Feeder
-
నువ్వు గ్రేట్ గురు! వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ
ముంబై: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా దేశంలో ఇప్పటికే అధిక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా వల్ల ఆరోగ్యపరంగానే కాదు ఆర్థికంగాను తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కొంత మంది ఇతరులకు సహాయం చేస్తూ మానవత్వానికి మరో పేరులా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సుమారు 200 వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నాడు. అది కూడా చికెన్ బిర్యానీతో వాటి కడుపు నింపడం విశేషం. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రంజిత్ నాథ్ రోజూ దాదాపు 40 కిలోల బిర్యానీ వండుకుని నగరంలోని పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఆహారాన్ని అందిస్తున్నాడు. లాక్డౌన్ మొదలయిన తర్వాత జంతువులకు ఆహారం దొరకడం కష్టమైంది. వాటిని చూసి ఎంతో చలించిపోయారు రంజిత్. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు. నాగ్‌పూర్‌లో వీధి కుక్కలు, పిల్లులకు ప్రతి రోజు అన్నం పెట్టేందుకు ముందుకొచ్చారు. అలా అప్పటి నుంచి ప్రతి రోజు దాదాపు 200 వరకు వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ పెడుతూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు. బుధవారం ఓ పత్రిక సంస్థతో రంజిత్ మాట్లాడుతూ.. ‘నేను ఈ కుక్కల కోసం ప్రతీ రోజు 30-40 కిలోల చికెన్ బిర్యానీని సిద్ధం చేసుకుంటాను. వీధి జంతువులను నా పిల్లల్లాగే భావిస్తాను. నేను జీవించి ఉన్నంత వరకు ఈ పని చేస్తుంటాను. పైగా ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపాడు. నా పని మధ్యాహ్నం వంటతో మొదలై.. ఇలా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకు బైక్ మీద నగరం చుట్టూ తిరిగి పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు భోజనం పెట్టి వాటి ఆకలిని తీర్చడంతో నా పని పూర్తి అవుతుంద’ని అన్నాడు. చదవండి: మహిళను కాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ Ranjeet Nath from Nagpur feeds more than 150 strays 🐶 “They’re like my kids now & I will do this till I am alive. It makes me happy” He’s a true inspiration 🙇 If anyone has his contact details, do share. Would like to contribute a bit from my end 🙏 📸: IG/abhinavjeswani pic.twitter.com/DDm2sTDXf7 — Nigel D'Souza (@Nigel__DSouza) May 20, 2021 -
ఫీడర్లకూ ఎర్తింగ్ ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ ఫీడర్లకు ఎర్తింగ్ ముప్పు తప్పడం లేదు. వినియోగదారుల గృహాల్లోనే కాదు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద కూడా సరైన ఎర్తింగ్ సిస్టం లేకపోవడంతో సబ్స్టేషన్లలోని ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. నిజానికి లైన్ల పునరుద్ధరణ, నిర్వహణ కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఏటా రూ.వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. ఈ పునరుద్ధరణ పనుల్లో భాగంగా లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, పాడైన ఇన్సులేటర్లు, కండక్టర్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చడం, లూజు వైర్లను సరి చేయడం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ లీకేజీలను అరికట్టడం, విద్యుత్ సరఫరాలో హె చ్చుతగ్గులకు కారణాలు గుర్తించి వాటిని సరి చేయడం వంటి పనులు చేయాల్సి ఉంది. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లోని కోర్‌సిటీలో మినహా శివారు ప్రాంతాల్లోని సర్కిళ్ల పరిధిలో ఈ పనులను నిర్వహించకపోవడంతో ఫీడర్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి...విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే కొంత మంది ఇంజనీర్లు బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి పునరుద్ధరణ పనుల పేరుతో సంస్థ ఖజానాను కొల్లగొడుతుండటం విశేషం. నిర్వహణ లోపం.. తరచూ అంతరాయాలు: ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం వీటిలో 42 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 7 లక్షలకుపైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. మరో 50 వేలకుపైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. లక్షకుపైగా వీధి దీపాల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 33/11కేవీ సబ్‌స్టేష న్లు 306, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 96882, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 802పైగా, 33కేవీ, 11కేవీ, ఎల్టీలైన్స్ 52142 కిమిపైగా ఉన్నాయి. రాజేంద్రనగర్, హబ్సి గూడ, సరూర్‌నగర్, సైబర్‌సిటీ, మేడ్చల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్ సర్కిళ్లు కొత్తగా ఏర్పడ్డాయి. శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండటం, కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు వెలుస్తుండటం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 2006లో నగరంలో 24.12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 1538 మెగవాట్ల విద్యుత్ వినియోగం ఉండేది. 2019 మే 29న అత్యధికంగా 3391 మెగవాట్ల విద్యుత్ వినియోగం (73.84 ఎంయూ)జరగగా, ఆ తర్వాత రోజుకో ఎంయూ చొప్పున వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త లైన్లు, డీటీఆర్లు, ఫీడర్లు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ... వాటికి సరైన ఎర్తింగ్ సిష్టం ఏర్పాటు చేయక పోవడం, ఒక వేళ ఎర్తింగ్ సిష్టం ఏర్పాటు చేసిన ప్పటికీ..నిర్వహణ లోపం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. చంపాపేట డివిజన్లో తరచూ కోతలు: చంపాపేట డివిజన్ పరిధిలోని బైరమల్గూడ సెక్షన్ నందనవనం సబ్‌స్టేషన్‌లోని 11కేవీ ఫీడర్లు రోజకు కనీసం నాలుగైదు సార్లు ట్రిప్పవుతున్నాయి. ఎవరైనా వినియోగదారులు ఫిర్యాదు చేసినప్పుడు ఫీడర్ ఆన్ చేయడం, ఆ తర్వాత కొద్ది సేపటికే మళ్లీ ట్రిప్పవడం ఇక్కడ పరిపాటిగా మారింది. లోపభూయిష్టమైన లైన్ల పునరుద్ధరణ పనులే ఇందుకు కారణమని తెలిసింది. సరూర్‌నగర్ డివిజన్, వనస్థలిపురంలోనూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు ఆయా ఏరియాలకు సంబధించిన లైన్మెన్లు, ఎఫ్ఓసీ సిబ్బందితో క్షేత్రస్థాయిలో పర్యటించి....లైన్ల పనితీరును స్వయంగా పర్యవేక్షించాల్సిన సంబంధిత ఇంజనీర్లు ఇవేవీ పట్టించుకోవడం లేదు. -
చిరుధాన్యాల రైతుకు ఎకరానికి రూ.4 వేలు!
జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో భాగంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని, వినియోగాన్ని పెంపొందించడం ద్వారా పోషకాహార లోపాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ‘మిల్లెట్ మిషన్’ను 2018–19 నుంచి అమల్లోకి తెస్తున్నది. ఐదేళ్లలో రూ. 1,700 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. తొలి ఏడాదిలో రూ. 300 కోట్లు కేటాయించారు. చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల వరకు నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) సంచాలకులు డా. విలాస్ ఎ. తొనపి వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాల్లో తొలుత మిల్లెట్ మిషన్ ఈ ఖరీఫ్ నుంచే అమల్లోకి వస్తుందని ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యాంశాలు.. ► ‘మిల్లెట్ మిషన్’ విశేషాలేమిటి? హరిత విప్లవ కాలంలో వరి, గోధుమల సాగుపై దృష్టి కేంద్రీకరించడంతో పోషకాల గనులైన చిరుధాన్యాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల్లో పౌష్టికాహార లోపం ఏర్పడడంతోపాటు జీవన శైలి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిని కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మిల్లెట్ మిషన్ అమలుకు తొలి అడుగు పడింది. తొలుత 13 రాష్ట్రాల్లో మిల్లెట్ మిషన్‌ను ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి తెస్తున్నాం. ఐదేళ్లలో రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తాం. 2018–19లో రూ. 300 ఖర్చు చేయనున్నాం. ► చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు..? జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలను సాగు చేసే రైతులతో క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తాం. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ, నాబార్డు, ఐ.ఐ.ఎం.ఆర్. బాధ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ మిల్లెట్ మిషన్ అమలును పర్యవేక్షిస్తుంది. 2018–19 ఖరీఫ్ సీజన్ నుంచే చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల వరకు నేరుగా నగదు బదిలీ చేస్తాం. చిరుధాన్యాల ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో అత్యధికంగా చిరుధాన్యాలను సాగు చేస్తున్నది మన దేశమే. దేశంలో 1.7 కోట్ల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. 1.8 కోట్ల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. ప్రతి సంవత్సరం పది శాతం సాగు పెంచాలన్నది లక్ష్యం. ► ప్రోత్సాహకాలు రైతులకా.. రైతు బృందాలకా? రైతులకు వ్యక్తిగతంగా కాదు. చిరుధాన్యాలు పండించే రైతుల ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్.పి.ఓ.) ద్వారా అందిస్తాం. నాబార్డు ద్వారా ఎఫ్.పి.ఓ.లను ఏర్పాటు చేస్తాం. ఎఫ్.పి.ఓ.లను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును కూడా మిల్లెట్ మిషన్ నిధుల నుంచి కేటాయిస్తాం. తెలంగాణా రాష్ట్రంలో 8 జిల్లాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సాహానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక జిల్లాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా చిన్న చిరుధాన్యాలైన కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఒరిగల సాగును విలేజ్ క్లస్టర్ల ద్వారా ప్రోత్సహించడం.. స్థానికంగానే వినియోగంలోకి తేవడానికి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారిస్తున్నాం. స్వయం సహాయక బృందాల ద్వారా 100 మిల్లెట్ ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ఎఫ్.పి.ఓ.లు కొన్నిటిని కలిపి ఫెడరేషన్‌గా ఏర్పాటు చేస్తాం. ► విత్తనం కోసం ఎవరిని సంప్రదించాలి? హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (డా.రఘునా«ద్: 99842 15020, డా. వెంకటేష్ భట్: 94406 44040)లో, నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (డా. సుబ్బారావు: 99896 25227), విజయనగరంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం(డా. పాత్రో: 97010 23194) చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ► ప్రాసెసింగ్ యంత్రాలపై సబ్సిడీ ఇస్తారా? పౌష్టికాహార లోపం, జీవనశైలి వ్యాధుల బెడద ప్రస్తుతం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంత వాసుల్లో కూడా అధికంగానే ఉన్నాయి. అందువల్ల చిరుధాన్యాల వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా పెంచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు సాగు చేసిన చిరుధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించి స్థానికంగానే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తాయి. రైతుల పొలాల దగ్గరలోనే ప్రాథమిక స్థాయి ప్రాసెసింగ్ సదుపాయాలను అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. ఎఫ్.పి.ఓ.లకు ప్రాసెసింగ్ మిషన్లను సబ్సిడీపై అందిస్తాం. చిరుధాన్యాలను నిల్వ చేసుకోవడానికి గోదాముల నిర్మాణానికి కూడా తోడ్పాటునందిస్తాం. ప్రభుత్వ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటాం. ప్రస్తుతం ప్రోసెసర్లు చిరుధాన్యాల రైతులను దోపిడీ చేస్తున్నారు. అలా కాకుండా రైతులకు సాగు ఖర్చులకు 50% అదనంగా ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ► చిరుధాన్య ఉత్పత్తులకు ప్రోత్సాహం చర్యలేమిటì ? హైదరాబాద్‌లోని ఐ.ఐ.ఎం.ఆర్.లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రత్యేక శిక్షణా సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం వివరాలకు డా. దయాకర్‌రావు (99897 10405), డా. సంగప్ప (98800 45728)లను సంప్రదించవచ్చు. ► డాక్టర్ ఖాదర్‌వలి చిరుధాన్యాలకు సిరిధాన్యాలని పేరుపెట్టి.. రోగులకు ఔషధాలుగా ఇచ్చి జబ్బులు నయం చేస్తున్నారు. దీనిపై ఐ.ఐ.ఎం.ఆర్. అభిప్రాయం ఏమిటి.? అవును. మా దృష్టికి వచ్చింది. డాక్టర్ ఖాదర్ వలి గారు గొప్ప సేవ చేస్తున్నారు. ఆయనను ఆహ్వానించి గౌరవించాలనుకుంటున్నాం. ఆయన అనుసరిస్తున్న చికిత్సా పద్ధతిపై అధ్యయనం చేయించి.. చిరుధాన్యాల వినియోగం వ్యాప్తికి చేపట్టనున్న ప్రచారోద్యమంలో ఈ భావనను అంతర్భాగం చేస్తాం. ఈ కృషిలో ఆయుష్ శాఖ నిపుణుల తోడ్పాటు కూడా తీసుకుంటాం. (డా. తొనపిని 85018 78645 నంబరులో సంప్రదించవచ్చు. millets.icar@nic.in director.millets@icar.gov.in) -
రెక్కలు తెగిన నెల్లూరు
వరద పోటుతో విలవిల్లాడుతున్న నెల్లూరు జిల్లా * జలదిగ్బంధంలోనే సింహపురి వాసులు * ఇంటి పైకప్పులు, చెట్లపైనే వందలాది మంది * సాయం చేసేవారి కోసం ఎదురుచూపులు * జిల్లా వ్యాప్తంగా 81 మంది మృత్యువాత * నీటమునిగిన పవర్ స్టేషన్లు, ఫీడర్లు * సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం విఫలం * సమీక్షలకే పరిమితమైన మంత్రులు సాక్షి నెట్వర్క్: తినేందుకు అన్నం, తాగేందుకు నీళ్లేకాదు కనీసం నిలబడేందుకు భూమికూడా లేదు. చుట్టూ ఎటుచూసినా నీళ్లే. చెట్టు, పుట్ట, గోడ, పైకప్పు ఏది కనిపిస్తే అదే అసరాగా గంటలతరబడి గడిపేస్తున్నారు. ఎవరైనా వస్తారని, ఆదుకుంటారనే ఆశతో చూసి.. చూసి.. నిల్చున్నచోటే కొయ్యబారిపోతున్నారు.ఆదుకోండంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలో నెలకొన్న అత్యంత దయనీయ పరిస్థితి ఇది. మిగతా జిల్లాల్లో పరిస్థితి కాస్త మెరుగుపడ్డా నెల్లూరు జిల్లా మాత్రం ఇంకా వరద బీభత్సాన్ని ఎదుర్కుంటూనే ఉంది. గురువారం కూడా జల్లుమీద జల్లు పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 10 మంది వరదలో కొట్టుకుపోయి, విద్యుత్ షాక్‌తో నలుగురు, చలితీవ్రతకు 67 మంది..మొత్తం 81 మంది మరణించారు. 459 పశువులు మృత్యువాత పడ్డాయి. ఆలకించేవారే లేరు..: జిల్లావ్యాప్తంగా వందలాది మంది జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. చిట్టమూరు వద్ద మూడు రోజులపాటు 22 మంది జలదిగ్భంధంలో చిక్కుకుని కాపాడంటూ వేడుకున్నా.. ప్రభుత్వ యంత్రాంగం వారిని ఒడ్డుకు చేర్చలేని దుర్భరస్థితి. ఇళ్లలోకి వరదనీరు రావటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వందలాది కుటుంబాలు నివాసాలపైకి ఎక్కి.. రక్షించండంటూ కేకలు పెట్టినా వారి మొర ఆలకించేవారు కరువయ్యారు. వారికి ఆహార ప్యాకెట్లు అందించే విషయంలోనూ అధికారయంత్రాంగం విఫలమైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నాయి. మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లాలోనే ఉన్నా.. వారు అధికారులతో సమీక్షలు, సమావేశాలకే పరిమతమయ్యారు. అక్కడక్కడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండిపోయారే తప్ప.. వరద ముప్పును అంచనా వేయటం.. వేగంగా సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనం.. గురువారం సీఎం చంద్రబాబు ముగ్గురు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయటమే. చిల్లకూరు మండలం తీర ప్రాంతంలోని రెండు విద్యుత్ పరిశ్రమల్లోకి నీరు చేరింది. దీంతో మూడురోజులుగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొంతమంది బాధితులను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ వేలమంది బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వరదలోనే ఉన్నారు. గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు డివిజన్లలో రోడ్లు తెగిపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అపారనష్టం.. : అవినీతి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వందలాది చెరువులు, నదులు తెగి గ్రామాలు, పంటలను ముంచెత్తింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో పాటు, వరి, అరటి, బొప్పాయి, నిమ్మ, వేరుశనగ, వరి నారుమళ్లు, మినుము, తమలపాకుల తోటలు దెబ్బతిన్నాయి. 12వేల ఎకరాల్లో సాగవుతున్న ఆక్వా వరదనీటిలో కొట్టుకుపోయింది. మొత్తంగా రైతాంగమే రూ.3వేల కోట్లకుపైగా నష్టపోయినట్లు అంచనా.150 పునరావాల కేంద్రాల్లో సుమారు 20 వేల మందికిపైగా తలదాచుకుంటున్నారు. నగరమా? నరకమా? ఎన్నడూలేని విధంగా నెల్లూరు నగరాన్ని వరదనీరు చుట్టుముట్టింది. వరద నీరు వెళ్లేందుకు ఉన్న మార్గాలన్నీ మూసుకుపోవటంతోరోడ్లు, నివాసాలు, వ్యాపార దుకాణాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, పెట్రోలు బంకులు నీటమునిగాయి. ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో నగరవాసులు నరకయాతనను అనుభవిస్తున్నారు. స్తంభించిన రాకపోకలు మనబోలు వద్ద జాతీయ రహదారికి మంగళవారం రాత్రి గండిపడటంతో చెన్నై-విజయవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది వాహనాల్లోని ప్రయాణికులు రోడ్డుపైనే రెండురోజులపాటు గడపాల్సి వచ్చింది. నెల్లూరు-ముంబై రహదారి కూడా పలుచోట్ల గండ్లుపడటంతో అటువైపు వెళ్లే వాహనాలు సైతం నిలిచిపోయాయి. నెల్లూరు నుంచి చెన్నై, తిరుపతి, కడప, కర్నూలు, ముంబై వెళ్లే వారిదీ ఇదే పరిస్థితి. గురువారం రాత్రికి రాకపోకలను పునరుద్ధరించారు. కలకత్తా-చెన్నై జాతీయరహదారిని పాక్షికంగా పునరుద్ధరించారు. మనుబోలు మండలపరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం వేకువన బ్రిడ్జ్ కూలిన విషయం తెలిసిందే. కోతకు గురైన హైవేను గురువారం రాత్రి 7 గంటల సమయంలో గూడూరు నుంచి నెల్లూరు వచ్చే వైపు పునరుద్ధరించి వాహనాలను అనుమతించారు. తిరుపతిపై జలఖడ్గం..: వర్షాల కారణంగా ఏక్షణంలో ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి తిరుపతిలో నెలకొంది. గురువారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రధానమైన రోడ్లు జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని అధికారులు చెబుతున్నా శ్రీకాళహస్తి నియోజక వర్గంలో 70 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 మంది మరణించారు. కూలిన కొండచరియలు తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. మొదటి ఘాట్‌రోడ్డులో తొలిసారిగా కొండ చరియలు కూలాయి. రెండో ఘాట్ తరహాలోనే మొదటి ఘాట్‌రోడ్డులో కూడా రాళ్లు కూలడంతో ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. తమిళనాడుకు మళ్లీ వానముప్పు భారీ వర్షాల నుంచి తమిళనాడు కోలుకోక ముందే మళ్లీ ప్రమాదం పొంచి ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో శుక్ర, శనివారాల్లో వానలు పడతాయని ప్రకటించింది. వరద సాయంలోనూ వివక్షేనా? మూడు రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నామని కనీసం పట్టించుకున్నవారు కూడా లేరని ఏపీపీఎస్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకా డు దళితవాడకు చెందిన వరద బాధితులు నిలదీశారు. గురువారం గూడూరు సబ్ కలెక్టర్ గిరిషాతోపాటు ప్రత్యేక అధికారి గిరిధర్ వచ్చారు. దీంతో వరద భాధితులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట వారిని చుట్టుముట్టారు. ప్రభుత్వం ప్రకటించిన వరద బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీలో అధికారులు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లల్లో నీళ్లు ఉంటేనే వరద సాయం వస్తుందని, లేకుంటే రాదని రెవెన్యూ అధికారులు చెప్పడం దారుణమన్నారు. అప్పటివరకు తాము నీళ్లల్లో ఎలా ఉంటామో మీరే చెప్పాలంటూ వరద బాధితులు ప్రిన్సిపల్ సెక్రటరీని గట్టిగా అడిగారు. స్పందించిన గిరిధర్ కాసేపు అధికారులతో చర్చించిన అనంతరం ప్రతి ఒక్కరికి వరద సాయం అందించాలని ఆదేశించారు. -
రైతులను ఆగం చేస్తున్న ‘కరెంట్’
బాల్కొండ:బాల్కొండ మండలంలో సాగుకు నాలుగు ఫీడర్లలో విద్యుత్ సరఫరా చేసే అధికారులు గత రెండు రోజుల నుంచి ఏ ఫీడర్‌కు ఎప్పుడు సరఫరా ఉంటుందో చెప్ప లేమంటున్నారు. ఉదయం ఉన్నతాధికారుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకైనా విద్యుత్ సరఫరా చేపట్టవచ్చంటున్నారు. దీంతో రైతులు పంట భూముల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్క ఫీడర్‌కు ఏడు గంటల విద్యుత్ కూడా సరఫరా చేస్తున్నారు. ఆరు గంటలు కూడా నిరంతరం సరఫరా చేస్తున్నారు. కానీ ఎప్పుడిస్తారో, ఇవ్వరో తెలియదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇలా ట్రాన్స్‌కో అధికారులు రైతుల బతుకులను ఆగం చేస్తున్నారు. రబీ పంటలు సాగు చేయడంలో రైతులు నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా జొన్న పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ఏ, బీ, సీ, డీ గ్రూపుల్లో సాగుకు విద్యుత్ సరఫరా చేసిన అధికారులు ప్రస్తుతం ఏ గ్రూపునకు సరఫరా ఎప్పుడు ఉంటుందో చెప్పలేక పోతున్నారు. రైతులు మాత్రం విద్యుత్ ఎప్పుడు వస్తుందోనని విద్యుత్ డబ్బాల వద్ద రాత్రి, పగలు కాపలా కాస్తున్నారు. వెన్ను వణికే చలిలో కూడా పంట భూముల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్ వస్తే మాత్రం నిరంతరంగా 5 నుంచి ఆరు గంటల సరఫరా చేస్తున్నారని అంటున్నారు. కోతలప్పుడు వేళాపాల లేకుండా కోతలు విధించారు. కానీ నిరంతరం సరఫరా చేస్తున్నప్పుడు కూడా వేళాపాల లేకుండా చేయడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి విద్యుత్‌కు గంట బోనస్..! రాత్రి విద్యుత్‌కు గంట విద్యుత్‌ను బోనస్‌గా ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా సరఫరా చేస్తున్నారు. రాత్రి విద్యుత్‌కు వెళితే గంట విద్యుత్ కలిసొస్తుందని రైతులు చలిని కూడా లెక్క చేయకుండా వెళుతున్నారు. నాణ్యమైన విద్యుత్ అంటే వేళాపాల లేని సరఫరా అని రైతులు విమర్శిస్తున్నారు. ఆరు తడి పంటలు సాగు చేస్తున్న ప్రాంతాల్లో మూడు ఫీడర్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఫీడర్‌కు 4 గంటల విద్యుత్ నిరంతరం సరఫరా చేస్తే సరిపోతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ సరఫరా తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.