Flawed
-
ఇక పక్కాగా ఓటరు లెక్క
►త్వరలో ఐఆర్‌ఈఆర్ కార్యక్రమం ►ఇప్పటికే బీఎల్ఓలకు ట్యాబ్‌ల అందజేత ►ఇంటి నంబర్‌తో ఓటర్లకు జియోట్యాగ్ ►అక్కడే తప్పుల సవరణ.. ►కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ వరంగల్ రూరల్: ఓటరు లెక్క.. పక్కాగా తేలనుంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఓటర్లును గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. త్వరలో ఇంటెన్సీవ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్స్ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ)కు ట్యాబ్‌లను అందజేశారు. ఇటీవల వీరికి శిక్షణ సైతం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా తొలుత అర్బన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ తర్వాత రూరల్ ప్రాంతాల్లో చేపట్టేలా కార్యచరణ రూపొందించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, జనగాం జిల్లాలోని ఘన్పూర్(స్టేషన్) తొలి విడతలో ఐఆర్‌ఈఆర్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. మొదట సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి నంబర్ అనుసంధానం చేసి జియో ట్యాగ్ చేయనున్నారు. ఓటరు జాబితలో తప్పులు ఉంటే సవరించనున్నారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతీయువకుల నుంచి ఓటరు దరఖాస్తులు స్వీకరించి.. ఓటు హక్కు కల్పించనున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. బీఎల్ఓలు ఓటరు ఇంటికి వెళ్లిన సమయం.. ఎవరి దగ్గర వివరాలు సేకరించారు.. వంటి అంశాలను ఆన్లైన్లో వెంట వెంటనే అప్డేట్ చేయనున్నారు. ఇది వరకు బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓరల్‌గా సమాచారం సేకరించే వారు. ఇంట్లో లేరని తెలియడంతో వెంటనే ఆ ఓటును తొలగించేవారు. ఇలా ఓట్లు తొలగింపు జాతీయ ఎన్నికల కమిషన్‌కు తలనొప్పిగా మారింది. ఓట్లు ఎందుకు తొలగించారు అని కోర్టుకు వెళ్లిన సంఘటనలు సైతం ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిని నిరోదించేందుకు.. పక్కాగా ఓటరు లెక్క ఉండేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని చేయనున్నారు. ఒకరికి రెండు ఓట్లు.. వివహామై ఆ ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతుల పేర్లను తొలగించనున్నారు. కొనసాగుతున్న ఓటరు నమోదు జిల్లాల పునర్విభజన తర్వాత ఓటు హక్కును కల్పించేందుకు చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. 18 ఏళ్లునిండిన యువతీయువకులను గుర్తించేందుకు గతంలో సర్వే నిర్వహించారు. బీఎల్ఓలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్లు, కారోబార్లు, వీఆర్ఓ, వీఆర్ఏలు బూత్ లెవల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు -
పొరపాట్లు... ఏమరుపాట్లు
రాంగ్ డైరెక్షన్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. సినిమా ప్రేక్షకులు కూడా దర్శక , నిర్మాతలకు దేవుళ్ల వంటివారే. పిక్చర్‌ను హిట్ చేసి కోట్లకు కోట్లు కుమ్మరిస్తారు. పిక్చర్‌లోని తప్పులను చూసీ చూడనట్లు పెద్ద మనసుతో క్షమించేస్తారు! తప్పులంటే పెద్ద తప్పులేం కాదు లెండి, మానవ తప్పిదాలు. వాటిని పొరపాట్లు, ఏమరుపాట్లు అనుకోవాలి. సరదాగా తీసుకుని నవ్వుకోవాలి. అలా కాసేపు మీ ముఖంపై చిరునవ్వుల్ని చిందించే కొన్ని బాలీవుడ్ ‘చిత్ర’ విచిత్రాలు ఇవి. ఎంజాయ్ చెయ్యండి. 1. ఓవర్‌కి 6 బంతులా? ‘లగాన్’ సినిమా కథ 1892 నాటిది. అందులో రెండు క్రికెట్ టీములూ ఓవర్‌కి ఆరు బంతులు చొప్పున ఆడతాయి! కానీ ఇంగ్లండ్‌లో ఆ కాలంలో ఓవర్‌కి 5 బంతులే ఆడేవారు! హౌ ఈజ్ దాట్!! 2. రెండున్నర ‘నవమాసాలు’! ‘క్రిష్’ చిత్రంలో రోహిత్ (హృతిక్ రోషన్) రెండేళ్లుగా సింగపూర్‌లో ఉంటాడు. ఇక్కడ ఇండియాలో ఉన్న రోహిత్ భార్య ప్రీతీ జింతా ఈ రెండేళ్లూ ప్రెగ్నెంట్‌గానే ఉంటుంది! 3. పాట 1950ల సినిమాలో! ‘భాగ్ మిల్కా భాగ్’ మూవీ కథాంశం 1950ల నాటిది. అందులో ఫర్హాన్ అఖ్తర్ ‘నన్హా మున్నా రహీ హూ’ అనే పాట పాడతాడు. అయితే ఆ పాట 1962 నాటి ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రంలోనిది! భలే బుక్ అయ్యారు రాకేశ్ ఓం ప్రకాష్ మిశ్రా. మిశ్రా ఎవరా? ఆ సినిమా డైరెక్టర్. 4. రాంగ్ అడ్రస్! ‘పికె’ చిత్రంలో సర్ఫరాజ్ (సుశాంత్ సింగ్) తను బ్రూజెస్లోని పాకిస్తానీ రాయబార కార్యాలయంలో పనిచేస్తుంటానని జగ్గుతో (అనుష్క) చెబుతాడు. కానీ బ్రూజెస్లో ఆ కార్యాలయం లేదు. బ్రస్సెల్స్‌లో ఉంది. (ఈ రెండు ప్రాంతాలూ బెల్జియంలోనివే.) 5. రాంగ్ ట్రైన్ ఇదే సినిమాలో సంజయ్‌దత్ 12290 నెంబర్ ట్రైన్లో ఢిల్లీ వస్తాడు. కానీ అది ముంబై, నాగపూర్‌ల మధ్య నడిచే ‘దురంతో’ ఎక్స్‌ప్రెస్! ట్రైన్ మీద ‘కల్యాణ్’ అనే ఇంగ్లీషు అక్షరాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి... అది ‘దురంతో’ ఎక్స్‌ప్రెస్ అనేదానికి రుజువుగా. 6. క్రిస్టియన్ చితాభస్మం! ‘రా.1’ చిత్రంలో షారుఖ్ ఖాన్ దక్షిణాది హిందువు. అతడిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం శవపేటికలో ఉంచి, ఖననం చేస్తారు! ఆ తర్వాత వచ్చే సీన్లో షారుఖ్ భార్య అతడి చితాభస్మాన్ని నదిలో కలుపుతూ కనిపిస్తుంది! దేవుడా!! 7. ‘టాప్’ మిస్టేక్ ‘జిందగీ న మిలేగీ దొబారా’ మూవీలో ఒకే సన్నివేశంలో కత్రినా కైఫ్ టీషర్ట్ కలర్ మారిపోతుంది. హృతిక్ రోషన్‌ని కలవడం కోసం ఈ పిల్ల తన ఫ్రెండ్ బైక్ అడిగి తీసుకుని బయల్దేరినప్పుడు పింక్ టాప్‌లో ఉంటుంది. తర్వాతి సీన్లో బైక్ దిగి, హృతిక్ రోషన్‌ని కలిసినప్పుడు మెరూన్ కలర్ టాప్‌లో ఉంటుంది. 8. బేతాళుడి బుక్ ‘యే జవానీ హై దీవానీ’ చిత్రంలో బన్నీ (రణబీర్ కపూర్), నైనా (దీపికా పదుకొనే) పట్టుకొని ఉన్న లగేజీతో పాటు, ఆమె చేతిలోని పుస్తకం కూడా అందుకుంటాడు. ఆ వెంటనే వచ్చే సీన్లో ఆ బుక్ ఇంకా నైనా చేతిలోనే ఉంటుంది! బేతాళుడు తిరిగి చెట్టెక్కినట్టుగా! 9. ఫోర్త్ ఇడియట్! ‘త్రీ ఇడియట్స్’ ఎండింగ్ సీన్లో సుహాస్ (ఆలివర్ సంజయ్ లఫాంట్) ఆల్రెడీ పెళ్లి మండపం లోపల ఉంటాడు. కానీ ఆ వెంటనే అతడు మెయిన్ గేటులో నుంచి పెళ్లి మండపంలోకి పరుగెత్తి వస్తూ కనిపిస్తాడు. 10. షేప్ మారిపోయింది ‘దమ్ లగాకే హైస్సా’ మూవీలో సంధ్యను కలవడానికి ప్రేమ్, అతడి కుటుంబం లేత నీలి రంగు ఆమ్నీ వ్యాన్‌లో బయల్దేరతారు. దారి మధ్యలో ఆమ్నీ కాస్తా డొక్కు వ్యానుగా మారిపోతుంది! 11. లేని చానల్లో అల్లర్ల న్యూస్! ‘కాయ్ పో చె’ చిత్రంలో గుజరాత్ అల్లర్ల సీన్ ఉంటుంది. ఆ అల్లర్లను సినిమాలో ‘హెడ్‌లైన్స్ టుడే’ ఛానల్ చూపిస్తూ ఉంటుంది. నిజానికి అప్పటికి ఆ ఛానల్ లేదు. అల్లర్లు జరిగింది 2002లో. చానల్ స్టార్ట్ అయింది 2003లో! -
వాయిదా పద్ధతొద్దు దేనికైనా
బద్ధకిష్టులకు పరిష్కార మార్గాలు ‘అబ్బబ్బ... ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న పని.ఇప్పటికీ పూర్తి కాలేదు... ’ మనలో చాలామంది నోట తరచూ వినిపించే మాట ఇది. నిజానికి ఇది ఒక లోపమే! ఒక్క ముక్కలో చెప్పాలంటే - వాయిదా మనస్తత్త్వం. స్థాయిలో తేడా ఉండవచ్చేమో కానీ, మనస్తత్త్వం మాత్రం కామన్. చెడు అలవాట్లు మానుకోవడం, మంచి అలవాట్లు చేసుకోవడం, చదువులో పూర్తి చేయాల్సిన పోర్షన్, ఆఫీసులో పూర్తి చేయాల్సిన పని - ఇలా రకరకాల వాటిలో ఈ లక్షణం తొంగి చూస్తుంటుంది. ఇలాంటి మనస్తత్త్వం ఉండేవారందరినీ మనస్తత్త్వ నిపుణులు వివిధ వర్గాలుగా విభజించారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా ఉంటారు, ఒత్తిడి పెరిగితే తడబడిపోతారా, ఫెయిల్యూర్ వస్తే తట్టుకుంటారా లాంటి పలు అంశాల ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు. ఆ వర్గీకరణ, అలాంటి వాయిదా మనస్తత్త్వం ఉన్నవాళ్ళు తమను ఎలా చక్కదిద్దుకోవాలో చూద్దాం... అతి ధైర్యవంతుల రకం ఈ రకమైన వాయిదా వ్యక్తులు ఆఖరు క్షణంలో పని మొదలుపెడతారు. ఆఖరు క్షణం దగ్గర పడుతోందనే ఒత్తిడి ఉన్నప్పుడే తాము బాగా పనిచేయగలుగుతామని భావిస్తారు. సర్వసాధారణంగా వీళ్ళు తమ బద్ధకం కారణంగా ఆఖరు నిమిషం వరకు పని వాయిదా వేసుకుంటూ వస్తారు. చివరికి వచ్చేసరికి హడావిడిగా పని పూర్తి చేయాల్సొచ్చి, పొరపాట్లు చేసే ప్రమాదం ఉంటుంది. ఈ రకం వ్యక్తులు పని విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఆ పని ఎంత నాణ్యంగా పూర్తయిందన్న దానిపై పట్టింపు పెట్టుకోరు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు మెడ మీద కత్తి లాంటి డెడ్లైన్లు పెట్టుకోవాలి. ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకుంటూ వెళ్ళాలి. తమ పనిని తామే అంచనా వేసుకుంటూ పోవాలి. పనిని అనుకున్నట్లు పూర్తి చేస్తే తమను తాము అభినందించుకోవాలి. పూర్తి చేయకపోతే తమకు తామే పనిష్మెంట్ కూడా వేసుకోవాలి. అలా స్వీయ నియంత్రణ వల్ల వాయిదా మనస్తత్త్వాన్ని దూరం చేసుకోగలుగుతారు. పనికి అడ్డంకులు సృష్టించుకొనే రకం ఈ రకం వాయిదా మనుషులు కూడా ఆఖరి నిమిషంలో ఒత్తిడి మధ్య పనిచేస్తేనే తాము బాగా పనిచేయగలమని పొరపడుతుంటారు. వీళ్ళలో విచిత్రం ఏమిటంటే - తమ పనికి తామే అడ్డంకులు సృష్టించుకుంటూ ఉంటారు. పనిచేసే క్రమంలోని ఈ అడ్డంకుల రీత్యా తమకు తామే ఆ పని నుంచి పక్కకు వస్తారు. పనిలో ఆలస్యమేమిటని అడిగితే, ఆ తప్పు మరొకరి మీద నెట్టేస్తుంటారు. అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, పనిలో క్వాలిటీ మాత్రం తగ్గకూడదనుకుంటారు. పరిష్కారం: మీరు గనక ఇలాంటి రకం వ్యక్తులైతే, అడ్డంకుల గురించి కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు, పనిలో కాసేపు విరామం తీసుకొని, ఆ టైమ్‌లో ఫేస్బుక్ చూసుకోవడం మీకు అలవాటు అనుకుందాం. దీని వల్ల పని టైమ్ వృథా అవుతుంది. ఆ మేరకు పని ఆలస్యమవుతుంది. ఈ సంగతి గ్రహించి, మీ లంచ్ బ్రేక్ టైమ్‌లోనో ఏమో ఈ ఫేస్బుక్ చూసే వ్యవహారం పెట్టుకున్నారనుకోండి. ఇటు ఫేస్బుక్ చూడడం ఆగదు. అటు పని సమయం వృథా కాదు. మామూలు టైమ్‌కే పని పూర్తయిపోతుంది. డెసిషన్‌ని తప్పించుకొనే రకం ఈ రకం వాయిదా మనుషులు ఏ నిర్ణయమూ తీసుకోకుండా వాయిదా వేస్తుంటారు. వీళ్ళకు పని విషయంలోనూ భయమే. ఆ భయంతో పని అసలు మొదలే పెట్టరు. ఇలా నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల ఫెయిల్యూర్ వస్తుందని కానీ, ఇతరులు తమను అంచనా వేస్తారని కానీ భయం ఉండదు కదా అని తృప్తి పడుతుంటారు. ఫలానా టైమ్‌లోగా పని పూర్తి కావాలనే డెడ్లైన్లు ఉన్నాయంటే, తెగ బాధపడిపోతారు. చేసే పని నాణ్యంగా ఉండాలని అనుకుంటారు కానీ, ఆఖరు నిమిషంలోని ఒత్తిడిని సరిగ్గా సంబాళించుకోలేరు. సాధారణంగా ఈ రకం వ్యక్తులు తమ పనితో సంతోషంగా ఉంటారు. కానీ, ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని తెగ వర్రీ అవుతుంటారు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకొనేందుకు గట్టిగా నిర్ణయించుకోవాలి. ‘‘మనం ఏం చేసినా ఎదుటివాళ్ళు కొందరు జడ్జ్ చేసి, ఏదో ఒకటి అంటారు. కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ కూడా అవుతాం. అయినా ఫరవాలేదు. ప్రపంచమేమీ తలకిందులు కాదు. దాని నుంచి కూడా నేర్చుకుంటా’’ అని తమకు తామే గట్టిగా చెప్పుకోవాలి. పక్కవాళ్ళ మీద నెట్టేసే రకం ఇలాంటి రకం వ్యక్తులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో గందరగోళంలో ఉంటారు. అందుకే, ఇతరులనే నిర్ణయం తీసుకోనిస్తారు. ఈ గందరగోళం వల్ల పని ఆలస్యమవుతుంది. ఫెయిల్యూర్ భారాన్ని కూడా ఇతరుల మీదే పడేస్తారు. వీళ్ళకు కూడా తమ పని పట్ల సంతృప్తి ఉంటుంది కానీ, ఇతరులు ఏమంటారోనన్న శంక పీడిస్తూ ఉంటుంది. ఈ రకం వాయిదా మనుషులు ఒక పట్టాన పని మొదలుపెట్టరు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులకు ఏది ముందుగా ఎంచుకోవాలనే మీమాంస వచ్చినప్పుడు - రెండు రకాల మార్గాలున్నాయి. ఉన్నవాటిలో అతి పెద్ద పనిని ముందుగా చేపట్టి, అది అయ్యాక మిగిలిన చిన్న పనుల్లోకి వెళ్ళాలి. ఇక, రెండో పద్ధతి ఏమిటంటే - పెద్ద పనిని ముందుగానే చిన్న చిన్న పనులుగా విడగొట్టుకోవాలి. ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం మీద తమలోని వాయిదా మనస్తత్త్వాన్ని ఎవరికి వారు గుర్తించి, సరిదిద్దుకోవాలి. బద్ధకాన్ని వదిలించుకొని, పనిలో పడాలి. పైన చెప్పిన పరిష్కార మార్గాల్ని అలవాటు చేసుకోవాలి. అందుకోసం మానసికంగా కృతనిశ్చయంతో ఉండాలి. వాయిదా పద్ధతిని సరైన సమయంలో మార్చుకుంటే, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. పనిలో పురోగతితో, జీవితం కూడా ఆనందంగా మారుతుంది. మరింకేం... వాయిదా వేయకుండా ఆచరణలో పెట్టండి. ఆల్ ది బెస్ట్! ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలనుకొనే రకం ఈ రకం వ్యక్తులు తమ పని ఏ మాత్రం తప్పు లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలని, అసలు విమర్శలే రాకూడదనీ అనుకోవడం వల్ల ఆలస్యం జరుగుతుంటుంది. ఈ పర్ఫెక్షనిజమ్కి మూలకారణం ఏమిటంటే మనస్సులోని ఆందోళన. వీళ్ళు పని మొదలుపెట్టేస్తారు కానీ చేయాల్సిన పనుల జాబితా మాత్రం కొండవీటి చాంతాడంత ఉంటుంది. కాబట్టి ఒత్తిడి ఎదురైనప్పుడు తడబడతారు. ఇలాంటి పర్ఫెక్షనిస్టులు అవతలివాళ్ళు ఏమంటారో అన్న దాని గురించి అతిగా ఆలోచిస్తుంటారు. ఇతరుల్ని నిర్ణయం తీసుకోనిచ్చి ఆందోళనను అప్పటికి దూరం చేసుకుంటూ ఉంటారు. పరిష్కారం: పర్ఫెక్షనిజమ్ తప్పు కాదు కానీ పనిని వాయిదా వేయకుండా టైమ్‌కి పూర్తి చేయడం కోసం ఇలాంటి వ్యక్తులు ‘ఎస్.ఎం.ఎ.ఆర్.టి’ (స్మార్ట్ -స్పెసిఫిక్, మెజరబుల్, ఎటైనబుల్, రిలవెంట్, టైమ్ బౌండ్) లక్ష్యాలను పెట్టుకోవాలి. లక్ష్యాలు నిర్ణీతంగా, అంచనా వేయడానికి వీలుగా, అందుకోదగినట్లుగా ఉండాలి. సమయానికి తగ్గవై ఉండాలి. నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా ఉండాలి. ఎవరం ఏ పని చేసినా అందులో అసలు తప్పులే లేకుండా ఉండడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చేసే పనిలో ఎప్పటికప్పుడు మెరుగుదల సాధించాలి. -
వజ్రం వంటిది వాక్కు
విద్య - విలువలు సమాజంలో ఎప్పుడూ మూడు రకాల వ్యక్తులు ఎదురవుతుంటారు. నీకన్నా అధికులు, నీతో సమానులు, నీకన్నా తక్కువ వారు. ఈ ముగ్గురితో ఎలా ప్రవర్తించాలో వేదం చెప్పింది. నీకన్నా అధికులు కనబడ్డారు. వారి ఆధిక్యాన్ని నీవు అంగీకరించాలి. మహానుభావుడు ఎంత సాధన చేశాడండీ... ఎప్పటికయినా వచ్చే జన్మకయినా అంత ఎత్తుకు ఎదగాలి అని మీరు వారికి నమస్కరించారనుకోండి. ఇప్పుడు మీరు ఎవరికి నమస్కరించారో వారు గొప్పవారన్నమాట పక్కనబెట్టండి, మీరు గొప్పవారయ్యారు. మీరు సంస్కారవంతులయ్యారు. మీరు నమస్కరించ లేదనుకోండి. అవతలివాడి ఆధిక్యం కించిత్ కూడా పోదు. వారి గౌరవం, వారి విద్వత్తు, వారి జ్ఞానం అలానే ఉంటాయి. పోయింది ఎవరి ఆధిక్యమంటే మనదే. వారి ఔన్నత్యాన్ని మనం అంగీకరించలేకపోయాం. తేడా మనలో ఉంది. పెద్దలు కనబడితే గౌరవించు. సమానులు కనబడితే... ఎదుటివ్యక్తి నీలాగా ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటాడన్న ఆలోచన రావాలి. నీవెంత కష్టపడిందీ నీకు తెలుసు. ఆయనను చూసినప్పుడు ఆదరభావం కలగాలి. ప్రేమతో మాట్లాడగలగాలి. నీకన్నా తక్కువ వారు కనబడితే... ఈశ్వరానుగ్రహంతో ఇతనుకూడా వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. ఇతనికన్నా పైన నేనున్నాను. నా అంతవాడయి నా స్థాయిని చేరుకోగలనన్న తృప్తి ఇతనికి కలుగుగాక, అని ప్రార్థించారనుకోండి. మీ పెద్దరికం నిలబడింది, మీ లాలిత్యం నిలబడింది. ఈ మూడురకాలుగా కాకుండా ఏ రకంగా ప్రవర్తించినా అది తెగడ్త. జీవిత పర్యంతం చదువుకుంటూనే ఉంటాం. దేనికి!!! సంస్కారబలం వృద్ధి చెందడం కోసం. సమాజంలో మనిషి మనిషిలాగా బతకాలి, పశువులాగా బతకకూడదు కనుక. దానికోసం చదువుకోవాలి. ఈ మూడింటికీ నీవు లొంగలేదు. నిన్ను తెగిడేవాడు కనబడ్డాడు. అప్పుడేం చేయాలి. అతన్ని సంస్కరించే పని చేయాలి. ఈశ్వరా! జారుడుమెట్ల మీద నిలబడి పెకైక్కాలనుకుంటున్నాడు. నిచ్చెన పెకైక్కడానికి కానీ దిగడానికి కాదుగదా. భగవాన్! ఇతను అహంకారంతో ఉన్నాడు. దాన్ని తొలగించి వృద్ధిలోకి వచ్చేటట్లు ప్రయత్నించు. అని వేడుకోవాలి. తెగడ్తను నీవు పుచ్చుకోకూడదు. నీవు స్వీకరించకూడదు. అందుకే వాదన చేయవద్దు అని శాస్త్రం చెప్పింది. వాదన అగ్నిలో ఆజ్యం పోసినట్లే ఉంటుంది. అది అసూయాజనితం. నీవు తెగడ్తను పుచ్చుకుంటే పాడయిపోయేది నువ్వే. అసూయతో ఉన్నవాడు బాగానే ఉంటాడు. నీ ఆగ్రహం ఎక్కువవుతుంటుంది. చాలాసార్లు పొరపాట్లు జరిగేది ఇక్కడే. అందుకే సంయక్-బాగా తయారవడానికి... సంస్కారాన్ని వినియోగించు.. అని శాస్త్రం చెప్పింది. లోకహితానికి కావలసిన రీతిలో సంస్కారాన్ని పొందు. కేవలం చదువుతో వెళ్ళి కూర్చుంటే సమాజంలో ప్రయోజనాన్ని పొందడంలో వైక్లబ్యాన్ని పొందుతారు. తెగడ్త-స్వప్రయోజనాన్ని సాధించుకోడానికి దాన్ని సాధనంగా వాడుకోవడం ఒకడు ఇదిలా ఉండకూడదు, అదలా జరగకూడదు అనుకుంటుంటాడు. అది ఎంత మంచి కార్యమయినా అది తను అనుకున్నట్లుగా మారిపోవడానికి తన వాక్కును ఉపయోగిస్తాడు. అసలు శ్రీరామాయణం అంతా ఎక్కడ మలుపుతిరిగింది! పుట్టినప్పటినుంచి కైకమ్మకు దాదిగా ఉన్న మంధర తప్ప శ్రీరామపట్టాభిషేకానికి అందరూ సంతోషించారు. ఇలా జరగకుండాఉంటే బాగుండుననే ఆలోచన ఆమెకు వచ్చింది. అంతే... కైక మనసులో కల్మషం నింపింది. శ్రీరాముడు, భరతుడు కొద్ది వ్యవధితో పుట్టినవారు. ఒకసారి రాముడు రాజయితే ఇక నీ వంశంలో ఎవరూ రాజుకాలేరు. రాముడి తర్వాత రాముడికొడుకే రాజవుతాడు. భరతుడే కాదు భరతుడి కొడుకు కూడా రాజు కాలేడు. కౌసల్య రాజమాత అవుతుంది. ఇప్పటిదాకా ఇద్దరూ సమానులే. ఇక అలా కుదరదు. రాజమాత వెడుతుంటే నీవు చేతులు కట్టుకుని నమస్కరిస్తూ ఆమె వెనక వెళ్ళాల్సి ఉంటుంది.. అని. మాటలు విషాన్ని ప్రోది చేసేసాయి. రాజయిన దశరథుడు, కౌసల్య, సుమిత్రలు, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘు్నలు, మహర్షులు, యావత్ ప్రజలు అంతా ఒకవైపు నిలబడినా ఒక దాసి మాటలకారణంగా పట్టాభిషేకం జరపలేక పోయారు. నిజానికి కైకేయి కూడా పట్టాభిషేకానికి సంతోషించింది. కానీ మంధర తన మాటలతో మొత్తం కథను మార్చేసింది. అలా మాట్లాడేవారు రేపు మీ జీవితాల్లోకూడా తటస్థపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు మీరు ఎంత పెద్ద పదవిలోకి వెళ్ళినా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, మీ పక్కనే చేరి ఎవడో దారితప్పిన వాడిని చూపి నీకెందుకీ మంచితనం, నీ కెందుకీ ప్రవర్తన, అని హితబోధ చేస్తున్నట్లుగా చెప్పేవారుంటారు. నీవు చేస్తున్నపని మీద విశ్వాసం ఉంచి ఇటువంటి మాటలను తోసేయడం అలవాటు చేసుకోలేకపోతే వాడు నిన్ను వాడుకుని వదిలేస్తాడు. నీ పని పులిస్తరాకులా తయారయిపోతుంది. అన్నం పెట్టుకుని తింటున్నంతసేపే విస్తరాకుకు గౌరవం. స్వకార్యాన్ని సాధించుకోవడానికి మీ పక్కన చేరిన వారి మాటలకు లొంగిపోవడానికి మీరు అలవాటుపడిపోయారో జీవితంలో మీరు వృద్ధిలోకి రాలేరు. మీ తల్లిదండ్రుల కష్టం, మీ కష్టం, అప్పటిదాకా మీరు సంపాదించుకున్న కీర్తి అడుక్కి వెళ్ళిపోతాయి. మహామంత్రి తిమ్మరుసు పోతే తప్ప విజయనగర సామ్రాజ్యం పడిపోదు అని తీర్మానించుకున్న వారు చివరకు ఆయనమీద రాయలవారికి లేనిపోనివన్నీ చెప్పారు. రాయలు తిమ్మరుసు కళ్ళు పొడిపించేసాడు. అప్పటికీ రామరాయల వల్ల సామ్రాజ్యం నిలబడినా ఆయనను కూడా తప్పుదోవ పట్టించారు. చివరకు ఇవ్వాళ శిథిలాలు మిగిలాయి. ఒక్కమాటతో రాజ్యం పడిపోయింది. ఒక్కమాటతో మహామంత్రి పడిపోయాడు. ఒక్క మాటతో రామాయణ కథ అడ్డంతిరిగింది. ఒక్కమాటతో రామచంద్ర మూర్తి జీవితపర్యంతం భార్య పక్కన లేకుండా గడిపేశాడు. మాట అంత శక్తిమంతమైనది. అందుకే ఒక వాక్కు మిమ్మల్ని సర్వ నాశనం చేయగలదు, ఒక వాక్కు మిమ్మల్ని అందుకోలేని ఎత్తులకు తీసుకెళ్ళగలదు అంటాడు. ఏమిటీ, నువ్వు కూడా ఈ ఉద్యోగంలో చేరదామనే వచ్చావా? అని ఎవరయినా అన్నారనుకోండి. మీరు చిన్నబుచ్చుకుంటారు. మిమ్మల్నీ మాటలు పదేపదే బాధిస్తుంటాయి. అప్పుడు నేను వచ్చి ఏం తక్కువయిందని నీకు! నీవెన్ని సాధించలేదు, నీవు తప్పకుండా సాధించగలవు అన్నాననుకోండి. నీ శక్తి ప్రజ్వలనం అవుతుంది. ఒకవాక్కు మిమ్మల్ని పతనం చేయగలదు, ఒక వాక్కు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలదు. అయితే అది పొగడ్త కాకూడదు. యుక్తాయుక్త విచక్షణతో కూడుకున్నదయి ఉండాలి. పెద్దల హితవాక్కులు ఎప్పుడూ వింటూ ఉండాలి. అవే మీకు సంస్కారబలాన్ని నేర్పుతాయి. మీరు ఎంత గొప్పవారయినా, ఎంత చదువుకున్నవారయినా సమాజంలోని ఇతర వ్యక్తులతో సమన్వయం మీకు చేతకాకపోతే ఎవర్ని దగ్గరగా ఉంచాలో ఎవర్ని దూరంగా ఉంచాలో చేతకానినాడు చాలా చాలా ఇబ్బంది పడతారు. స్వప్రయోజనాభిలాషుడయి మీ దగ్గరచేరి మాట్లాడుతున్నప్పుడు తన కార్యాన్ని సాధించుకోవడానికి నీ శక్తిని వాడుకుంటాడు. ఎందుకో తెలుసా!!! వాడు నీ అంత చదువుకోలేదు, నీ అంత కష్టపడలేదు, నీవు రాసినన్ని పరీక్షలు రాయలేదు, నీవు కూర్చున్న పదవిలోకి వాడు ఈ జన్మకు రాలేడు. కానీ వాడికి ఒక్కటి వచ్చు. మాటలతో మభ్యపెట్టి మీ స్థానాన్ని తన ప్రయోజనం కోసం వాడుకోవడం వచ్చు. ఆ అప్రతిష్ఠ నీది, ప్రయోజనం వాడిది. నీకు జాగ్రత్త పడడం చేతకాకపోతే నీ పెట్టుబడికి వాడు యజమాని ఔతాడు. అందుకే జాగ్రత్త పడమని శాస్త్రం హెచ్చరిస్తుంది. హితవాక్కు అన్ని వేళలా మృదువుగా, మధురంగా ఉండదు. ప్రతిసారీ చాలా మర్యాదగా, మెత్తగా మాట్లాడటం కుదరదు. రాజశాసనం ఎలా ఉంటుందో అలా ఉండాలి. సత్యంవద ధర్మంచర, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ... అంతేగానీ మీ అమ్మగారిని బాగా చూడు నాన్నా, మీ నాన్నగారిని బాగాచూడు నాన్నా అని చెప్పదు. రాజశాసనం ఎలా కఠినంగా ఉంటుందో అలా ఉంటుంది. మరీ ఇంత కఠినంగా ఉంటే ఎలా అని మన పురాణాలు ఒక స్నేహితుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు... ఇదిగో రేయ్, నీకు ఆఖరిసారి చెబుతున్నా వినకపోతే పాడయిపోతావ్ తర్వాత నీఖర్మ... ఇలా చెబుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది...ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్లు, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్లు అనునయంగా మాట్లాడితే వినే వాడొకడుంటాడు. తారమాట్లాడితే సుగ్రీవుడు వింటాడు. శ్రీ రామాయణం ఎక్కడా కఠినంగా ఉండదు. అందుకే దానిని కావ్యభాష అంటారు. వాల్మీకి అంటాడు... ఎవరు ఎలా మాట్లాడతారన్నది తెలుసుకోలేని వాడు కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం నాశనమవుతుంది. వాడు ఒక అధికారి అయితే అక్కడి వ్యవస్థ నాశనమవుతుంది. ఒక గ్రామాధికారయితే గ్రామం, దేశాధినేతయితే దేశం నాశనమవుతాయి. ఆవుల మంద వెనుక ఒక గొల్లవాడు వెడుతుంటే ఆవులు రక్షింపబడతాయి. నక్కవెడితే ఆవులు కనబడవు. అందుకే స్వభావం అన్నారు. నీకు పుట్టుకతో వచ్చినది ఏది, దాన్ని దిద్ది మార్చగలిగినది ఏది... అంటే ఒక్క మంచిమాట. అదే మిమ్మల్ని మారుస్తుంది.