Financial academics
-
కొత్త సంవత్సరంలో ఎవరు ఏం చేయాలో తెలుసా..
ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. పాత రోజుల్లాగే ఈ ఏడాదీ గడిచిపోతే కిక్కేముంటుంది. వైవిధ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఆర్థికంగా ఈ ఏడాదిలో మరింత రాణిస్తూ, పెట్టుబడులను కాపాడుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే కొందరు వయసురీత్యా రిస్క్ చేయలేకపోవచ్చు. ఏ వయసువారు ఎలాంటి పెట్టుబడి పంథాను ఎంచుకోవాలో..తమ ఇన్వెస్ట్మెంట్ ఎలా కాపాడుకోవాలో ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.20-30 ఏళ్ల వయసువారు..ఈ వయసువారు కాస్త దూకుడుగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వీరు తమ పెట్టుబడుల్లో సుమారు 80 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత సురక్షితంగా ఉండాలంటే 70 శాతం వరకు చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని నష్టం తక్కువగా ఉంటే లిక్విడ్, డెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి మూడేళ్లలోపు నగదు అవసరం ఉందని భావిస్తే ఈ పథకాల్లో నుంచి డబ్బు తీసుకునే వీలుంటుంది. ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.30-40 ఏళ్ల గ్రూప్ వారు..వీరికి స్థిరంగా ఆదాయం ఉంటుంది. ఈ వయసులోవారు ఇల్లు కొనడం, పిల్లల చదువులు, కుటుంబ పెద్దల ఆరోగ్య ఖర్చులు, పెళ్లిళ్లు, బంధువుల ఇంటికి వెళ్లడం.. వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. దాంతోపాటు ప్రధానంగా పదవీ విరమణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కాబట్టి, రిస్క్‌తో కూడిన ఈక్విటీ పెట్టుబడులను కొంత తగ్గించుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో గరిష్ఠంగా 70 శాతం వరకే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతాది సురక్షితంగా ఉండే వివిధ మార్గాల్లో మదుపు చేయాలి.40-50 ఏళ్లవారు..ఈ వయసులో రిస్క్ తీసుకోవడం సరికాదు. ఇది ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను తగ్గించుకుని స్థిరాదాయం ఇచ్చే డెట్ పథకాల్లోకి పెట్టుబడిని మళ్లించాలి. మొత్తం మదుపులో ఈక్విటీ పెట్టుబడులు 60 శాతం మించకుండా జాగ్రత్తపడాలి.ఇదీ చదవండి: మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?50 దాటిన వారు..ఈ వయసులో అసలు రిస్క్ తీసుకోకూడదు. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితానికి ఏర్పాట్లు చేసుకోవాలి. పదవీ విరమణ మరో మూడేళ్లు ఉందనుకున్నప్పుడే క్రమంగా మీ ఈక్విటీ పెట్టుబడులను స్థిర ఆదాయం వచ్చే డెట్ ఫండ్స్‌లోకి మళ్లించాలి. లేదంటే ఏదైనా అనిశ్చితులు ఏర్పడి మార్కెట్ పడిపోయినా, కొంత కాలంపాటు ఎలాంటి పెరుగుదల లేకుండా కదలాడినా భారీగానే నష్టపోవాల్సి ఉంటుంది. పదవీవిరమణ తర్వాత ఆదాయం ఉండదు కాబట్టి డబ్బును కాపాడుకోవడం ఉత్తమం. -
ఏడాదిలో 1,895 మందికి లేఆఫ్స్!
