FICCI survey
-
కంపెనీలు ఎదుర్కొంటున్న రిస్క్‌లేంటో తెలుసా?
న్యూఢిల్లీ: మేధోపరమైన హక్కులు (ఐపీ), సమాచారం, సైబర్ దాడులు, ప్రమాదాలు అనేవి భారత కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన రిస్క్‌లు అని ఫిక్కీ సర్వే తెలిపింది. మహిళల భద్రతా ముప్పు 2021లో 12వ స్థానంలో ఉంటే, 2022లో 5వ స్థానానికి వచ్చినట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఎత్తి చూపింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! లాజిస్టిక్స్, నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీని ప్రధానంగా ప్రస్తావించాయి. ముఖ్యంగా లాజిస్టిక్స్ కంపెనీలకు రోడ్డు ప్రమాదాలు రెండో అత్యంత ఆందోళకరమైన అంశంగా ఉంది. ఐపీ హక్కుల చోరీ మొదటి స్థానంలో ఉంది. నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాల రూపంలో ఎక్కువ రిస్క్‌ను చూస్తున్నాయి. రిటైల్ పరిశ్రమ ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీ, విపత్తులను రిస్క్‌లుగా తెలిపాయి. మీడియా, వినోద పరిశ్రమ సమాచారం, సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను ప్రస్తావించాయి. ఐటీ, తయారీ రంగంలో ఐపీ హక్కుల చోరీ ప్రథమ రిస్క్‌గా ఉంది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే రిస్క్‌లను తెలుసుకునేందుకు ఫిక్కీ ఈ వార్షిక సర్వే నిర్వహించింది. ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్! -
మహమ్మారి ఎఫెక్ట్ : పతనం అంచున పరిశ్రమ
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని పరిశ్రమ సంస్థ ఫిక్కీ సర్వేలో వెల్లడైంది. గత కొద్దివారాలుగా మహమ్మారి ప్రభావంతో అంచనాలకు మించి ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, భవిష్యత్‌లోనూ వ్యాపారాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై కోవిడ్-19 ప్రభావంపై అనిశ్చితి నెలకొందని ఫిక్కీ-ధ్రువ సర్వే తేల్చిచెప్పింది. కరోనా మహమ్మారి తమ వ్యాపారాలపై అధిక నుంచి అత్యధిక స్ధాయి ప్రభావాన్ని చూపతోందని సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపారాలకు సానుకూల డిమాండ్ నెలకొనే పరిస్ధితి లేదని కూడా సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు భారీగా పడిపోతాయని 70 శాతం మంది వెల్లడించారు. కరోనా మహమ్మారితో తమ వ్యాపారంలో నగదు ప్రవాహాలు కుచించుకుపోవడంతో పాటు ఆర్డర్లు గణనీయంగా తగ్గుతాయని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్ధిష్ట ఆర్థిక ప్యాకేజ్‌తో సత్వరమే ముందుకురాని పక్షంలో పరిశ్రమ గడ్డుపరిస్ధితిని ఎదుర్కొంటుందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. తమ సంస్ధల్లో సిబ్బందిని తగ్గించాలని యోచిస్తున్నామని సర్వే పలుకరించిన వారిలో నాలుగింట మూడొంతుల మంది వెల్లడించడంతో రాబోయే నెలల్లో ఉద్యోగాలు పెద్ద ఎత్తున కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. చదవండి : కరోనాపై అంతుచిక్కని అంశాలు వ్యాపారాల విస్తరణకు పలు సంస్ధలు చేపట్టిన ప్రణాళికలూ కోవిడ్ మహమ్మారితో అటకెక్కాయని సర్వేలో వెల్లడైంది. ఇక ఫిక్కీ-ధ్రువ చేపట్టిన ఈ సర్వేలో పలు రంగాలకు చెందిన 380 కంపెనీలు పాలుపంచుకున్నాయి. కోవిడ్-19 ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించిందని, దశాబ్ధాలుగా పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్ధ సాధించిన ప్రయోజనాలను హరించివేసిందని ఫిక్కీ ప్రెసిడెంట్ డాక్టర్ సంగీతా రెడ్డి అన్నారు. ప్రజలు, ఉద్యోగాలు, సంస్ధలను కాపాడేందుకు పరిశ్రమను ఆదుకునేలా ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అవసరమని పేర్కొన్నారు. వ్యాపారాలు సజావుగా సాగేందుకు సత్వరమే ద్రవ్య సరఫరా పెంచాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేలా డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం ద్రవ్య ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించడంతో పాటు లిక్విడిటీని పెంచడం, ట్యాక్స్ రిఫండ్లు, తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలని ధ్రువ అడ్వైజర్స్ సీఈఓ దినేష్ కనబర్ కోరారు. -
వ్యాపారాలపై ధీమా తగ్గింది
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి వ్యాపారాలపై కార్పొరేట్ల ధీమా సన్నగిల్లింది. 2008–09 నాటి అంతర్జాతీయ ఆర్థిక మాంద్య స్థాయికి పడిపోయింది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ ఎకానమీ పరిస్థితులు సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థాయికి తిరిగొచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, వ్యాపారాలకు సహాయక ప్యాకేజీలు ఇవ్వాలని ఫిక్కీ పేర్కొంది. అలాగే కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ మరో 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) తగ్గించాలని కోరింది. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే దిశగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో భారత్ సహా పలు దేశాల వృద్ధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాపారవర్గాలపై ఫిక్కీ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. ‘వ్యాపార విశ్వాస సూచీ ప్రస్తుతం 42.9 పాయింట్లుగా ఉంది. గత సర్వేలో ఇది 59.0గా నమోదైంది‘ అని ఫిక్కీ పేర్కొంది. గతంలో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు 2008–09 రెండో త్రైమాసికంలో ఈ సూచీ అత్యంత కనిష్టమైన 37.8 స్థాయికి పడిపోయినట్లు వివరించింది. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అవకాశాలపై వ్యాపార వర్గాల్లో ధీమా సడలటాన్ని ఇండెక్స్ సూచిస్తోందని తెలిపింది. వివిధ రంగాలకు చెందిన సుమారు 190 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వీటి టర్నోవరు రూ. 1 కోటి నుంచి రూ. 98,800 కోట్ల దాకా ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంపై వ్యాపార వర్గాల అంచనాలను దీని ద్వారా సేకరించారు. సబ్సిడీలు.. ట్యాక్స్ హాలిడేలు కావాలి.. డిమాండ్, సరఫరా, నిధుల కొరత రూపంలో దేశ ఎకానమీ ప్రధానంగా మూడు సమస్యలు ఎదుర్కొంటోందని ఫిక్కీ తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తం పరిశ్రమకు.. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు గట్టెక్కడానికి కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. సబ్సిడీలు, విధానపరమైన మద్దతు, ట్యాక్స్ హాలిడేలు, కరోనా పూర్వ స్థాయిల్లో ఉద్యోగాలను కొనసాగించేందుకు ప్రత్యేకంగా నిధులపరమైన తోడ్పాటులాంటివి అందించాలని విజ్ఞప్తి చేసింది. కార్మిక మార్కెట్ సంస్కరణలను తక్షణమే ప్రాధాన్యత అంశంగా పరిశీలించాలని కోరింది. అలాగే, నేరుగా రిజర్వ్ బ్యాంక్ నేరుగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలు చేపట్టాలని, రెపో రేటును మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపింది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో అత్యధికంగా 72 శాతం కంపెనీలు.. కరోనావైరస్ వ్యాప్తి తమ వ్యాపారాలను దెబ్బతీసిందని వెల్లడించాయి. -
ఆర్థిక వ్యవస్థ రికవరీ కష్టమే...
ఫిక్కీ సర్వేలో కార్పొరేట్ల నిర్వేదం న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ రికవరీ పట్ల భారత కంపెనీల ఆశలు అడుగంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రికవరీ కష్టమేనని కంపెనీలు భావిస్తున్నాయి. గత ఆర్నెళ్ల నుంచి ఆర్థిక పరిస్థితుల్లోనూ, కంపెనీల స్థితిగతుల్లోనూ ఎలాంటి మెరుగుదల లేదని ఫిక్కీ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. కింది స్థాయి నుంచి విధానాల అమలు సక్రమంగా జరిగినట్లయితేనే ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసం మెరుగుపడుతుందని కంపెనీలు అంటున్నాయి. జూలై-డిసెంబర్ కాలానికి అంచనాలు, ఇంకా వివిధ అంశాలపై రూ.6 కోట్ల నుంచి రూ.92,000 కోట్ల టర్నోవర్ ఉన్న దాదాపు 130 కంపెనీలపై ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఉక్కు, ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్, ప్లాస్టిక్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎలక్ట్రిక్ పరికరాల తయారీ, ఇన్ఫ్రా తదితర రంగాల కంపెనీలు పాల్గొన్నాయి. ఫిక్కి బిజినెస్ కాన్ఫిడెన్స్ పోల్ సర్వేలో ముఖ్యాంశాలు.. ►గత ఏడాది మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసం ప్రోత్సాహకరంగా పెరిగింది. ఇదే జోరు రానున్న కాలంలో కొనసాగాల్సిన ఉంది. ►రానున్న ఆర్నెళ్లలో ఆర్థిక వ్యవస్థ, కంపెనీల స్థితిగతులు కొంత మెరుగుపడవచ్చు. ►వివిధ దేశీయ, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ►తమ కంపెనీలు 75 శాతం తక్కువ ఉత్పత్తి సామర్థ్యం స్థాయిలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని 50 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ►డిమాండ్ పడిపోవడం పట్ల 71 శాతం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. -
మోడీ సర్కారుతో వృద్ధి పరుగులు!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని సుస్థిర ఎన్డీఏ సర్కారు కొలువుదీరనున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు రానున్నాయని కార్పొరేట్లు ఆశిస్తున్నారు. పారిశ్రామిక మండలి ఫిక్కీ నిర్వహించిన సర్వేలో మెజారిటీ కంపెనీల సీఈఓలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమీప కాలంలో దేశ ఆర్థిక పరిస్థితులు భారీగా మెరుగుపడనున్నాయని 93 శాతం మంది సీఈఓలు(మొత్తం సర్వేలు పాల్గోన్నవారి సంఖ్య 76) పేర్కొన్నారు. 7 శాతం మంది మాత్రమే ఓమోస్తరు మెరుగుదల ఉంటుందని అంచనా వేశారు. గడిచిన కొద్దికాలంగా ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాల విషయంలో జడత్వం నెలకొందని, వృద్ధికి ఇది ఆటంకంగా మారినట్లు అత్యధిక శాతం సీఈఓలు భావిస్తున్నారని ఫిక్కీ పేర్కొంది. ఇప్పుడు కేంద్రంలో సుస్థిరమైన మోడీ సర్కారు రానుండటంతో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని తిరిగి పెంపొందించే చర్యలు ఉంటాయని.. అదేవిధంగా ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యంగా తయారీ రంగంలో పెట్టుబడుల పెంపునకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్న విశ్వాసం వ్యక్తమవుతున్నట్లు సర్వే నివేదిక వెల్లడించింది. వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)ను పటిష్టంగా అమలు చేయడం, కొత్త ఉద్యోగాల కల్పన వంటి అంశాలను మోడీ సర్కారు నుంచి కార్పొరేట్లు ప్రధానంగా ఆశిస్తున్నారని తెలిపింది. వచ్చే 12 నెలల్లో తమ వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాల్లో గణనీయమైన పురోగతి ఉండొచ్చని సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది సీఈఓలు చెప్పడం గమనార్హం.