Fashion photographer
-
ప్రతి దృశ్యం అంతులేని కవిత్వం!
ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో తాజా కెరటం లౌకిక్దాస్. కోల్‌కతాకు చెందిన దాస్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డిప్లొమా చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2020లో ఇతడికి ఎనిమిది షోలు కవర్ చేసే ఛాన్స్ దొరికింది. ప్రస్తుతం కోల్‌కతా కేంద్రంగా తన పాషన్ కొనసాగిస్తున్న లౌకిక్దాస్ మాటలు కొన్ని... ∙నేను ఎప్పుడూ ఫాలో అయ్యే ఏకైక రూల్... ఏ రూల్ ఫాలో కావద్దని! ఎందుకంటే ఫొటోగ్రఫీ అనేది సృజనాత్మకమైనది. దానికి హద్దులు, పరిమితులు లేవు ∙ఫొటోగ్రఫీలోని రకరకాల జానర్స్‌లో ఎన్నో గొప్ప అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా మన కోసం ఎదురుచూస్తున్నాయి ∙ఏ పుస్తకమో ఎందుకు? ‘ప్రకృతి’ అనే అందమైన పుస్తకాన్ని చదివితే ఎంతో జ్ఞానం మన సొంతమవుతుంది. అది మన వృత్తికి ఇరుసుగా పనిచేస్తుంది ∙‘ఈ దృశ్యంలో ఏదో మ్యాజిక్ ఉంది’ అని పసిగట్టే నైపుణ్యాన్ని మన కంటికి నేర్పాలి. -
టార్జాన్
1985లో రిలీజైన ‘టార్జాన్’ ఫ్లాపా యావరేజా హిట్టా సూపర్హిట్టా ఎవ్వరూ చెప్పలేరు. కాని చాలామంది ఈ సినిమాను రకరకాల కారణాల వల్ల చూశారు. టార్జాన్ కథ అప్పటికే బాలసాహిత్యం ద్వారా పాప్యులర్ కావడం ఒక కారణమైతే నేషనల్ జియోగ్రఫిక్ వంటి చానెల్స్ అందుబాటులో లేని రోజుల్లో అడవులు చూపించే ఏ సినిమా అయినా చూడాలనే కుతూహలం ప్రేక్షకులకు ఉండేది. దానికి తోడు దర్శకుడు బి.సుభాష్ తెలివిగా కిమి కాట్కర్ అందాలను ఆరబోయడంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకులందరినీ ఊపేసింది. ఆ రోజులో అలా తెర మీద ఒక హీరోయిన్ని దాదాపు నగ్నంగా చూపడం పెద్ద విశేషం. టార్జాన్‌గా నటించిన హేమంత్ బిర్జే కన్నడిగుడు. ఎత్తుగా కండలతో ఉండటం తప్ప యాక్టింగ్‌లో పస లేకపోవడం వల్ల రాణించలేదు. కిమి మాత్రం మరికాస్త ముందుకెళ్లి అమితాబ్‌తో ‘హమ్’ వంటి సినిమాల వరకూ నటించింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ శంతనును పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో లేదంటే పుణె శివార్లలో ఇండస్ట్రీకి దూరంగా జీవిస్తోంది. టార్జాన్కు బప్పి లాహిరి చేసిన పాటలు పెద్ద హిట్. జిలేలే జిలేలా ఆయొ ఆయొ జిలేలా..... మేరే సాత్ గావోనా జూబీ జుబి జుబి జూబీ... టార్జాన్ మై టార్జాన్... ఆ రోజుల్లో మోగిపోయాయి. ఆ సినిమా వచ్చాకే చిరంజీవి ‘అడవి దొంగ’ రావడం యాదృచ్చికం కాదు.