full water
-
ప్రాజెక్టులకు జలకళ
జైనథ్(ఆదిలాబాద్): ఓ పక్క భారీ వర్షాలతో జిల్లాలో ఖరీఫ్ పంటలు నాశనం కాగా, మరో పక్క సాగు నీటి ప్రాజెక్టుల్లో భారీగా వరద నీళ్లు చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగు నీటి ప్రాజెక్టుల్లో చేరిన జలసిరి రైతులకు కొంత భరోసానిస్తోంది. ఖరీఫ్ నష్టాన్ని కొంతలో కొంతనైనా వచ్చే రబీ సీజన్లో భర్తీ చేసుకునేందుకు భరోసా కనిపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు, లక్ష్మీపూర్ రిజర్వాయర్, తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టుల్లో భారీ నీటి ని ల్వలు చేరాయి. దీంతో రబీ సీజన్లో ఆదిలాబాద్, జైనథ్, బే ల, తాంసి మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉండడంతో వచ్చే రబీ సీజన్‌కు సాగు నీటి ఇబ్బందులు తప్పాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాత్నాలలో 1 టీఎంసీ నీటి నిల్వ.. జిల్లాలో 24 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన సాత్నాల ప్రాజెక్టులో ప్రస్తుతం 1టీఎంసీ నీటి నిల్వలు ఉన్నాయి. 286.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 1.24టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సాత్నాలలో ప్రస్తుతం వరద నీళ్లు భారీగా వచ్చాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇన్‌ఫ్లో చాలా ఎక్కువగా రావడంతో పలుమార్లు గేట్లు ఎత్తారు. ఈ సంవత్సరం మొత్తం 4.042 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, ఇప్పటి వరకు గేట్లు, స్పిల్‌వే ద్వారా 3.038 టీఎంసీల నీళ్లను వదిలారు. ప్రస్తుతం 285.5మీటర్ల ఎత్తులో 1.004టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇంకా 507 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కాగా సాత్నాల పరిధిలో ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోని సుమారు 25 గ్రామాల్లో 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నిండుకుండలా లక్ష్మీపూర్ రిజర్వాయర్.. సాత్నాల ప్రాజెక్టు వృథా నీటిని ఒడిసిపట్టేందుకు 2008లో రూ. 56 కోట్ల లక్ష్మీపూర్ గుట్ట కింద రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఇటీవలే సాత్నాల ఆధునికీకరణ పనుల్లో భాగంగా రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు రూ.30 కోట్లతో సీసీ లైనింగ్ పనులు చేపట్టారు. 250.6 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 0.153 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న లక్ష్మీపూర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు చేరాయి. 0.153 టీఎంసీ నీళ్లు చేరడంతో మాకోడ వైపు ఏర్పాటు చేసి బ్రీచ్ నుంచి బెల్లూరి వాగులో నీళ్లు పారుతున్నాయి. దీని కుడి కాలువ కింద మాకోడ, బెల్లూరి, బెల్గాం, ఉమ్రి, ఖాప్రి, ఆవల్పూర్ గ్రామాల్లో 2800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువల కింద జైనథ్, మాకోడ, దీపాయిగూడ, కుతుంపూర్, ఖాప్రి, బెల్గాం, కూర గ్రామాల్లో 4800 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. మత్తడి వాగుకు జలకళ.. తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామ సమీపంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు సైతం జలకళ సంతరించుకుంది. 277.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 0.57టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 277.05 మీటర్ల ఎత్తులో 0.50 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కాలువ కింద వడ్డాడి, జామిడి, కప్పర్ల, బండల్‌నాగాపూర్, పొచ్చెర, ఈదుల సావర్గామ, గోట్కూరి, భీంసరి, నిపాని, జందాపూర్, చాంద తదితర గ్రామాల్లో 8500 ఎకరాల్లో ఆయకట్టు ఉంది. రబీ సాగుకు చింత లేదు.. ఈ సంవత్సరం వర్షాలకు ఖరీఫ్‌లో పత్తి, సోయా పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్ పోయినట్లే అనిపిస్తోంది. కాకపోతే రబీలో ఈ నష్టాన్ని కొంత పూడ్చవచ్చనే ఒక అశ ఉంది. సాత్నాల ప్రాజెక్టులో నీళ్లు భారీగా చేరడంతో రబీలో శనగ పంట వేసుకోవచ్చు. ప్రాజెక్టు నిండడం చాలా సంతోషంగా ఉంది. – కామ్రే ఆనంద్‌రావు, యువరైతు, లక్ష్మీపూర్, జైనథ్ మండలం -
ఉగ్ర గోదావరి
సారంగాపూర్/ధర్మపురి/ఇబ్రహీంపట్నం/జగిత్యాల రూరల్/ బసంత్‌నగర్/మంథని/కాళేశ్వరం: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టునుంచి గేట్లు ఎత్తివేయడంతో దిగువకు ఒక్కసారిగా వరదనీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ధర్మపురి, కాళేశ్వరం, మంథని ప్రాంతాల్లోనూ గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. సారంగాపూర్ మండలంలో గోదావరి ఉధృతి మంగళవారం మధ్యాహ్నం 12గంటల వరకు పెరిగి ఆ తర్వాత తగ్గింది. రాయికల్ మండలం బోర్నపెల్లిలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టునుంచి గేట్లు ఎత్తివేయడంతో నీరు పుష్కరఘాట్‌లోని షవర్ల వద్దకు చేరింది. వరదనీటితో ఒడ్డున ఉన్న పత్తిపంట నీట మునిగింది. ఎస్సారెస్పీ నీటితో ధర్మపురిలోని పుష్కరఘాట్లతోపాటు సంతోషిమాత ఆలయంలోకి నీరు చేరింది. శ్రాద్ధ మండపం సగం మునిగింది. ఎస్సారెస్పీ నుంచి 3.50లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో రాయపట్నం వంతెన వద్ద నీటి ఉధృతి పెరిగింది. భక్తులను స్నానాలకు అనుమతించలేదు. ధర్మపురిలోని తెనుగువాడలో ఉన్న వాగు నీటితో పోటెత్తింది. దమ్మన్నపేట, రాజరాం, జైనా గ్రామాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల మండలం గోవిందుపల్లి వంతెన, మోతె బ్రిడ్జి, తిమ్మాపూర్ బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. అంతర్గాం ప్రధాన కాలువ వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాలువపైనున్న ఎస్కేప్‌ను ఎత్తడంతో ధరూర్ గ్రామ శివారులో నుంచి తిమ్మాపూర్ గ్రామశివారు వరకు వచ్చే ప్రధాన వాగు భారీగా ప్రవాహం రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు స్పందించి నీటిని నిలిపివేశారు. భారీ వర్షానికి ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి శివారులో మినీ పర్కులేషన్ ట్యాంక్‌కు గండి పడడంతో పొలాలు నీటమునిగాయి. దాదాపు 50ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువనున్న ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతున్నారు. వస్తున్న వరదకు సమానంగా ప్రాజెక్ట్ నలభై గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20టీఎంసీలకుగాను మంగళవారం 16.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌కు 4,00,830 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 5,79,018 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. పంట పొలాలు మునక మంథని వద్ద గల గోదావరి నదికి వరద మళ్లీ పోటెత్తింది. మొదటి ప్రమాద హెచ్చరికను దాటి డేంజర్ జోన్లో ప్రవహించింది. నదిలోని ఆలయాలు, మండపాలు, స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల వెంట ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరింది. డివిజన్లో సుమారు మూడువేల ఎకరాల్లో వరి, పత్తి పంట పొలాలు మునిగిపోయినట్లు ప్రాథమిక సమాచారం. నీట మునిగిన పంట పొలాలను మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం పరిశీలించారు. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండడంతో పోలీసులు సందర్శకులకు గోదావరి వద్దకు అనుమతి నిలిపివేశారు. కొద్ది దూరంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి నది వైపు వెళ్లనీయడం లేదు. కాళేశ్వరం వద్ద.. కాళేశ్వరం వద్ద గోదావరినది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఎగువన పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తిడంతో మంగళవారం కాళేశ్వరం వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. సాయంత్రంవరకు గోదావరి నీటిమట్టం 9.90 మీటర్ల మేర పెరిగి ప్రవహిస్తోంది. రాత్రి వరకు నీటి మట్టం మరింత పెరిగే అవకాశముంది. గోదావరి పరివాహక ప్రాంతాలైన అన్నారం, మద్దులపల్లి, పల్గుల, కుంట్లం, పూసుకుపల్లి, కాళేశ్వరం, మెట్పల్లి గ్రామాల్లోపత్తి, మిర్చి, వరి పంటలు నీట మునిగాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులు లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
నిండుకుండలా..కిన్నెరసాని..
పాల్వంచ రూరల్: కిన్నెరసాని రిజర్వాయర్ 407 అడుగల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 406.60 అడుగులకు వరద చేరగా.శుక్రవారం ఉదయం నుంచి రెండు గేట్లను ఎత్తి, దిగువకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాజాపురం, యానంబైల్ గ్రామాల మధ్య లోలేవల్ చప్టాపైనుంచి వరదనీరు పొంగింది. యానంబైల్, ఉల్వనూరు, చండ్రాలగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో 20కిపైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. -
శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు జలకళ
-
‘భారీ’ష్!
తడిసిముద్దయిన మెతుకు సీమ జిల్లావ్యాప్తంగా 55.8 మిల్లీమీటర్ల వర్షపాతం వెల్దుర్తిలో అత్యధికంగా 15 సెం.మీ వర్షం నిండిన నారింజవాగు.. చెరువులు, కుంటల్లోని నీరు పలుచోట్ల పాక్షికంగా కూలిన ఇళ్లు వర్షాధార పంటలకు మేలు, రబీ సాగుకు ఊతం సాక్షి, సంగారెడ్డి: భారీగా కురుస్తున్న వర్షాలతో మెతుకుసీమ తడిసిముద్దయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో చెరువులు, కుంటల్లో వర్షం నీరు వచ్చి చేరింది. జహీరాబాద్‌లోని నారింజవాగు నిండగా.. వాగు పరివాహక ప్రాంతాల్లోని పొలాలు మునిగిపోయాయి. బుధవారం జిల్లావ్యాప్తంగా 55.8 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కాగా.. వెల్దుర్తిలో అత్యధికంగా 15 సెం.మీ, నర్సాపూర్‌లో 11.4 సెం.మీ వర్షంకురిసింది. భారీ వర్షాల కారణంగా వెల్దుర్తి, రామాయంపేట, మెదక్‌లోని పలుచోట్ల ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామంలో వర్షం ధాటికి చావిడి కూలి రాజయ్య గాయపడ్డాడు. వర్షాధార పంటలకు మేలు వర్షాల వల్ల ఖరీఫ్‌లో సాగుచేసిన వర్షాధార పంటలకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలకు మేలు జరగనుంది. అదేవిధంగా చెరకు, వరి, అల్లం పంటలు వర్షంతో ఎదుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రబీకి సిద్ధమయ్యే వారికి ప్రస్తుత వర్షాలు మేలు చేయనున్నాయి. మెదక్‌లోని కొంటూరు, రాయినిపల్లి ప్రాజెక్టు, సమ్నాపూర్, కూచన్‌పల్లి చెరువుల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చి ఆవరణలో ఇల్లు కూలింది. రామాయంపేటలో ఏడు ఇళ్లు పాక్షికంగా.. తూప్రాన్‌లో 18, వెల్దుర్తి మండంలంలో 12 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ వర్షం కారణంగా పటాన్చెరు మండలం బీరంగూడ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. జోగిపేట పట్టణంలోని ప్రధాన రహదారి నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్ డివిజన్లో అత్యధికం నర్సాపూర్ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 55 మి.మీ వర్షపాతం నమోదు కాగా మెదక్ డివిజన్లో 66.8 మి.మీ, సంగారెడ్డిలో 51.6 మి.మీ, సిద్దిపేటలో 45.4 మి.మీ వర్షం కురిసింది. వెల్దుర్తిలో అత్యధికంగా 15 సెం.మీటర్ల వర్షం కురవగా.. నర్సాపూర్‌లో 11.4, చేగుంట, తొగుటలో 9 సెం.మీ, శివ్వంపేటలో 8.5 సెం.మీటర్ల వర్షం కురిసింది. రాయికోడ్, జహీరాబాద్, అల్లాదుర్గం, చిన్నశంకరంపేట, హత్నూర, జిన్నారం, నంగనూరు, కొండపాక మండలాల్లో 7 సెం.మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రామచంద్రాపురం, కోహీర్, కొల్చారం, అందోలు, పుల్కల్, దౌల్తాబాద్ మండలాల్లో 6 సెం.మీటర్లు వర్షం కురిసింది. కంగ్టి, ఝరాసంగం, సంగారెడ్డి, రేగోడ్ మండలాల్లో 5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. -
