final notification
-
ఇక 33 జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భౌగోళిక స్వరూపం 33 జిల్లాలుగా విడిపోయింది. ప్రస్తుతమున్న 31 జిల్లాలకు తోడు ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ములుగు, నారాయణపేట జిల్లాలు నేటి నుంచి మనుగడలోకి రానున్నాయి. ములుగు జిల్లాలో 9 మండలాలు, 336 గ్రామాలుండగా... 11 మండలాలు, 246 గ్రామాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది. ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్ 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ కాగా, నెల రోజుల పాటు అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. ఈ అభ్యంతరాలు, వినతులను పరిశీలించిన అనంతరం తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) చట్టం 1974, సెక్షన్ 3 ప్రకారం ఆదివారం నుంచి ఈ జిల్లాలు మనుగడలోకి వస్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు... నారాయణపేట జిల్లాలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలు ఉన్నాయి. కొత్త కలెక్టర్ల నియామకం.. రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం శనివారమే ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లుకు ములుగు జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ డి.రోనాల్డ్రాస్కు నారాయణపేట జిల్లా కలెక్టర్లుగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ఉత్తర్వులు జారీ చేశారు. -
రూరల్ జిల్లా ఉంటుందా..
మంత్రివర్గ సమావేశంలో చర్చ తుది నోటిఫికేషన్‌పై ఉత్కంఠ సాక్షిప్రతినిధి, వరంగల్ : రోజుకో తీరుగా మారుతున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేయనున్న తుది నోటిఫికేషన్లో ఎన్ని జిల్లాలు ఉంటాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ములుగు జిల్లా డిమాండ్‌తో ఉద్యమం తీవ్రమైన నేపథ్యంలో... వరంగల్ రూరల్ జిల్లా ప్రతిపాదన ఉంటుందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజన తుది ముసాయిదాపై శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. వరంగల్ జిల్లా పునర్విభజనలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలుగా ఏర్పాటయ్యేలా ప్రతిపాదనలు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై ఏ వర్గంలోనూ ఆసక్తి లేదని వివరించినట్లు సమాచారం. వరంగల్ నగరానికి సమీపంలో ఉండే ప్రాంతాలను వేరే జిల్లాగా చేయడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి అంతకుముందు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ములుగు జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను పరిశీలించాని మంత్రి అజ్మీరా చందూలాల్ మరోసారి కోరినట్లు తెలిసింది. ఇలా ములుగు జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్.. వరంగల్ రూరల్ జిల్లా అవసరం లేదని ప్రతిపాదనల నేపథ్యంలో జిల్లాల పునర్విభజన తుది ముసాయిదాపై ఆసక్తి పెరుగుతోంది. వరంగల్ జిల్లాలో కొత్తగా నాలుగు జిల్లాలు ఉంటాయా, ఐదు జిల్లాలు ఉంటాయా, ఏ జిల్లాలు ఉంటాయనే ఉత్కంఠకు ఒకటి రెండు రోజుల్లో జారీ చేయనున్న తుది నోటిఫికేషన్‌తో తెరపడనుంది. -
ఈ-రిక్షాలపై వచ్చేవారం తుది నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఈ-రిక్షాలకు సంబంధించి నూతన నియమనిబంధనలతోకూడిన తుది నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం వచ్చేవారం విడుదల చేయనుంది. ఇందులో గరిష్ట వేగపరిమితి గంటకు 25 కి.మీ: డ్రైవింగ్ లెసైన్సు తప్పనిసరివంటి నిబంధనలను పొందుపరచనుంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. న్యూ సెంట్రల్ వెహికల్ రూల్స్-2014 పేరిట దీనిని విడుదల చేస్తుందన్నారు. దసరా సెలవుల తర్వాత కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశముందన్నారు. కాగా నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31న ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగ తి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషేధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది. హస్తిన రహదారులపై ‘ఈ-కార్టు’లు: నగర రోడ్లపై ఈ-కార్ట్’ అనే కొత్త రకం వాహనాలను అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రిక్షాల్లో నలుగురు వ్యక్తులు, 40 కేజీల లగేజీని అనుమతిస్తుండగా, ఈ-కార్ట్‌లను కేవలం సరుకుల రవాణాకు వాడనున్నారు. ఇందులో 310 కేజీల వరకు బరువైన సరుకులను తరలించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ కేటగిరీ కింద అనుమతించనున్న వాహనాలు ప్రభుత్వ ఆమోదిత సంస్థలు నిర్వహించే భద్రత పరీక్షలకు తట్టుకోవాలని, తగిన ప్రామాణికాలను కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ వాహనాలు తగిన నాణ్యతా ప్రమాణాలను పాటించాయని ఢిల్లీ హైకోర్టు నమ్మిన మీదటే రహదారులపైకి వచ్చే అవకాశముంది. అయితే నమూనా పరీక్షల విషయమై రోడ్డు భద్రతా నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.