ftp
-
వచ్చే ఐదేళ్లలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్తొ ఒక్క సిరీస్ లేదు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)ని బుధవారం విడుదల చేసింది. 2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల కాలానికి గాను పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు 2023 వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 వరల్డ్ కప్స్, రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎడిషన్లు ఉన్నాయి. 2019-23 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌తో పోలిస్తే రాబోయే సీజన్లో మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. 2023-27 ఎఫ్టీపీలో మొత్తం 777 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వీటిలో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఎఫ్టీపీ ఐసీసీ సభ్యత్వం ఉన్న 12 దేశాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక, భారత జట్టు విషయానికొస్తే టీమిండియా 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లతో కలిపి మొత్తం 141 మ్యాచ్‌ల్లో పోటీపడనుంది. అయితే ఈ ఐదేళ్లలో భారత్, పాకిస్తాన్ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ లేకపోవడం గమనార్హం. ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతాయి. అలాగే భారత్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు ఆడుతుంది. ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ ఆడేది. 1991 తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి. చదవండి: 'రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే' -
మూడు సంవత్సరాల్లో 301 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. ఎవరితో ఎవరు?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తొలిసారి మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)ను మంగళవారం విడుదల చేసింది. మే 2022 నుంచి ఏప్రిల్ 2025 కాలానికి గానూ మహిళా క్రికెట్ జట్లు ఆడబోయే సిరీస్‌లు, మెగాటోర్నీ వివరాలను ఎఫ్టీపీలో పేర్కొంది. ఇందులో 2023 వన్డే వరల్డ్ కప్‌తో పాటు మొత్తంగా 301 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టి20లు ఉన్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే టెస్టులు ఆడనున్నాయి. ఇతర జట్లు ఎక్కువగా టి20లవైపే మొగ్గుచూపాయి. ఇక మహిళా క్రికెట్లో ఎఫ్టీపీ షెడ్యూల్ రూపొందించడం ఒక అద్భుతం ఘట్టం. ఎఫ్టీపీ అనేది కేవలం భవిష్యత్తు పర్యటనల కోసమే గాక మహిళల క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నాం. గతంలో కివీస్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పలుమార్లు హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. అందుకే ఎఫ్టీపీలో మరిన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించాం అని ఐసీసీ జనరల్ మేనేజర్ వసీమ్ ఖాన్ పేర్కొన్నారు. ఇక ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ మహిళా చాంపియన్‌షిప్(IWC)లో భాగంగా 10 జట్లు వన్డే సిరీస్‌లు ఆడనున్నాయి. దీంతో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం అన్ని జట్లకు ఉండనుంది. పాకిస్తాన్ మినహా మిగతా 9 దేశాలతో మ్యాచ్‌లు.. 2022-25 కాలానికి గాను ప్రకటించిన ఎఫ్టీపీలో టీమిండియా మహిళల జట్టు ఒక్క పాకిస్తాన్ మినహా మిగతా తొమ్మిది దేశాలతో మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో కొన్ని ద్వైపాక్షిక, ట్రై సిరీస్‌లు ఉన్నాయి. అలాగే 2023 డిసెంబర్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఒక్కో టెస్టు మ్యాచ్ ఆడనుంది. 2022-25 కాలంలో టీమిండియా మహిళలు ఆడనున్న ద్వైపాక్షిక సిరీస్‌లు.. ►ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. ►డిసెంబర్ 2022లో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ►వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రకా, న్యూజిలాండ్‌తో ట్రై సిరీస్‌లో ఆడనున్న టీమిండియా నాలుగు టి20లు ఆడనున్నాయి ►2023 జూన్‌లో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు ►స్వదేశంలో సెప్టెంబర్-అక్టోబర్ 2023లో దక్షిణాఫ్రికాతో మూడు టి20లు, మూడు వన్డేలు ►న్యూజిలాండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ►డిసెంబర్ 2023లో ఇంగ్లండ్‌తో ఒక టెస్టు, మూడు టి20లు ►డిసెంబర్ 2023లోనే ఆస్ట్రేలియాతో ఒక టెస్టు, మూడు టి20లు, మూడు వన్డేలు ►నవంబర్ 2024లో ఆసీస్‌తో ఆస్ట్రేలియా వేదికగా మూడు వన్డేలు ►డిసెంబర్ 2024లో విండీస్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు ►జనవరి 2025లో ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు 2022-25లో జరగనున్న ఐసీసీ మెగాటోర్నీలు ►ఫిబ్రవరి 2023 - దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ ►సెప్టెంబర్ / అక్టోబర్ 2024 - బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ ►సెప్టెంబర్ / అక్టోబర్ 2025 - భారత్ వేదికగా మహిళల క్రికెట్ ప్రపంచకప్ UNVEILING 👀 The first-ever Women’s Future Tours Program ⬇️ — ICC (@ICC) August 16, 2022 చదవండి: IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు -
139 ఏళ్ల యాషెస్ చరిత్రకు తొలిసారి దెబ్బ పడనుందా!
క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చిరకాల ప్రత్యర్థులుగా అభివర్ణిస్తారు. ఇరుజట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాషెస్ అంటే టెస్టు సిరీస్ కావొచ్చు కాని.. సంప్రదాయ క్రికెట్లో ఉండే మజా ఎంత రుచిగా ఉంటుందో ఈ సిరీస్ తెలియజేస్తుంది.ట్రోపీలో ఉండే బూడిదను దక్కించుకోవడం కోసం ఇరుజట్లు కొదమసింహాల్లా తలపడుతుంటాయి. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో.. యాషెస్ సిరీస్ పట్ల అభిమానుల్లో అదే ఉత్సాహం కనిపించడం సహజం. ఇరుజట్ల మధ్య తొలిసారి 1882-83లో యాషెస్ సిరీస్ జరగ్గా.. అప్పటినుంచి 72 సిరీస్‌లు ఆడగా.. ఆస్ట్రేలియా 34 సార్లు, ఇంగ్లండ్ 32 సార్లు యాషెస్‌ను కైవసం చేసుకున్నాయి. మరో ఆరు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి. మరి 139 ఏళ్ల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్ ప్రతీ రెండేళ్లకోసారి జరుగుతుంది. 2023లో ఇంగ్లండ్ వేదికగా జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే అవకాశముంది. కానీ ఐసీసీ ఏర్పాటు చేసిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)లో భాగంగా బిజీ షెడ్యూల్ ఉండడం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను తొలిసారి వాయిదా వేసేలా చేయనుంది. ఎఫ్టీపీతో పాటు హండ్రెండ్ టోర్నమెంట్లో ఇంగ్లండ్ జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు పాల్గొనాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో 139 ఏళ్ల చరిత్రలో యాషెస్ సిరీస్ వాయిదా పడడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. ఐసీసీ ప్లాన్ చేసిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ప్రకారం అన్ని జట్లకు బిజీ షెడ్యూల్ ఉండడంతో పాటు.. ఆయా దేశాలు నిర్వహించే హండ్రెడ్ టోర్నమెంట్, ఐపీఎల్ లాంటి లీగ్‌లకు ఎఫ్టీపీ విండోలో సెపరేట్‌గా షెడ్యూల్ ఉంది. దీనికి అనుగుణంగానే ఎఫ్టీపీ షెడ్యూల్ డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో హండ్రెడ్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్‌ను ముందుకు జరిపే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈసారి జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌కు ఇంగ్లండ్ టెస్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా జానీ బెయిర్ స్టో లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. ఆగస్టు 17 నుంచి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్, భారత్లతోనూ వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇక 2021/22 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0తో దక్కించుకుంది. ఇంగ్లండ్‌ను చీల్చి చెండాడుతూ సిరీస్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ యాషెస్‌ను దక్కించుకుంది. యాషెస్ ఓటమితో పాటు వెస్టిండీస్‌కు సిరీస్ కోల్పోవడంతో ఓటములకు బాధ్యత వహిస్తూ జో రూట్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక రూట్ అనంతరం కెప్టెన్‌గా వచ్చిన స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లండ్ మునుపటి ఫామ్‌ను ప్రదర్శిస్తోంది. అయితే స్టోక్స్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి యాషెస్ సిరీస్ కానుండడం.. ఈసారి సొంతగడ్డపై యాషెస్ జరగనుండడం ఇంగ్లండ్‌కు సానుకూలాంశమని చెప్పొచ్చు. చదవండి: Cricket Australia: 'లంక ప్రజల దుస్థితికి చలించి'.. ఆసీస్ క్రికెటర్ల కీలక నిర్ణయం -
జై షా చెప్పిందే నిజమైంది.. ఐపీఎల్‌పై ఐసీసీ కీలక నిర్ణయం
ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పిందే అక్షరాల నిజమైంది. నివేదికల ప్రకారం.. ఐసీసీ 2023-27 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్టీపీ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సింహ భాగాన్ని దక్కించుకుంది. తదుపరి ఎఫ్టీపీలో ఐపీఎల్‌ను రెండున్నర నెలల పాటు నిర్వహించుకునేందుకు ఐసీసీ పచ్చజెండా ఊపింది. ఐపీఎల్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్‌లు కూడా ఎఫ్టీపీలో తమ బెర్తులను పొడిగించుకున్నాయి. ఈ మేరకు ఐసీసీ ఎఫ్‌టీపీని రూపొందిచినట్లు తెలుస్తోంది. తాజా సవరణలతో ఐపీఎల్ మార్చి చివరి వారంలో ప్రారంభమైన జూన్ మొదటి వారంలో (రెండున్నర నెలలు) ముగుస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు ఎంటర్ కావడంతో మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు పొడిగించబడగా.. ఈ సంఖ్య 2023, 2024 సీజన్లలో ఆలాగే కొనసాగి.. 2025, 2026 ఎడిషన్లలో 84కు, 2027 సీజన్లో 94కు చేరుతుంది. ఐపీఎల్ విండో పొడిగించబడినప్పటికీ.. ఇప్పట్లో ఫ్రాంచైజీల సంఖ్య పెంచే ఆలోచన లేదని బీసీసీఐ తెలపడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, ఐసీసీ 2023-27 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాంలో ఐసీసీ విండో పొడిగింపుపై జై షా గత నెలలోనే ట్వీట్ చేశాడు. షా చెప్పినట్లుగానే ఐసీసీ తమ ఎఫ్టీపీలో ఐపీఎల్‌కు అగ్రతాంబూలం అందించింది. చదవండి: అందుకే బీసీసీఐ కోహ్లిని తప్పించే సాహసం చేయలేకపోతుంది..! -
ఎఫ్‌టీపీపై చర్చకే పరిమితం!
దుబాయ్: భవిష్యత్‌లో జరగబోయే టోర్నీల నిర్వహణ (ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్–ఎఫ్టీపీ), క్రికెట్‌ను మరిన్ని దేశాల్లో అభివృద్ధి చేసే అంశాలపై చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు నేడు సమావేశం కానుంది. టి20 ప్రపంచ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే ముందు తమకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీని కోరిన నేపథ్యంలో కీలక ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చు. జూలై 1 తర్వాత బీసీసీఐ వరల్డ్ కప్ విషయంలో స్పష్టతనిచ్చిన తర్వాతే ఐసీసీ స్పందించే అవకాశం ఉంది. కాబట్టి జూలై 18 నుంచి జరిగే ఐసీసీ తదుపరి సమావేశంలోనే వరల్డ్ కప్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఇతర అంశాలే అజెండాగా ఐసీసీ సమావేశం సాగవచ్చు. 2023–2031 మధ్య ఎనిమిది సంవత్సరాల కాలంలో నిర్వహించబోయే ఐసీసీ టోర్నీలతో పాటు తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కొనసాగింపు సాధ్యాసాధ్యాలపై కూడా చర్చ జరుగుతుంది. క్రికెట్‌ను కనీసం 104 దేశాలకు విస్తరించాలని భావిస్తున్న ఐసీసీ... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కూడా మహిళల క్రికెట్‌ను చేర్చేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించనుంది. -
2021లో బిజీ బిజీగా...
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు ఆడాల్సిన పలు సిరీస్‌లు రద్దయ్యాయి. ఐపీఎల్ విజయవంతంగా జరిగినా... టీమిండియాకు మాత్రం ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. కోవిడ్–19 ప్రభావం మొదలైన తర్వాత కోహ్లి సేన ఇప్పటి వరకు ఇంకా బరిలోకి దిగలేదు. ఈ నెలలో ఆస్ట్రేలియాతో సిరీస్‌తో మన ఆటగాళ్లు మళ్లీ మైదానంలో కనిపించనున్నారు. ఈ లోటును తీరుస్తూ వచ్చే ఏడాది ‘మెన్ ఇన్ బ్లూ’ పెద్ద సంఖ్యలో సిరీస్‌లకు సన్నద్ధమవుతోంది. 2021లో భారత జట్టు ఐపీఎల్ సహా కనీసం 9 సిరీస్‌లు/టోర్నీలలో ఆడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 14 టెస్టులు, 13 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లలో భారత్ పాల్గొనవచ్చని సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఆడే వన్డేల సంఖ్య, ఆసియా కప్ టి20 టోర్నీలో, ప్రపంచకప్ టి20 టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌ల సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. సరిగ్గా చెప్పాలంటే ఏడాదిలో ఏ ఒక్క నెలలోనూ విరామం లేకుండా మన క్రికెట్ కొనసాగనుంది. ‘పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటం క్రికెటర్లకు అంత సులువు కాదనే విషయం మాకూ తెలుసు. అయితే ఎఫ్టీపీ ఒప్పందాలను మేం గౌరవించాల్సిందే. ఇప్పుడు మన జట్టులో ప్రతిభకు కొదవ లేదు. ఒకరు కాదంటే మరొకరు అన్నట్లుగా పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. రొటేషన్ విధానంలో వారికి అవకాశాలు లభించవచ్చు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భారత్ ఆడబోయే సిరీస్‌ల వివరాలను చూస్తే... -
కోహ్లి ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే
న్యూఢిల్లీ : తీరిక లేని మ్యాచ్‌లతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని, బిజీ షెడ్యూల్‌పై పునరాలోచించాలని ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ప్రతిపాదనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో మ్యాచ్‌లు ఆడే రోజులను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్( ఎఫ్టీపీ) మ్యాచ్‌లు ఆడే రోజులను తగ్గించారు. 2019 నుంచి 2023 మధ్య 390 రోజులు ఆడాల్సి ఉండగా ఈ సంఖ్యను 306 రోజులకు తగ్గించారు. ఈ ప్రణాళికలో 2021 చాంపియన్స్ ట్రోఫీ, 2023 ప్రపంచకప్ మ్యాచ్‌లను లెక్కించలేదు. ఈ టోర్నీల్లో టీమిండియా ఆడే మ్యాచ్‌లను కలిపినా ఈ సంఖ్య 350కు మించదు. అయితే ప్రస్తుత ఎఫ్టీపీతో పోలిస్తే 2019-2023 ఎఫ్టీపీ ప్రకారం టీమిండియా మూడు రెట్లు ఎక్కువగా టీ20లు ఆడనుందని సమాచారం. ఈ మధ్యకాలంలో భారత్ 50 శాతం మ్యాచ్‌లను పెద్ద జట్లైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో ఆడింది. ఈ అన్ని జట్లతో లాంగ్ ఫార్మట్ సిరీస్‌లు ఎక్కువగా ఆడింది. దీంతో ఎక్కువ రోజులు ఆడాల్సి రావడంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. వచ్చే ఎఫ్టీపీలో టెస్టు, వన్డేలను తగ్గిస్తే మ్యాచ్‌లు ఆడే రోజులు తగ్గుతాయని, అలాగే మ్యాచ్‌ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని భావించిన బీసీసీఐ ప్రత్యామ్నాయంగా టీ20ల సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది. -
ఎగుమతులకు మరిన్ని ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఎగుమతులు బలోపేతమే లక్ష్యంగా మరిన్ని ప్రోత్సాహకాలతో కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానానికి (ఎఫ్టీపీ) తాజా మెరుగులద్దింది. 2015–20 వాణిజ్య విధానాన్ని మధ్యంతరంగా సమీక్షించి పలు ప్రోత్సాహకాలతో మళ్లీ ఆవిష్కరించింది. సరుకుల ఎగుమతుల పథకం (ఎంఈఐఎస్) ప్రోత్సాహకాన్ని 2 శాతం మేర పెంచినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు ఎఫ్టీపీ విడుదల సందర్భంగా తెలిపారు. వార్షిక ప్రోత్సాహక బడ్జెట్ 34 శాతం పెంపుతో రూ.8,450 కోట్లకు చేరిందన్నారు. ‘‘దీంతో తోలు, చేతి ఉత్పత్తులు, కార్పెట్లు, క్రీడా వస్తువులు, వ్యవసాయం, మెరైన్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లకు ప్రయోజనం కలుగుతుంది. వాణిజ్య విధానాన్ని మరింతగా సులభతరం చేసి ఎగుమతులను పెంచాలన్న లక్ష్యంతోనే దీన్ని మధ్యంతరంగా సమీక్షించాం. అధిక ఉపాధినిచ్చే రంగాలకు మద్దతు పెంచటం, సేవల ఎగుమతులను ప్రోత్సహించడం కూడా మా లక్ష్యాల్లో ఉన్నాయి’’ అని మంత్రి వివరించారు. కొత్త మార్కెట్లను, ఉత్పత్తులను గుర్తించడంతోపాటు సంప్రదాయ మార్కెట్లలో, ఉత్పత్తుల్లో భారత వాటాను పెంచడంపై ఎఫ్టీపీ దృష్టి సారిస్తుందన్నారు. అంతర్జాతీయంగా భారత పరిశ్రమ ప్రాతినిధ్యాన్ని పెంచుతామన్నారు. ‘‘ఎఫ్టీపీ కింద ఏటా అదనంగా తోలు రంగానికి రూ.749 కోట్లు, చేతి తయారీ సిల్క్ కార్పెట్లు, హ్యాండ్లూమ్, జూట్, కాయిర్ ఉత్పత్తులకు రూ.921 కోట్లు, వ్యవసాయోత్పత్తులకు రూ.1,354 కోట్లు, మెరైన్ ఉత్పత్తులకు రూ.759 కోట్లు, టెలికం, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల ఎగుమతులకు రూ.369 కోట్లు, మెడికల్ ఎక్విప్మెంట్కు రూ.193 కోట్ల ప్రయోజనాలు లభిస్తాయి’’ అని సురేష్ ప్రభు తెలిపారు. జీఎస్టీ ఎగుమతుల వృద్ధికి ప్రేరణగా ఉంటుందన్నారు. ఐదేళ్ల ఎఫ్టీపీ కింద 2020 నాటికి కేంద్రం 900 బిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఎగుమతుల్లో దేశీయ వాటా 2 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలన్నది కేంద్రం ఆశయం. ఎఫ్టీపీ ప్రధానాంశాలివీ... ►ఎంఈఐఎస్ ప్రోత్సాహకాలను రెడీమేడ్ గార్మెంట్స్‌పై 2 శాతం పెంచడం వల్ల వార్షికంగా ప్రభుత్వంపై రూ.2,743 కోట్ల భారం పడుతుంది. ► ఎంఈఐఎస్ వార్షిక బడ్జెట్ పెంపు 34 శాతం. దీంతో మొత్తం బడ్జెట్ రూ.8,450 కోట్లకు చేరింది. ►సేవల ఎగుమతుల పథకం (ఎస్ఈఐఎస్) కింద కూడా ప్రోత్సాహకాలను కేంద్రం 2 శాతం మేర పెంచి రూ.1,140 కోట్లు చేసింది. ►సెజ్‌లకు సరఫరా చేసే వస్తు, సేవలను జీఎస్టీ కింద సున్నా రేటుగా పరిగణిస్తారు. ►డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్ చెల్లుబాటు కాలాన్ని 18 నెలల నుంచి 24 నెలలకు పెంచింది. ►లాజిస్టిక్స్‌ను ప్రోత్సహించేందుకు గాను నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ►పారదర్శకత దిశలో డేటా ఆధారిత విధాన చర్యలకు గాను డీజీఎఫ్టీ పేరుతో అనలైటిక్స్ డివిజన్ ఏర్పాటవుతుంది. ►నియంత్రణ సంస్థల నిబంధనలను పాటించేందుకు, నూతన మార్కెట్లను చేరుకునేందుకు ఎగుమతిదారులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు నిపుణులతో బృందం ఏర్పాటు అవుతుంది. ►విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు నూతన విధానం. ►సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ఉపాధి కల్పనపై దృష్టి సారిస్తారు. -
2020 నాటికి ఎగుమతులు 900 బిలియన్ డాలర్లు!
మోదీ ప్రభుత్వ లక్ష్యం ఇది.. • ఎగుమతులను రెట్టింపు చేసేలా తొలి విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ • కొత్త మార్కెట్ల అన్వేషణకు వ్యూహాలు న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ మొట్టమొదటి విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) భారీ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. 2020 నాటికి ఈ పరిమాణం 900 బిలియన్ డాలర్లుగా ఉండాలన్న ధ్యేయంతో ఉన్నట్లు విధానం స్పష్టం చేసింది. 2013-14లో భారత వ్యాపార ఎగుమతులు 312 బిలియన్ డాలర్లు. సేవల రంగాన్ని కూడా కలుపుకుంటే ఈ విలువ దాదాపు 466 బిలియన్ డాలర్లు ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం కూడా దాదాపు ఇదే స్థాయిలో ఎగుమతులు నమోదుకావచ్చని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఐదేళ్లకు (2015-2020) సంబంధించి బుధవారం తాజా విధానాన్ని విడుదల చేసింది. లక్ష్యాలను సాధించే క్రమంలో వాణిజ్య విధానాన్ని ఇకపై రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుంది. ఇప్పటి వరకూ వార్షికంగా ఈ సమీక్ష జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం వాణిజ్యంలో భారత్ వాటా కేవలం 2 శాతం. ఈ రేటును 3.5 శాతానికి పెంచాలన్నది లక్ష్యమని వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ తెలిపారు. ఈ దిశలో కొత్త మార్కెట్ల అన్వేషణకు దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రపంచ స్థాయిలో భారత వాణిజ్య వాటా పెంపు లక్ష్యంగా ట్రేడ్ కౌన్సిల్ అండ్ నేషనల్ కమిటీసహా పలు సంస్థల ఏర్పాటును వాణిజ్య విధానం ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. 3 శాతం వడ్డీ సబ్సిడీ పథకం పునరుద్ధరణ డిమాండ్‌పై ఆయన సమాధానం ఇస్తూ, దీని అమలుకు వాణిజ్య మంత్రిత్వశాఖ త్వరలో కేబినెట్ ఆమోదాన్ని కోరనున్నట్లు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాకు అనుసంధానం.. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో అనుసంధానం ద్వారా.. భారీ ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా ఎఫ్‌టీపీని రూపొందించినట్లు విధాన ప్రకటన కార్యక్రమం సందర్భంగా వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎగుమతిదారులు, ప్రత్యేక ఆర్థిక జోన్లకు(ఎస్ఈజెడ్) తమ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నదని తెలిపారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధికి భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. రాష్ర్ట ప్రభుత్వాలతో కలిసి ఒక వ్యవస్థాగత ఫ్రేమ్‌వర్క్ ద్వారా దేశ ఎగుమతుల వృద్ధికి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్(ఈపీఎం)ను ఆవిష్కరించనున్నట్లు ఎఫ్టీపీ సూచించింది. రక్షణ, ఫార్మా, పర్యావరణ సానుకూల ఉత్పత్తులు.. అలాగే విలువ ఆధారిత ఎగుమతులపై కొత్త పాలసీ దృష్టి పెడుతుందని తెలిపారు. తయారీ, కేపిటల్ గూడ్స్ ఉత్పత్తి వృద్ధికీ పాలసీలో చర్యలు తీసుకున్నామన్నారు. ఈ-కామర్స్ కంపెనీల ఎగుమతి ప్రొడక్టులకు కూడా ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని, ఇది ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడుతుందని తెలిపారు. 2 కొత్త స్కీమ్‌లు..: ఎగుమతుల పెంపు లక్ష్యంగా... గతంలో ఉన్న పలు ‘క్లిష్ట విధానాల’ స్థానంలో కొత్తగా రెండు పథకాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎంఈఐఎస్), సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎస్ఈఐఎస్) పథకాలను తాజాగా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ పథకాల అన్ని ప్రయోజనాలను ఎస్‌ఈజెడ్‌లలోని యూనిట్లకు కూడా అందించనున్నట్లు తెలిపారు. ఎస్ఈఐఎస్ భారత్‌లోని ‘సర్వీస్ ప్రొవైడర్లకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఎంఈఐఎస్ కింద ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ అగ్రికల్చరల్, ఆహార వస్తువులు, వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులకు ప్రయోజనం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలు ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని కోరుతున్నట్లు పేర్కొన్న మంత్రి, దీనికి కట్టుబడి ఉంటూనే ఎగుమతుల వృద్ధి వ్యూహాలను కేంద్రం రూపొందిస్తోందన్నారు. యోగా, హస్త కళల వంటి భారత సాంప్రదాయక అంశాలు, తత్సంబంధ సేవలను కూడా ‘సేవా సంబంధ’ ఎగుమతుల కేటగిరీలో చేర్చాలని ఎఫ్టీపీ పేర్కొంది. మిశ్రమ స్పందన... తాజా విధానంపై సంబంధిత వర్గాల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. భారత ఎగుమతుల సంఘాల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) డెరైక్టర్ జనరల్, సీఈఓ అజయ్ షాహీ మాట్లాడుతూ... గతానికన్నా భిన్నంగా సానుకూలంగా విధానం ఉందన్నారు. తాజా సమస్యలను ఈ విధానం గుర్తించి, అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నించిందని అన్నారు. కాగా,ఇది కొత్త సీసాలో పాత సారాను తలపిస్తోం దని వాణిజ్య నిపుణులు, బిజి నెస్ స్టడీస్ అకాడమీ డెరైక్టర్ అరుణ్ గోయల్ అన్నారు. వైజాగ్, భీమవరంకు ప్రత్యేక హోదా.. తాజా పాలసీ విధానంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, భీమవరంను ‘టౌన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ’ జాబితాలో చేర్చారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోకి ఎగుమతి ఆధారిత యూనిట్లకు పలు ఆర్థిక పరమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్రత్యేక హోదా 21 నగరాలు, పట్టణాలకు ఉంది. తాజా నిర్ణయంతో ఈ సంఖ్య 23కు చేరింది.