నీరు పారదు.. సాగు సాగదు
పిఠాపురం : రబీ సాగుకు పుష్కలంగా నీరందిస్తామన్న అధికారుల మాట నీటిమూటే అయింది. అవసరానికి నీరందక ఏలేరు ఆయకట్టు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కలుపుతీతల సమయం వచ్చినా.. పలుచోట్ల నాట్లే పడలేదు. మరోపక్క ఎదిగిన వరినారు.. నీరు లేక నాట్లు ఆలస్యమవడంతో ముదిరి పనికి రాకుండా పోతోంది. ఇప్పటికే నాట్లు పడ్డ చేలు అంతంత మాత్రంగా అందుతున్న నీటితో ఎండిపోయే స్థితి దాపురించింది. ఈ ఏడాది ఖరీఫ్ సాగును అతికష్టం మీద గట్టెక్కిన రైతులకు రబీలో ఆది నుంచే సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఏలేరు కింద ఆయకట్టులో కొంత శాతం నాట్లు వేసినా నీరందక ఎండిపోతున్నాయి. మిగిలిన ఆయకట్టులో నాట్లు పడని పరిస్థితి నెలకొంది. పిఠాపురం మండలంలో బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం, పి.తిమ్మాపురం, వెల్దుర్తి, పి.దొంతమూరు, గోకివాడ, మంగితుర్తి, కోలంక తదితర గ్రామాల పరిధిలో పల్లపు భూములతో పాటు మెట్ట ఆయకట్టు ఉంది. ఏలేరు పరిధిలో 15 వేల ఎకరాల్లో, చెరువుల కింద 7వేల ఎకరాల్లో వరి వేస్తున్నారు. గొల్లప్రోలు, కొత్తపల్లి, మండలాల్లోనూ ఏలేరుపై ఆధారపడి నాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే నాట్లుపడిన పొలాలకే నీటి ఎద్దడి ఎదురవగా మిగిలిన ప్రాంతంలో సుమారు 1500 ఎకరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏలేరు కాలువ అధ్వానస్థితిలో ఉండడం వల్ల నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, భారీవర్షాలు కురిస్తే తప్ప సాగునీటి కష్టాలు గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. వర్షాలు అధికంగా పడక పోతే ఏలేరు ఆయకట్టు కింద రబీ సాగు సగానికి పైగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏటా రూ.కోట్ల పంటనష్టం నాలుగు మండలాల్లో సాగుకు ఆధారమైన ఏలేరు ఆధునికీకరణ ఈ ఏడాది కూడా అటకెక్కింది. ఏలేరు కాలువలో పూడిక తీయకపోవడంతో గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీంతో ఏలేరు ద్వారా కేవలం అరకొర నీరు మాత్రమే వస్తోంది. అయినా నీటిపారుదల శాఖాధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఏటా సాగు నీరందక ఏలేరు రైతాంగం రూ.కోట్ల విలువైన పంటను నష్టపోతున్నా శాశ్వత చర్యలు తీసుకోవడంలో పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. వర్షాలు కురవకపోయినా కాలువ నిండా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటే సాగుకు ఇబ్బందులు ఉండవని, అయితే అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి, సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని కోరుతున్నారు. పుష్కరాలకు తొలి ప్రాధాన్యం రాజమండ్రి సిటీ : పుష్కరాలకు తొలి ప్రాధాన్యమిచ్చి, విజయవంతమయ్యేందుకు పారదర్శకంగా కృషి చేస్తానని నగర పాలక సంస్థ కొత్త కమిషనర్ జె.మురళి చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఆర్అండ్ బి అతిథిగృహంలో ఆయన ఇప్పటి వరకూ కమిషనర్‌గా ఉన్న రవీంద్రబాబు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న నాలుగు నెలల కాలాన్ని పుష్కరాలకే వెచ్చిస్తానన్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాల పుష్కర ప్రత్యేకాధికారిగా జె.మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.