Folklore
-
Cannes 2024: కన్నడ జానపదానికి కాన్స్ బహుమతి
దక్షిణ భారత జానపద కథ కాన్స్ మొదటి బహుమతి గెలుచుకుంది. కోడి కూయకూడదని ఒక అవ్వ పుంజును దొంగిలిస్తే ఆ ఊళ్లో తెల్లారదు. తర్వాత ఏమవుతుందనేది 15 నిమిషాల షార్ట్ఫిల్మ్గా తీశాడు పూణె ఇన్స్టిట్యూట్ చిదానంద నాయక్. ప్రపంచవ్యాప్తంగా 2263 ఎంట్రీలు వస్తే చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఘనత సాధించిన చిదానంద పరిచయం.మారుమూల చిన్న పల్లెటూరు. ప్రతి ఉదయం కోడి కూయగానే తెల్లారుతుంది. ఆ రోజు కోడి కూయలేదు. తెల్లారలేదు. చీకటి. ఎక్కడ చూసినా చీకటి. సూర్యుడు ఎందుకు రావడం లేదు? కోడి కూయడం లేదు. కోడెందుకు కూయడం లేదు? ఊళ్లోని అవ్వ దానిని దొంగిలించి దాచేసింది. దేవుడా... పదండి కోడిని వెతకండి. ఊరంతా బయలుదేరింది. లాంతర్లు పట్టుకుని తలోదిక్కు. అంతేనా? దీనికంతటికీ కారణమైన అవ్వ కుటుంబాన్ని వెలేసింది. కోడి దొరక్క΄ోయినా అవ్వ కనపడక΄ోయినా ఆ ఊరిలో సూర్యుడు వచ్చేలా లేడు. తర్వాత ఏమైంది?చిదానంద నాయక్ తీసిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్వన్స్ టు నో’ (΄÷ద్దు తిరుగుడు పూలకే మొదట తెలుస్తుంది) షార్ట్‌ఫిల్మ్ చూడాలి. 15 నిమిషాల ఈ షార్ట్‌ఫిల్మ్‌కు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కోసం...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో చదివే విద్యార్థులను ్ర΄ోత్సహించేందుకు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగం ఉంటుంది. దీనికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు గంట నిడివి లోపు ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ను ఎంట్రీగా పంపవచ్చు. జ్యూరీ వీటిని పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇస్తుంది. ఈసారి మొత్తం 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2263 ఎంట్రీలు వస్తే మొదటి ప్రైజ్ చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు దక్కింది. దాదాపు పదమూడున్నర లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇది సామాన్యవిషయం కాదు. మన దక్షిణాది జానపదానికి దక్కిన గౌరవం కింద లెక్క.దర్శకుడైన డాక్టర్చిదానంద నాయక్ది కర్ణాటక. చిన్నప్పటి నుంచి అకిరా కురసావా సినిమాలు చూస్తూ పెరిగాడు. సినిమా దర్శకుడు కావాలని ఉన్నా మెడిసిన్ చదవాల్సి వచ్చింది. ‘ఒక డాక్టర్‌గా అతి దగ్గరి నుంచి జననాన్ని, మరణాన్ని చూడటం నాకు మానవ జీవనసారాన్ని తెలిపింది. ఒక వైద్యుడిగా జీవించడమంటే క్షణంలో ఆనందం క్షణంలో దుఃఖాన్ని చూడటమే. మనుషుల మకిలి లేని నిజాయితీని ఆ సమయంలోనే చూస్తాం’ అంటాడు చిదానంద. డాక్టరయ్యాక కూడా మనసు సినిమా రంగంలోనే ఉన్నట్టు అర్థమయ్యి పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు.నాలుగు రోజుల్లో షూట్:‘సన్‌ఫ్లవర్స్’ షార్ట్‌ఫిల్మ్‌ను తన సంవత్సరాంత అభ్యాసంగా తీశాడు చిదానంద. ‘మా ఇన్స్టిట్యూట్కు 50 కిలోమీటర్ల దూరం లోపల షార్ట్‌ఫిల్మ్ తీయాలని నియమం. ఆ దూరంలోనే ఒక లోపలి పల్లెలో షూట్ చేశాం. నాలుగు రోజుల్లోనే తీయమని చె΄్పారు. కథంతా రాత్రే కాబట్టి నాలుగు రాత్రులు ఒళ్లు హూనం చేసుకుని పని చేశాం’ అని తెలి΄ాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే– సూరజ్ (సినిమాటోగ్రఫీ), మనోజ్ (ఎడిటింగ్) సాంకేతిక శాఖలు నిర్వర్తించారు.నీ కోడి కూయక΄ోతే...‘నీ కోడి కూయక΄ోతే తెల్లారదా?’ అనేది లోకోక్తి. అంటే ఎదుటి వారంటే లెక్కలేక΄ోవడం, ఏదైనా లెక్క చేయకుండా ఉండటం ఈ మాటలో ఉంది. కాని ఈ జానపద కథ ప్రతి వ్యక్తి, ప్రతి అనుభవం, ప్రతి మేల్కొలుపు కూడా ముఖ్యమే అని చెబుతుంది. దేనినీ మర్చి΄ోకూడదని, నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తుంది. ‘మా కర్నాటకలో ప్రతి చిన్నపిల్లవాడికి ఈ కథ తెలుసు. దానిని షార్ట్ఫిల్మ్గా తీయడం, ఈ ప్రతిష్టాత్మక బహుమతి రావడం సంతోషంగా ఉంది’ అంటున్నాడు చిదానంద. -
LoreKeepers: మా కథలు మా సొంతం
అవ్వలు, తాతలు గతించిపోతే వారికి తెలిసిన జానపద సంపద కూడా అంతరించిపోతుంది. మన పెద్దల నుంచి వినాల్సిన ఎన్నో కథలు, పాటలు, సామెతలు, ఉదంతాలు ఇప్పటికే మన నిర్లక్ష్యం వల్ల అందకుండా పోయాయి. కేరళలో చిన్నారులు ఇకపై ఇలా జరగడానికి వీల్లేదంటున్నారు. తల పండిన వృద్ధుల దగ్గర కూచుని వారికి తెలిసిన మౌఖిక జానపద కథలను రికార్డు చేస్తున్నారు. ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లలు ఇలా కథలు సేకరించేందుకు ఒక ఎన్.జి.ఓ. ప్రతి బడికి తిరిగి శిక్షణనిస్తోంది. ఇది చాలా మంచి ఆలోచన కదూ. బహుశా ఇప్పుడున్న నానమ్మ, తాతయ్యల తరమే కొద్దోగొప్పో జానపద వారసత్వాన్ని కాపాడుకున్న తరం కావచ్చు. ఆ తర్వాతి తరమంతా సెల్ఫోన్ల తరం. టీవీల తరం. ఓటీటీల తరం. ఇప్పుడు పల్లెల్లో ఎవరూ గుంపుగా కూచుని కథలు చెప్పుకోవడం లేదు. తరం నుంచి తరానికి అందాల్సిన మాటలను చెప్పుకోవడం లేదు. పాటలను పంచుకోవడం లేదు. ఆటలను ఆడుకోవడం లేదు. ‘స్థానిక సంస్కృతి’, ‘జానపద వారసత్వం’ ప్రతి సమూహానికి ఉంటుంది. అది ఉమ్మడి ఆస్తి. జాగ్రత్తగా తరం నుంచి తరానికి అందించాలి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు వరకూ ప్రతి సమూహంలోని ఎందరో వృద్ధులకు– చదవడం, రాయడం రాకపోయినా కథలూ గాథలూ పురాణాల స్థానిక ప్రక్షిప్తాలు చారిత్రక ఘటనలు తెలిసి ఉంటాయి. వారు గతించితే అవి అంతరించిపోతాయి. ఇప్పటికే ఎన్నో తరాల వద్ద నుంచి స్వీకరించి నిక్షిప్తం చేయాల్సిన మౌఖిక జానపద సంపదను రికార్డు చేయడంలో చాలా నిర్లక్ష్యం పాటించి ఉన్నాం. ఇప్పటికీ అరకొరగా మాత్రమే ఆ పని జరుగుతూ ఉంది. ఈ తరం కూడా దాటిపోతే ఆ తర్వాత తెల్లముఖం వేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కేరళ మేల్కొంది. ఇప్పటి వృద్ధతరం వెళ్లిపోక ముందే వారి నుంచి జానపద సంపదను అందుకోవాలనుకుంది. ‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ (ఏ.ఆర్.పి.ఓ) అనే స్వచ్ఛంద సంస్థ ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లల్నే సైనికులుగా రంగంలో దింపి జానపద కథలను రికార్డు చేయించి డిజిటల్ ఆర్కయివ్గా నిక్షిప్తం చేయనుంది. ► కరోనా సమయంలో ఆలోచన ‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ వ్యవస్థాపకుల్లో ఒకడైన స్రుతిన్ లాల్ కేరళలో జర్నలిస్ట్. కరోనా సమయంలో లక్షలాదిగా ఇళ్లకు మళ్లిన వలస కార్మికుల వ్యధను రికార్డు చేయడానికి ఢిల్లీ నుంచి లక్నో వరకు వారితో పాటు 600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. వారి దీనాలాపనను రికార్డు చేశాడు. ఆ సమయంలో వారి మాటలను రికార్డు చేయకపోతే ఆ తర్వాత ఆ సందర్భం, ఆ మాటలు రెండూ మిస్ అయిపోతాయి. భావితరాలకు ఆ వేదన అందదు. సరిగ్గా ఆ సమయంలోనే వృద్ధతరం దగ్గర ఉన్న జానపద సంపద అతనికి గుర్తుకొచ్చింది. ‘నా బాల్యంలో అమ్మమ్మ, నానమ్మలు చెప్పే కథలు ఇప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పడం లేదు. ఏవో కొద్దిమంది దగ్గరే అలాంటివి మిగిలి ఉన్నాయి... వాటిని కాపాడుకోవాలి’ అనుకున్నాడతడు. ఆ ఆలోచన ఎన్.జి.ఓ. స్థాపనకు కారణమై మార్జినలైజ్డ్ సెక్షన్స్ దగ్గర వున్న కళారూపాలను నిక్షిప్తం చేసే పనికి అతణ్ణి పురిగొల్పింది. ► పిల్లలే సైనికులు మౌఖిక జానపద కథకు వారసులు బాలలు. వారికే ఆ విలువైన జానపద సంపద అందాలి. అలా అందాలంటే వారే నేరుగా రంగంలోకి దిగాలి అనుకున్నాడు స్రుతిన్ పాల్. ‘ఇప్పుడు దాదాపు ప్రతి చిన్నారికి సెల్‌ఫోన్ అందుబాటులో ఉంది. వారు సెల్‌ఫోన్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. అన్నీ టక్కున నేర్చుకుంటారు. వారికి రికార్డు చేసి ఎడిట్ చేయడం నేర్పిస్తే వారే పెద్దవాళ్ల దగ్గర కూచుని అన్నీ చెప్పించుకుంటారు. పైగా పిల్లలు అడిగితే చెప్పడానికి అవ్వలు, తాతలు ఇష్టపడతారు కూడా’ అంటాడు లాల్. అందుకోసం తన సంస్థ తరఫున కొందరు వాలంటీర్లను కేరళలోని వివిధ జిల్లాల స్కూళ్లకు పంపడం మొదలెట్టాడు. వారు స్కూల్లో పిల్లలకు మౌఖిక జానపద సంపద సేకరణ గురించి చెప్పి, సెల్‌ఫోన్‌తో పెద్దవాళ్లు చెప్పే కథలను ఎలా రికార్డు చేసి తమకు పంపాలో నేర్పుతారు. ఇక పిల్లలు ఊరుకుంటారా? రంగంలో దిగి వరదలా వీడియోలు పంపుతున్నారు. అవన్నీ నిక్షిప్తం అవుతున్నాయి. ► విన్నవీ కన్నవీ కాశీమజిలీ కథలో, కాటమరాజు కథలో, మర్యాద రామన్న కథలో, పూటకూళ్లమ్మ కథలో... అడవి కథలో, వేట కథలో, వ్యవసాయ కథలో, ప్రకృతి కథలో, గొడ్డుగోదా కథలో, రాజు పేదా కథలో... ఏవో కథలు ఒకప్పుడు చెప్పుకోని, వినని వారు ఉండరు. అయితే అందరూ గుర్తు పెట్టుకుని మళ్లీ చెప్పే స్టోరీ టెల్లర్లు కారు. కొందరు మాత్రమే ‘కథల పుట్ట’గా ఉంటారు. వీరు స్థానిక జ్ఞానాన్ని కథల్లో దాచి ఉంటారు. అవి రికార్డు కావాలి. కేరళలో ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. నిజానికి ప్రతిచోటా ప్రభుత్వాలు పూనుకుని ఈ పని చేస్తే ప్రతి ప్రదేశంలోని విలువైన కథలు బయటికొస్తాయి. యూట్యూబ్‌లాంటి మాధ్యమాల వల్ల అందరికీ తెలుస్తాయి. కేరళ మేల్కొంది. అందరూ మేల్కొనాలి. -
NTR Birth Anniversary: దటీజ్ ఎన్టీఆర్.. రెండుసార్లు ఫ్రాక్చర్ అయినా..
శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు, భీముడు.... ‘శ్రీమద్విరాట పర్వము’లో ఈ ఐదు భిన్న పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం చూసి, తెలుగు ప్రేక్షకులు ఆనందించారు.. నటన మాత్రమే కాదు... తెరపై ఆ అందగాడిని చూసి ఆనందించారు. అదే అందగాడు కురూపిగా కనిపించినా ఆనందించారు.. ఆ నటన అలాంటిది. 44ఏళ్ల సినీ కెరీర్లో ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చిన నటుడు ‘నటనానంద తారకరాముడు’ (ఎన్.టి.ఆర్). ఈ తారక దేశంలోనే వంద చిత్రాలు పూర్తి చేసిన తొలి ఘనుడు.. ఆ తర్వాత ఎనిమిదేళ్లల్లో 200 సినిమాలు పూర్తి చేసి, రాష్ట్రంలో రెండొందల సినిమా మార్క్ చేరుకున్న నటుడు. 300 మార్కు కూడా ఈ నటుడి సొంతమే. 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలు చేసి, తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. తొలి చిత్రం ‘మనదేశం’తో మొదలుకొని, చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్ ’ వరకూ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. వాటిలో 140 వందరోజుల చిత్రాలు కాగా, 33 రజతోత్సవ చిత్రాలు కావడం విశేషం. ఈ ‘నటనానంద తారక’ ‘శత జయంతి’ నేడు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాల్లో కొన్ని ఈ విధంగా... పౌరాణికం శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, దుర్యోధనుడు, భీముడు, యముడు, రావణాసరుడు... ఎలా ఉంటారు? ‘ఇలా ఉంటారు?’ అని ఎన్టీఆర్ తన పాత్రలతో చూపించారు. పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక చిత్రాల్లో ఎప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977). ఎన్టీఆర్ ఆరు పడవల ప్రయాణం ఈ సినిమా. అంటే..నటన, దర్శకత్వం, నిర్మాణం.. ఈ మూడు బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు... మూడు పాత్రలను చేయడం అంటే ఆరు పడవల ప్రయాణమే కదా. మేకప్ వేయడానికి మూడు గంటలు, తీయడానికి రెండు గంటలు పట్టేదట. మూడు పాత్రల అభినయానికి, దర్శకుడిగా తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర కోసం అక్కినేని నాగేశ్వర రావుని సంప్రదిస్తే.. ‘కృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూసిన కళ్లతో ప్రేక్షకులు నన్ను చూడలేరు’ అంటూ చేయనని చెప్పారట. దీంతో కర్ణుడి పాత్ర అయినా చేయమని కోరితే.. ‘ఆ పాత్రకి నా ఆహార్యం సరిపోదు’ అంటూ సున్నితంగా తిరస్కరించారట ఏఎన్ఆర్. శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకునేలా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ‘ఇద్దరు పెళ్లాలు’ (1954) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి కృష్ణునిగా కనిపించారు. ఆ తర్వాత ‘మాయాబజార్’ (1957), ‘వినాయకచవితి’ (1957), ‘దీపావళి’ (1960), ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1963), ‘శ్రీకృష్ణ తులాభారం’ (1966) ఇలా... పలు చిత్రాల్లో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. ఆయన్ని అపర శ్రీకృష్ణునిగా నిలిపిన చిత్రం ‘మాయాబజార్’. ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆరే శ్రీకృష్ణునిగా నటించి, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఇక ‘శ్రీకృష్ణ తులాభారం’లో మరోమారు కృష్ణుని పాత్రలో జీవించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రధారి అయిన ఎన్టీఆర్‌ని సత్యభామ పాత్రధారి జమున కాలితో తన్నే సన్నివేశం ఉంటుంది. అంత పెద్ద స్టార్ హీరో అయినా భేషజాలకు పోకుండా, అభిమానులు, ప్రేక్షకులు ఏమనుకుంటారో? అని ఆలోచించకుండా కథకి అవసరం మేరకు ఆ సన్నివేశంలో నటించి, ‘దట్ ఈజ్ ఎన్టీఆర్’ అనిపించుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఒదిగిపోయిన ఎన్టీఆర్.. శ్రీరామునిగానూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ‘చరణదాసి’ (1956) చిత్రంలో తొలిసారి శ్రీరామునిగా కనిపించారు. ఆ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’ (1958)లో తొలిసారి పూర్తి స్థాయిలో శ్రీరామునిగా నటించారాయన. ‘లవకుశ’ (1963) చిత్రంలో శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఆ తర్వాత ‘శ్రీరామ పట్టాభిషేకం’ (1978)తో పాటు మరికొన్ని చిత్రాల్లో శ్రీరామునిగా ప్రేక్షకులను అలరించారు. సౌమ్యుడైన శ్రీరాముడు పాత్రకు పూర్తి వ్యతిరేకమైన రావణాసురుడి పాత్రలోనూ ఎన్టీఆర్ ఒదిగిపోయిన వైనం అద్భుతం. ‘భూకైలాస్’ (1958) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి రావణబ్రహ్మ పాత్రలో నటించి, మెప్పించారు. ఆ తర్వాత ‘సీతారామ కళ్యాణం’ (1961), ‘శ్రీరామపట్టాభిషేకం’ (1978) వంటి పలు సినిమాల్లో రావణబ్రహ్మగా శభాష్ అనిపించుకున్నారు. అదే విధంగా ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ (1960)లో తొలిసారి వెంకటేశ్వర స్వామి పాత్ర చేశారు ఎన్టీఆర్. అలాగే ‘పాండవ వనవాసము’ (1965)లో భీమునిగా, ‘ఉమ్మడి కుటుంబం’ (1967)లో తొలిసారి ‘యముడి’ పాత్రలో ఆకట్టుకున్నారాయన. ఇక ‘నర్తనశాల’ (1963)లో బృహన్నల పాత్రలో తన నటనా ప్రతిభను మరోసారి చూపించారు ఎన్టీఆర్. ఇలా పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. జానపదం ఎన్టీఆర్ నటించిన తొలి జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (1950). ఈ చిత్రంలో క్రూరమైన ఎద్దుతో ఎన్టీఆర్ పోరాడే యాక్షన్ సీన్ ఉంది. చిత్రదర్శకుడు బీఏ సుబ్బారావు ఎద్దు కొమ్ములను పట్టుకుంటే చాలని ఎన్టీఆర్‌తో అన్నారు. కానీ, ఎన్టీఆర్ ఆ ఎద్దుతో నిజంగానే పోరాడారు. ఆ యాక్షన్ సీన్ అప్పుడు రెండుసార్లు ఫ్రాక్చరయింది. డాక్లర్టు విశ్రాంతి సూచించినా ‘నో’ అన్నారు ఎన్టీఆర్. కట్టు కనిపించకుండా పొడవు చేతుల చొక్కా ధరించి, నటించారు. ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైన మరుసటి సంవత్సరం ‘పాతాల భైరవి’ (1951)లో చేసిన తోటరాముడి పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. ఈ పాత్రకు ఎన్టీఆర్‌ని తీసుకోవాలని నిర్మాతలు నాగిరెడ్డి–చక్రపాణి అనుకుంటే... పెద్దగా ఇమేజ్ లేని నటుణ్ణి అంత పెద్ద పాత్రకా? అనుకున్నారు దర్శకుడు కేవీ రెడ్డి. సరిగ్గా అదే టైమ్‌కి టెన్నిస్ ఆడుతున్న ఎన్టీఆర్ రెండు పాయింట్లు కోల్పోవడంతో బంతిని విసిరి కొట్టారు. అంతే.. జానపద నాయకుడి లక్షణం ఉందని తోటరాముడిగా ఎన్టీఆర్‌ని ఫిక్స్ చేశారు కేవీ రెడ్డి. ఈ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయి నటించారు. ఇంకా ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, ‘అలీబాబా నలభై దొంగలు’, ‘చిక్కడు దొరకడు’, ‘మంగమ్మ శపథం’, ‘గండికోట రహస్యం’... ఇలా దాదాపు యాభై జానపద చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. సాంఘికం హీరోగా పట్టుమని పది సినిమాలు పూర్తి చేయకుండానే సందేశాత్మక సినిమాలు చేయాలనుకున్నారు ఎన్టీఆర్. వరకట్నం తీసుకోవడం సరైంది కాదని, యువతలో చైతన్యం నింపేలా, అభ్యుదయ భావాలు రేకెత్తించేలా ‘పెళ్లి చేసి చూడు’ (1952)ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ తర్వాత 1970లో స్వీయ దర్శకత్వంలో వరకట్నం ప్రధానాంశంగానే ‘వరకట్నం’ సినిమా తెరకెక్కించి, నటించారాయన. ఇక అప్పటి సాంఘిక దురాచారాల్లో ప్రముఖంగా వినిపించే మరో అంశం ‘కన్యాశుల్కం’. ఈ విషయంలో ప్రజల ఆలోచనా సరళిలో మార్పు రావాలనే ఉద్దేశ్యంతో ‘కన్యాశుల్కం’లో గిరీశంగా కనిపించి, మెప్పించారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్ చేసిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రాలే కాదు.. ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను తెలియజేసేలా, ‘ఉమ్మడి కుటుంబం’, కుటుంబ సంబంధాలకు అద్దంపట్టేలా ‘తల్లా? పెళ్లామా?’ చిత్రం, ఈ కోవలోనే ‘కోడలు దిద్దిన కాపురం’, ‘తాతమ్మ కల’, ‘ఇంటిగుట్టు’ సినిమాలు చేశారు ఎన్టీఆర్. ముఖ్యంగా 1969–1970 దశకంలో ఎన్టీఆర్ నుంచి ఎక్కువగా సాంఘిక చిత్రాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘వరకట్నం, తల్లా? పెళ్లామా?, కొడుకులు దిద్దిన కాపురం’ సినిమాల్లో నటించి, స్వీయ దర్శకత్వం వహించారు ఎన్టీఆర్. ఈ చిత్రాలే కాదు.. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయాలని గ్రామీణ యువకులను ప్రోత్సహించే విధంగా ‘పల్లెటూరు’, ‘రైతుబిడ్డ’ వంటి వ్యవసాయ ఆధారిత సినిమాల్లో నటించారు. అలాగే వ్యవసాయ రంగంలో పెత్తందార్లను ప్రశ్నించేలా ‘పెత్తందార్లు’లో నటించారు. ఇంకా సమాజంలోని అసమానతను తెలిపేలా ‘రాజూ పేద’, మహిళలకు సమాజంలో దక్కాల్సిన గౌరవాన్ని గుర్తు చేసేలా ‘నాదీ ఆడ జన్మే’, ‘స్త్రీ జన్మ’ వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు ఎన్టీఆర్. అలాగే దేశభక్తిని చాటేలా ‘బొబ్బిలిపులి’, ‘నా దేశం’, ‘జస్టిస్ చౌదరి, ‘మేజర్ చంద్రకాంత్’, కులమతాలకు అతీతంగా ‘ఒకే కుటుంబం’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ప్రయోగాత్మకం ‘పిచ్చి పుల్లయ్య’ (1953), ‘బండరాముడు’ (1959), ‘తిక్క శంకరయ్య’ (1968).. ఇవన్నీ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల టైటిల్సే. వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్‌కు కథ నచ్చితే ఎలాంటి సాహసానికైనా సై అంటారని. అందుకే 31ఏళ్ల వయసులోనే ‘తోడుదొంగలు’ (1954)లో వృద్ధ పాత్రకి ఓకే అన్నారు. అలాగే నాలుగుపదుల వయసు దాట కుండానే ‘భీష్మ’ (1962) చిత్రంలో కురు వృద్ధుడైన భీష్మ పాత్ర చేశారు. అదే విధంగా ‘కులగౌరవం’లో కుటుంబ పెద్దగా వృద్ధ పాత్రలో మరోసారి ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టించారు. ‘తోడు దొంగలు’ వచ్చిన ఏడాదే ‘రాజూ పేద’ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి డీ గ్లామరస్ రోల్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అదే ఏడాది రిలీజైన మరో చిత్రం ‘పరివర్తన’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ అభినయిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారే కానీ నెగటివ్‌గా తీసుకోలేదు. ఇంకా ‘పిచ్చి పుల్లయ్య’లో మానసిక పరిస్థితి బాగాలేని పుల్లయ్యగా, ‘తిక్క శంకరయ్య’లో శంకరయ్యగా.. ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘ఆరాధన’ వంటి చిత్రాల్లో దివ్యాంగుడిగా ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ఇవే కాదు.. ‘దాసి’లో జట్కా బండి రామయ్యగా... చెప్పుకుంటూ పోతే... ‘బడిపంతులు, ఆత్మ బంధువు, గుడిగంటలు’... ఇలా పలు చిత్రాల్లో ఎన్టీఆర్ కథలోని పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చారు. చారిత్రకం ‘నందామయ.. గురుడ నందామయ..’ స్క్రీన్ మీద కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామిగా సాత్వికంగా కనిపించారు ఎన్టీఆర్. ఒక యాక్షన్ హీరో అంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలనుకోవడం ఓ సాహసం. ఎన్టీఆర్‌కి సాహసాలు ఇష్టం. అందుకే బ్రహ్మంగారి కథతో ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ తీయాలనుకున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమా తీయాలనుకోవడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే... ఓసారి ఎన్టీఆర్ కడప జిల్లా సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఈ కాలజ్ఞాని చెప్పిన విషయాలు ఆయన్ను ఆకర్షించాయి. అందుకే వీరబ్రహ్మం పాత్ర చేయాలనుకున్నారు... దర్శకత్వం–నిర్మాణం కూడా ఎన్టీఆరే. షూటింగ్ సమయంలో కొన్ని ఆటుపోట్లు ఎదురయితే, పూర్తయ్యాక కొన్ని కారణాలతో మూడేళ్ల పాటు సెన్సార్ అనుమతి లభించలేదు. చివరికి ఆ సమస్య పరిష్కారమై 1984 నవంబరు 29న విడుదలై, ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో ఈ చిత్రానిది ప్రముఖ స్థానం కాగా, ఈ సినిమాకన్నా దాదాపు ముప్పై ఏళ్ల ముందు చేసిన చారిత్రాత్మక చిత్రం ‘తెనాలి రామ కృష్ణ’ (1956)లో శ్రీకృష్ణ దేవరాయలుగా రాజసం చూపించారు ఎన్టీఆర్. కొంచెం తారాగణం మార్పుతో తెలుగు, తమిళ (‘తెనాలి రామన్’) భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలోనూ శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను ఎన్టీఆర్ చేయగా, తెనాలి రామకృష్ణగా శివాజీ గణేశన్ నటించారు. తెలుగులో ఈ పాత్రను ఏఎన్నార్ చేశారు. రాజదర్బారులో న్యాయమైన తీర్పు ఇచ్చిన దేవరాయలుకి ప్రేక్షకులు కూడా మంచి తీర్పు ఇచ్చి, ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు. అన్నట్లు ‘మహా మంత్రి తిమ్మరసు’లోనూ శ్రీకృష్ణ దేవరాయలుగా మెప్పించారు. ఇంకా ‘అక్బర్ సలీం అనార్కలి’లో అక్బర్ పాత్రలో ఒదిగిపోయారు. ఎన్టీఆర్ ఇష్టపడి చేసిన పాత్రల్లో అశోకుడు ఒకటి. ‘సామ్రాట్ అశోక్’తో అది నెరవేర్చుకున్నారు. ఇంకా ‘చాణక్య చంద్రగుప్త’ (చంద్రగుప్తుడు పాత్ర), ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’ (శ్రీనాథుడు పాత్ర)... ఇలా ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో చరిత్రలో నిలిచిపోయినవి చాలా ఉన్నాయి. -
