financial situation
-
ట్విట్టర్ ఆర్థిక పరిస్థితిపై ఎలాన్ మస్క్ హెచ్చరిక
-
భారతీయులు వీటి కోసం ఖర్చుకు వెనకాడలేదు!
న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులలో ఎక్కువ మంది రాబోయే ఒక సంవత్సరంలో తమ ఆర్థిక పరిస్థితి పట్ల ఎంతో ఆశావహంగా ఉన్నారని లండన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వృత్తిపరమైన బహుళజాతి సేవల నెట్వర్క్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) పేర్కొంది. అయితే పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఇది వారి కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని నివేదిక తెలిపింది. దేశంలోని పొదుపుల్లో 80 శాతం పెరుగుతున్న జీవన వ్యయాలను, ఇందుకు సంబంధించి అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవేనని విశ్లేషించింది. దేశానికి సంబంధించి విడుదలైన ఈవై ఫ్యూచర్ కన్సూ్యమర్ ఇండెక్స్ తొమ్మిదవ ఎడిషన్ వివరాలు క్లుప్తంగా... ► సర్వే ప్రకారం దేశంలోని 77 శాతం మంది వచ్చే ఏడాది కాలానికి సంబంధించి ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులను ఆశిస్తున్నారు. దీనిపై ఈ అంశంపై సూచీ భారతీయ వినియోగదారు ల ‘సానుకూల దృక్పథాన్ని‘ పునరుద్ఘాటించిం ది. అంతర్జాతీయంగా నమోదయిన 48 శాతం రేటుకన్నా ఇది మెరుగ్గా ఉండడం గమనార్హం. ►దేశంలో వినియోగదారులకు వస్తువులు, సేవల ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఇది వస్తువులను కొనుగోలు చేసే వారి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వారి కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ►వినియోగానికి సంబంధించి ‘‘తమ స్థోమత’’ను బట్టే ప్రధానంగా వ్యయాలు ఉంటాయని వర్థమాన దేశాల్లో 62 శాతం మంది పేర్కొంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రేటు 45 శాతంగా ఉంది. దేశాల వారీగా చూస్తే, ఈ గణాంకాలు భారత్ దేశంలో 64 శాతం, దక్షిణాఫ్రికాలో 77 శాతం, బ్రెజిల్లో 63 శాతం, చైనాలో 42 శాతం ఉన్నాయి. ఇక అభివృద్ధి చెందిన మార్కెట్లను చూస్తే ఈ రేట్లు అమెరికాలో 50 శాతం, కెనడాలో 52 శాతం, బ్రిటన్‌లో 42 శాతం, ఫ్రాన్స్ 40 శాతాలుగా ఉన్నాయి. ►స్థోమతను బట్టి వ్యయాలు ఉంటాయన్న వారిని భారత్‌లో గ్రూపులుగా విభజిస్తే, తక్కువ ఆదాయ సంపాదకుల విషయంలో ఇది 72 శాతంగా ఉంది. అధిక ఆదాయ సమూహానికి సంబంధించి 60 శాతం, మధ్య ఆదాయ వర్గానికి సంబంధించి 58 శాతంగా ఉంది. ► దేశంలోని పొదుపుల్లో 80 శాతం పెరుగుతున్న జీవన వ్యయాలను, ఇందుకు సంబంధించి అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవే. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది ఇప్పటికే ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు. ►భారత్ వినియోగదారులో వ్యయాలు ఆరోగ్యం కేంద్ర బిందువుగా కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిడి మధ్య కూడా భారతీయ వినియోగదారులు అధిక నాణ్యత, సేంద్రీయ ఆహారం కోసం అధిక డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ►భారతదేశంలో సర్వేలో పాల్గొన వారిలో సగానికి పైగా (54 శాతం) వ్యక్తులు వచ్చే 2–3 సంవత్సరాలలో శారీరక ఆరోగ్యం, ఆరోగ్య పరిరక్షణనే లక్ష్యంగా చేసుకున్నారు. 80 శాతం మంది దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారిస్తున్నారు. మానసిక ఆరోగ్యం ఆవసరమని, దీనిపై తాము దృష్టి పెడుతున్నామని చెప్పిన వారి సంఖ్య 78 శాతంగా ఉంది.వినియోగదారుల్లో ఈ తరహా వైఖరి దీర్ఘకాలంలో కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ►వినియోగదారుల్లో పర్యావరణ స్పృహ కూడా గణనీయంగా పెరుగుతోంది. ► దీనితోపాటు బ్రాండ్ల పట్ల అవగాహనా విస్తృతమవుతోంది. వారికి విక్రయించే బ్రాండ్ల విలువలను తెలుసుకోవడానికి భారత్ వినియోగదారులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఉత్పత్తి సంస్థలకు సవాళ్లు.. మహమ్మారి తదితర అనిశ్చితి పరిస్థితుల నుంచి చవిచూసిన అనుభవాలు, ద్రవ్యోల్బణం స్పీడ్ వంటి పలు అంశాలు వినియోగదారును ప్రస్తుతం గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆయా అంశాలు వ్యయాల నుంచి వారిని వెనక్కు మళ్లేలా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి సంస్థలు సైతం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రత్యేకించి నిత్యావసరాలకు సంబంధించి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు తమ ఆదాయాన్ని– మార్జిన్లను బేరీజు వేసుకుని కార్యకలాపాలు నిర్వహించాలి. లాభదాయకతను పెంచడానికి వ్యయాలనూ కట్టడి చేయాలి ఉంటుంది. విలువ గొలుసు అంతటా ఖర్చులను తగ్గించాలని పిలుస్తుంది‘ అని ఇది పేర్కొంది. మహమ్మారి తర్వాత వినియోగదారుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్న విషయాన్ని జాగ్రత్తగా గమనించిన నిర్ణయాలు తీసుకోవాలి. – అంగ్షుమన్ భట్టాచార్య, ఈవై ఇండియా పార్టనర్ అండ్ నేషనల్ లీడర్ (కన్సూ్యమర్ ప్రొడక్ట్, రిటైల్ సెక్టార్) సర్వేకు ప్రాతిపదిక ఇదీ.. 2022 ఫిబ్రవరిలో 1,000 మంది భారతీయ వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఈవై ఫ్యూచర్ కన్సూ్యమర్ సూచీకి ప్రాతిపదిక. ఈ ఇండెక్స్ నిర్ధిష్ట కాలపరిధిలో ప్రపంచ మార్కెట్లలో మారుతున్న వినియోగదారు సెంటిమెంట్, వారి కొనుగోలు ప్రవర్తనలను ట్రాక్ చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న కొత్త వినియోగదారు అభిరుచులను గుర్తిస్తుంది. భారత్‌సహా అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, ఇండోనేషియా, ఇటలీ, స్పెయిన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, చిలీ (కొత్త), అర్జెంటీనా (కొత్తది), థాయిలాండ్ (కొత్తది)లలో ఈ ఏడాడి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 15, 2022 మధ్య 18,000 వినియోగదారులతో జరిపిన అభిప్రాయ సేకరణ ప్రాతిపదికన ఈవై ఫ్యూచర్ కన్సూ్యమర్ ఇండెక్స్ తొమ్మిదో ఎడిషన్ రూపొందింది. -
రెండేళ్లలో కో–లివింగ్ రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కో–లివింగ్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. దశల వారీగా విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావటం, రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ చేరుకోవటంతో దేశీయ కో–లివింగ్ మార్కెట్ క్రమంగా రికవరీ అయింది. దీంతో వచ్చే రెండేళ్లలో దేశీయ కో–లివింగ్ మార్కెట్ రెట్టింపు అవుతుందని కొలియర్స్ అడ్వైజరీ అంచనా వేసింది. ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60 శాతం ఆక్యుపెన్సీకి చేరుకోవటంతో ఈ విభాగం శరవేగంగా కోలుకుందని పేర్కొంది. ఈ ఏడాది వ్యవస్థీకృత రంగంలో 2.10 లక్షల బెడ్స్ ఉండగా.. 2024 నాటికి రెట్టింపు వృద్ధి రేటుతో 4.50 లక్షల పడకలకు చేరుతుందని అంచనా వేసింది. కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవటం, వర్క్ ఫ్రం హోమ్, వలసల నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితులు అనిశ్చితిలోకి వెళ్లిపోయాయి. దీంతో కో–లివింగ్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఈ ఏడాది మేలో 11.84 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు నవంబర్ నాటికి 7 శాతం క్షీణించింది. కరోనా సమయంలోనూ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు నియామకాలను పెంచడంతో కో–లివింగ్ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొందని కొలియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. ఉద్యోగ నియామకాలలో వృద్ధి, పట్టణాలకు వలసలు, విద్యార్థుల సంఖ్య పెరగడం, అసంఘటితక రంగంలో కో–లివింగ్ నమూనా వృద్ధి వంటివి ఈ పరిశ్రమ డిమాండ్ పెరిగిందని వివరించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో కో–లివింగ్ ఆక్యుపెన్సీ 45–50 శాతం, ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60–70 శాతానికి చేరిందని పేర్కొన్నారు. మధ్యలో సెకండ్ వేవ్ ప్రచారం కారణంగా రెండో త్రైమాసికంలో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిందన్నారు. సంప్రదాయ నివాస సముదాయాలలో 2–3 శాతం ఆదాయంతో పోలిస్తే కో–లివింగ్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. -
AP: రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గుదల
సాక్షి, అమరావతి: ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రాబడి తగ్గిపోవడం, మరోపక్క కొత్త సంక్షేమ పథకాల అమలుతో 2019–20లో రెవెన్యూ వ్యయం 6.93 శాతం మేర పెరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. తప్పనిసరి ఖర్చులైన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, వడ్డీ చెల్లింపుల వ్యయం అంతకు ముందు ఆర్ధిక ఏడాదితో పోలిస్తే పెరిగాయి. 2019–20 ఆర్ధిక ఏడాదికి సంబంధించి రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై కాగ్ నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమానికి భారీగా వ్యయం అమ్మఒడి, వైఎస్సార్ ఉచిత విద్యుత్, వైఎస్సార్ భరోసా పథకాల అమలుతో రెవెన్యూ వ్యయం పెరిగిందని కాగ్ నివేదిక పేర్కొంది. పంచాయతీలను పరిపుష్టం చేయడం, పారదర్శకంగా ఇంటివద్దే ప్రభుత్వ సేవలను అందించడంలో భాగంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో రెవెన్యూ వ్యయం పెరిగిందని తెలిపింది. అయితే అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2019–20లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాల సంక్షేమ వ్యయం భారీగా పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. సాధారణ విద్య, విద్యుత్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు కూడా భారీ వ్యయం చేసినట్లు తెలిపింది. బడ్జెట్ బయట అప్పులు 2014–15 నుంచి తెస్తున్నా బడ్జెట్లో చూపడం లేదని, దీన్ని సరి చేయాలని అప్పట్లోనే సూచించినా పట్టించుకోలేదని పేర్కొంది. కాగ్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ... ►2018–19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 8.80 శాతం ఉండగా 2019–20లో 12.73 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ వృద్ధి రేటు 7.21 శాతం కన్నా ఇది బాగా ఎక్కువ. ►2018–19లో 149.56 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా 2019–20లో 171.37 లక్షల టన్నులకు పెరగడంతో వ్యవసాయ రంగంలో 16.03 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఉద్యాన, పశు, మత్స్యశాఖల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. ►రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రూ.97,123.93 కోట్ల మేర రుణభారం ఉంది. 2020 మార్చి నాటికి ఆ రుణం పెరిగి రూ.2,15,617 కోట్లకు చేరింది. ►అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2019–20లో రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర సొంత రాబడులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా బదిలీ రాబడులు తగ్గడం. ►కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో 2019–20లో రెవెన్యూ ఖర్చులు 6.93 శాతం మేర పెరిగాయి. రెవెన్యూ లోటు 90.24 శాతం పెరిగింది. ►సాధారణ కేటగిరీ రాష్ట్రాల సగటుతో పోలిస్తే తప్పనిసరి ఖర్చులైన వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు, పరిపాలన ఖర్చులు ఏపీలో ఎక్కువ. ►రాష్ట్ర సొంత పన్నుల రాబడి 0.74 శాతం తగ్గింది. సొంత పన్నేతర రాబడి 24.59 శాతం తగ్గింది ►కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్ర వాటా 13.86 శాతం తగ్గింది ►కేంద్రం నుంచి పొందే గ్రాంట్లు 12.43 శాతం పెరిగాయి. -
ఎకానమీపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ శుక్రవారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష జరిపింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ల 590వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్–19 ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యల ఫలితాల అంశం కూడా సమీక్షలో చోటుచేసుకుందని ప్రకటన వివరించింది. డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు మరియు టీ రబీ శంకర్లతోపాటు సెంట్రల్ బోర్డ్ ఇతర డైరెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. సతీష్ కే మరాఠే, ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది సమవేశంలో పాల్గొన్న డైరెక్టర్లలో ఉన్నారు. ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్ పాండా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్సేథ్ కూడా ప్రభుత్వం తరఫున సమావేశానికి హాజరయ్యారు. -
ఆర్థిక పరిస్థితి బాలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని మాజీ ఐఏఎస్ చిత్తరంజన్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అభిప్రాయపడింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ప్రజలు భారీ ఆశలతో ఉన్నారని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడంతో ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగుల వేతన సవరణ సిఫార్సులు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఆర్థిక స్థితి, ఉద్యోగుల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని సమతూకం పాటించామని వెల్లడించింది. ఆదాయంలో సంక్షేమ పథకాలు, వేతనాలు/పెన్షన్ల రూపంలో దాదాపు 89.86 శాతం నిధులు ఖర్చు అవుతున్నాయని వివరించింది. ఇక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కష్టమని పేర్కొంది. ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన రాష్ట్రాలకు ఎల్లప్పుడూ ఆర్థిక వనరులు కల్పించుకోవడం కష్టమని వ్యాఖ్యానించింది. రాష్ట్ర్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలనే ఉద్దేశంలో అప్పులు ఎక్కువవుతున్నాయని, రుణాల చెల్లింపులు, వాటి వడ్డీలు ఏటా పెరుగుతున్నాయని పేర్కొంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల కోసం తీసుకున్న అప్పుల చెల్లింపులు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. గత పీఆర్సీ సిఫారసు చేసిన ఫిట్మెంట్ కంటే ఎక్కువ మొత్తం ఇవ్వడం వల్ల విద్యావంతులైన యువత ప్రైవేట్ రంగం వైపు కాకుండా దిగువ స్థాయిలోని ఉద్యోగాల్లోనూ చేరడానికి ముందుకొచ్చారని తెలిపింది. గడిచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేయడం వల్ల, తద్వారా వచ్చిన ఆదాయంతో కూడా ఆ పీఆర్సీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగిందని, ఇప్పుడా పరిస్థితులు లేవని కమిషన్ వ్యాఖ్యానించింది. జీవన ప్రమాణాలు పెరగకుంటే లాభమేంటి..? గతేడాది మార్చి నుంచి కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక రంగం కుదేలైందంటూ లక్షలాది అసంఘటిత కార్మికులు మండుటెండల్లో వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన దైన్యస్థితిని సైతం కమిషన్ తన నివేదికలో వివరించింది. విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు పెరగకుండా రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. మానవ అభివృద్ధి సూచికలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం 16వ స్థానంలో ఉందని వివరించింది. ఆదాయ వనరులు తగ్గుతుండగా, అప్పులు మాత్రం పెరుగుతున్నాయని తెలిపింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 13.76 శాతం నుంచి 11.88 శాతానికి తగ్గినట్లు వివరించింది. అలాగే కేంద్రం నుంచి వచ్చే సాయం కూడా 5.32శాతం నుంచి 2.93 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. -
దేశ ఆర్థిక మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. గురువారం నీతి ఆయోగ్‌లో పలువురు ఆర్థికవేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ .. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులు మొదలైన వారితో బడ్జెట్ ముందస్తు సమవేశంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో వివిధ రంగాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. విధానకర్తలు, వివిధ వర్గాలు సమన్వయంతో కలిసి పనిచేసేందుకు ఇవి తోడ్పడగలవని మోదీ చెప్పారు. 5 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదని.. దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీన్ని నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. ‘దేశాన్ని ముందుకు నడిపించేందుకు, ఉద్యోగాలను కల్పించేందుకు అవసరమైన సత్తా.. టూరిజం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మొదలైన రంగాల్లో పుష్కలంగా ఉన్నాయి’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి వేదికల్లో జరిగే మేధోమథనాలు దేన్నైనా సాధించగలమనే స్ఫూర్తి నింపగలవని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు తీసుకోదగిన చర్యల గురించి అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న మోదీ.. సోమవారం పలువురు వ్యాపార దిగ్గజాలతో సమావేశమైన సంగతి తెలిసిందే. రుణ వితరణ పెరగాలి... రుణ వితరణ పెంచాలని .. ఎగుమతుల వృద్ధికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గవర్నెన్స్ మెరుగుపడటానికి, వినియోగానికి డిమాండ్ పెంచేందుకు, ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వల్పకాలికంగా తీసుకోదగ్గ చర్యలపై సత్వరం నిర్ణయం తీసుకుంటామని, దీర్ఘకాలిక అంశాలకు సంబంధించి వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమైనందున కాలక్రమేణా అమలు చేయగలమని మోదీ హామీ ఇచ్చారు. ‘ఆర్థిక వృద్ధి, స్టార్టప్స్, నవకల్పనలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది‘ అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆర్థిక మంత్రి గైర్హాజరు... దాదాపు 40 మంది పైగా నిపుణులు, ఆర్థిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు దీనికి హాజరయ్యారు. అయితే, బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ వర్గాలతో ప్రి–బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నందున.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి హాజరు కాలేదు. ఫిబ్రవరి 1న ఆమె రెండోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
ఏపీకి మూడు రాజధానులు
-
ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్ క్యాపిటల్), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్ క్యాపిటల్) ఏర్పాటు చేసేందుకు వీలుందన్నారు. రాజధానిపై ప్రతిష్టాత్మక సంస్థలతో వేసిన కమిటీ నివేదిక రాగానే ఈ అంశాలపై చర్చించి పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం ఈ మేరకు వివరించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. రాజధాని ముసుగులో అంతా అవినీతే.. ‘గత ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలు, మోసాలు, కుట్రలను మంత్రులు, సభ్యులు వివరించారు. స్కామ్‌ల గురించి ఆర్థిక మంత్రి బుగ్గన స్లయిడ్స్ కూడా చూపించారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు కేవలం ఆరు నెలల కాలంలో 4,070 ఎకరాలను అప్పటి పాలకుల బినామీలు, బంధువులు ఏరకంగా తక్కువ రేటుకు కొన్నారు? ఎవరెవరు కొన్నారు? అనే అంశాలను పేర్లతో సహా ప్రదర్శించారు. రాజధాని పేరుతో జరిగిన స్కామ్‌లు, అన్యాయాలు, చట్టాల ఉల్లంఘనలను సభ్యులు ధర్మాన, గుడివాడ అమర్నాథ్, మంత్రులు బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు ఆధారాలతో సహా వివరించారు. చంద్రబాబు.. రాజధాని అని ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడ ముందుగానే బినామీ పేర్లతో తక్కువ ధరతో భూములు కొన్నారు. తర్వాత అక్కడ రాజధాని అని ప్రకటించారు. ఆ తర్వాత ఆ భూముల రేట్లు పెంచుకునేందుకు ఏం చేశారో కూడా సభ్యులు వివరించారు. చదవండి: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలకు తావుండదు సాగు, తాగునీరు అందించడం ముఖ్యం కదా? ‘బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి.. తద్వారా రాయలసీమలోని బనకచర్లకు గోదావరి నీటిని తెచ్చే భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రూ.55 వేల నుంచి రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనాతో ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. ఈ ఏడాది భారీ వర్షాలు పడ్డా, వరదలు వచ్చినా రాయలసీమలో ప్రాజెక్టులు నిండలేదు. నీరు తీసుకెళ్లే కాలువల సామర్థ్యం సరిపోవడం లేదు. సహాయ పునరావాస ప్యాకేజీలు అమలు చేయలేదు. రాయలసీమలో ప్రాజెక్టుల కోసం రూ.23 వేల కోట్లు కావాలి. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరివ్వాలి. రాష్ట్రంలో తాగడానికి స్వచ్ఛమైన మంచినీరు లేని పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా వల్ల నీరు కలుషితమైంది. బోర్లు వేస్తే ఉప్పు నీరు వస్తోంది. పోలవరం, ధవళేశ్వరం నుంచి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి, ప్రతి ఊరికి పైప్లైన్లు వేసి.. తాగు నీటిని తీసుకు రావాలంటే.. ఒక్కో జిల్లాకు రూ.4 వేల కోట్లు చొప్పున ఉభయ గోదావరి జిల్లాలకు రూ.8 వేల కోట్లు కావాలి. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా తాగు నీటి కోసం రూ.40 వేల కోట్లు కావాలి. స్కూళ్లు, ఆసుపత్రుల మాటేంటి? మరోవైపు నాడు–నేడు కార్యక్రమం కింద శిథిలావస్థలో ఉన్న స్కూళ్లు, ఆసుపత్రులు అభివృద్ధి చేస్తున్నాం. స్కూళ్లలో నీళ్లు, కరెంటు, ఫ్యాన్లు, ఫర్నీచర్ తదితర కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఆసుపత్రుల్లో సెల్ఫోన్ల లైట్లలో ఆపరేషన్లు చేస్తున్నారు. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయిన దుస్థితి. ఈ పరిస్థితిలో స్కూళ్ల బాగు కోసం రూ.14 వేల కోట్లు, ఆస్పత్రుల బాగు కోసం రూ.16 వేల కోట్లు కలిపి ‘నాడు – నేడు’కు రూ.30 వేల కోట్లు కావాలి. ఇన్ని కార్యక్రమాలకు మన దగ్గర డబ్బులున్నాయా? ఇవన్నీ కాదని రాజధాని కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయగలమా అని ఆలోచించాలి. ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి ఈ పరిస్థితుల్లో వేసే ప్రతి అడుగూ ఆలోచించి, ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంది. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి. మనమూ మారాలి. సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టు వికేంద్రీకరణ అనేది ఉత్తమ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ కు బహుశా మూడు క్యాపిటల్స్ వస్తాయేమో. ఇలా రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి ఆలోచనలు చేయడానికే పేరెన్నికగన్న నిపుణులతో, ప్రఖ్యాతి గాంచిన బీసీజీతో పాటు మరో కన్సల్టెన్సీని నియమించాం. ఈ సంస్థలు సుదీర్ఘంగా అన్ని విధాలా పరిశీలించి, పరిశోధించి నివేదిక వారం పది రోజుల్లో నివేదిక ఇవ్వనున్నాయి. అధికార వికేంద్రీకరణ దిశగా పలు సూచనలు, సలహాలు చేయనున్నాయి. నివేదిక ఫలానా విధంగా ఉండాలని మేమైతే చెప్పలేదు. ఈ నివేదికలు రాగానే పరిశీలించి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ అంశంలో స్పష్టత ఇచ్చినట్లే భావిస్తున్నా. ఇంత కంటే మంచి సలహా ఉంటే.. ఇస్తే తప్పకుండా తీసుకుంటాం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? రాజధానిలో కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో కనీస మౌలిక సదుపాయాలకు రూ.1.09 లక్షల కోట్లు అవుతుందన్నది బాబు లెక్క. ఇలా నిర్మిస్తూ పోతే వడ్డీతో కలిపి ఇది రూ.3 లక్షల కోట్లో.. 4 లక్షల కోట్లో ఖర్చయ్యే పరిస్థితి ఉంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అయిదేళ్లలో రూ.5,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇందులో రాజధాని బాండ్ల పేరుతో 10.35 శాతం వడ్డీకి కూడా అప్పు తెచ్చారు. ఈ అప్పులకు ఏటా రూ.700 కోట్లు వడ్డీ చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ఇన్నిన్ని వేల కోట్లు కావాలని లెక్కలున్నాయి. పలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో రాజధాని నిర్మాణం కోసం అంటూ లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎక్కడి నుంచి తేవాలి? ఈ పరిస్థితిలో రాజధానిలో కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు, కరంటు లాంటి పనుల కోసం రూ.లక్ష ఖర్చు పెట్టడం అవసరమా? ►గత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని డిసైడ్ చేశారు. ఆయన (చంద్రబాబు)లెక్క ప్రకారం 53 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే.. ఎకరాకు కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 కోట్ల లెక్కన రూ.లక్షా ఆరు వేల కోట్లవుతుందని తేల్చారు. ఇది కనీస మౌలిక వసతుల ఏర్పాటుకు మాత్రమే. రాష్ట్రంలో ఇతరత్రా అభివృద్ధి పనులు, ఖర్చుల మాటేమిటి? ►రాజధాని కోసం లక్ష కోట్లకు పైగా ఎక్కడ నుంచి తేవాలి? అప్పు తెస్తే దానికి వడ్డీ ఎంత అవుతుంది? వడ్డీ అయినా కట్టే పరిస్థితిలో రాష్ట్రం ఉందా? నాకు కూడా రాజధాని కట్టాలనే ఉంది. కానీ లక్ష కోట్లు ఎక్కడ నుంచి తేవాలి? ఒకవేళ రూ. లక్ష కోట్లు తెచ్చినా దానిని ఎక్కడ ఖర్చు పెట్టాలని కూడా ఆలోచించాలి. ►ఈ పరిస్థితిలో వికేంద్రీకరణే మేలు. పెద్దగా ఖర్చు పెట్టకుండానే రాజధాని సమస్యలు కొలిక్కి వస్తాయి. విశాఖపట్నం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరం. అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా సరిపోతుంది. రోడ్లు కాస్త వెడల్పు చేసి, ఒక మెట్రో రైలు తీసుకొస్తే చాలు. అటు కర్నూల్లో జ్యుడిషియల్ క్యాపిటల్ ఉంటుంది. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే (అమరావతి) ఉంటుంది. – సీఎం వైఎస్ జగన్ చదవండి: పరిపాలనా రాజధానిగా విశాఖ సరైన నిర్ణయం -
ఆర్థికాంశాలు, ఫలితాలే దిక్సూచి..!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఈవారంలో వెల్లడికానున్న పలు కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లో సానుకూలతను నింపేందుకు ఆస్కారం ఉందనేది మార్కెట్ వర్గాల మాట. దీపావళి నుంచి ఇప్పటివరకు 4%, సెప్టెంబర్ 20 నుంచి 13 శాతం ర్యాలీ చేసిన ప్రధాన సూచీలు.. ఇదే జోరును కొనసాగించవచ్చని విశ్లేషిస్తున్నాయి. ‘లార్జ్, బ్లూ–చిప్ షేర్ల వాల్యుయేషన్స్ మళ్లీ ప్రీమియం స్థాయికి చేరుకున్నాయి. ఇది మార్కెట్ ట్రెండ్‌పై ప్రభావం చూపొచ్చు. అయితే, దీర్ఘకాలిక లాభాల కోసం మార్కెట్ అవుట్‌లుక్ మెరుగుపడింది. సంస్కరణలు, ఉద్దీపనలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల, వర్షాలు ఆశాజనకంగా ఉండటం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి సానుకూల అంశాల ప్రభావాన్ని ప్రస్తుత కంపెనీల ఫలితాల వెల్లడి సీజన్ అద్ధం పడుతోంది. ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో ఎర్నింగ్స్ వృద్ధి బాగుండవచ్చనే సంకేతాలు ఇస్తుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఈ వారంలో వెల్లడికానున్న ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రెండ్ ఉంటుందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. స్థూల ఆర్థికాంశాలు.. సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, తయారీ రంగ ఉత్పత్తి డేటా నవంబర్ 11న (సోమవారం) వెల్లడికానున్నాయి. ఇక మంగళవారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, గురువారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రానున్నాయి. 2,700 కంపెనీల ఫలితాలు.. ఈ వారంలో 2,700 కంపెనీలు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి లార్జ్‌క్యాప్స్‌లో కోల్ ఇండియా, హిందాల్కో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, భారతి ఎయిర్టెల్, ఓఎన్జీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మదర్సన్ సుమి సిస్టమ్స్, ఆయిల్ ఇండియా వంటివి ఉన్నాయి. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. గురునానక్ 550వ జయంతి సందర్భంగా మంగళవారం (12న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితమైంది. బుధవారం (13న) మార్కెట్ యథావిధిగా ప్రారంభంకానుంది. అయోధ్యపై సుప్రీం తీర్పు ప్రభావం... అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు శనివారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. రామజన్మభూమి న్యాస్‌కే ఈ వివాదాస్పద భూమి చెందుతుందని, రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని సూచించింది. రెండున్నర దశాబ్దాల వివాదాస్పదానికి తెరపడిన నేపథ్యంలో ఈ అంశంపై మార్కెట్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కేఆర్ చోక్సి ఇన్వెస్ట్మెంట్ ఎండీ దేవాన్ చోక్సి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని, వివాదం ముగియడంతో ఈ రాష్ట్ర వాటా మెరుగుపడొచ్చని ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా విశ్లేషించారు. అయితే, తీర్పు ప్రభావం మార్కెట్‌పై పెద్దగా ఉండకపోవచ్చని ట్రేడింగ్ బెల్స్ సీనియర్ విశ్లేషకులు సంతోష్ మీనా అన్నారు. నవంబర్‌లో ఎఫ్‌పీఐ నిధులు రూ. 12,000 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో రూ. 12,000 కోట్లను కుమ్మరించారు. నవంబర్ 1–9 కాలంలో వీరు స్టాక్ మార్కెట్లో రూ. 6,434 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 5,673 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా పేర్కొంది. -
ఆర్థిక స్థితి కంటే ఆవు సంగతే ముఖ్యం: అసద్
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతున్నా ప్రధాని మోదీ మాత్రం దాన్ని చక్కదిద్దడం కంటే ఆవులపై ప్రేమనే ఒలకబోస్తున్నారని ఎంఐఎం అధ్యక్షు డు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో జాతీయ మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పతనమవుతున్నా.. మోదీ ఆవుల విషయంలో ఓ మతానికి అనుకూలంగా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తున్నారని పేర్కొన్నారు. -
తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోయిందని, ఈ విషయాన్ని చర్చించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం కట్టాల్సిన బకాయిలే రూ.35 వేల కోట్లకు అంటే రికార్డు స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. భగీరథలోనే రూ.10 వేల కోట్ల బకాయిలున్నాయని, ఇక ఇరిగేషన్ శాఖలో మరొక రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉన్నట్లు చెప్పారు. ‘ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆర్థిక పరిస్థితి మీద వివరణ ఇవ్వాలి. దీన్ని సరిచేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’ అని రాకేశ్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిపై అఖిలపక్షం: చాడ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చేసిన ప్రకటన వాస్తవాలను కప్పిపుచ్చేదిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనను తమ పార్టీ ఖండిస్తోందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్థికస్థితి గురించి పారదర్శకంగా వ్యవహరించాలి అనుకుంటే ఆర్థిక నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తే ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు పనులను ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చాడ డిమాండ్ చేశారు. -
ఖాళీ డబ్బాలను రివ్యూ చేస్తారా?
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సున్నాకి తీసుకువచ్చి.. ఇప్పుడు రివ్యూలు చేస్తామనంటున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఖాళీ డబ్బాలను రివ్యూ చేస్తారా అని చంద్రబాబుని ప్రశ్నించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. చంద్రబాబు స్పందన దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఓ పార్టీ మూతపడనుందనే అనుమానం కలుగుతుందని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు దురాగత పాలనకు, అవినీతికి అంతులేకుండా పోయిందని ఆరోపించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా దోపిడిని కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు. అందుకే ప్రజలు ఆగ్రహంతో స్పీకర్‌ను చొక్కా విప్పి కొట్టారని వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాలో రైతుల పరిస్థితి బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎక్కడా గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. మిల్లర్ల నుంచి సివిల్ సప్లయి అధికారులు లంచాలు స్వీకరిస్తున్నారని ఆరోపించారు. రైతులకు మిలర్లు తక్కువ ధర ఇస్తుంటే.. అధికారులు అవినీతికి బాటలు వేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రైతు కుటుంబాల ఆర్థికస్థితిపై సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేస్తోంది. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న దానికి అనుగుణంగా ఈ సర్వే చేస్తున్నట్లు అధికారు లు చెబుతున్నారు. ఈ ఐదేళ్లలో పరిస్థితులు ఏమైనా మారాయా.. మారితే ఏ మేరకు మార్పులు వచ్చా యి.. ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే కోణంలో ఈ సర్వే జరుగుతోంది. అర్థగణాంక శాఖ ద్వారా 1958 నుంచి సాంఘిక, ఆర్థిక సర్వేలను జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్ఎస్ఎస్వో)తో నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న దేశవ్యాప్తంగా ప్రారంభమైన సర్వే రాష్ట్రంలో ఈ నెల 21న ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు విడతలవారీగా కొనసాగుతుంది. వాస్తవానికి 2022 లో సర్వే జరగాల్సి ఉండగా మూడేళ్ల ముందుగానే సర్వేకు కేంద్రం ఆదేశించింది. పదేళ్లకోసారి ఈ సర్వే జరగాల్సి ఉండగా దేశవ్యాప్తంగా 2020 నాటికి రైతు ల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రాల్లోని రైతుల ఆర్థిక స్థితిగతులపై కేంద్రం ముందస్తు గా అధ్యయనం చేస్తోంది. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరుగా నమోదు చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పరిస్థితిని సర్వే చేయనుండగా, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధితో ఎలా జీవిస్తున్నారు.. రుణాల వినియోగం ఎలా ఉందనే కోణంలో వివరాలను ప్రత్యేక నమూనాలో పొందుపరచనున్నా రు. యాసంగి పంటలు చేతికొచ్చాక మళ్లీ రైతుల ఆదాయంపై సర్వే నిర్వహించనున్నట్లు తెలిసింది. కనీసమద్దతు ధర అందిందా? గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులకు ప్రాముఖ్యతనిస్తుండగా, పట్టణాల్లో అద్దెకుండే ప్రాంతాలను ఎం పిక చేశారు. గ్రామాల్లో రైతు కుటుంబాల ఆర్థిక స్థితి తెలుసుకుంటారు. ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారు? ఏఏ పంటలు వేస్తారు? విత్తనం నుంచి పం ట చేతికందే వరకు ఎంత పెట్టుబడి వచ్చింది? పంట విక్రయం తర్వాత వచ్చిన మొత్తం సొమ్మెంత? కనీసమద్దతు ధర అందిందా, లేదా? పెట్టుబడి, కుటుంబ ఖర్చులు పోను మిగిలిందెంత? వంటి వివరాలు నమోదు చేస్తారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో ఉన్నారా? ఆదాయమెంత? ఖర్చులెంత? వం టి వివరాలను పొందుపరుస్తారు. అప్పుల్లో ఉంటే అప్పుల వివరాలు, ఎందుకు అప్పులయ్యాయి, రుణాలివ్వడం లేదా.. ఇస్తే వినియోగమెలా ఉందనే వివరాలు సేకరించి వారి ఆర్థికస్తోమతను లెక్కిస్తున్నారు. -
పసివాడిని పోషించలేం
కొనుక్కోండి లేదా పెంచుకొమ్మని వేడుకున్న దంపతులు ఆత్మకూర్: పదినెలల పసివాడిని పోషించే పరిస్థితి లేదని, ఎవరైనా కొనుక్కున్నా.. లేదా పెంచుకుంటే ఇస్తామని దంపతులు వేడుకుంటుండగా.. పోలీ సులు అడ్డుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఎస్సీ కాలనీకి చెందిన మీసాల కురుమన్న, లచ్చమ్మల కుమార్తె నాగేంద్రమ్మకు, జూరాలకు చెందిన బాల్‌రాజ్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లకు బాబు పుట్టాడు. పది నెలల క్రితం మరో బాబుకు నాగేంద్రమ్మ జన్మనిచ్చి, నెలరోజులు తిరగకముందే మరణించింది. ఆ పసిబాలుడిని పెంచుకునేందుకు తండ్రి నిరాకరించడంతో అమ్మమ్మ, తాతయ్యలే సంరక్షిస్తున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో అమ్మమ్మ లచ్చమ్మ ఆ బాలుడ్ని అమ్మేస్తానని, లేకపోతే పెంచుకుంటామంటే ఇస్తానని గురువారం ఆత్మకూరులోని ప్రతి దుకాణం తిరిగి వేడుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సీహెచ్ రాజు బృందం చేరుకుని బాలుడితోపాటు అమ్మమ్మ, తాతయ్యలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలుడిని మహబూబ్‌నగర్‌లోని శిశువిహార్ కేంద్రానికి తీసుకెళ్లి అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
'ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కుదరదు'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రూ.9 నుంచి 10 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి లోటు బడ్జెట్ రూ.24 వేల కోట్లకు చేరే అవకాశముందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా అందుకు అడ్డుగా ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు ఉద్యోగులు కృషి చేయాలని యనమల అన్నారు. మంత్రి తాజా వ్యాఖ్యలతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. -
భారత్ రేటింగ్‌పై లోటు ప్రభావం ఉండదు: మూడీస్
న్యూఢిల్లీ: భారత స్వల్పకాలిక రేటింగ్స్‌పై ద్రవ్య లోటు గణాంకాల స్వల్ప పెరుగుదల, తగ్గుదల ప్రభావాలు పెద్దగా ఉండబోవని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. భారత ద్రవ్య పరిస్థితి ఇప్పటికే బలహీనంగా ఉందని, లోటు కట్టడి లక్ష్యాలు సాధించినా కూడా పరిస్థితి అలాగే ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాల ప్రభావమనేది రేటింగ్‌పై ఎక్కువగా ఉండబోదని మూడీస్ అసోసియేట్ ఎండీ అత్సి సేఠ్ వివరించారు. ప్రస్తుతం మూడీస్ భారత్‌కు సానుకూల అంచనాలతో ‘బీఏఏ3’ రేటింగ్ ఇచ్చింది. తామిచ్చే రేటింగ్ వృద్ధి ఆధారంగానే ఉంటుందని, విధానాల్లో మార్పులను బట్టి ఉండదని సేఠ్ తెలిపారు. అందుకే, 2002-03 నుంచి 2007-08 మధ్య కాలంలో ద్రవ్య లోటు ఏకంగా 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గినప్పటికీ తాము రేటింగ్‌ను పెంచలేదని ఆమె పేర్కొన్నారు. వచ్చే ఏడాది వృద్ధి 7.7 శాతం.. భారత్ వృద్ధి ధోరణికి కార్పొరేట్ ఫలితాలు, ద్రవ్యోల్బణమే కీలకమని మూడీస్ దేశీయ అనుబంధ విభాగం ఐసీఆర్ఏ రేటింగ్స్ పేర్కొంది. అయినా... 2016లో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2015-16లో భారత్‌లో 7.2%, 2016-17లో 7.7% వృద్ధి ఉంటుందని అంచనావేసింది. -
ఈసారి 7.5 శాతం వృద్ధి
దేశీయంగా పెరిగే డిమాండ్, వినియోగం తోడ్పాటు చమురు భారం తగ్గడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది భారత్‌పై యూఎన్‌సీటీఏడీ నివేదిక న్యూఢిల్లీ:దేశీయంగా డిమాండ్, వినియోగం ఊతం తో ఈ ఏడాది భారత్ 7.5 శాతం వృద్ధి సాధించగలదని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి మండలి (యూఎన్‌సీటీఏడీ) పేర్కొంది. చమురు దిగుమతుల భారం తగ్గడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదని ఒక నివేదికలో తెలిపింది. తూర్పు, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల సంయుక్త వృద్ధి రేటు 2015లో 5.5-6 శాతం మధ్యలో ఉండగలదని పేర్కొంది. ఆసియా మళ్లీ గతంలోలాగా అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోందని, 2015లో ప్రపంచ దేశాల మొత్తం వృద్ధిలో దాదాపు సగం వాటా దక్కించుకోగలదని వివరించింది. ముడిచమురు రేట్ల తగ్గుదలతో భారత్, పాకిస్తాన్ వంటి పలు దేశాల్లో క్యాడ్ భారం తగ్గిందని తెలిపింది. 2007-2015 మధ్య కాలంలో ప్రపంచ ఉత్పత్తి వృద్ధి పట్టికను ప్రస్తావిస్తూ.. భారత్ స్థూల దేశీయోత్పత్తి 7.5 శాతంగా ఉండగలదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అంచనాలు (8.1-8.5 శాతం).. ఐక్యరాజ్య సమితి అంచనాల కన్నా అధికంగా ఉండటం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ముందుగా 7.6 శాతం వృద్ధి రేటు అంచనా కట్టినా.. ఇటీవలే దాన్ని 7.4 శాతానికి కుదించింది. డిమాండ్ మెరుగుపర్చుకోవాలి.. భారత్ దేశీయంగా డిమాండ్‌ను పెంచుకోవడంపైనా, ఉద్యోగాల కల్పనపైనా దృష్టి సారించాలని నివేదికను ఆవిష్కరించిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిస్వజిత్ ధర్ తెలిపారు. కేవలం సేవా రంగంపైనే ఆధారపడకుండా వ్యవసాయం, తయారీ రంగాలకీ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అటు రేటింగ్ ఏజెన్సీలు వాస్తవ పరిస్థితులను పెద్దగా పట్టించుకోకుండా కేవలం కొన్ని నివేదికల ఆధారంగానే రేటింగ్ ఇస్తుంటాయని ధర్ వ్యాఖ్యానించారు. కాగా చాలా మటుకు ఆసియా దేశాలు.. ప్రధానంగా చైనా తమ దేశాల్లో డిమాండ్ సరళిని సరిచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయని యూఎన్‌సీటీఏడీ తెలిపింది.