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులను తగ్గించుకుంది. ఏడాదిలో శాశ్వత ఉద్యోగుల్లో 716 మంది పురుషులు, 618 మంది మహిళలను ఉద్యోగం నుంచి తొలగించింది. నాన్ పర్మినెంట్ సిబ్బంది విభాగంలో 531 మంది పురుషులు, 30 మంది మహిళలకు లేఆఫ్స్ ప్రకటించింది. నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఖర్చులను సర్దుబాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.వేతన మార్పులుపర్మినెంట్ ఉద్యోగుల్లో 74% మంది పురుషులు కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు కంపెనీ గుర్తించింది. ఇది గతంలో 61%గా ఉండేది. ఈ కేటగిరీలోని మహిళలు 37% నుంచి 56%కి పెరిగారు. నాన్ పర్మినెంట్ ఉద్యోగుల్లో కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదించే పురుషులు 1 శాతం నుంచి 8 శాతానికి, మహిళలు 2 శాతం నుంచి 16 శాతానికి పెరిగారని సంస్థ పేర్కొంది.ఖర్చు తగ్గింపు: ఉద్యోగాల్లో కోతలు, వారికి అందించే ప్రయోజనాలు తగ్గించుకోవడం ద్వారా ఖర్చులు 9% తగ్గి రూ.770.44 కోట్లకు చేరుకున్నాయి.ఛైర్మన్ వేతనం: కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సగటు ఉద్యోగి వేతనం కంటే 211 రెట్లు అధికంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో వేతనం, ఇతర అలవెన్స్‌ల రూపంలో ఆయన రూ.5.4 కోట్లు అందుకున్నారు.ఆర్థిక పనితీరుకంపెనీ మొత్తం ఆదాయం గతంతో పోలిస్తే 14 శాతం క్షీణించి రూ.8496.96 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న మొత్తం విమానాల సంఖ్య 76గా ఉండేది. ఇది 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 65కు తగ్గింది. ప్రస్తుతం స్పైస్ జెట్ 60 విమానాలను నడుపుతుండగా, బకాయిలు చెల్లించని కారణంగా కొన్ని విమానాలు నిలిచిపోయాయి.ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!నిధుల సమీకరణక్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా ఇటీవల కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరించింది. వీటితో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, టీడీఎస్ బకాయిలను చెల్లించి కీలక సెటిల్మెంట్లను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. స్పైస్ జెట్ 2026 నాటికి 100 విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇకపై పిల్లలకు ఆర్థిక పాఠాలు
న్యూఢిల్లీ: దేశంలో మూడు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు ఆర్బీఐ సూచించే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడానికి అంగీకరించాయి. ఆర్బీఐ, ఇతర నియంత్రణ సంస్థలు సంయుక్తంగా ఆర్థిక అక్షరాస్యత అంశాలను రూపొందించాయి. దీంతో స్కూల్ పాఠ్యాంశాల్లో ప్రాథమిక ఆర్థిక అంశాలకు చోటు లభించనుంది. ‘‘పాఠశాల విద్యలో ఆర్థిక అక్షరాస్యతను మనం చేర్చితే, దేశంలో ఆర్థిక జ్ఞానం విస్తరించేందుకు తోడ్పడుతుంది. 610 తరగతుల పాఠాల్లో దీన్ని చేర్చనున్నట్లు’’ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ శర్మ అన్నారు. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
కాలంతోపాటే ప్రణాళిక
రుణం తీసుకొని ఇన్వెస్ట్ చేయొద్దు. ఆర్జిస్తున్న దాని కంటే తక్కువే ఖర్చు పెట్టు. ఇవి తరచుగా వినిపించే మనీ సూత్రాలు. వీటికి కట్టుబడి నడుచుకుంటే ఆర్థిక వ్యవహారాలు తప్పుదోవలో వెళ్లకుండా చూసుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక విషయంలో ఇలాంటివే ఎన్నో సాధారణ సూత్రాలు ఉన్నాయి. వీటిని కాలంతోపాటే వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నతీకరించుకుని ఆచరణలో పెడితేనే ఆశించినంత ప్రయోజనం నెరవేరుతుందని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. ఆధునిక కాలంలో మార్చుకోదగిన సిద్ధాంతాల గురించి వారు ఇలా తెలియజేస్తున్నారు... వేతనంలో రిటైర్మెంట్కు పొదుపు నెలవారీ ఆర్జనలో 10 శాతాన్ని పెన్షన్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలన్నది గతంలోని సూత్రం. రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవనం కోసం ఈ మాత్రం పొదుపు చేసుకోవాలి. కానీ, పెరుగుతున్న జీవన ప్రమాణాలతో ఆయుర్దాయమూ అధిగమవుతోంది. కనుక వేతనంలో కనీసం 20 శాతాన్ని రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆప్టిమా మనీ మేనేజర్స్ వ్యవస్థాపకుడు మత్పాల్ తెలిపారు. జీవన వ్యయం పెరిగిపోతున్నందున, వైద్య వ్యయాలు కూడా భారమవుతుండడంతో రిటైర్మెంట్కు అధిక పొదుపు అవసరమని గుర్తించిన చరణ్ (35), వేతనం వచ్చిన వెంటనే 20 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈక్విటీల్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి? సాధారణంగా తమ పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కాకుండా డెట్, తదితర సాధనాల మధ్య కేటాయింపులు చేసుకోవాలని, తద్వారా రిస్క్‌ను సమతుల్యం చేసుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తుంటారు. మరి ఈక్విటీల్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలన్న ప్రశ్న తలెత్తిత్తే... 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలే అంత శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది ఓ ప్రాథమిక సూత్రం. ఉదాహరణకు చరణ్ వయసు 35 ఏళ్లు. 100లో 35 తీసివేస్తే 65 వస్తుంది. కనుక తన మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే, కాలంతోపాటే ఇందులోనూ మార్పులు అవసరమన్నది నిపుణుల భావన. ఆర్జన ఆగిపోయిన తర్వాత కూడా 25 ఏళ్ల వరకు జీవించాల్సి వస్తున్న పరిస్థితుల్లో... ఈక్విటీలకు అధిక కేటాయింపులు అవసరమని సూచిస్తున్నారు. కనుక 100 కాకుండా 120 స్థాయిని నిర్ణయించుకోవాలన్నది వారి సూచన. ఈ నేపథ్యంలో 120 నుంచి తమ వయసును మినహాయించి మిగిలే అంత మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ముంబైకి చెందిన చేతన్ (39) ప్రస్తుతానికి పలు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ప్రతీ నెలా రూ.50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే మొత్తం పెట్టుబడుల్ని తీసుకెళ్లి ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాడు. దీనికి బదులు నూతన సూత్రం ప్రకారం 120 నుంచి చేతన్ వయసు 39ని తీసివేసి చూస్తే 81 వస్తుంది. కనుక పెట్టుబడిచేయదగిన మొత్తంలో 81 శాతం మాత్రమే.. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను రూ.40,000కు పరిమితం చేసుకోవాలి. మరింత చిన్న వయసుల్లో వారు (25–35 వయసు) ఈక్విటీలకు 85–90 శాతాన్ని, డెట్‌కు 10 శాతాన్ని కేటాయించుకోవచ్చని మనీ మ్యాటర్స్ సీఈవో తేజల్ గాంధీ సూచించారు. 60 ఏళ్ల తర్వాత కూడా ఈక్విటీలకు 25–30 శాతం కేటాయింపులు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 50–20–30 సూత్రం 50–20–30 సూత్రం తెలుసు కదా? పన్ను బాధ్యతలు పోను మిగిలే నెలవారీ ఆదాయంలో 50 శాతాన్ని కనీస అవసరాల కోసం వినియోగించుకోవాలి. 20 శాతాన్ని భవిష్యత్తు లక్ష్యాలు, అవసరాల కోసం కేటాయించుకోవాలి. మిగిలిన 30 శాతాన్ని తమ విచక్షణ అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చన్నది ఈ సూత్రం అంతరార్థం. అయితే, మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఇందులో భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం 20% చాలదని, కనీసం 30% అయినా కేటాయించుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. వీలయితే 40% కేటాయించుకోవడం మంచిదన్నది సలహా. మంచి వేతనాల్లో ఉన్న వారికి ఇది సాధ్యమే. జీవిత బీమా జీవిత బీమా అవసరాన్ని నేడు చాలా మంది గుర్తిస్తున్నారు. అయితే, పాలసీ తీసుకుంటున్నారు కానీ అవసరమైన మొత్తానికి బీమా రక్షణ ఉండేలా జాగ్రత్త వహిస్తున్న వారు కొద్ది మందే. నిజానికి ఆర్జించే వ్యక్తికి ఎంత మేర జీవిత రక్షణ ఉండాలి? అన్న సందేహం ఎదురైతే... వార్షిక వేతనానికి కనీసం 10 రెట్లు అయినా తీసుకోవాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తుంటారు. అయితే, అందరికీ వర్తించే ఉమ్మడి సూత్రం కాదిది. విడిగా వ్యక్తుల అవసరాలు, రుణాలు, వారిపై ఆధారపడిన వారు ఎంత మంది ఉన్నారు తదితర ఎన్నో అంశాలు జీవిత బీమా రక్షణ మొత్తాన్ని నిర్ణయిస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే ఆర్జన మొదలు పెట్టి, తక్కువ వేతనంలో ఉన్న యువకులకు జీవిత బీమా కొంచెం అధికంగానే ఉండాలంటున్నారు నిపుణులు. ‘‘చిన్న వయసులో బీమా పాలసీ తీసుకుంటుంటే... బీమా కవరేజీ వార్షిక వేతనానికి కనీసం 20 రెట్లు అయినా ఉండాలి. ఎందుకంటే చిన్న వయసులో ఉన్న వారికి వేతనంలో పెరుగుదల వేగంగా ఉంటుంది. దీనికి తగినట్టు జీవిత బీమా కవరేజీ పెంచుకుంటూ వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు’’ అని మత్పాల్ వివరించారు. అయితే 40 ఏళ్లకు పైగా వయసున్న వారు మాత్రం ఇంతకుముందు మాదిరే వార్షిక వేతనానికి పది రెట్ల మొత్తం బీమా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. హెల్త్ కవరేజీ వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్సలు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడేస్తున్నాయి. వైద్య రంగంలో పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ, అత్యాధునిక చికిత్సా విధానాలు అమల్లోకి వస్తుండడంతో వాటి వ్యయాలు కొంచెం ఖరీదుగానే ఉంటున్నాయి. కనుక నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.3–5 లక్షల వైద్య బీమా అవసరం అని భావిస్తుండగా, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతంగా ఉంటుందన్న నేపథ్యంలో పట్టణాల్లో నివసించే వారికి ఇది చాలదంటున్నారు నిపుణులు. దీన్ని కనీసం రూ.10 లక్షలకు పెంచుకోవాలని సూచిస్తున్నారు. కిరణ్ కుమార్ తల్లికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. బీమా కవరేజీ రూ.3 లక్షలు ఏ మాత్రం సరిపోలేదు. దీంతో హెల్త్ కవరేజీ మరింత అవసరమని అర్థం చేసుకున్న అతడు రూ.25 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ కవరేజీని పెంచుకున్నాడు. ఇందులో తన తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజీ ఉండేలా చూసుకున్నాడు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీల ప్రాముఖ్యతనూ కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలం పాటు చికిత్స అవసరమైతే ఇవి ఆదుకుంటాయని, సంప్రదాయ పాలసీలు దీర్ఘకాలం పాటు చికిత్సా వ్యయాలను తీర్చలేవని గుర్తు చేస్తున్నారు. అత్యవసర నిధి ఎంత మొత్తం? ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు లేదా వైద్య పరమైన ఆకస్మిక చికిత్సలు అవసరం పడినప్పుడు లేదా ఇతర ఆర్థిక అత్యవసరాల్లో ఆదుకునేందుకు అత్యవసర నిధిని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలన్నది ఓ ఆర్థిక సూత్రం. కనీసం మూడు నుంచి ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో అత్యవసర నిధిగా ఉంచుకోవాలన్నది ఇప్పటి వరకు చెబుతున్న సూత్రం. కానీ, దీన్ని తొలి అడుగుగానే చూడాలంటున్నారు. ముందు ఆరు నెలల మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాత దానిని కనీసం 9 నెలల అవసరాలకు సరిపడా మొత్తానికి పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఫార్మా కంపెనీలో పనిచేసే వైభవ్ కుమార్ (36) నెలవారీ వేతనం రూ.50,000. కానీ, ఇతడు రూ.4.5 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచాడు. దీనికి అదనంగా అతడికి రూ.10 లక్షలకు హెల్త్ ప్లాన్ కూడా ఉంది. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడి తక్కువ కనుక ఒక నెల అవసరాలకు సరిపడా ఎఫ్డీగా ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది సూచన. -
అభిమానాల బజార్
అక్కడ ఆస్తులు లేవుఅంతస్తులు లేవు డిగ్రీలు లేవు కులమతాలు లేవు ఉన్నదల్లా మనుషులువారి మధ్య నెలకొన్నఅభిమానాలుఅవే, ‘నుక్కడ్’ సీరియల్‌ని సంపన్నం చేశాయి. ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచి పోయాయి. మన కాలనీలోని కార్నర్ ప్లేస్‌లో ఏమేం దుకాణాలు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా. ఓ చాయ్ బండి, దానిని ఆనుకొని ఫాస్ట్‌ఫుడ్ బండి, ఓ పాన్ షాప్, ఆ పక్కనే ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్ షాప్, వస్తువులను తాకట్టు పెట్టుకొని పదో పరకో ఇచ్చే సేట్ షాప్, ఒకవైపు కూరగాయలు, మరోవైపు ఇస్త్రీ షాప్, షూ షాప్, సెలూన్ షాప్.. ఇలా చిన్న చిన్న దుకాణాలన్నీ ఉంటాయి. ఆ షాపుల్లో పనిచేసేవారంతా సాయంత్రమైందంటే ఓ చోట చేరుతారు. వేడి వేడి చాయ్ చప్పరిస్తూనో, బీడీ ముక్కను నోట్లో పెట్టుకొని పొగ ఊదుతూనో పక్కవారితో బాతాఖాని వేస్తుంటారు. అంతా దిగువతరగతి. అక్కడ ఒకరి కష్టం అందరిది. ఒకరి ఆనందమూ అందరిది. ప్రపంచాన్ని దర్శించాలంటే ఇలా వీధి మూలన ఉన్న జీవితాలతో ఓ అరగంట గడిపితే చాలు. నగరాల్లో తక్కువ ఆదాయపు ప్రజల సాంఘిక, ఆర్థిక పోరాటాలను 80ల కాలంలోనే కళ్లకు కట్టింది దూరదర్శన్. వారం వారం శ్రమ జీవుల కష్టాన్ని, వారు పంచుకున్న ఆనందాన్ని హాస్యభరితంగా ఆవిష్కరించింది. నిరంతరం ఆర్థికసమస్యలతో, నెరవేరని కలలతో పోరాటం చేస్తుండే కార్నర్ జీవితాలను ‘నుక్కడ్’ సీరియల్‌గా మూడు దశాబ్దాల క్రితం 40 ఎపిసోడ్లలో పరిచయం చేసింది చిన్నతెర. గరీబుల కార్నర్ ఎలక్ట్రీషియన్ గురు నుక్కడ్ గ్యాంగ్‌కి చిన్నపాటి లీడర్. నుక్కడ్‌లో ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కరించడంలో తను ముందుంటాడు. కదేరిభాయ్ తినుబండారాల షాప్ ఓనర్. నుక్కడ్‌లో ఉన్నవారంతా ఇతని షాపు ముందే చేరుతుంటారు. మరీ తిండికి లేని వారికి ఉచితంగా టీ, స్నాక్న్ ఇచ్చే మంచి మనసు ఉన్నవాడు. హరికి చిన్న సైకిల్ రిపేర్‌షాప్ ఉంటుంది. ఇతడు గుప్తా సేత్ కూతురును ప్రేమిస్తుంటాడు. గోపాల్ అనే వ్యక్తి తాగుబోతు. కానీ అందరినీ ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి. నేనేదైనా చేయగలను అని సూటు బూటులో కనిపించే వ్యక్తి రాజా పటేల్. చిన్న హెయిర్‌కటింగ్ సెలూన్‌ని నడుపుకునే బార్బర్ కరీమ్. నుక్కడ్లోని ఇళ్లలో పనిచేస్తూ, అందరికీ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది రాధ. సింగిల్ ఉమెన్ మారియా టీచర్. గురు–మారియాలు ప్రేమించుకుంటారు. కానీ, తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకోరు. దుఖియా షాయర్ నిరుద్యోగి. గురు దగ్గర ఉంటూ అందరినీ పదో పరకో అడుక్కుంటూ జీవితం గడుపుతుంటాడు. ఘనశ్యామ్ బిక్షగాడు. చౌరాషియా పాన్వాలా. గుప్తాసేత్ కిరణా, మానిక్లాల్సేత్ ఆభరణాల షాప్‌ను నిర్వహిస్తుంటారు. వీరితో పాటు అలా ఇలా వచ్చిపోయే మరో పది మంది మనుషులతో నుక్కడ్ సందడిగా కనిపిస్తుంది. పండగతో మొదలు పేద–ధనిక బేధం లేకుండా ఆనందాన్ని పంచుకునేవే పండగలు. మరి నగరాల్లో దీపావళి పండగ అంటే.. టపాసులకు, కొత్త బట్టలకు వేలల్లో డబ్బు ఖర్చు పెట్టాలి. అంతంత మాత్రంగా ఉండే శ్రమజీవుల సంపాదనతో పూట గడవడమే కష్టం. అలాంటిది టపాసులు కొనుగోలు చేయాలంటే పెద్ద యుద్ధమే. అందుకే నుక్కడ్‌లో ఉండేవారంతా తలా కొంత చందా వేసుకుంటారు. గుప్తా, సేట్లు మాత్రం ఒక్కొక్క టపాసు అందరి మధ్య భయం భయంగా కాల్చడం నవ్వు తెప్పిస్తుంది. టపాస్ కాదు బాంబ్ అంటూ దబాయించే పోలీసు హడావిడి, చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. చందా డబ్బుతో మిఠాయిలు కొనుక్కొని దీపావళి పండగ జరుపుకుంటారు అంతా. ఇలాగే అన్ని పండగలు అందరూ కలిసి జరుపుకుంటారనే విషయాన్ని నుక్కడ్ జనం పరిచయం చేస్తారు. పంచుకునే ప్రేమలు పెళ్లిళ్లకు ట్రాపెంట్ వాయించే బ్యాండ్ మాస్టర్ ఎందరిచేతనో గౌరవం అందుకున్న వ్యక్తే. ముసలివాడైపోతాడు. కానీ, పూట గడవక తానెంతో ఇష్టపడే ట్రాంపెట్ను 200 రూపాయలకు సేట్‌కి అమ్మేస్తాడు. ‘వృద్దాప్యంలో చివరకు ట్రాంపెట్ కూడా లేకపోతే ఎలా బతుకుతావు’ అని అడిగితే ‘నా రెక్కల కష్టమ్మీద బతికేస్తా..’ అని దుఖిస్తాడు. గురు, మిగతా బృందమంతా కలిసి బ్యాండ్ మాస్టర్ ట్రాంపెట్ను తాకట్టు నుంచి విడిపించి, అతని చేత ట్రాంపెట్ను వాయించేలా చేయాలనుకుంటారు. కానీ, మాస్టర్ నిపించుకోడు. చివరకు ట్రాంపెట్ను అతను వాయించడం, అతని చుట్టూ చేరి నుక్కడ్ జనం అంతా గంతులేస్తూ ఆనందాన్ని పంచుకుంటారు. ఒకరి కష్టం అందరూ పంచుకుంటే జీవితం ఎంత సింపుల్‌గా గడిపేయొచ్చో దీంట్లో తెలుసుకోవచ్చు. నాయకులను నిలదీసే నైజం నుక్కడ్కి రాజకీయ నేత వస్తాడు ఈ సారీ ఓట్లు వేసి గెలిపించమని. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తారు ఒక్కొక్కరు. మారియా టీచర్ రాజకీయనాయకుడిని ‘మీ కొడుకు ఎక్కడున్నాడ’ని అడుగుతుంది. అమెరికాలో ఉన్నాడని, అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడని గర్వంగా చెబుతాడు. పదవుల కోసం వచ్చే నాయకులు చెప్పేవి ఒకటి, చేసేది ఒకటి అంటూ క్లాస్ తీసుకుంటుంది టీచర్. తనను తప్పుపడుతున్నారనే కోపంతో మండిపడుతూ అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు రాజకీయ నాయకుడు. హామీలు ఇచ్చి నెరవేర్చని నాయకుల దుమ్ము దులపాలంటే అందుకు సామాన్యులే సరైనవారని చూపుతారు. దొంగ నుంచి మంచి నుక్కడ్‌లో దొంగతనం జరుగుతుంది. అక్కడి జనానికి పట్టుబడిన వ్యక్తి తాను దొంగగా మారిన పరిస్థితుల గురించి వివరిస్తాడు. పోలీసులు దొంగను పట్టుకోవడానికి వస్తే అతను తమకు పరిచయం ఉన్న వ్యక్తే అని, దొంగ కాదని టీచర్ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నుక్కడ్‌లో అతనూ ఓ మెంబర్ అవుతాడు. ఏ వ్యక్తీ పుట్టుకతో చెడ్డవాడు కాదని, పరిస్థితులే వారనలా మారుస్తాయని, మంచి మనుసుల మధ్య ఉంటే దొంగలైనా మంచివారుగా మారుతారనే నిజాన్ని కళ్లకు కడతారు. ఇలా ఒక్కో వారం ఒక్కో సమస్య నుక్కడ్ జనాల మధ్య నడుస్తూ ఉంటుంది. ఆ సమస్య నుంచి ఓ పరిష్కారం చూపుతుంది. కొన్ని పరిష్కారం లేని సమస్యలూ ఉంటాయి. అందరి కళ్లలోనూ భవిష్యత్తు పట్ల అందమైన కలలు. అవి నెరవేరేవి కావని తెలిసినా నిరుత్సాహపడకుండా ఆనందంగా గడిపే జీవితాలు నుక్కడ్‌లో దర్శించవచ్చు. మన జీవితానికి కావాల్సిన పాఠాలనెన్నో నుక్కడ్ బజార్లో వెతుక్కోవచ్చు. – ఎన్.ఆర్. ∙మూడు దశాబ్దాల క్రితం శ్రామిక జీవుల జీవితాలను తరచి చూసి, తెరకెక్కించారు దర్శకులు కుందన్ షా, సయీద్ అక్తర్ మిర్జా. ఈ సీరియల్‌కి ప్రబో«ద్ జోషి, అనిల్ చౌదరి తమ రచనా సహకారాన్ని అందించారు ∙దిలీప్ ధావన్, పవన్ మల్హోత్రా, సంగీతానాయక్, రమా విజ్, అవతార్గిల్లు ప్రధాన పాత్రదారుల్లో కనిపించి నుక్కడ్ని సుసంపన్నం చేశారు ∙1986–86లో 40 ఎపిసోడ్లతో ఫస్ట్ సీజన్ వచ్చిన నుక్కడ్, ఆ తర్వాత 1993లోనయానుక్కడ్ పేరుతో సీక్వెల్ సీరిస్ వచ్చింది. -
ఎంపీసీకి ముగ్గురు ఆర్థికవేత్తలు
నియమించిన కేంద్రం... * ద్రవ్య పరపతి విధాన రేటు నిర్ణయ ప్రక్రియలో తాజా నిర్ణయం * పదవీకాలం నాలుగేళ్లు..! న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయానికి ఏర్పాటవుతున్న పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)కి ప్రభుత్వం తరఫున ముగ్గురు ప్రముఖ ఆర్థిక విద్యావేత్తలను కేంద్రం గురువారం నియమించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రభుత్వం తరఫున ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాల పేర్లను నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(ఏసీసీ) ఖరారు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. వీరి పదవీ కాలం నాలుగేళ్లు. పునర్నియామకానికి అవకాశం లేదు. కాగా ప్రస్తుతం ఆర్బీఐ ఐదుగురు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల్లో చేతన్ ఘాటే ఒకరు. రెపోకు ఇక మెజారిటీ నిర్ణయం ఈ ముగ్గురితో పాటు కమిటీలో ఆర్బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరు ఓట్ల మెజారిటీ ప్రాతిపదికన పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు నిర్ణయం ఉంటుంది. ఒకవేళ రేటు నిర్ణయంలో కమిటీ చెరిసమానంగా చీలిపోతే... ఆర్బీఐ గవర్నర్ గా ఆయన అదనపు ఓటు కీలకం అవుతుంది. ఇక కమిటీలో ఆర్బీఐ గవర్నర్, ఒక డిప్యూటీ గవర్నర్, మరో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 4న జరిగే 2016-17 ఆర్బీఐ నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు నిర్ణయం ఏకాభిప్రాయ నిర్ణయం ప్రాతిపదికనే జరుగుతుందని భావిస్తున్నారు.