ఆనాటి నుంచి పన్నెండు మెట్ల కిన్నెర పాట వరకు.. సూపర్ సక్సెస్
‘సారంగదరియా’.. ‘రాములో రాములా’.. ‘నాది నక్కిలీసు గొలుసు’.. ‘గున్నా గున్నా మామిడి’... జనం పాటలు జోరు మీదున్నాయి. వెండితెరపై మోత మోగిస్తున్నాయి. పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్య వంటి వారిని వెతికి మరీ సినిమాలకు పదాలిమ్మంటున్నాయి. కల్పించే పాటకు అంగీకారం డౌట్. జానపదానిది గ్యారంటీ సక్సెస్‌రేట్. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకూ జానపదం ఝల్లుమంటూనే ఉంది. ఘల్లుమంటూనే ఉంది. సండే స్పెషల్... జానపదం జనం నాల్కల మీద ఉంటుంది. అందుకే వెండితెర మీద కనపడి వినిపించగానే కనెక్ట్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. జానపద గీతం ఆర్గానిక్‌గా పుడుతుంది. తరాలపాటు నిలిచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సినిమాల్లోకి రాగానే ఆ శక్తితో సూపర్‌హిట్ అవుతూ ఉంటుంది. సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి. సన్నివేశాలకు తగినట్టు పాటలు కడతారు. ఆ అన్ని సన్నివేశాలకు జానపదాలు సూట్ కావు. కాని కుదిరే సన్నివేశాలలో జానపదాలు పెట్టడానికి నిర్మాత దర్శకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆ పాటలు తెర మీద మొక్కజొన్నల్ని పండిస్తాయి. భుజం మీద కడవలతో మెరుస్తాయి. మావ మావ మావా... ‘మంచి మనసులు’ సినిమాలో ‘మావ మావ మావా’ పాట కలెక్షన్ల దుమారం రేపింది. అయితే జానపద గీతాల్లో శృంగారం వాచ్యంగా, అవసరంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ పాటను కొందరు అశ్లీలంగా భావించారు కూడా. కాని సామాన్య ప్రేక్షకుడు ఉత్సాహపడ్డాడు. కేరింతలు కొట్టాడు. తెలుగు సినిమాల్లో కొసరాజు జానపద గీతాలను రసాత్మకంగా ప్రవేశపెట్టారు. జానపదం అంటే కొసరాజు వైపు చూడాల్సి వచ్చేది. ‘పెద్దమనుషులు’ సినిమా కోసం ‘నందామయా గురుడ నందామయా’, ‘శివశివమూర్తివి గణనాథ’... జానపదాల నుంచి ఇచ్చారు. ‘జేబులో బొమ్మ జేజేలా బొమ్మ’ (రాజు–పేద), ‘ఏరువాక సాగారో’, ‘ఒలియ ఒలి పొలియ పొలి’... (రోజులు మారాయి), ‘రామన్న రాముడు కోదండ రాముడు’ (లవకుశ).. ఇవన్నీ కొసరాజు కలం చివర నుంచి సిఖను అంటించుకున్నాయి. మరోవైపు పింగళి వంటి పెద్దలు జానపదం నుంచి తీసుకుని ‘కాశీకి పోయాను రామా హరే’ సరదా గీతాలను ఇచ్చారు. ఆరుద్ర ‘అత్తా ఒకింటి కోడలు’ సినిమాలో ‘తడికో తడిక’ అంటూ తడికను అడ్డం పెట్టుకుని జానపదులు చేసే సంవాదాన్ని పాట చేశారు. కొనకళ్ల వెంకటరత్నం ‘అదృష్టవంతులు’ సినిమాలో ‘మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో’తో భవిష్యత్ ముఖ్యమంత్రి జయలలితకు ఒక అచ్చతెలుగు హిట్ పాట ఇచ్చారు. పట్నంలో షాలిబండ కలర్, బ్లాక్ అండ్ వైట్ సంధికాలపు సినిమాలు వచ్చే సరికి ఈ దూకుడు తగ్గింది. సినారె కొన్ని జానపద వరుసలను పాటలకు వాడి మెరిపించారు. ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే’ (అమ్మమాట), ‘మాయ చేసి పోతివిరో నాగులు’ (జీవితం)... తదితరాలు జానపదాల రెక్కలను రేకులను తొడుక్కున్నాయి. అప్పుడే ‘అమాయకుడు’ సినిమాలో ఏ.వేణుగోపాల్ రాసిన జానపద వరుస ‘పట్నంలో షాలిబండ’ తెలంగాణ పదాలతో చమ్కాయించింది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో ‘వచ్చే వచ్చే వానజల్లు యాల్మది యాల’, ‘మంగమ్మగారి మనవడు’లో ‘నోమో నోమన్నలాల’... ఆ మట్టినెత్తావులను కొనసాగించాయి. ఆ తర్వాత తొంభైలలో కూడా అడపా దడపా ఈ పాటలు వినిపించాయి. ‘మొండి మొగుడు పెంకిపెళ్లాం’లో సాహితి రాసిన ‘లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగ’ పాట హిట్ అయ్యింది. ‘తమ్ముడు’ సినిమాలో ‘తాటిచెట్టు ఎక్కలేవు.. తాటికల్లు తెంపలేవు’, ‘ఖుషి’లో ‘బైబైయ్యే బంగారు రమణమ్మ’ వంటి జానపదాలు సందర్భానుసారం వినిపిస్తాయి. ‘కాలేజ్’ సినిమాలో ‘మాయదారి మైసమ్మో’ కుర్రకారును గెంతులేయించింది. జానపద బాణీలను తీసుకుని మలిచిన విప్లవ గీతాలు కూడా ఈకాలంలో వచ్చాయి. ‘నాంపల్లి టేషను కాడ రాజలింగో’, ‘హే లిగజిగిడి లంబాణి’, ‘ఎర్రజెండెర్రజెండెన్నీయలో’, ‘బండెనక బండి కట్టి’, ‘జంజంబల్ మర్రి వేయికాళ్ల జెర్రి’... ఇవన్నీ జనం నోళ్లలో నేటికీ నానుతున్నాయి. గాజులోళ్లమే పిల్లా మేము ఆర్.పి.పట్నాయక్ వంటి సంగీత దర్శకుల హయాంలో ఉత్తరాంధ్ర జానపదాలు వినిపించడం మొదలెట్టాయి. ‘నువ్వు–నేను’లో ‘గాజులోళ్లమే పిల్లా మేము’ పెద్ద హిట్ అయ్యింది. ‘మగధీర’లో ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ లైన్లు మెరిసి మాస్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇది చాలారోజుల తర్వాత తిరిగి ‘పలాసా’ సినిమాతో మళ్లీ ఉత్తరాంధ్ర జానపదాల వైపు అందరూ చూస్తున్నారు. నాది నక్కిలీసు గొలుసు గత ఐదారేళ్లుగా మళ్లీ జానపదాలు ఊపు మీదున్నాయి. పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సందర్భం వస్తే జానపదాన్ని వదలడం లేదు. ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా కదిరి నర్సింహుడా’ హల్చల్ చేసింది. ‘కృష్ణార్జున యుద్ధం’లో పెంచలదాసు రాసి పాడిన ‘దారి చూడు దమ్ము చూడు’ పెద్ద హిట్ అయ్యింది. ‘రాజా ది గ్రేట్’లో ‘గున్నా గున్నా మామిడి’, ‘పలాసా’లో ‘నాది నెక్కిలీసు గొలుసు’, ‘బావొచ్చాడోలమ్మ’, ‘శ్రీకారం’ లో ‘వస్తానంటివో పోతానంటివో’ హిట్ అయ్యాయి. శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో ‘సారంగ దరియా’ పాట ఆ సినిమా రిలీజ్ కాక ముందే పెద్ద హిట్ అయ్యింది. ‘అల వైకుంఠపురంలో’ నుంచి ‘రాములో రాములా’, ‘రంగస్థలం’లో ‘ఆగట్టునుంటావా’... ఇవన్నీ కొత్త సినిమా సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. రాబోయే ‘వరుడు కావలెను’ లో ‘దిగు దిగు దిగు నాగ’, ‘భీమ్లా నాయక్’లో మొగిలయ్య సాకీ ఇవన్నీ జానపదం శక్తిని, అవసరాన్ని చూపుతున్నాయి.తెలుగు పల్లెల్లో, తెలుగు సినిమాల్లో జానపదం జెండా ఎగురుతూనే ఉండాలి. -
సంస్కృతికి జానపదమే మూలం
సాక్షి, బెంగళూరు: ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భాష, కళలు, చేతివృత్తులు, పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, వైద్యం, పంటలు, సంగీతం, నృత్యం, ఆటలు, హావభావాలన్నింటి సమాహారమే జానపద విజ్ఞానమని ఆయన తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పలువురు జానపద కళాకారులు అంతర్జాల వేదిక ద్వారా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జానపద సంపద లేకుండా భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి జరగవని.. ఆ రెండింటి పుట్టుక జానపదం నుంచే మొదలైందన్నారు. అమ్మ పాడే లాలిపాటలు, అలసట తెలియకుండా పాడుకునే శ్రామికుల గీతాలు, జీవితాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక తత్త్వాలు ఇలా ఏ సాహిత్యాన్ని చూసినా జానపద వాసన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అలాంటి విలువైన జానపద సంపదను సంరక్షించుకుంటూ భాషా సంస్కృతులను నిరంతరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామీణ ప్రజల జీవితాల నుంచే జానపద కళలు పుట్టాయని చెప్పారు. వీధినాటకాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, యక్షగానాలు, జముకుల కథలు, పగటి వేషాలు వంటి వందలాది జానపద కళారూపాలు ఆ రోజుల్లో పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచాయని చెప్పారు. తన బాల్యంలో పండుగ రాగానే తోలుబొమ్మలాట, కోలాటాలు, సంక్రాంతి సమయంలో హరిదాసులు, గంగిరెద్దులతో ఊరంతా కోలాహలంగా ఉండేదన్నారు. సినిమా, టీవీ, రేడియోల్లో జానపదాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ప్రముఖ జానప ద గాయకుడు దామోదరం గణపతి రావు, జానపద పరిశోధకులు డాక్టర్ సగిలి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ భాషను నిలిపేదే జానపద సాహిత్యం
డాక్టర్ భాస్కరయోగి హన్మకొండ కల్చరల్ : తెలంగాణ భాష, యాసను మహోన్నతంగా నిలిపేదే జానపద సాహిత్యమని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పి.భాస్కరయోగి అన్నారు. వరంగల్‌లోని పోతన విజ్ఞానపీఠంలో శనివారం సాయంత్రం తెలంగాణ జానపద సాహిత్యంపై ప్రసంగం జరిగింది. నమిలికొండ నారాయణరావు స్మారకోపన్యాసంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోతన విజ్ఞానపీఠం కార్యదర్శి నమిలికొండ బాలకిషన్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భా స్కరయోగి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత అస్థిత్వాన్ని, సహజత్వాన్ని తెలిపేదే తెలంగాణ జానపద సాహిత్యమన్నారు. ఇక్కడి జానపదుల జనజీవనం, ఆచారాలు, పండుగలు, ఉత్సవాలు, నమ్మకాలు, శ్రామికజీవనం, కుటుంబవ్యవస్థ అన్నీ వారికి వస్తువులని తెలిపారు. తెలంగాణ జనజీవన lసంస్కృతి ఈ సాహిత్యంలో ప్రతిబింబిస్తుందన్నారు. ఇలాంటి సాహిత్యాన్ని భావితరాలకు అందించాలని కోరారు. అనంతరం దూపకుంట కాకతీయ కళాసమితి ఆధ్వర్యంలో జానపద గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, కేయూ తెలుగుశాఖ ఆచార్య బన్న అయిలయ్య, నాగిళ్ల రామశాస్త్రి, ఆచార్య ఎంవీ రంగారావు, వరిగొండ కాంతారావు, వీఆర్ విద్యార్థి, పల్లె నాగేశ్వర్రావు, పోతన విజ్ఞానపీఠం మేనేజర్ జేఎన్ శర్మ, కుందావజ్జుల కృష్ణమూర్తి, మారేడోజు సదానందచారి, మల్లికార్జున్, పాంచాలరాయ్, వీరాచారి, రఘురామయ్య, గోకులరాణి, బాలాజీ, శ్రీనివాసాచారి పాల్గొన్నారు. -
బొబ్బిలి యుద్ధం
పద్దెనిమిదో శతాబ్దంలో ఫ్రెంచి, బ్రిటిష్ వాళ్ళ రాకతో ఆంధ్రదేశం ఆధునిక యుగంలోకి ప్రవేశించింది. వాణిజ్యానికై వచ్చిన తెల్లదొరలు అధికారానికై తలబడ్డారు. పక్కవాడు బాగుపడితే ఓర్వలేని మనవాళ్ళు ఆంధ్రదేశాన్ని బంగారుపళ్ళెంలో పెట్టి వారికి అందించారు. స్వార్థపూరితమైన రాజకీయాల వల్ల పెరిగిపోయిన అప్పుల భారానికి రైతుబిడ్డలు అల్లాడారు. ఆనాటి జానపద సాహిత్యం వారి ఆక్రందనలకి అద్దంపడుతుంది. ‘ఏటికేతాంబట్టి ఎయిపుట్లు పండించి ఎన్నడూ మెతుకెరగనన్నా... కాలె గంజిలో మెతుకెరుగనన్నా...’ అంటూ రైతులు వాపోయారు. ఆనాటి రైతులు పండించిన పంట ఎవరెవరికి ఎంత పోయిందో వివరాలు కొన్ని నైజాం రికార్డుల్లో దొరికాయి. మూడెకరాల మాగాణిలో నేటి హైబ్రిడ్ రకాలు రాకమునుపు వరిపంట ఎకరానికి 2400 శేర్ల చొప్పున పండితే అదే పెద్ద గొప్ప. అందులో పురోహితుడికి 5 శేర్లు, ధర్మాలకి 5, జోతిష్యుడికి 1, మంగలి 2, కుమ్మరి 2, కమ్మరి 2, చాకలి 4, కొలిచే సరాఫుకి 4, గుడికి 5, రెడ్డి లేదా మునసబుకి 8, కరణానికి 10, తలారి లేదా కొత్వాల్కి 10, దేశ్‌ముఖ్ 45, దేశ్‌పాండే 45, నేరడికి 20 అంటే 169 శేర్లు ఊళ్ళో కొలిచి పంచవలసి వచ్చేది. ఇక గుత్తేదారుకి 10 శాతం అంటే 240 శేర్లు. మొత్తం పంటలో 50 శాతం అంటే 1200 శేర్లు ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలి. ఇక మిగిలింది. 790 శేర్లు. ఇది మాగాణి రైతుల పరిస్థితి. అంటే మెట్ట రైతుల విషయం ఇంకెంత అధ్వాన్నంగా ఉండిందో ఊహించుకోవచ్చు. ఉత్తరకోస్తాని ఫ్రెంచివారికి పరం చేయడంతో పన్ను 66 శాతానికి పెంచబడింది. అప్పుడు రైతులు చేసిన ఆక్రందనలే బొబ్బిలియుద్ధానికి ముఖ్యకారణం. ఆ అన్యాయాన్ని ఎదిరించి ప్రాణాలు త్యాగం చేసిన బొబ్బిలివీరులు తెలుగుజాతికి చిరస్మరణీయులయ్యారు. అందుకే జానపద సాహిత్యంలో ఆ వీరగాథ అజరామరమయింది. గ్రామీణ వినోదంలో వీరగాథలకున్న ప్రాముఖ్యం మరి దేనికీ లేదు. ఇంటిని తిమ్మరాజుకత, యింటిని యీర్లకథా ప్రసంగముల్ ఇంటిని పాండులాలి, యిబమింటిని నాయకురాలి శౌర్రెమొ అంటూ పండగ వచ్చిందంటే గ్రామాలు జానపదుల ఆటపాటలతో మార్మోగుతాయి. ఇక సంక్రాంతి పండగ హరిదాసులకీ, డూడూ బసవన్నలకీ, కూచిపూడి భాగోతులకీ అన్నంపెట్టే పండగ. కోలాటాలూ, గొబ్బిసుద్దులూ, బొమ్మలకొలువులతో ఆడపిల్లలు ధాన్యలక్ష్మికి స్వాగతం చెబితే, కోడిపోరు, ఎడ్లపందేలు, మల్లయుద్ధాలు, కర్రసాములతో యువకులు చిందులేస్తారు. చేతిలో కాసులు గలగలలాడుతుంటే ఇక జూదానికీ, పంతాలకీ అంతుండదు. అప్పటి శిష్ఠ సాహిత్యం జమిందారుల వరండాలకే పరిమితమయింది. పనికిమాలిన రాజులని కూడా ఇంద్రుడు చంద్రుడు అని కీర్తించి పబ్బం గడుపుకునే కవులు, రూపాయిస్తే పద్యం చెప్పే స్తోత్రపాఠకులు, కానీ వాళ్ళవల్లనే సాంప్రదాయక కవిత్వం అనే ప్రక్రియ పూర్తిగా మాయమవకుండా నిలిచింది. నాటి పరిస్థితులను గురించి ఆవేదనని వ్యక్తం చేసే చాటువులూ, శతకాలూ వెలువడ్డాయి. దేశంలో అరాచకానికి దేవుడిదే బాధ్యత అంటూ తిరుపతి వెంకన్ననీ, సింహాచలం అప్పన్ననీ తిట్టిపోస్తూ వందల పద్యాలు చెప్పారు. ఇక పులిమీద పుట్రలా తనఖాలు, తాకట్లతో రైతుబిడ్డ ఆధారపడిన నేలతల్లికే ఎసరుపెట్టే వడ్డీవ్యాపారులూ, వకీళ్ళు బయలుదేరి గ్రామీణ జీవితాన్ని మరింత ఛిద్రం చేశారు. ధనమైనంతట భూముల తనఖాలను విక్రయములు తరువాత సతీ మణి భూషణాంబరమ్ములు గొనుట యవలక్షణములు గువ్వలచెన్నా!మరో వందేళ్ళు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే. రైతుపై ఆధారపడిన గ్రామీణ సంస్కృతీ, సంప్రదాయాలకూ, చేతివృత్తులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్ళయినా ఆనాటి గాయం ఇంకా మానలేదు.