foil
-
తెగిపడిన రైతు తల
బుక్కపట్నం : ఇనుప రేకు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. గాలికి ఎగిరి వచ్చిన ఆ రేకు నేరుగా ద్విచక్ర వాహనదారుడి శిరస్సును ఖండించింది. అంతే.. క్షణాల్లో తల, మొండెం వేరుపడ్డాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చెన్నేకొత్తపల్లి మండలం మొగలాయిపల్లికి చెందిన రైతు నారాయణరెడ్డి (50) బుధవారం పని నిమిత్తం బుక్కపట్నం వచ్చాడు. తిరుగు ప్రయాణంలో చెరువుకట్ట మీదుగా ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. ఇదే సమయంలో కొత్తచెరువు నుంచి బుక్కపట్నానికి ఇనుప రేకును టాపుపై వేసుకుని ఆటో వస్తోంది. నడిమిగుట్ట మలుపు వద్దకు రాగానే టాపుపై ఉన్న రేకు ముందుకు దూసుకొచ్చి.. ఎదురుగా వస్తున్న నారాయణరెడ్డి మెడను తాకింది. క్షణాల్లో రక్తం చిమ్ముతూ మెడ తెగిపడింది. అటుగా వస్తున్న కొందరు ఇది గమనించి దగ్గరకొచ్చి చూసేసరికి నారాయణరెడ్డి అప్పటికే ప్రాణం విడిచాడు. ఆటో టాపుపై రేకును కట్టకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. -
న్యూజిలాండ్ లో భారతీయుడి సాహసం..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఓ భారతీయుడు చేసిన సాహసంతో ఓ దోపిడి దొంగ తోక ముడిచాడు. దోపిడీ చేయలేక పారిపోయాడు. హామిల్టన్‌లోని హుకనూయి రోడ్డులో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి చిన్న దుకాణం నడుపుకుంటున్నాడు. అక్కడి ముసుగు ధరించి చేతిలో తుపాకీతో వచ్చిన ఓ వ్యక్తి వెంటనే క్యాష్ కౌంటర్లోని సొమ్మంతా తీసి తన బ్యాగులో వేయాలని బెదిరించాడు. దీంతో తొలుత భయపడిన అతడు కౌంటర్ తెరిచి డబ్బులిచ్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే తాళం రాకపోవడంతో దానితో కాసేపు పెనుగులాడుతూ కనిపించాడు. దీంతో అసహనానికి లోనైన దోపిడీ దొంగ ఏకంగా క్యాష్ కౌంటర్‌పైకి ఎక్కి కూర్చున్నాడు. దీంతో అతడి చేతిలో తుపాకీ లాక్కొనే అవకాశం షాప్ యజమానికి వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పనిచేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కిందపడ్డారు. దొర్లుతూ పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో చివరికి యజమాని చేతిలోకి తుపాకీ రావడంతోపాటు దొంగ ముసుగు కూడా వీడింది. దీంతో అతడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. ప్రాణాలకు తెగించి భారతీయుడు చేసిన సాహాసాన్ని అందరూ మెచ్చుకున్నారు. -
భత్కల్ కదలికల పై ఎన్ఐ ఆరా
-
సీమాంధ్రలో బంద్ వాతావరణం
-
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆమరణ దీక్ష భగ్నం