family attempt suicide
-
ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా
అహ్మదాబాద్: మహమ్మారి వైరస్ దేశంలో భయాందోళన రేపుతోంది. మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతున్నాయి. వైరస్ ధాటికి తట్టుకోలేక ఛిన్నాభిన్నమవుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తితో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆవేదనకు గురి చేస్తోంది. వైరస్‌తో కుటుంబ పెద్ద మృతి చెందగా అతడి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ అంత్యక్రియలు ముగియనే లేదు ఆయన భార్య, పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని జిల్లాకేంద్రం దేవభూమి ద్వారకలోని రుష్మానీనగర్‌లో జయేశ్ భాయ్ జైన్ (60), భార్యా ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నాడు. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం జయేశ్ మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం నిర్వహించారు. అయితే ఆయన మృతిని భార్య సాధన బెన్, కుమారులు కమలేశ్ (35), దుర్గేశ్ (27) తట్టుకోలేకపోయారు. అంత్యక్రియలు జరిగిన రెండు గంటలకే తల్లి, కుమారులు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనే పురుగుల నివారణ మందు తాగి బలవన్మరణం పొందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ చదవండి: ఆస్పత్రి నుంచి 23 కరోనా బాధితులు పరార్ -
భార్య మృతిని తట్టుకోలేక భర్త దారుణం
సాక్షి, ప్రకాశం: భార్య మృతితో మనస్తాపానికి గురైన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి, ఓ కుమారుడు మృతి చెందగా మరో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఎలుకల మందు మజాలో కలిపి తాగి బలవన్మరణానికి ఒడిగట్టారు. పెద్ద కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలు మిలటరీ కాలనీకి చెందిన తన్నీరు అంకమ్మ రాజు (36) బేల్దారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈయన భార్య కల్యాణి గతేడాది క్యాన్సర్‌తో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి కొడుకుల జీవనం కష్టంగా మారింది. పెద్ద కుమారుడు వంశీకృష్ణ ఆరో తరగతి, చిన్న కుమారుడు ముకుంద కృష్ణ (11) ఐదో తరగతి చదువుతుండేవాడు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూత పడడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే రెండు నెలలుగా పనులకు కూడా వెళ్లకుండా రాజు ఉన్న డబ్బుతో పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున రాజు తన సోదరుడు మధుకు ఫోన్‌చేసి తాను, పిల్లలు ఇద్దరు మజా బాటిల్లో ఎలుకల మందు కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. వారి ఇంటి సమీపంలోనే ఉంటున్న మధు వెంటనే వచ్చి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాజు మృతిచెందాడు. అయితే చిన్న కుమారుడు ముకుంద కృష్ణ (11) పరిస్థితి విషమంగా ఉండడంతో బైపాస్ సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తీసుకెళ్లిన కొద్దిసేపటికే కృష్ణ కన్నుమూశాడు. వంశీకృష్ణ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. వంశీకృష్ణ కోలుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అచ్చం ‘సర్కార్’ సినిమాలో లాగా.. కానీ..
సాక్షి, చెన్నై: ఇటీవల విజయ్ విడుదలైన ‘సర్కార్’ సినిమాలో ఓ వ్యక్తి కుటుంబంతో సహా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడతాడు. ఇద్దరు కూతుళ్లు, భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తాడు. అయితే అక్కడున్న అధికారులెవరూ గుర్తించకపోవడంతో ఒక్క బాలిక మినహా ముగ్గురు అగ్నికి ఆహుతి అవుతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కోయంబత్తూరు కలెక్టరేట్ ఎదుట జరిగింది. అయితే అదృష్టవశాత్తు మీడియా ప్రతినిధులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం నుంచి వారు బయటపడ్డారు. వివరాలు.. కోయంబత్తూరు కలెక్టరేట్లో సోమవారం ఓ కుటుంబం ఆత్మాహుతి యత్నం చేసింది. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే క్రమంలో మీడియా వర్గాలు గుర్తించి, వారిని రక్షించారు. పెట్రోల్ క్యాన్‌తో కలెక్టరేట్‌లోకి ఓ కుటుంబం వచ్చినా వారిని అడ్డుకునేందుకు అక్కడ ఏ ఒక్క పోలీసు లేకపోవడం శోచనీయం. కందు వడ్డి వేధింపులు తాళలేక తిరునల్వేలి కలెక్టరేట్లో ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ఆత్మాహుతికి పాల్పడడం రాష్ట్రంలో కలకలం రేపింది. నలుగురు ఆహుతి అవుతున్నా రక్షించేందుకు, మంటల్ని ఆర్పేందుకు తగ్గ పరికరాలు లేకపోవడం వివాదానికి దారి తీసింది. దీంతో అన్ని కలెక్టరేట్ వద్ద అగ్ని నిరోధక పరికరాలు ప్రవేశ మార్గంలోనే ఉంచారు. అలాగే ప్రవేశమార్గంలో భద్రతా విధుల్లో ఉండే పోలీసులు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించాల్సి ఉంది. అయితే ఇవన్నీ మమా అనిపించే రీతిలోనే ఉన్నాయన్న విమర్శలు ఎక్కువే. ఈ విమర్శలకు బలం చేకూర్చే రీతిలో తాజా ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారి వేధింపులతో.. విచారణలో కోయంబత్తూరుకు చెందిన సెల్వరాజ్ కుటుంబంగా తేలిసింది. తన ఇద్దరు కుమార్తెల వివాహం కోసం దాచుకున్న సొమ్ముతో గతంలో సెల్వరాజ్ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ స్థలాన్ని తనకు ఇవ్వాలని ఓ పోలీసు అధికారి వేధిస్తూ వచ్చినట్టు సమాచారం. పోలీసుస్టేషన్‌కు వెళ్లిన పక్షంలో న్యాయం లభించదని భావించి, కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడానికి గతంలో ప్రయత్నించారు. అక్కడ కూడా తమ ప్రయత్నం ఫలించకపోవడంతో చివరకు ఆత్మాహుతికి సిద్ధపడి వచ్చామని కలెక్టరేట్ వర్గాలకు సెల్వరాజ్ వివరించినట్లు తెలిసింది. దీంతో ఆ అధికారి ఎవరో, ఆ స్థలం ఎక్కడ ఉన్నదో తదితర అంశాల మీద సమగ్ర విచారణకు కలెక్టర్ రాజామణి ఆదేశించారు. -
ఐదుగురి ఆత్మాహత్యాయత్నం
గాంధీనగర్: ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు ఓ కుటుంబంలో కలతలకు కారణమయ్యాయి. తీవ్ర ఆవేదనతో వారంతా బలవన్మరణానికి యత్నించారు. వివరాలివీ.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన జహంగీర్, మసీద దంపతులకు ఆరుగురు సంతానం. వీరిలో ఇంకా ముగ్గురు కుమార్తెలు అసీమా(25), ఆస్మా(21),కాజల్(15), కుమారుడు లియాఖత్(28)కి వివాహం కావాల్సి ఉంది. వీరంతా మిర్యాలగూడలోని సొంతింట్లో ఉంటుండగా జహంగీర్ హైదరాబాద్‌లో ఉంటూ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా కుటుంబసభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో మసీద(48), లియాఖత్, అసీమా, ఆస్మా, కాజల్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అయితే, ఇరుగుపొరుగు వారు గమనించి, మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ బిక్షపతి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు.