fncc
-
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన FNCC సభ్యులు
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ (FNCC) ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు వెంకయ్య నాయుడు గారిని కలిసి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ.. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీగా ఉండటమే కాకుండా వివిధ శాఖల మంత్రిగా అలాగే మాజీ ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణం రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారని ఆయన తెలియ చేశారు. FNCC సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ.. ఈ రోజున వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషన్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. తెలుగువారిగా ఉపరాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి వ్యక్తికి భారతరత్న రావాలని నా అభిప్రాయం అని తెలియజేశారు. మాకు సమయాన్ని కేటాయించినందుకు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు అన్నారు -
ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో గ్రాండ్‌గా న్యూ ఇయర్ వేడుకలు
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్ ఏర్పాటు చేసి.. సంగీత విభావరి, బెల్లీ డాన్స్, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ ఆహుతుల్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని 2023కి వీడ్కోలు పలికారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఎఫ్ఎన్సీసీ సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ.. "గతంలోని కమిటీ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌ని ఎంతో అభివృద్ధి చేసింది. మేము కూడా అదే దిశగా ముందుకు తీసుకెళతాం. దక్షిణాదిలో నంబర్ వన్ కల్చరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతాం" అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ ప్రెసిడెంట్ జి.ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ట్రెజరర్ బి రాజశేఖరరెడ్డి, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ , శైలజా జుజల, బాలరాజు, గోపాలరావు, ఏడిద రాజా మోహన్ వడ్లపట్ల, ఇంద్రపాల్‌రెడ్డి, వరప్రసాదరావు పాల్గొన్నారు. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సన్మానించిన FNCC సభ్యులు
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు తాజాగా సన్మానం చేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు ప్రెసిడెంట్ ఆదిశేష గిరి, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో పాటుగా ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గడ్డం ప్రసాద్‌కు FNCC ప్రెసిడెంట్, సెక్రటరీ పుష్పగుచ్చము ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ప్రొడ్యూసర్, FNCC సెక్రటరీ మోహన్ మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ ఆహ్వానాన్ని మన్నించి FNCCకి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ప్రత్యేకంగా కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఇలా ఈ సన్మానానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. FNCC ద్వారా ఇక్కడికి రావడమే కాకుండా తన స్నేహితుల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. FNCC కి తన వంతు కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని ఆయన తెలియచేశారు. ఇలా తనను ఆహ్వానించి గౌరవించినందుకు FNCC కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ( ఫొటోలు)
-
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
ఫిలింనగర్‌లోని ఎఫ్ఎన్సీసీలో గత ఆదివారం నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ఇంకా పూర్తి కాలేదు. శిథిలాల తొలగింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇనుపచువ్వలు కట్ చేయడం, పిల్లర్లు పగలగొట్టడం చాలా సమస్యాత్మకంగా ఉండటంతో ఆరు రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా కూలిన పోర్టికో శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగించే క్రమంలో ఎఫ్ఎన్సీసీ ప్రధాన భవనానికి ముప్పు ఏర్పడింది. ఇప్పటికే అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన గేటు వద్ద కిటికీలు విరిగిపోయాయి. గోడలు ధ్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుండటంతో ఎఫ్ఎన్సీసీ యాజమాన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
కేఎస్ రామారావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు కేఎస్ రామారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కేఎస్ రామారావుతో పాటు కార్యదర్శికి, మరో నలుగురికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన గురువారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కేఎస్ రామారావును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 41 నిబంధన పాటించాలని, కేఎస్ రామారావుకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కాగా ఈ నెల 24న ఫిలింనగర్‌లోని ఫిలింనగర్ కన్వెన్షన్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో పోర్టికో కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గంపైన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. -
ఇక విచారణ తేలినట్లే!
బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని ఎఫ్ఎన్సీసీలో నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనపై విచారణ బాధ్యతలను ప్రభుత్వం జేఎన్టీయూ నిపుణుల కమిటీకి అప్పగించడం పట్ల ఎఫ్ఎన్సీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నివేదికను బుట్టదాఖలు చేసేందుకే జేఎన్టీయూకు విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో సిటీలైట్స్ హోటల్ కుప్పకూలిన ఘట నలోనూ విచారణ చేపట్టిన జేఎన్టీయూ ఇంతవరకు నివేదిక అందజేయలేదన్నారు. విచారణ బాధ్యతలను ఇతరులకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల్లో గుబులు ఎఫ్ఎన్సీసీ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో జీహెచ్ఎంసీ సర్కిల్–10ఏ, సర్కిల్–10బి అధికారుల్లో గుబులు మొదలైంది. ఆయా సర్కిళ్ల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులందడంతో వాటిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమతులు తీసుకున్న వారి జాబితా ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో సర్కిల్–10 పరిధిలోని డీఎంసీలు, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శేఖర్‌రెడ్డి, సెక్షన్ అధికారి మల్లీశ్వర్‌ను సస్పెండ్ చేశారు. ఇటీవల ఏఎంహెచ్‌వో కూడా సస్పెన్షన్‌కు గురికావడంతో ఈ రెండు సర్కిల్ కార్యాలయాలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వాటిని ప్రక్షాళన చేయాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇద్దరు ఉప కమిషనర్లతోపాటు ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు, ఏఎంహెచ్వోలపై బదిలీ వేటు పడనున్నట్లు సమాచారం. నోటీసుల జారీ నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో కాంట్రాక్టర్ కొండల్రావు, సైట్ ఇంజనీర్ సుధాకర్‌రావు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ బాలరాజులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం విచారించారు. ఇందులో భాగంగా ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కే.ఎస్.రామారావుతో పాటు కార్యదర్శిని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.