
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత ఫరీదుద్దీన్ బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ హయాంలో ఫరీదుద్దీన్ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
చదవండి: సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ కామెంట్లపై కేటీఆర్ రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment