gadde rammohan
-
రేషన్ పాయే.. మద్యం డోర్ డెలివరీ వచ్చే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘ఇక మద్యం తాగేందుకు వైన్‌షాపునకు రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరఫరా చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా మద్యం వ్యాపారులు ప్రచారానికి తెరలేపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట ప్రాంతంలోని ఓ వైన్‌షాపు నిర్వహకుడు ఈ రకంగా పోస్టులు పెట్టడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ఘోరం అంటూ పలువురు మండిపడుతున్నారు. సూపర్‌సిక్స్, అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మద్యం డోర్ డెలివరీ చేసేందుకు బరితెగిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటికే రేషన్ ఇస్తే.. ఇప్పుడేమో..ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనాల ద్వారా ఇంటికే రేషన్ సరఫరా చేశారని, నేడు కూటమి ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీ చేస్తోందంటూ ప్రజలు మండిపడుతున్నారు. మద్యం డోర్ డెలివరీ చేయడమే అభివృద్ధా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాయకులు జేబులు నింపుకొనే పనిలో ఉన్నారే కానీ ప్రజలకు చేసిన మంచి పని ఒక్కటీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఇంటికి మద్యం సరఫరా చేయడం కాదన్నారు. గత ప్రభుత్వంలా గుమ్మం వద్దకే పాలనను తీసుకెళ్లాలని, ఇంటి ముంగిటే సంక్షేమ పథకాలు అందించాలని హితవు పలుకుతున్నారు.ఎమ్మెల్యే అండతోనేనా..మద్యం హోం డెలివరీ చేసే వారికి తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అండతోనే పబ్లిక్‌గా ప్రచారం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మద్యం సిండికేట్లు సైతం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయా? అనే సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాలో అంటున్నారు. దోచుకో.. దాచుకో.. పంచుకో.. అనేలా కూటమి పాలన సాగిస్తోందంటున్నారు. -
కష్టం కార్పొరేటర్‌ది.. ప్రచారం ఎమ్మెల్యేది
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేటర్లు కౌన్సిల్లో శాంక్షన్ చేయించిన పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తానే చేయించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు ఆ పనులను మంజూరు చేయించిన కార్పొరేటర్ల ప్రమేయం లేకుండా ప్రచారం కోసం టెంకాయలు కొట్టి శంకస్థాపనలు చేస్తుంటే ఇదేమీ చోద్యం అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇలా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత ప్రభుత్వంలో మంజూరైన నిధులకు సంబంధించిన పనులకు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తూ అంతా తన ఘనతే అంటూ ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తుంది. ఇవే నిదర్శనం.. మూడో డివిజన్లోని రామచంద్రానగర్, నాగార్జున నగర్లో రోడ్లు నిర్మాణం కోసం ఎన్నికలకు ముందుకు కౌన్సిల్లో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, కో ఆప్షన్ సభ్యుడు ముసునూరు సుబ్బారావు ప్రతిపాదనలు పెట్టారు. ఆ పనులను అడ్డుకునేందుకు టీడీపీ వాళ్లు ప్రయత్నం చేయగా, కార్పొరేటర్, కో ఆప్షన్ సభ్యుడు పట్టుబట్టి వాటిని మంజూరు చేయించారు. ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్లి, ఆ పనులకు శంకుస్థాపన చేసి అంతా తన ఘనతే అని చెప్పుకుంటున్నారు. నాల్గవ డివిజన్ ఎనీ్టఆర్ కాలనీలో 2021లో పార్కు, జిమ్‌ను ప్రారంభించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో, నాటి కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. వాటిని మళ్లీ ఇటీవల ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెళ్లి రిబ్బన్ కట్ చేశారు. ఒకసారి ప్రారంభించిన పనిని మళ్లీ ప్రారంభించడం ఏమిటనీ ఆ ప్రాంత వాసులు నవ్వుకున్నారు. అంతేకాదు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. అవన్నీ ఎన్నికల కోడ్ సందర్భంగా నిలిచిపోయాయి. వాటన్నింటికి శంకుస్థాపనులు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు నాసిరకంగా కొంతమేర రిటైనింగ్‌వాల్ నిర్మించి, రిటైనింగ్ వాల్ ఘనత తమదే అంటూ ప్రచారం చెప్పుకోవడం విశేషం. తూర్పు నియోజకవర్గంలో 2014–19 కాలంలో కూడా కార్పొరేటర్లు చేసిన పనులను తానే చేసినట్లు చెప్పుకుంటున్నారని నాడు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా ప్రచారం చేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. నాడు అడ్డుకున్నారు.. నాగార్జున నగర్, రామచంద్రానగర్లలో రోడ్ల నిర్మాణం కోసం కౌన్సిల్లో పెడితే టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కానీ పట్టుబట్టి ఆమోదం చేయించాం. ఇప్పుడు మాకు చెప్పకుండా శంకుస్థాపన చేసి, వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. తాను కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత డివిజన్లో రూ.25 కోట్లతో అభివృద్ధి చేశాం. అంతా కళ్లకు కనిపిస్తుంది. ఎవరు అభివృద్ధి చేశారో కూడా ప్రజలకు తెలుసు. గత ప్రభుత్వంలో దేవినేని అవినాష్ సహకారంతోనే అభివృద్ధి చేయగలిగాం. – భీమిశెట్టి ప్రవల్లిక, 3వ డివిజన్ కార్పొరేటర్ -
నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సమన్వయం కొరవడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీనికి తోడు తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థి రాసలీలల వ్యవహారం సోషల్ మీడియాలో బట్టబయలవడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. జరుగుతున్న పరిణామాలన్నీ రానున్న ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంకేతాలుగా ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య అంతరం రోజు రోజుకు పెరుగుతోంది. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి, ఇద్దరూ కలిసి కనీసం ప్రచారంలో కూడా పాల్గొనటం లేదు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఓటర్లకు డబ్బు పంపకాలలో సైతం గద్దె రామ్మోహనరావు, ఎంపీ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోకుండా సొంత మనుషులతోనే పంపకాలు చేస్తున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన బొప్పన భవకుమార్ సైతం గద్దె వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో ఆయన్ను దూరంగా పెట్టడంతో కినుక వహించారు. గద్దె వ్యవహారం నచ్చక ఆయన అలకబూనారు. దీంతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్లు సైతం గద్దె రామ్మోహన్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు ప్రచారంతోపాటు, డబ్బు పంపిణీ కార్యక్రమాల్లో సైతం దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నిస్తేజం నెలకొంది. నానాటికీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారుతుండటంతో, కొంతమంది నేతలు సైలెంట్ అయిపోతున్నారు. ఈ పరిణామాలన్నీ ఓటమికి సంకేతాలుగా సూచిస్తున్నాయని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని, ఓటమి ఖాయం అనే భావనకు టీడీపీ వర్గాలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాసలీలల రామ్మోహన్!గద్దె అసంతృప్తి సెగలు తాకకుండా... విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లు గద్దె పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి గురించి పట్టించుకోలేదని అసంతృప్తితో ఉన్నారు. మాయ మాటలతో ప్రతిసారీ ఎన్నికల్లో మభ్యపెట్టడం, దుష్ప్రచారం చేసి నెట్టుకొస్తున్నాడనే భావన నియోజకవర్గ ఓటర్లలో వ్యక్తం అవుతోంది. దీనికితోడు తాజాగా గద్దె గలీజు బాగోతం బట్టబయలైంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఆయన రాసలీలల వ్యవహారం సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి రావటం విజయవాడలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈయన నిజస్వరూపం తెలిసి తూర్పు నియోజకవర్గ ప్రజలు ఛీకొడుతున్నారు. దీనికితోడు టీడీపీ ప్రభుత్వ హయంలో కాల్‌మనీ వేధింపుల కేసుల్లో నిందితులు కూడా ఈయన అండతోనే అలా వ్యవహరించారనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు పట్టించుకోలేదని, ఇన్నాళ్లకు గద్దె పాపాలు పండాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురి చేసి, దాడి చేయడంతో అతనిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇప్పుడు ఏకంగా గద్దె రామ్మోహనరావు వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇలా పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. వీరిరువురు విడివిడిగా ప్రచారం చేసుకొంటున్నారు. గద్దె రామ్మోహనరావు ఎంపీ అభ్యరి్థకి సహకరించటం లేదు. గత రెండేళ్లు నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా తానే ఖర్చు భరించానని, తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి గద్దె పట్టించుకోకపోవడంతో ఆయన తీరుపై ఎంపీ అభ్యర్థి కారాలు మిరియాలు నూరుతున్నారు. మొత్తం మీద తూర్పు నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయం అనే సంకేతాలను ఇస్తున్నాయి. రాసలీలల రామ్మోహన్! -
70 ఏళ్ల గద్దె రామ్మోహన్...35 ఏళ్ల అవినాష్ కి వణుకుతున్నాడు...
-
పలాయనవాదమే లక్ష్యం
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో ఏం మాట్లాడాలో దిక్కుతోచక, ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయంతో టీడీపీ పలాయనవాదాన్ని నమ్ముకుని, ఆచరిస్తోంది. ఇందులో భాగంగానే చట్టసభల ఖ్యాతిని దిగజారుస్తూ చిల్లర వ్యాఖ్యలతో స్పీకర్, అధికార పక్ష సభ్యులను చిరాకుపరుస్తోంది. తద్వారా సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు జారుకోవచ్చనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా బుక్కై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో టీడీపీ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో సభలో ‘స్కిల్’ స్కామ్‌పై మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, జైల్లో సౌకర్యాల గురించి అడ్డగోలుగా తప్పులు పట్టడం మినహా.. ఆయన నేరం చేయలేదని చెప్పేందుకు అవకాశం, ఆధారం లేక సభలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గురు, శుక్రవారాల్లో శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనే ఇందుకు సాక్షంగా నిలుస్తోంది. రెండవ రోజు శుక్రవారం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి వ్యవహరించారు. ఆకతాయిల మాదిరిగా స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై కాగితాలు చింపి విసిరేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ, బయటి నుంచి తెచ్చుకున్న విజిల్స్ ఊదుతూ అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. కుర్చీలు, బల్లలపై ఎక్కి తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే చర్చలో పాల్గొనాలని మంత్రులు సవాల్ విసిరినా పట్టించుకోలేదు. çసభా సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా గొడవ సృష్టించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లలో చిత్రీకరిస్తున్న ఇద్దరు సభ్యులను స్పీకర్ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేయగా, మరో ముగ్గురిని ఒకరోజు సస్పెన్షన్ చేశారు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్–చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై చేపట్టిన స్వల్ప కాలిక చర్చలో పాల్గొనకుండా పలాయనం చిత్తగించారు. సభ ప్రారంభమైంది మొదలు.. రెండో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సిద్ధమయ్యారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సభలోకి వస్తూనే స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలో పాల్గొని మీ వాదన వినిపించుకోవచ్చన్నారు. అయినా తక్షణమే చర్చకు పట్టుబడుతూ స్పీకర్‌పై కాగితాలు విరుసుతూ నినాదాలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రెండోసారి సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యుల చుట్టూ మార్షల్స్‌తో మూడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ తీరుపై మండిపాటు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులతో సహా పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూసి.. ఇలాంటి వారినా మనం ఎన్నుకున్నదని ప్రజలు సిగ్గు పడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై చర్చలో పాల్గొనే దమ్ము లేకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సైకో చంద్రబాబు పాలన ఎప్పుడో పోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్‌ను పొట్టనపెట్టుకున్న చంద్రబాబే అసలైన సైకో అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని దోచుకుని దొరకిపోయిన దొంగ చంద్రబాబు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని,ఆయనకు మెంటల్ సర్టిఫికెట్ ఉందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించకపోతే గన్ను తెచ్చి సభలో ఎవరో ఒకరిని కాల్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నిషేధం ఉన్నా సెల్ఫోన్లతో చిత్రీకరణ మూడంచెల భద్రతను ఏర్పాటుచేయడంతో టీడీపీ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు తమ సెల్ఫోన్ల ద్వారా