హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్ ఏర్పాటు చేసి.. సంగీత విభావరి, బెల్లీ డాన్స్, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ ఆహుతుల్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని 2023కి వీడ్కోలు పలికారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ఎఫ్ఎన్‌సీసీ సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ.. "గతంలోని కమిటీ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌ని ఎంతో అభివృద్ధి చేసింది. మేము కూడా అదే దిశగా ముందుకు తీసుకెళతాం. దక్షిణాదిలో నంబర్ వన్ కల్చరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతాం" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్ జి.ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ట్రెజరర్ బి రాజశేఖరరెడ్డి, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ , శైలజా జుజల, బాలరాజు, గోపాలరావు, ఏడిద రాజా మోహన్ వడ్లపట్ల, ఇంద్రపాల్‌రెడ్డి, వరప్రసాదరావు పాల్గొన్నారు.
(ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment