్మ స్పష్టం చేశారు. స్థానిక లక్ష్మీపురంలోని వైఎస్సార్ ఆరోగ్యకేంద్రం, సింగిరెడ్డిపల్లిలోని అంగన్వాడీ కేంద్రం, సీపీఐ కాలనీలోని కస్తూరిబా విద్యాలయ, ఎంఎల్ఎస్ పాయింట్, చౌకధాన్య డిపోలను గురువారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రూ.వేల కోట్ల వ్యయంతో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాయన్నారు. ఆహార భద్రత కింద అమలులో ఉన్న వివిధ పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఇందులో నాన్ ఎఫ్ఏసీ కింద సుమారు 56లక్షల కార్డుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ రేషన్‌కార్డు అందజేస్తామన్నారు. ఎక్కడైనా అర్హులైన కార్డు రాకపోయినా, రేషన్ బియ్యంలో పంపిణీలో అవకతవకలు, నాణ్యత ప్రమాణాలు లోపించినా వెంటనే ఫుడ్‌కమిషన్ టోల్‌ఫ్రీ నంబర్ (155235)కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపించినా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ప్రధానమంత్రి మాతృయోజన పథకం కింద మొదటి, రెండవ కాన్పులకు అందిస్తున్న పారితోషికానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్‌ను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని గురువారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. కార్యక్రమంలో డీఎస్ఓ వంశీ«కృష్ణారెడ్డి, డీఎం అశ్వత్థనారాయణ, ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి, నోడల్ ఆఫీసర్ గాయత్రి, సీడీపీఓ నాగమల్లేశ్వరి, డాక్టర్ ఆనంద్, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ డీఈఓ రంగస్వామి, ఏడీ నాగరాజు, ఈడీ దివాకర్‌రెడ్డి, ఎంఈఓ గంగప్ప, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: కులాంతర వివాహంతోనే హత్య) -
దక్షిణాదిలో తొలి మహిళ...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణాధికారి(పీసీసీఎఫ్)–ఎఫ్ఏసీగా రొయ్యూరు శోభ నియమితులయ్యారు. పీసీసీఎఫ్‌గా నియ మితులైన మహిళా ఐఎఫ్ఎస్ అధికారుల్లో దక్షిణాది రాష్ట్రా ల్లో మొదటివ్యక్తిగా, దేశంలోనే నాలుగో మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. బుధవారం పీసీసీఎఫ్‌గా పదవీ విరమణ చేసిన ప్రశాంత్‌కుమార్ ఝా నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అరణ్యభవన్‌లో ఆమెను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ ఎస్కే జోషి , ఇతర అధికారులు అభినందించారు. ఆర్.శోభను పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ)గా నియమిస్తూ బుధవారం సీఎస్ ఎస్కేజోషి ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆమె పీసీసీఎఫ్ పోస్టులో చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌గా కొనసాగుతారని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. యూపీ డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ, అనంతపురంలోని కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ బయోసైన్స్‌లో పట్టా పొందారు. 1986లో ఆమె ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన ఆమెకు పీసీసీఎఫ్ ర్యాంకుతో పదోన్నతి కల్పించారు. దాంతో తెలుగురాష్ట్రాల నుంచి అటవీశాఖలో పీసీసీఎఫ్ వంటి అత్యున్నత ర్యాంక్ చేరుకున్న తొలి మహిళగా శోభ నిలిచారు. అప్పటి నుంచి ఆమె అరణ్యభవన్‌లో పీసీసీఎఫ్(ఎఫ్సీఏ)గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు మూడేళ్ల పాటు అదనపు పీసీసీఎఫ్ (ఎఫ్సీఏ)గా పనిచేశారు. 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఇప్పటివరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆమె భర్త ఆర్.సుందరవదన్ ఐఎఫ్ఎస్ అధికారిగా పదవీ విరమణ చేశారు. -
తహసీల్దార్లు వద్దు.. డీటీలే ముద్దు
* ఎఫ్‌ఏసీతో బాధ్యతలు అప్పగిస్తున్న వైనం * కీలకమైన రెవెన్యూలో ఇదీ వరుస సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమమైనా ప్రజల్లోకి వెళ్లాలన్నా... ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా మండలస్థాయిలో పరిష్కరించాలన్నా తహసీల్దార్లే ప్రధానం. రేషన్‌కార్డు మొదలు... కీలకమైన భూ సంబంధ విషయాల వరకూ వీరిదే మండలంలో కీలకపాత్ర. అటువంటి పోస్టుల్లో తహసీల్దార్లను కాదని.... పూర్తిస్తాయి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ)పేరుతో డిప్యూటీ తహశీల్దార్(డీటీ)లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కేవలం రెండు, మూడు నెలల కిందట డీటీగా పదోన్నతి వచ్చిన వారికి సైతం ఏకంగా తహ సీల్దారు బాధ్యతలు అప్పగించడంపై రెవెన్యూ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. రెవెన్యూలో కీలకమైన సంస్కరణలు జరుగుతున్న ఈ సమయంలో ఇది మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తహసీల్దార్లు లేరా అంటే అదీ కాదు. అర్హులైన వారు ఉన్నప్పటికీ వారికి ఏ పోస్టింగులు ఇవ్వకుండా డీటీలవైపు మొగ్గుచూపుతున్నారు. డీటీలో కింగ్‌లు! జిల్లాలో మొన్నటివరకు ఏకంగా ఏడాది కాలంపాటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరంలో డిప్యూటీ తహసీల్దారే తహశీల్దారుగా వ్యవహరించారు. మొన్నటి బదిలీల్లో కూడా ఆళ్లగడ్డ తహసీల్దారును రుద్రవరంకు బదిలీ చేశారు. ఈయన కూడా నాలుగు రోజుల క్రితం వరకూ బాధ్యతలు తీసుకోలేదు. ఇక జిల్లాలో మంత్రాలయం, కోసిగి. ఆళ్లగడ్డ, మద్దికెర మండలాల్లో డీటీలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ) పేరుతో డిప్యూటీ తహసీల్దార్లే... తహసీల్దార్లుగా పని కానిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే కొన్ని మండలాలను డీటీలకు అప్పగించి పనులు కానిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. 3 నెలల్లోనే బాధ్యతలా? డిప్యూటీ తహసీల్దారు(డీటీ)గా పదోన్నతి వచ్చి రెండు, మూడు నెలలైనా కాకముందే వారికి ఏకంగా తహసీల్దారు పోస్టును పూర్తిస్థాయి అదనపు బాధ్యతల పేరుతో అప్పగించడంపైనా రెవెన్యూశాఖలోని వారే నోరెళ్లబెడుతున్నారు. కనీసం డీటీగా కూడా సరియైన అవగాహన లేని వ్యక్తికి ఎఫ్ఏసీ ఇచ్చి తహసీల్దారు సీట్లో కూర్చోబెడితే సదరు పోస్టుకు ఏం న్యాయం జరుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాలనలో కీలకమైన రెవెన్యూశాఖలో ఇటువంటి ప్రయోగాలు జిల్లాకు ఎంతకూ మంచివికావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మండుతున్న నిత్యావసరాల ధరలు..