సభలో దృశ్యాలను రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. నిబంధనను తుంగలో తొక్కి వీడియో రికార్డు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు స్పీకర్‌ను కోరారు. వీడియో రికార్డింగ్ చేసిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్‌లను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ రూల్ పాస్ చేశారు. దీంతో వీరిని మార్షల్స్ బయటకు పంపారు. ఈ దశలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడుతో సహా సభ్యులందరూ తమ వెంట తీసుకొచ్చిన విజిల్స్ ఊదుతూ సభలో గందరగోళం సృష్టించే యత్నం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ సహా టీడీపీ సభ్యులు కుర్చిలలో నిల్చొని విజిల్స్ ఊదుతూ హంగామా చేశారు. సభా సంప్రదాయాలను తుంగలోకి తొక్కి విలువలను దిగజారుస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరగా, ఎమ్మెల్యేలు గోరంట్ల, వెలగపూడి, నిమ్మలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. వారిని మార్షల్స్ బయటకు పంపగా, వారి వెంట మిగిలిన సభ్యులు కూడా వెళ్లిపోయారు. కనీసం మిగిలిన వాళ్లయినా చర్చలో పాల్గొనాలని మంత్రులు సహా పలువురు సభ్యులు కోరినా పట్టించుకోకుండా సభ నుంచి వెళ్లిపోయారు. -
దివ్యాంగుడిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె అనుచరుల జులుం
పటమట(విజయవాడతూర్పు): ‘రూ.2వేలు ఇస్తామని చెప్పి లోకేశ్ యువగళం పాదయాత్రకు తీసుకువెళ్లారు. వెళ్లిన తర్వాత కేవలం రూ.500 ఇచ్చి మోసం చేశారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు బెదిరిస్తున్నారు. దాడికి ప్రయత్నించారు.’ అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, 13వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, ఆయన కారు డ్రైవర్ దుర్గారావుపై పటమట కృష్ణానగర్‌కు చెందిన గద్దె తంబి అనే దివ్యాంగుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు... ‘ఈ నెల 20వ తేదీన విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలో జరిగిన నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు వస్తే రూ.2వేలు ఇస్తామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాకు చెప్పారు. అయితే, కేవలం రూ.500 మాత్రమే ఇచ్చారు..’ అని గతంలో తంబి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనుచరుడు, కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, ఆయన కారు డ్రైవర్ దుర్గారావు సోమవారం సాయంత్రం అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు తనను తీసుకువెళ్లారని తంబి ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ తనతో బలవంతంగా ఎమ్మెల్యేకు అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకున్నారని తెలిపారు. ఈ స్టేట్మెంట్ను సోషల్ మీడియాలో పెట్టడంతో తాను ప్రశ్నించానని, దీంతో తనపై దాడికి ప్రయత్నించారని తంబి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. తనను బెదిరించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ముమ్మినేని ప్రసాద్, దుర్గారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సీఐ కాశీవి«శ్వనాథ్ దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ నాయకుల హంగామా!
సాక్షి, విజయవాడ: మూడు రాజధానులు వద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం విజయవాడలో హంగామా సృష్టించారు. వీరి హడావుడి వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ వేదిక కళ్యాణమండపంలో చేపట్టిన 24 గంటల దీక్షను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. అనంతరం చినకాకానిలో చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధనంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడులతో కలిసి వారు బయలుదేరారు. బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నారా లోకేష్, కొల్లు రవీంద్ర, రామానాయుడులు ఓవర్ యాక్షన్ చేశారు. దీంతో పోలీసులు లోకేష్‌ను తొట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధా పోలీసుస్టేషన్ వద్దకొచ్చి ధర్నా చేశారు. పోలీసులను తిట్టిపోసిన బొండా ఉమా చినకాకాని వద్ద హంగామా సృష్టించడానికి బయలుదేరిన ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా బొండా ఉమా ఓ ఎస్ఐతో దురుసుగా వ్యవహరించారు. ‘నోరు మూసుకో.. ఖాకీ చొక్కాను ఎలా విప్పదీయించాలో నాకు తెలుసు’ అంటూ నోరు పారేసుకున్నారు. నిరసన తెలిపేందుకు మాత్రమే అనుమతి తీసుకుని మాజీ మంత్రి దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై హైడ్రామా సృష్టించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన 24 గంటల దీక్షకు స్పందన కరువైంది. -
కృష్ణలంక కరకట్ట వద్ద ఉద్రిక్తత
విజయవాడ : విజయవాడ కృష్ణలంక కరకట్ట వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొది. కరకట్ట సుందరీకరణ పేరుతో ఇళ్ల తొలగింపుకు రంగం సిద్ధం అయింది. అయితే పేదల ఇళ్లకు భరోసా తనదేనని గతంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇళ్ల తొలగింపుకు అధికారులు రావటంతో... గద్దె రామ్మోహన్ మొహం చాటేశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎమ్మెల్యే కరకట్ట వద్దకు రావాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. అంతేకాకుండా అధికారులు చేపట్టిన సర్వే ప్ర్రక్రియను అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
మంత్రి, ఎమ్మెల్యే గోడ గొడవ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారన్న విమర్శలు ఆ పార్టీ వర్గాల్లోనే వినవస్తున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో ఎప్పటి నుంచో కొనసాగుతున్న రాజకీయ వైరమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇద్దరి మధ్య నెలకొన్న వైరం తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ పనులు పూర్తయితే గద్దెకు నియోజకవర్గంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయని, పార్టీ అధినేత చంద్రబాబు వద్ద గ్రాఫ్ పెరుగుతుందనే అభద్రతా భావంతో ఉమా ఆటంకాలు కలిగిస్తున్నారని చెబుతున్నారు. కొందరు ఇంజనీర్లు ఒక వర్గంగా ఏర్పడి ఆయన చెప్పిన పనులను.. నిబంధనలకు వ్యతిరేకమైనా నిమిషాల్లో చేసేస్తున్నారు. మరికొందరు ఇంజనీర్లు అత్యుత్సాహంతో మంత్రిని వ్యతిరేకించే నేతల పనులకు బ్రేక్‌లు వేస్తున్నారు. కృష్ణానది రిటైనింగ్‌వాల్ నిర్మాణమే ఇందుకు ఉదాహరణగా ఉంది. కృష్ణానది వరదల సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురై ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజి దిగువన రిటైనింగ్‌వాల్ నిర్మాణం జరగకపోవడంతో ఎడమ వైపున విజయవాడలో బ్యారేజి నుంచి రామలింగేశ్వరనగర్ వరకు ఉన్న ప్రాంతం వరదకు మునిగిపోతోంది. 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో నదికి అనుకున్న అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. 15 రోజులపాటు ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అప్పటి ఎమ్మెల్యే యల మంచిలి రవి రిటైనింగ్ వాల్ నిర్మాణం అవసరాన్ని ప్రభుత్వానికి వివరించడంతో 2014 ఫిబ్రవరిలో రూ.104 కోట్ల విలువతో టెండర్లు ఆహ్వానించారు. అంచనాకన్నా 5.4 శాతం తక్కువ రేటుకు ఎస్‌ఈడబ్ల్యు, దీపిక కనస్ట్రక్షన్ సంస్ధ లు టెండరు దక్కించుకున్నాయి. 24 నెలల కాలపరిమితిలో రిటైనింగ్ వాల్ నిర్మిం చాలనే నిబంధన విధించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికే 14 నెలలు విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని కేసీ డివిజన్ దీనికి సంబంధించిన పనులను ముందుకు సాగనీయలేదు. సాధారణంగా ఇంజనీరింగ్శాఖలో టెండర్ల ఖరారు తరువాత నెలరోజుల్లో నిర్మాణసంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డరు ఇస్తుంది. రిటైనింగ్ వాల్ విషయంలో మాత్రం 14 నెలల తరువాత (జూన్ 2015లో) ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అగ్రిమెంట్ జాప్యం వెనుక ఇంజనీర్ల సహకారం ఉందన్న ఆరోపణలున్నాయి. అగ్రిమెంట్ కుదుర్చుకున్న తరువాత కూడా పనులు ప్రారంభించడానికి ఇంజనీరింగ్ శాఖ రీఇన్ఫోర్స్మెంట్కు సంబంధించి డిజైన్లు ఇవ్వలేదు. డిజైన్ల కోసం నిర్మాణసంస్థల ప్రతినిధులు ఐదునెలలుగా ఇంజనీర్లను కలుస్తున్నా ఇప్పటివరకు వాటిని తీసుకోలేక పోయారు. కేసీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కడియాల రవి ఈ డిజైన్లు ఇవ్వడంలేదని వారం రోజుల కిందట నిర్మాణసంస్థల ప్రతి నిధులు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈకి ఫిర్యాదు చేశారు. డిజైన్లు ఇప్పించాలని కోరారు. ఈ విషయమై కేసీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కె.రవిని ‘సాక్షి’ వివరణ కోరగా డిజైన్లు ఇచ్చామని, నిర్మాణసంస్థ పని ప్రారంభించుకోవచ్చని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారంటే ఈ మధ్యనే.. అన్నారు. డిజైన్లు ఇవ్వనందునే పని ప్రారంభం కావడం లేదనే మాటలు వినవస్తున్నాయని అడగగాా అదేం లేదు.. రెండు రోజుల్లో క్లియర్‌గా వివరాలు చెబుతా.. అంటూ దాటవేశారు. -
నిన్న కేశినేని.. నేడు యలమంచిలి
అధికార పార్టీలో ఆగని మాటల తూటాలు నేడు గద్దెపై యలమంచిలి రవి తీవ్ర ఆరోపణలు అధినేత వద్ద పంచాయితీలు విజయవాడ : జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఆదిపత్యపోరు తారాస్థాయికి చేరింది. జిల్లాలో ఎవరికి వారు తమ మాట నెగ్గాలని, తాను చెప్పినట్లు అధికారులు పనిచేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నేతల నోటి నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రాష్ట్ర డీజీపీ కూడా ‘ఎవరో.. ఏవేవో మాట్లాడుతుంటారు. వాటన్నింటినీ పట్టించుకోవాలా?..’ అంటూ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించారు. నాని వ్యాఖ్యలపై పార్టీ అధినేత, సీఎం చర్చలు జరుపుతుండగానే శనివారం ఉదయం పటమట రైతు బజారులో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై పలు ఆరోపణలు చేశారు. ఆయన వర్గం డబ్బులకు షాపులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. తన అనుచరులను రైతుబజారు నుంచి బయటకు పంపిస్తూ గద్దె అనుయాయులకు షాపులు కేటాయిస్తున్నారని యలమంచిలి ఆరోపించారు. ప్రజా సంక్షేమం గాలికొదిలి... ప్రజాసంక్షేమం గురించి టీడీపీ ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. ఎవరికి వారు అధికారులపై ఆధిపత్యం సాధించేందుకు పథకం ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఎంపీ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని అధిష్టానం ఆయన్ని వెంటనే హైదరాబాద్ పిలిపించింది. సీఎం చంద్రబాబు స్వయంగా ఎంపీతో మాట్లాడారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అధికారులకు తాను చెబుతానని, వారి సహకారం ఉంటుందని నానీకి సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ఆగ్రహం చల్లారింది. చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చిన ఎంపీ తాను పబ్లిక్‌లో కాకుండా పార్టీ నేతల వద్దే మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహాన్ని ఒక్కసారి వెళ్లగక్కడం, ఆ తరువాత సీఎం సర్దిచెప్పడంతో తాత్కాలికంగా పరిస్థితి చక్చబడింది. అయితే, తన మాటలు అధికారులు పట్టించుకోవడం లేదనే కోపంతోనే పార్టీలో జరుగుతున్న పరిణామాలను బయటపెట్టినట్లు ఎంపీ కేశినేని నాని చెప్పడం ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల ముందు నుంచే వైరం ఎన్నికలకు ముందు నుంచే దేవినేని ఉమాకు, కేశినేనికి మధ్య స్పర్థలున్నా యి. పార్టీ అధికారంలోకి రావడం, ఉమాకు మంత్రి పదవి దక్కడంతో అధికారులు ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ఎంపీ పిలిచినా పట్టించుకోవద్దని, ఆయన కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుంటారు..’ అని పలువురు అధికారుల వద్ద ఉమా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ విషయాలు తెలుసుకున్న ఎంపీ కేశినేని జిల్లా ఉమా జాగీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా ఎంపీ కేశినేని నానికి అనుకూలంగా ఉన్నారు. నాని వ్యాఖ్యలపై మంత్రి కొల్లు కూడా పలువురి వద్ద సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎం వద్దకు వెళ్లేందుకు యలమంచిలి సిద్ధం! ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ గెలుపు కోసం శ్రమించారు. మొదటి నుంచి తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని, ఈ విషయాన్ని చంద్రబాబు వద్దే తేల్చుకుంటానని పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్నారు. రవి మాటలను పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన శనివారం ఉదయం తనకు అన్యాయం జరుగుతోందని, తనతోపాటు వచ్చిన వారిని ఎక్కడా ఏ పనీ చేయనీయకుండా టీడీపీ వారే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యవహార శైలిపై సోమవారం చంద్రబాబు వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. నలిగిపోతున్న అధికారులు టీడీపీ ప్రజాప్రతినిధుల వ్యవహార శైలితో ప్రభుత్వ అధికారులు నలిగిపోతున్నారు. మంత్రికి సమాధానం చెప్పుకోలేక, ఎమ్మెల్యేలకు ఏంచెప్పాలో అర్థం కాక తికమక పడుతున్నారు. ఏ విషయమైనా తనకు తెలియకుండా చేయొద్దంటూ ఉమా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఎంపీ ఏకంగా బయటపడి మాట్లాడారు. పలువురు ఎమ్మెల్యేలు త్వరలోనే సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖలో ఏ తనిఖీలు, సమీక్షలు నిర్వహించినా ముందుగా తనకు తెలియజేయాలని మంత్రి కామినేని శ్రీనివాస్ హుకుం జారీచేయడంతో ఆ శాఖ జోలికి మాత్రం ఉమా వెళ్లడం లేదని సమాచారం. -
వీడని సస్పెన్స్
సాక్షి, విజయవాడ : నామినేషన్ల ముగింపునకు గడువు దగ్గరపడుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేయడంలో తాత్సారం చేస్తున్నారు. సీట్లకోసం ఆశావహులు పట్టుబడుతుండడంతో చివరి నిమిషంలో ఏం చేయాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింటిని బీజేపీకి కేటాయించారు. మిగిలినవాటిలో టీడీపీ 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. విజయవాడ తూర్పు, నూజివీడు స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న పెనమలూరు సీటు బోడే ప్రసాద్‌కు కేటాయించారు. తూర్పు సీటు గద్దె రామ్మోహన్‌కు ఇచ్చారని మంగళవారమే ప్రచారం జరిగినప్పటికీ బీఫారం అందకపోవడంతో ఆయన అభ్యర్థిత్వంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నూజివీడు సీటుకోసం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ముత్తంశెట్టి కృష్ణారావులు నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారు. హరికృష్ణ వస్తారంటూప్రచారం.. సినీనటుడు బాలకృష్ణకు హిందూపురం సీటు కేటాయించడంతో ఆయన సోదరుడు హరికృష్ణకు కృష్ణాజిల్లా నుంచి సీటు కేటాయిస్తారంటూ బుధవారం జోరుగా ప్రచారం జరిగింది. పెనమలూరు సీటు బోడే ప్రసాద్‌కు ఇవ్వడంతో హరికృష్ణకు నూజివీడు, విజయవాడ తూర్పు నియోజవర్గాల్లో ఏదో ఒకటి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన రాకను పార్టీ వర్గాలు ధ్రువీకరించడం లేదు. చంద్రబాబు , హరికృష్ణల మధ్య పొరపొచ్చాలున్న నేపథ్యంలో హరి గురించి మాట్లాడితే చంద్రబాబు ఆగ్రహిస్తారేమోనని నేతలంతా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా గద్దె పోటీ..! తూర్పు సీటు కేటాయించని పక్షంలో తిరుగుబావుటా ఎగురవేసేందుకు గద్దె రామ్మోహన్ సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమచారం. ఇప్పటివరకు తనకు సీటు కేటాయించకపోవడంతో ఆగ్రహించిన ఆయన బుధవారం చంద్రబాబుతో కాని, పార్టీ ప్రముఖులతో కాని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. గురువారం బీ ఫారం రాకపోతే గద్దె స్వయంగా నిర్ణయం తీసుకుని ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. బుధవారం గద్దె అనూరాధ భర్త రామ్మోహన్ తరఫున విజయవాడ తూర్పు స్థానానికి బీ ఫారం లేకుండానే నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సీటు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆయన ఏకంగా ఎంపీ అభ్యర్థిగానే రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో యలమంచిలి రవి కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.