FC Kohli
-
బిల్ గేట్స్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
భారతీయ ఐటి పరిశ్రమకు పితామహుడిగా పిలుచుకునే దివంగత ఎఫ్‌సీ కోహ్లీ (మరణానంతరం), ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, దాత బిల్ గేట్స్ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. 'టై గ్లోబల్' అనే సంస్ కోహ్లీకి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ సర్వీస్ అవార్డును ప్రదానం చేయగా, బిల్ గేట్స్ కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డుతో సత్కరించింది. మారియట్ ఇంటర్నేషనల్‌కు చెందిన బిల్ మారియట్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఫ్యామిలీ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం వర్చువల్ గా జరిగిన ‘‘గ్లోబల్ సమ్మిట్ 2020’’ కార్యక్రమంలో ది ఇండస్ వ్యవస్థాపకులు (టీఐఈ) ఈ అవార్డులను ప్రదానం చేసింది. టీసీఎస్ వ్యవస్థాపక సీఈవో దివంగత కోహ్లీ తరపున ఆయన భార్య ఈ అవార్డును అందుకున్నారు. (ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక లేరు) ప్రతి వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ లా ఉండాలనే కలకంటారని, కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్దిలో ఆయన అద్భుతమైన కృషికి ఈ అవార్డు లభించిందని టీఐఈ గ్లోబల్ చైర్ మహావీర్ శర్మ వెల్లడించారు. అటు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 'టై గ్లోబల్' అవార్డును అందుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని గేట్స్ తన సందేశంలో తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కరణలే కీలకమని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలోనూ ఆవిష్కరణలే ప్రధానభూమిక పోషిస్తాయన్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ విభాగంలో మూడు అవార్డులతో పాటు, వివిధ విభాగాల క్రింద పది అవార్డులను ఇచ్చింది. స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మద్దతు ఇచ్చే ఉత్తమ ప్రభుత్వ సంస్థ అవార్డును సింగపూర్ ప్రభుత్వం గెలుచుకుంది. ఇతర అవార్డులు: ఉత్తమ కార్పొరేట్ సహాయక వ్యవస్థాపకత (స్టార్టప్‌ల కోసం గూగుల్ / ఆల్ఫాబెట్); ఉత్తమ విశ్వవిద్యాలయం ప్రోత్సాహక వ్యవస్థాపకత (స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం); ఉత్తమ యాక్సిలరేటర్ అవార్డు (వై కాంబినేటర్); ఉత్తమ పనితీరు గ్లోబల్ వీసీ ఫండ్ (సీక్వోయా క్యాపిటల్); ప్రపంచంలో అత్యంత చురుకైన ఏంజెల్ నెట్వర్క్ (టెక్ కోస్ట్ ఏంజిల్స్); బూట్‌స్ట్రాప్ టు బిలియన్స్ అవార్డు (బెన్ చెస్ట్నట్); రాపిడ్ లిస్టింగ్ అవార్డు (విఐఆర్ బయోటెక్నాలజీ), లైటనింగ్ యునికార్న్ అవార్డు (ఇండిగో అగ్రికల్చర్); మరియు మోస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ (డేటా రోబో) ఉన్నాయి. -
హైదరాబాద్‌తో ఎఫ్‌సీ కోహ్లీకి ప్రత్యేక అనుబంధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ రంగ పితామహునిగా పరిగణించే దిగ్గజం ఫకీర్ చంద్ కోహ్లీ (ఎఫ్‌సీ కోహ్లీ)కి హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ వీ రాజన్న పేర్కొన్నారు. తమ సంస్థ వ్యవస్థాపక సీఈవో అయిన కోహ్లీ పేరిట హైదరాబాద్‌లోని ఐఐఐటీలో ’కోహ్లీ సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్’ను టీసీఎస్ ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ దేశంలోని అగ్రశ్రేణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే నగరంలో 2015లో సైబర్నెటిక్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ సెంటర్ (కేసీఐఎస్) కూడా ఏర్పాటైంది. వయోజన అక్షరాస్యత కార్యక్రమానికి కోహ్లీనే ఆవిష్కర్త. ఈ ప్రోగ్రామ్‌లో 4–6 వారాల్లో ప్రాథమిక భాషలను నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారని రాజన్న గుర్తు చేసుకున్నారు. కోహ్లీ కొన్నేళ్ల పాటు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి బోర్డ్‌లోనూ పనిచేశారు. 2016లో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కోహ్లీని లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్‌తో సత్కరించింది. మంత్రి కేటీ రామారావు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. -
ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక లేరు
సాక్షి, ముంబై: భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వ్యవస్థాపకులలో ఒకరు, తొలి సీఈవో, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఫకీర్‌చాంద్ కోహ్లి (97) కన్నుమూశారు. 100 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమ నిర్మాణానికి పునాది వేసిన కోహ్లిని "సాఫ్ట్వేర్ పరిశ్రమ పితామహుడు" అని పిలుస్తారు. భారతీయ టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన కోహ్లీ మరణంపై పలువురు కార్పొరేట్ దిగ్గజాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఐటీ రంగానికి అనేక చేసిన సేవలు ఎనలేనివని, దేశానికి చెందిన అనేక తరాల ఐటీ నిపుణలు కోహ్లికి రుణపడి ఉంటారంటూ కాగ్నిజెంట్ ఇండియా మాజీ ఛైర్మన్ రామ్‌కుమార్ రామమూర్తి , మాజీ నాస్కామ్ చైర్మన్ గణేష్ నటరాజన్ సంతాపం తెలిపారు. ఎఫ్‌సీ కోహ్లీ 1924 మార్చి 19 న పెషావర్ బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. పెషావర్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు మరియు లాహోర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్ విజేత ఆయన. 1950 లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీజీ చేశారు. ఆగష్టు 1951 ప్రారంభంలో భారతదేశానికి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు ఎఫ్‌సీ కోహ్లీ. ఆ తరువాత 1970 లో టాటా ఎలక్ట్రిక్ కంపెనీలకు డైరెక్టర్ అయ్యారు. 1968, ఏప్రిల్ 1న జేఆర్డీ టాటా, ఎఫ్‌సీ కోహ్లీ టీసీఎస్‌ను స్థాపించారు. ముంబై కేంద్రంగా సేవలను అందిస్తూ తదనంతర కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా టీసీఎస్ అవతరించింది. 1995-96 వరకు నాస్కామ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కోహ్లీ. ప్రస్తుతం టీసీఎస్ ఛైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్, సీఈవోగా రాజేష్ గోపినాథన్ ఉన్నారు. pic.twitter.com/mLTMthHKcQ — Tata Consultancy Services (@TCS) November 26, 2020 -
మిస్త్రీ వ్యాఖ్యలు నిజం కావు: ఎఫ్‌సీ కోహ్లీ
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను రతన్ టాటా ఒకప్పుడు ఐబీఎంకు విక్రరుుంచే ప్రయత్నం చేశారంటూ ఆ గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలను టీసీఎస్ వ్యవస్థాపక చైర్మన్ ఎఫ్‌సీ కోహ్లీ కొట్టిపారేశారు. ‘‘టీసీఎస్‌ను ఐబీఎంకు విక్రరుుంచే విషయమై నిర్దిష్ట సమయం చెప్పకుండా మిస్త్రీ చేసిన వ్యాఖ్యలు నిజం కావు’’ అని పేర్కొన్నారు.