fareeduddin
-
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత
జహీరాబాద్/ సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మహ్మద్ ఫరీదుద్దిన్ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెం దారు. వారం క్రితం ఆయనకు కాలేయ సంబంధిత శస్త్ర చికిత్స జరగ్గా, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న క్రమంలో బుధవారం గుండెపోటుకు గురయ్యారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఫరీదుద్దీన్ 1957 అక్టోబర్ 14న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హోతి (బి) గ్రామంలో జన్మించారు. ఉమ్మడి రా ష్ట్రంలో దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆయన 2004 నుంచి 2009 వరకు మంత్రిగా కొనసాగారు. జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో జహీ రాబాద్ అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వుడు కా వడంతో హైదరాబాద్‌లోని అంబర్‌పేట స్థా నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన టీఆర్ఎస్లో చేరారు. 2016లో సీఎం కేసీఆర్, ఫరీదుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇటీవలే ఆయన పదవీ కాలం ముగిసింది. ఫరీదుద్దీన్‌కు సౌమ్యుడిగా పేరుంది. పార్టీ నేతలతో పాటు సామాన్య కార్యకర్తలకు కూడా అందు బాటులో ఉండేవారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీవర్గ నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి టి.హరీశ్‌రావు, కాంగ్రెస్ సీని యర్ నేత షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, జీకాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు దిల్లీ వసంత్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేత లు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఫరీదుద్దీన్ బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ హయాంలో ఫరీదుద్దీన్ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చదవండి: సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ కామెంట్లపై కేటీఆర్ రియాక్షన్ -
హాస్టల్లో ఉండటం ఇష్టంలేక..
♦ ఉరి వేసుకుని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య ♦ మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్న బంధువులు ♦ సూరారం డివిజన్ మైనారిటీ హాస్టల్లో ఘటన హైదరాబాద్: హాస్టల్లో ఉండటం ఇష్టంలేక ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. కుత్బుల్లా పూర్లోని వెంకటరాంరెడ్డి నగర్‌కు చెందిన అత్తరున్నీసా బేగం భర్త నజీముద్దీన్ తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందాడు. వీరి కుమారుడు ఫరీదుద్దీన్(13) గాజుల రామారంలోని రోడా మేస్త్రీనగర్‌లోని ఓ ఉర్దూ పాఠశాల మదర్సాలో ఏడో తరగతి చదివాడు. 8వ తరగతిని మద ర్సాలో చదవనని ఫరీద్ మారాం చేయడంతో సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ నెల 7న చేర్చారు. ఆ రోజు స్కూల్లో ఉండనని ఫరీద్ మారాం చేయడంతో తల్లి ఇంటికి తీసుకెళ్లింది. శనివారం పాఠశాలకు వచ్చిన అతను.. మరుసటి రోజు ఆదివారం కావడంతో ఇంటికి వెళ్లిపోయాడు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఫరీద్ హాస్టల్లోనే ఉన్నాడు. మంగళవారం హాస్టల్లో ఉండనని అతను మారాం చేయడంతో సాయంత్రం తల్లితో ఫోన్లో మాట్లాడించారు. రాత్రి భోజనం చేసి విద్యార్థులంతా నిద్ర పోయారు. అర్ధరాత్రి 12 గంటలకు ఫరీద్ గదిలో ఉన్న మరో బాలుడు టాయిలెట్ కోసం లేవగా ఫరీద్ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలికి వచ్చేసరికి బాలుడు మృతిచెంది ఉన్నాడు. మైనార్టీ పాఠశాలల రాష్ట్ర చీఫ్ రెసిడెన్సీ ఆఫీసర్ ఎజాజ్ అహ్మద్ బాలుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఫరీద్ తల్లి, బంధువులు అక్కడకు చేరుకుని అంబు లెన్స్‌ను అడ్డుకున్నారు. రాష్ట్ర రెసిడెన్షియల్ ఎడ్యు కేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ప్రెసిడెంట్ ఏకే ఖాన్, స్థానిక ఎమ్మేల్యే వివేకానంద్ వారికి నచ్చ జెప్పి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫరీధ్ మృతిపై అనుమానా లున్నాయని, మెడ, ఒంటిపై కమిలిన గాయాలు న్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని తల్లి, బంధువులు డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్: ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఫరీదుద్దీన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలవడం, అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. -
ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఏకగ్రీవం!
- నామినేషన్ వేసింది ఆయనొక్కరే - ముగిసిన నామినేషన్ల ప్రక్రియ హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక జరుగుతున్న ఒక ఎమ్మెల్సీ స్థానం అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే పడనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైంది. సోమవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు స్క్రుటినీ, ఉపసంహరణ గడువు ముగిశాక ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలవడం, అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఫరీదుద్దీన్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆయనతో పాటు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనపై నమ్మకముంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఫరీదుద్దీన్ ఈ సందర్భంగా విలేకరులతో అన్నారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామి అయ్యేందుకు తనకు అందివచ్చిన అవకాశంగా దీన్ని భావిస్తున్నట్టు చెప్పారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని నాయిని అన్నారు. విపక్షాలు ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నాయని, ఏ ఎన్నికల్లోనూ గెలవలేమని అవి ఆందోళనలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఫరీదుద్దీన్, తాను ఒకే మంత్రివర్గంలో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. -
ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి: ఫరీదుద్దీన్
జహీరాబాద్:ఎమ్మెల్సీ పదవికి టీఆర్ఎస్ అధిష్టానం తన పేరును ఖరారు చేయడంపై ఎం.డి.ఫరీదుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సీటు కోసం తానెలాంటి ప్రయత్నా లూ చేయలేదన్నారు. పార్టీకి తన సేవలను గుర్తించి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.