Food Inflation
-
నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
భారత రిటైల్ ద్రవ్యోల్బణం(inflation) 2024 డిసెంబర్లో గణనీయంగా క్షీణించి నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. నవంబర్‌లో 5.48 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.22 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదలే(decline) ఇందుకు ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 9.04% నుంచి డిసెంబర్లో 8.39%కి పడిపోయింది.మెరుగైన సరఫరా, అంతర్జాతీయ పరిణామాల్లో మార్పులు డిసెంబర్లో ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమని ఎంఓఎస్పీఐ పేర్కొంది. అయినప్పటికీ కూరగాయలు, పండ్లు, వంట నూనెలు వంటి కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు భారీగానే ఉన్నాయని అభిప్రాయపడింది. ఆహార ధరలను ప్రధాన కారణంగా పేర్కొంటూ ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది. ఈసారి ద్రవ్యోల్బణం మొత్తంగా తగ్గినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా 5.76%, పట్టణ ప్రాంతాల్లో 4.58% ద్రవ్యోల్బణం ఉంది. ఆర్బీఐ లక్ష్యం ప్రకారం ఇది 4 శాతానికి మించకూడదు.వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్‌లో గరిష్టంగా 7.79 శాతం నమోదైనప్పటి నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ హెచ్చుతగ్గులను నిశితంగా గమనిస్తూ వడ్డీ రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం పరిధిలో ఉంచాలని ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఆర్థిక అస్థిరతల వల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గత 11 విధాన పరపతి సమావేశాల్లో ఆర్బీఐ వడ్డీరేట్లను మార్చకుండా స్థిరంగా రెపో రేటును 6.5 శాతం వద్ద ఉంచింది.ఇదీ చదవండి: మస్క్‌కు ప్రభుత్వం ఆహ్వానంప్రస్తుత ఆర్థిక ఒడిదొడుకుల్లో ద్రవ్యోల్బణం తగ్గడం శుభపరిణామమే. కానీ అస్థిరమైన ఆహార ధరలు, ఆర్థిక ప్రతికూలతల వల్ల భవిష్యత్తులో సవాళ్లు తప్పవు. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఆర్బీఐ ఈసారి జరగనున్న మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో కీలకంగా వ్యవహరిస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
తయారీ రంగం, ఆహార ద్రవ్యోల్బణంపై సూచనలు
బడ్జెట్ రూపకల్పనకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. గతంలోకంటే మరింత మెరుగ్గా అభివృద్ధి సాగించేందుకు అవసరమైన బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమగ్ర తయారీ విధానం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహకాలు, వ్యవసాయ వృద్ధిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్థికవేత్తలతో చర్చించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు గ్రీన్ ఎనర్జీ వనరులను అన్వేషించాలని, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను పెంచాలని ప్రముఖులు సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అవసరమైన విధానాలపై చర్చించారు. ఉత్పాదక రంగంలో దిగుమతి సుంకాలు, పన్నులు, సాంకేతికత బదిలీ, ఇతర అంశాల పురోగతిపై ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని తెలిపారు. ప్రభుత్వం మూలధన పెట్టుబడులపై స్థిరాదాయం సమకూరాలని పేర్కొన్నారు.స్తబ్దుగా తయారీ రంగందేశీయ తయారీ రంగ వాటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15-17% వద్ద కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. దీన్ని 25% పెంచడానికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే వాదనలున్నాయి. అనేక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగతున్నప్పటికీ, ప్రభుత్వం మూలధన వ్యయంపై స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కంపెనీలను ప్రోత్సహించాలని కొందరు ఆర్థికవేత్తలు సిఫార్సు చేశారు. 2025-26లో ప్రభుత్వ మూలధన వ్యయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జపాన్ కంపెనీల హవా.. కొరియన్, చైనా బ్రాండ్లకు దెబ్బ!ఆహార ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలుసమగ్ర ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణం ప్రధాన అడ్డంకిగా మారుతుందనే వాదనలున్నాయి. ఆహార ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రణలో ఉంచడానికి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని ప్రముఖులు విశ్లేషించారు. దాంతోపాటు ఆయా ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను పెంచడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంపొందించడానికి ఇండియా అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయం అయినప్పటికీ, గ్రీన్ ఎనర్జీలో మరిన్ని ఆవిష్కరణలు రావాలని తెలిపారు. -
సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు?
వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలనే వాదనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో సీపీఐ ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరి ఏకంగా 6.1 శాతంగా నమోదైంది. అయితే అందుకు ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం పెరగడమేనని ఆర్బీఐ తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మెరుగైన గణాంకాలు కనిపించే వీలుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆహార ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని సీపీఐలో కొనసాగించాల్సిందేనని ఇంకొందరు చెబుతున్నారు.తగ్గుతున్న పంటల సాగుదేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి. పాతస్టాక్‌ను 45 రోజుల్లో క్లియర్ చేసి కొత్త సరుకుకు ధరలు పెంచేలా నిబంధనలున్నాయి. కానీ ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే కంపెనీలు ధరల పెరుగుదలను అమలు చేశాయి.ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర నష్టంభౌగోళిక స్వరూపం ప్రకారం భారత్‌లో మొత్తం సుమారు 70 రకాల పంటలు పండించవచ్చని గతంలో పలు సర్వేలు తెలియజేశాయి. కానీ గరిష్ఠంగా దాదాపు 20 రకాల పంటలనే ఎక్కువగా పండిస్తున్నారు. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలే అధికంగా పండుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులపై ధరల ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఆహార ద్రవ్యోల్బణం కీలకంఆర్థికసర్వే సూచనల ప్రకారం ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణాన్ని సీపీఐ నుంచి తొలగించే ఆలోచన చేయకుండా దాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే మార్గాలను అన్వేషించాలని నిపుణులు కోరుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పరిగణించరు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది.ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9.24 శాతంగా ఉండేది. అక్టోబర్‌లో ఇది ఏకంగా 10.87 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబరులో నమోదైన 5.87 శాతంతో పోలిస్తే అక్టోబర్‌లో 6.68 శాతానికి చేరింది. పట్టణ ద్రవ్యోల్బణం అంతకు ముందు నెలలో 5.05 శాతం నుంచి 5.62 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.81-6 శాతానికి చేరువగా ఉంటుందని రాయిటర్స్ పోల్ ఇటీవల అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా గణాంకాలు వెలువడ్డాయి.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!భగ్గుమంటున్న కూరగాయలువంట సామగ్రి, కూరగాయలు, వంట నూనె, ఉల్లిపాయల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఉల్లిపాయ హోల్‌సేల్ ధరలు కిలోగ్రాముకు రూ.40-60 నుంచి రూ.70-80కి పెరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌లో కీలక వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. -
ఆలూ, ఉల్లి ధరలు తీవ్రం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 1.84 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆగస్టులో ఇది 1.31 శాతం కాగా, 2023 సెప్టెంబర్‌లో అసలు పెరుగుదల లేకపోగా -0.07 శాతం క్షీణించింది. కూరగాయల ధరలు ప్రత్యేకించి ఆలూ, ఉల్లి ధరల తీవ్రత అధికంగా ఉంది. సమీక్షా నెల్లో మూడు ప్రధాన విభాగాలు చూస్తే..ఫుడ్ ఐటమ్స్ టోకు ద్రవ్యోల్బణం 11.53 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.11 శాతం కావడం గమనార్హం. ఆగస్టులో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా -10.01 శాతం తగ్గుదల నమోదయ్యింది. అయితే సమీక్షా నెల సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు ఏకంగా 48.73 శాతంగా ఉంది. ఆలూ ధరలు 78.13 శాతం పెరిగితే, ఉల్లి ధరలు ఏకంగా 78.82 శాతం ఎగశాయి.ఇంధనం, విద్యుత్ విభాగంలో ధరలు 4.05 శాతం తగ్గాయి. రిటైల్ ధరలూ భారమే..! ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబర్‌లో తీవ్రంగా ఉండడం గమనార్హం. సమీక్షా నెల్లో ఈ స్పీడ్ ఏకంగా 9నెలల గరిష్ట స్థాయిలో 5.49 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.65 శాతం. అధిక కూరగాయల ధరలు దీనికి కారణమని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. జాతీయ గణాంకాల కార్యాలయం వివరాల ప్రకారం ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.24 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 5.66 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే నెల్లో 6.62 శాతం. -
ఇంటి భోజనం.. భారం!
కూరగాయలు, ఇతర వంట సామాగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇంటి భోజనం ఖర్చులు అధికమైనట్లు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈసారి అదే నెలలో భోజనం ఖర్చులు పెరిగాయని తెలిపింది. అందుకు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమాటా వంటి కూరగాయల ధరలు పెరగడం కారణమని క్రిసిల్ ‘రోటి రైస్ రేట్’ నివేదికలో పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..గతేడాది సెప్టెంబరులో శాకాహార భోజనం తయారీ ఖర్చు రూ.28.10గా ఉండేది. అది ఈ ఏడాది అదే నెలలో 11% పెరిగి రూ.31.30కు చేరింది. శాకాహార భోజనం ఖర్చులో 37% వాటా ఉన్న కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణం. ఏడాదిక్రితంతో పోలిస్తే ఉల్లిపాయల ధర 53%, బంగాళాదుంపలు 50%, టమాటా ధర 18% పెరిగాయి. ఉల్లి, బంగాళాదుంపల సరఫరా తగ్గడం వల్ల వీటి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో టమాటా అధికంగా పండిస్తారు. కానీ ఈసారి అధిక వర్షాల కారణంగా పంట తీవ్రంగా దెబ్బతింది. దాంతో ధరలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో పప్పుల ధరలు కూడా 14% పెరిగాయి. అయితే వంట గ్యాస్ ఖర్చులు 11% తగ్గాయి. మాంసాహార భోజనం తయారీ ఖర్చు 2% తగ్గి రూ.59.30కు పరిమితమైంది. మాంసాహార భోజనం ఖర్చులో 50% వాటా ఉండే బ్రాయిలర్ చికెన్ ధర 14% తగ్గడం ఇందుకు దోహదం చేసింది. అయితే ఆగస్టుతో పోలిస్తే మాంసాహార భోజనం ధర సెప్టెంబర్‌లో పెద్దగా ప్రభావం చెందలేదు.ఇదీ చదవండి: ఇండియా పోస్ట్, అమెజాన్ జతఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతులివ్వడంతో ధరలు దిగిరావడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొందరు వ్యాపారులు అక్రమ నిల్వలు పెంచుకుంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని చెప్పారు. ఫలితంగా ఉల్లి ధరలు అధికమవుతున్నాయని తెలిపారు. ఇటీవల వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా వంట నూనెల ధరలు పెరిగాయి. చాలా కంపెనీలు అప్పటికే తక్కువ ధరకు దిగుమతి చేసుకున్నాయి. దానిపై అధిక ధర వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కొన్ని సంస్థలు వాటిని బేఖాతరు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ వర్గాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.