సాక్షిప్రతినిధి, వరంగల్ : నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. సన్న బియ్యం ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. పప్పులు, నూనెలు... అన్ని సరుకులదీ ఇదే తీరు. గత ఏడాదితో పోల్చితే అన్ని సరుకుల ధరలూ పెరిగాయి. వర్షాలు లేక ఈ ఏడాది పంటల సాగు తక్కువగా ఉంది. ముఖ్యంగా ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. అరుుతే, పంట ఉత్పత్తులు తక్కువగా వచ్చే పరిస్థితి ఉండడంతో వ్యాపారులు, రైస్ మిల్లర్లు నిత్యావసర వస్తువులు, బియ్యూన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పౌర సరఫరాల శాఖ, నిఘా విభాగం స్పందించి తనిఖీలు చేయాలి. నిత్యావసరాలను అక్రమ నిల్వ చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా సరుకుల సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ, జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అక్రమ నిల్వలు, సర్కారు సబ్సిడీ బియ్యం అక్రమాల విషయంలో పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు ఎక్కువగా చేయూల్సి ఉండగా.. దీనికి విరుద్ధంగా జరుగుతోంది. గత ఏడాది తనిఖీలతో పోల్చితే ఈ ఏడాది బాగా తగ్గాయి. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు పెరగడం గమనార్హం. ప్రజా పంపిణీ వ్యవస్థ(రేషన్)లో పారదర్శకత పెంచడం, ఆహార సలహా కమిటీ(ఎఫ్ఏసీ) సమావేశం నిర్వహించి నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. దీనిపై కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎఫ్ఏసీ సమావేశం జరగాల్సి ఉంది. 2013 మే 29న ఎఫ్ఏసీ సమావేశం జరిగింది. అప్పటి నుంచి సమావేశం నిర్వహించ లేదు. ఇలా 14 నెలలు గడిచినా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ధరల మోత పట్టదు... పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో ఐదుగురు సహాయ సరఫరా అధికారులు(ఏఎస్వో), ఐదుగురు ఆహార ఇన్స్పెక్టర్లు, 15 మంది ఉప తహసీల్దార్లు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక ధాన్యం కొనుగోలు అధికారి(జీపీవో), ఈ విభాగం సహాయ అధికారి ఉన్నారు. నిత్యావసరాల అక్రమ నిల్వలను నిరోధించడం.. ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను నివారించడం లక్ష్యంగా వీరు నిత్యం తనిఖీలు నిర్వహించాలి. ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు చేయాలి. ఇలా ప్రత్యేకంగా తనిఖీలు, దాడులు చేసే పౌర సరఫరాల అధికారులు సిబ్బంది కాకుండా.. ప్రతి మండంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉంటారు. ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు ఉంటారు. వీరు కూడా ఈ పనులు చేయవచ్చు. కానీ, అవేమీ జరగడం లేదు. ఎన్నికలు, ఇతర పరిపాలన పనుల్లో రెవెన్యూ శాఖ ఉద్యోగులు పని ఒత్తిడితో ఉన్నా... పౌర సరఫరాల శాఖలోని 27 మంది సిబ్బంది నెలకు ఒకటి చొప్పున తనిఖీలు చేసినా 27 అవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి. ఇలా ఒక్కో అధికారి ఒక తనిఖీ చొప్పున చేసినా వీటి సంఖ్య ఇప్పటికి 189 అయ్యేవి. జిల్లాలో ఇలా జరగడం లేదు. నిత్యావసర సరుకుల బడా వ్యాపారులతో, రైస్ మిల్లర్లతో అధికారులకు, కింది స్థాయి ఉద్యోగుల వరకు ఉన్న సత్సంబంధాల కారణంగా ఎవరూ తనిఖీలు చేయడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా... సంబంధిత వ్యాపారులకు అధికారుల నుంచి ముందుగానే సమాచారం అందుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిల్వలు, ధరలు పెరగడం యథావిధిగా జరుగుతోంది. ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సరఫరా చేసే సరుకులను కొనుగోలు చేయాలంటే కొన్ని ఇతర వస్తువులు తీసుకోవాల్సిందేనని కొందరు రేషన్ డీలర్లు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా పౌర సరఫరాల అధికారులు స్పందించడం లేదు. అన్ని శాఖల్లో అక్రమాలపై నిఘా బాధ్యతల నిర్వహణ కోసం ఉన్న విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ సైతం దాడులు, తనిఖీల విధులను దాదాపుగా పక్కనబెట్టింది. ఏదైనా ఫిర్యాదు వస్తే కింది స్థాయి సిబ్బంది అక్కడి వెళ్లి, తర్వాత పౌర సరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి రావడం జరుగుతోంది. నిత్యావసరాల అక్రమ నిల్వలు, ధరల పెరుగుదల విషయంలో పౌర సరఫరాలు, రెవెన్యూ, విజిలెన్స్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఈ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
కాసుల కక్కుర్తి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శుల నియామకాలు వివాదాస్పదంగా మారాయి. పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) పేరిట నిబంధనలు తుంగలో తొక్కి మినిస్టీరియల్ ఉద్యోగులను నియమించడం దుమారం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉన్న ఉద్యోగులు కోరుకున్న చోట పోస్టింగ్‌లు కొట్టేశారన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీలపై కన్నేసిన కొందరు జూనియర్, సీనియర్ అసిస్టెంట్ కేడర్ ఉద్యోగులు తాము కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు ‘ముడుపులు’ ముట్టజెప్పారని ఆ శాఖలోని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఇన్‌చార్జీలుగా నియమితులైన ఉద్యోగులు.. వారు పనిచేసే కా ర్యాలయానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఎలా నియమించారు? వారు ఎలా విధులు నిర్వహిస్తారనేది అర్థం కావడం లేదు. వారి రాకపోకలకే సమయం సరి పోతోంది. గ్రామ పంచాయతీని బట్టి ధరను నిర్ణయించి ఈవో, కార్యదర్శులుగా అదనపు బాధ్యతలు అప్పగిం చేందుకు బాగానే దండుకున్నారన్నా ప్రచారం ఉంది. ఈ విషయమై ఆ శాఖలోని ఉద్యోగులు బాహాటంగా చర్చించుకోవడం వివాదాలకు కారణమవుతోంది. మనోడైతే మేజరే.. ఈవో, కార్యదర్శుల నియామకాల వివాదం ఉధృతంగా మారుతోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత కార్యదర్శు ల కొరత పేరిట ఆ శాఖ ఉన్నతాధికారులు పూర్తి అదన పు బాధ్యతలు ఇస్తూ ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇచ్చారన్న విమర్శలున్నాయి. ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేయడంతోపాటు నెలనెల ‘మామూళ్ల’ ఒప్పందం చేసుకున్న ట్లు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు డివిజనల్ పంచాయతీ అధికారులు, డీపీవో కార్యాలయంలో ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగిన సీనియర్ కార్యదర్శులు రాయబారం చేసినట్లు విమర్శలున్నాయి. పంచాయతీ ఉన్నతాధికారులకు విధేయులుగా ఉండే డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఒక్కొక్కరికి రెండు, మూడేసి పంచాయతీల కు ఈవో, కార్యదర్శులుగా నియమించడం వివాదాస్ప దం అవుతోంది. అవకాశంరాని కార్యదర్శులు, సీనియ ర్లు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. నిబంధనల కు విరుద్ధంగా మినిస్టీరియల్ ఉద్యోగులను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీల భర్తీకే పంచాయతీలకు అదనపు కార్యదర్శులు ఈవో కమ్ కార్యదర్శుల నియామకంలో అక్రమాలు, అవకతవకలు లేవు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలకు దాదాపు 600 పైచిలుకు పంచాయతీలకు కార్యదర్శులు లేరు. గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గం ఏర్పడటంతో అభివృద్ధి కార్యకలాపాలు కుంటుపడకుండా ఉండేందుకు మాత్రమే వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులకు ఈవో కమ్ కార్యదర్శులుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నియామకాలు చేయడం జరిగింది. - కె.పోచయ్య, డీపీవో, ఆదిలాబాద్ వివాదాస్పదంగా నియామకాలు.. చెన్నూరు గ్రామ పంచాయతీ ఎల్డీసీ రాజ్‌కుమార్‌ను 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాంకిడి పంచాయతీ కార్యదర్శిగా నియమించారు. మంచిర్యాల పరిధిలోని నస్పూరు మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న శ్రీపతిబాబును 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం పొన్కల్ మేజర్ గ్రామ పంచాయతీ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటికే శ్రీపతిబాబు నస్పూర్తోపాటు హాజీపూర్, వేమనపల్లికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. డీఎల్పీవో కార్యాలయంలో ఎల్డీసీగా ఉన్న ఉమర్‌కు ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ కార్యదర్శిగా ఇచ్చారు. ఆదిలాబాద్ డీఎల్పీవో కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సత్యానందస్వామిని ఇచ్చోడ మేజర్ పంచాయతీ ఈవో, ఇన్చార్జి కార్యదర్శిగా నియమించారు. ఉట్నూర్ బిల్‌కలెక్టర్ మసూద్‌ను లక్కారం కార్యదర్శిగా నియమించారు. మంచిర్యాల ఈవోఆర్డీ శంకర్ కాసిపేట ఇన్చార్జి ఈవోఆర్డీగా, కాసిపేట, ముత్యంపల్లి ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శిగా, నెన్నెల ఇన్చార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తుండటం వివాదాస్పదం అవుతోంది. డిసెంబర్ 31న బాసర మేజర్ పంచాయతీ కార్యదర్శి పదవీవిరమణ చేయగా ఆయన స్థానంలో ని ర్మల్ డీఎల్పీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌కు బాసర, ముథోల్ అప్పగించారు. ఇలా కార్యదర్శుల కొరతను ఆసరాగా చేసుకుని ఖాళీల భర్తీ పేరిట ఇష్టారాజ్యంగా జూనియర్ అసిస్టెంట్లను ఈవో కమ్ కార్యదర్శులుగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు.. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం మేజర్ గ్రామ పంచాయతీలకు కార్యదర్శులుగా గ్రేడ్-1 వాళ్లను నియమించాలి. అలా కాకుండా గ్రేడ్-4 వాళ్లను నియమించారు. జూనియర్ అసిస్టెంట్లను పంచాయతీ కార్యదర్శులుగా నియమించి వివాదాలకు అధికారులు తెరతీశారు. ఎక్స్టెన్షన్ స్టాఫ్ కిందకు వచ్చే ఈవోఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకే మిగతా పంచాయతీ కార్యదర్శులుగా నియమించా లి. మినిస్టీరియల్ స్టాఫ్‌ను, అందులో డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల్లో పనిచేసే వారికి ఇవ్వకూడదు. ఈవో కమ్ కార్యదర్శులను నియమించాలంటే ఆయా మండలాల ఎంపీడీవోలు ప్రతిపాదనలు ఇవ్వాలి. ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా అధికారులు వాస్తవాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా కేవలం ఖాళీల భర్తీ పేరిట నిబంధనలకు వక్రభాష్యం చెప్పడంపై ఆరోపణలు వస్తున్నాయి. -
రైలు రవాణా భారం!
న్యూఢిల్లీ: రైలు రవాణా మరింత భారం కానుంది. రవాణా చార్జీలను అక్టోబర్‌లో పెంచడానికి రైల్వే సన్నద్ధమవుతోంది. ఇంధన భారం పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సర్దుబాటు అంశం (ఎఫ్ఏసీ)పై పునఃసమీక్షించి చార్జీలపై నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్ఏసీ ఆధారంగానే గత ఏప్రిల్‌లో రవాణా చార్జీలను రైల్వే 5.7 శాతం పెంచింది. ప్రయాణికుల చార్జీలు మాత్రం ఈ దఫా పెరగవు. ప్రతి ఆరు నెలలకొకసారి ఇంధన ధరలను సమీక్షించి ఆ మేరకు చార్జీలు పెంచేందుకు వీలుగా బడ్జెట్లో ప్రతిపాదించిన ఎఫ్ఏసీ ప్రకారం అక్టోబర్‌లో మరోసారి రవాణా చార్జీలు పెరుగుతాయని రైల్వే సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ‘భారతీయ రైల్వే ఆధునీకరణ- సవాళ్లు, అవకాశాలు’ అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సరుకు రవాణా చార్జీలు మాత్రమే పెరుగుతాయని, ఈసారి ప్రయాణికుల చార్జీలు ముట్టుకోబోమని చెప్పారు. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలతో పాటు ప్రస్తుతం స్థిరంగాలేని రూపాయి విలువనూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. రైల్ టారిఫ్ అథారిటీ (ఆర్టీఏ) ఏర్పాటు ప్రక్రియను రైల్వే ప్రారంభించిందని, ఈ నెలలోనే దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని వెల్లడించారు. చైనాను ఆదర్శంగా తీసుకోవాలి: రైల్వే రంగంలో చైనా ప్రగతిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అధీర్ రంజన్ చౌదరి అభిప్రాయపడ్డారు. అలాగే భారత్, చైనాల మధ్య స్నేహసంబంధాలకు కృషి చేయాలని అన్నారు. పొరుగు దేశమైన చైనా రాజధాని బీజింగ్‌కు ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించాలని తాను ఆశిస్తున్నానన్నారు. కాగా, రైల్వే లోకో డ్రైవర్లు, గార్డులు, ఇతర సిబ్బందికి ప్రస్తుతమున్న వసతులను మరింతగా పెంచాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. -
రైలు రవాణా భారం!
న్యూఢిల్లీ: రైలు రవాణా మరింత భారం కానుంది. రవాణా చార్జీలను అక్టోబర్‌లో పెంచడానికి రైల్వే సన్నద్ధమవుతోంది. ఇంధన భారం పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సర్దుబాటు అంశం (ఎఫ్ఏసీ)పై పునఃసమీక్షించి చార్జీలపై నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్ఏసీ ఆధారంగానే గత ఏప్రిల్‌లో రవాణా చార్జీలను రైల్వే 5.7 శాతం పెంచింది. ప్రయాణికుల చార్జీలు మాత్రం ఈ దఫా పెరగవు. ప్రతి ఆరు నెలలకొకసారి ఇంధన ధరలను సమీక్షించి ఆ మేరకు చార్జీలు పెంచేందుకు వీలుగా బడ్జెట్లో ప్రతిపాదించిన ఎఫ్ఏసీ ప్రకారం అక్టోబర్‌లో మరోసారి రవాణా చార్జీలు పెరుగుతాయని రైల్వే సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ‘భారతీయ రైల్వే ఆధునీకరణ- సవాళ్లు, అవకాశాలు’ అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సరుకు రవాణా చార్జీలు మాత్రమే పెరుగుతాయని, ఈసారి ప్రయాణికుల చార్జీలు ముట్టుకోబోమని చెప్పారు. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలతో పాటు ప్రస్తుతం స్థిరంగాలేని రూపాయి విలువనూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. రైల్ టారిఫ్ అథారిటీ (ఆర్టీఏ) ఏర్పాటు ప్రక్రియను రైల్వే ప్రారంభించిందని, ఈ నెలలోనే దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని వెల్లడించారు. చైనాను ఆదర్శంగా తీసుకోవాలి: రైల్వే రంగంలో చైనా ప్రగతిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అధీర్ రంజన్ చౌదరి అభిప్రాయపడ్డారు. అలాగే భారత్, చైనాల మధ్య స్నేహసంబంధాలకు కృషి చేయాలని అన్నారు. పొరుగు దేశమైన చైనా రాజధాని బీజింగ్‌కు ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించాలని తాను ఆశిస్తున్నానన్నారు. కాగా, రైల్వే లోకో డ్రైవర్లు, గార్డులు, ఇతర సిబ్బందికి ప్రస్తుతమున్న వసతులను మరింతగా పెంచాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది.