జహీరాబాద్/ సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మహ్మద్ ఫరీదుద్దిన్ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెం దారు. వారం క్రితం ఆయనకు కాలేయ సంబంధిత శస్త్ర చికిత్స జరగ్గా, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న క్రమంలో బుధవారం గుండెపోటుకు గురయ్యారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఫరీదుద్దీన్ 1957 అక్టోబర్ 14న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హోతి (బి) గ్రామంలో జన్మించారు.
ఉమ్మడి రా ష్ట్రంలో దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆయన 2004 నుంచి 2009 వరకు మంత్రిగా కొనసాగారు. జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో జహీ రాబాద్ అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వుడు కా వడంతో హైదరాబాద్‌లోని అంబర్‌పేట స్థా నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2014లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. 2016లో సీఎం కేసీఆర్, ఫరీదుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇటీవలే ఆయన పదవీ కాలం ముగిసింది. ఫరీదుద్దీన్‌కు సౌమ్యుడిగా పేరుంది. పార్టీ నేతలతో పాటు సామాన్య కార్యకర్తలకు కూడా అందు బాటులో ఉండేవారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీవర్గ నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఫరీదుద్దీన్ మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి టి.హరీశ్‌రావు, కాంగ్రెస్ సీని యర్ నేత షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, జీకాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు దిల్లీ వసంత్, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేత లు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment