హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక.. | Student Suicide in Survivor Division Minority Hostel | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక..

Published Thu, Jul 13 2017 12:41 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక.. - Sakshi

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక..

ఉరి వేసుకుని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్న బంధువులు
సూరారం డివిజన్‌ మైనారిటీ హాస్టల్‌లో ఘటన


హైదరాబాద్‌: హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. కుత్బుల్లా పూర్‌లోని వెంకటరాంరెడ్డి నగర్‌కు చెందిన అత్తరున్నీసా బేగం భర్త నజీముద్దీన్‌ తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందాడు. వీరి కుమారుడు ఫరీదుద్దీన్‌(13) గాజుల రామారంలోని రోడా మేస్త్రీనగర్‌లోని ఓ ఉర్దూ పాఠశాల మదర్సాలో ఏడో తరగతి చదివాడు. 8వ తరగతిని మద ర్సాలో చదవనని ఫరీద్‌ మారాం చేయడంతో సూరారం డివిజన్‌ టీఎస్‌ఐఐసీ కాలనీలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఈ నెల 7న చేర్చారు.

 ఆ రోజు స్కూల్‌లో ఉండనని ఫరీద్‌ మారాం చేయడంతో తల్లి ఇంటికి తీసుకెళ్లింది. శనివారం పాఠశాలకు వచ్చిన అతను.. మరుసటి రోజు ఆదివారం కావడంతో ఇంటికి వెళ్లిపోయాడు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఫరీద్‌ హాస్టల్‌లోనే ఉన్నాడు. మంగళవారం హాస్టల్‌లో ఉండనని అతను మారాం చేయడంతో సాయంత్రం తల్లితో ఫోన్‌లో మాట్లాడించారు. రాత్రి భోజనం చేసి విద్యార్థులంతా నిద్ర పోయారు. అర్ధరాత్రి 12 గంటలకు ఫరీద్‌ గదిలో ఉన్న మరో బాలుడు టాయిలెట్‌ కోసం లేవగా ఫరీద్‌ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఎస్సై శ్రీనివాస్‌ ఘటనా స్థలికి వచ్చేసరికి బాలుడు మృతిచెంది ఉన్నాడు. మైనార్టీ పాఠశాలల రాష్ట్ర చీఫ్‌ రెసిడెన్సీ ఆఫీసర్‌ ఎజాజ్‌ అహ్మద్‌ బాలుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

 మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఫరీద్‌ తల్లి, బంధువులు అక్కడకు చేరుకుని అంబు లెన్స్‌ను అడ్డుకున్నారు. రాష్ట్ర రెసిడెన్షియల్‌ ఎడ్యు కేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ ఏకే ఖాన్, స్థానిక ఎమ్మేల్యే వివేకానంద్‌ వారికి నచ్చ జెప్పి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫరీధ్‌ మృతిపై అనుమానా లున్నాయని, మెడ, ఒంటిపై కమిలిన గాయాలు న్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని తల్లి, బంధువులు డిమాండ్‌ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement