freezes
-
తాలిబన్లకు భారీ షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు తాజాగా అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఎవ్వరి మీదా ప్రతీకార చర్యలు లేవు. తమ నాయకుడి ఆదేశాల మేరకు అందర్న క్షమించేశాం..అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామంటూ ప్రకటించిన తాలిబన్ల దూకుడుకు అమెరికా జో బైడెన్ సర్కార్ బ్రేకులు వేసింది. తాలిబన్లకు దక్కకుండా నిధులను స్తంభింప చేసింది. అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్‌కు సంబంధించిన నిధులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాబూల్ తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత వారికి నిధులు అందుబాటులో లేకుండా అమెరికా చర్యలు తీసుకుంటోంది. యుఎస్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్, ఇతర అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘాన్ నిధులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 9.5 బిలియన్ డాలర్ల మేర నిధులను నిలిపివేసింది. తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. తమ బ్యాంకుల్లోని అఫ్గన్ ప్రభుత్వానికి చెందిన ఆస్తులు తాలిబాన్లకు అందుబాటులో ఉండవని పరిపాలనా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తాలిబాన్లపై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇతర చర్యలను కూడా ఆలోచిస్తోందని చెప్పారు. ఇప్పటికే జర్మనీ డెవలప్మెంట్ నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. (Afghanistan: తాలిబన్లకు మరో షాక్! సాయం నిలిపివేత) అఫ్గన్ కరెన్సీ పతనం తాలిబన్ల ఆక్రమణ తరువాత అఫ్గన్ కరెన్సీ అఫ్గని రికార్డు నష్టాలను చవిచూస్తోంది.. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, మంగళవారం 4.6 శాతం పడిపోయి డాలర్‌కు 86.0625 స్థాయికి చేరింది. (Afghanistan: పాపం పసివాడు, గుండెలు పగిలే దృశ్యం) నిరసన సెగలు, కాల్పులు కలకలం మరోవైపు అఫ్గన్‌లో తాలిబన్లను వ్యతిరేకంగా నిరసన సెగలు మరింత చెలరేగాయి. దీంతో ఆందోళన చేస్తున్న ప్రజలపై తాలిబన్ల కాల్పులకు దిగారు. జలాలాబాద్‌లో అఫ్గన్ జెండా ఎగరేసిన వారిపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 10 మందికి పైగా గాయబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా) #Taliban firing on protesters in Jalalabad city and beaten some video journalists. #Afghanidtan pic.twitter.com/AbM2JHg9I2 — Pajhwok Afghan News (@pajhwok) August 18, 2021 -
ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్
సాక్షి, ముంబై: అదానీ గ్రూప్‌నకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)భారీ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన మూడు విదేశీ ఫండ్ల ఖాతాలను స్తంభింపజేసింది. నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలల రూ.43,500 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. డిపాజిటరీ వెబ్సైట్ ప్రకారం అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్,క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ఫండ్ ఖాతాలుమే 31న లేదా అంతకుముందే వీటిని స్తంభింపజేసినట్టు తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సరైన సమాచారాన్ని బహిరంగ పరచడంలో ఈ 3 కంపెనీలు విఫలమైనట్టు తెలుస్తోంది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఖాతాలను స్తంభింపజేయవచ్చు. దీంతో ఈ ఫండ్స్ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలలో దేనినీ విక్రయించలేవు లేదా కొత్త సెక్యూరిటీలను కొనలేవు. అదానీ గ్రూప్‌లో ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. మారిషస్‌కు చెందిన మూడుకంపెనీలు అదానీ ఎంటర్ ప్రైజెస్ 6.82 శాతం, అదానీ ట్రాన్మిషన్ 8.03 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5.92 శాతం, అదానీ గ్రీన్ 3.58 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. అదానీ గ్రూప్ గత ఏడాదిలో 200శాతం నుంచి 1,000 శాతం మధ్య లాభపడింది. అయితే దీనిపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు. తాజా వార్తతో స్టాక్మార్కెట్లో అదానీ గ్రూపు షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 25 శాతం క్షీణించి ఇంట్రాడే కనిష్టానికి 1,201.10 డాలర్లకు చేరుకుంది.దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 1,40,500.74 కోట్లకు పడిపోయింది. అదానీ పోర్టు 19 శాతం క్షీణించి, ఇంట్రాడే కనిష్టానికి 681.50 రూపాయలకు చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ 1,46,444.65 రూపాయలకు పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ , అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం పతనమై లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. చదవండి: stockmarket: అదానీ షాక్, భారీ నష్టాలు -
తక్కువ మాట్లాడండి.. ఊపిరి ఎక్కువ తీసుకోవద్దు!
న్యూయార్క్: మాట్లాడకుండా, ఊపిరి తీసుకోకుండా ఎలా ఉంటారు? అయినా.. ఇవేం పిచ్చి సూచనలు? ..ఇవే కదా మీ అనుమానాలు! తొందరపడి అక్కడి అధికారులను తిట్టుకోవద్దు. నిజానికి ప్రజల ప్రాణాలు కాపాడేందుకే అధికారులు ఈ రకమైన సూచనలు చేశారు. అసలు విషయమేంటంటే.. చలి అమెరికాను గడ్డకట్టించేస్తోంది. మనదగ్గర ఉష్ణోగ్రతలు ఏడెనిమిది డిగ్రీలకు పడిపోతేనే గజగజా వణికిపోతున్నాం. అమెరికాలోనైతే ఏకంగా మైనస్ 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. దీంతో అమెరికా రాజధాని వాషింగ్టన్, విస్కాన్సిన్, ఇలినాయిస్, మిచిగాన్ తదితర ప్రాంతాల్లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ఈ సందర్భంగా వాతావరణశాఖ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సెకన్లలోనే ఒళ్లు మొద్దుబారేలా చేసే చలివాతావరణం ఆవరించి ఉందని.. బయటకు వెళ్లేటప్పుడు పెద్దగా ఊపిరి తీసుకోవద్దని, ఇతరులతో తక్కువగా మాట్లాడాలని సూచించారు. అలాగే ఇటువంటి చలి వాతావరణంలో బయట 10 నిముషాలకు మించి ఉంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. రానున్న రెండుమూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
కాగ్నిజెంట్‌కు ఐటీ షాక్
సాక్షి, చెన్నై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సిటిఎస్) ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. పన్నుఎగవేత ఆరోపణలతో వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. 2016-17 సంవత్సరానికి సంబంధించిన రూ.2500కోట్లకు పైగా పన్నులు చెల్లించలేదంటూ ఆదాయ పన్ను శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఆదాయం పన్ను చట్టం ప్రకారం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డిటిటి) 2,500 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు చెల్లించలేదని సీనియర్ టాక్స్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో చెన్నై, ముంబైలోని బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ గతవారం స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై కాగ్నిజెంట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కాగ్నిజెంట్ అధికారి ప్రతినిధి అన్నిబకాయిలను చెల్లించామని వివరణ ఇచ్చారు. తదుపరి చర్యలను నిషేధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిందని ప్రకటించారు. అయితే మరిన్ని వివరాలను అందించడానికి నిరాకరించారు. -
దక్షిణ కొరియా కేంద్ర బ్యాంకు సంచలన నిర్ణయం
సియోల్: దక్షిణ కొరియా సెంట్రల్ బ్యాంక్ తన బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను రికార్డ్ స్థాయిల వద్ద నిలిపింది. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ కొరియా తన వడ్డీ రేట్లను భారీగా స్తంభింపచేసింది. వరుసగా 13 నెలలో కూడా పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత వడ్డీరేట్లు రికార్డు కనిష్టాన్ని నమోదు చేశాయి. బీవోకే గవర్నర్ లీ జు-యూయోల్, మిగిలిన ఆరు ద్రవ్య విధాన బోర్డు సభ్యులు 1.25 శాతంగా (ఏడురోజులు రీపర్చేజ్) నిర్ణయించారు. గత ఏడాది జూన్ నాటి స్థాయికి ప్రస్తుత వడ్డీ రేట్లను బ్యాంక్ తగ్గించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. కొరియా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేషన్, 200మంది స్థిర-ఆదాయ నిపుణుల సర్వే ప్రకారం రేటు ఫ్రీజ్ ఉంటుందని 98 శాతం మంది అంచనా వేశారు. అటు బీవోకే రేటు పెంపు ఆవశకత్యపై ఇటీవల సంకేతాలిచ్చింది. అయితే అమెరికా గత నెలలో ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ రేటును 1.00-1.25 శాతం పెంచడంతో బీవోకేపై ఒత్తిడి పెరిగినట్టు అంచనా. ఫెడ్ దాని పాలసీ రేట్లను మరింత పెంచితే దక్షిణ కొరియా ఆర్థిక మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు బహుశా బయటికి వెళ్లిపోతాయని, దీంతో ప్రపంచ వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ అని ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఊహాత్మక పెట్టుబడులను నియంత్రించే లక్ష్యంతో తనఖా రుణాలపై ప్రెసిడెంట్ మూన్ జాయె ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.