ఐదుగురి ఆత్మాహత్యాయత్నం | family attemprs suicied due to facing problems | Sakshi
Sakshi News home page

ఐదుగురి ఆత్మాహత్యాయత్నం

Published Fri, Apr 3 2015 11:09 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

family attemprs suicied due to facing problems

గాంధీనగర్: ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు ఓ కుటుంబంలో కలతలకు కారణమయ్యాయి. తీవ్ర ఆవేదనతో వారంతా బలవన్మరణానికి యత్నించారు.  వివరాలివీ.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన జహంగీర్, మసీద దంపతులకు ఆరుగురు సంతానం. వీరిలో ఇంకా ముగ్గురు కుమార్తెలు అసీమా(25), ఆస్మా(21),కాజల్(15), కుమారుడు లియాఖత్(28)కి వివాహం కావాల్సి ఉంది. వీరంతా మిర్యాలగూడలోని సొంతింట్లో ఉంటుండగా జహంగీర్ హైదరాబాద్‌లో ఉంటూ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.

 

శుక్రవారం కూడా కుటుంబసభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో మసీద(48), లియాఖత్, అసీమా, ఆస్మా, కాజల్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అయితే, ఇరుగుపొరుగు వారు గమనించి, మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ బిక్షపతి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement