gaganpahad
-
శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో శనివారం పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. నిత్యం ఈ రూట్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటూ రోడ్డును బ్లాక్ చేసి ఆందోళన చేపట్టారు వందల మంది స్థానికులు. దీంతో పోలీసుల ఎంట్రీతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అక్కడ. సిద్ధాంతి గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే.. వీఐపీ, విమాన ప్రయాణాలు చేసేవాళ్ల వాహనాలతో ఈ రోడ్లు నిత్యం బిజీగా ఉంటాయి. ఈ క్రమంలో వాహనాలు వేగంగా రావడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు. గాల్లో ప్రాణాలు కలుస్తున్నా పట్టించుకోవడం లేదని అధికారులను తిట్టిపోశారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు వందల మంది.. యాదయ్య మృతదేహంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళన భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. శంషాబాద్ నుంచి గగన్‌పహాడ్ వరకు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రోడ్డుపై బైఠాయించిన స్థానికులను అరెస్ట్ చేశారు. మరోవైపు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్లియరెన్స్‌కు చాలాసేపు పట్టింది. ఇంకోవైపు ఎయిర్పోర్ట్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వాహనాలను వదిలి ఎయిర్‌పోర్ట్‌కు పరుగులు పెట్టిన దృశ్యాలు కనిపించాయి. -
బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకల ఉండ!
సాక్షి, హైదరాబాద్: ఆమె 17 ఏళ్ల అమ్మాయి. గత 5 నెలలుగా ఆహారంతో పాటు ఆమె ఏం తింటోందో తెలుసా? తన వెంట్రుకలు..! అదేంటి ఎవరైనా వెంట్రుకలు తింటారా అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఈ విషయం తెలిసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అయితే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆ అమ్మాయి అప్పుడప్పుడూ తన వెంట్రుకలు తానే లాక్కుని తినేదని డాక్టర్లు గుర్తించారు. గగన్‌పహాడ్‌కు చెందిన ఎం.పూజితకు కడుపు నొప్పి రావడం, వాంతులు చేసుకుంటుండటంతో మే 31న ఆస్పత్రిలో చేర్పించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా, కడుపులో వెంట్రుకలు ఉండలా పేరుకుపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ పర్యవేక్షణలో డాక్టర్ రాణి, డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ పావని, డాక్టర్ పాండునాయక్ వైద్య బృందం జూన్ 2న ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. పెద్దపేగు, చిన్నపేగులో 120 సెంటమీటర్ల పొడవు, 2 కేజీల బరువు ఉన్న వెంట్రుకలతో కూడిన ఉండను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి కేసులు 68 నమోదు కాగా.. రాష్ట్రంలో మొదటిదని చెబుతున్నారు. చదవండి: సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం తరహాలో ఫ్యామిలీ పెన్షన్ -
బ్యాటరీ వ్యర్థాల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
శంషాబాద్ : లారీ బ్యాటరీ వ్యర్థాల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ బయట ఆగి ఉన్న నాలుగు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ.45 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ షర్క్యుట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం. ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. -
శంషాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం ; నాలుగు లారీలు దగ్ధం
-
ప్రైవేటు బస్సులపై అధికారుల కొరడా
రంగారెడ్డి : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. శంషాబాద్ గగన్‌పహాడ్ వద్ద శుక్రవారం ఉదయం రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా పలు బస్సులపై దాడులు జరిపారు. నిబంధనలు పాటించని 19 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు. -
అధికారుల తనిఖీలు..ఆరు బస్సులు సీజ్
హైదరాబాద్: నిబంధనలు పాటించని బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్ వద్ద సోమవారం ఉదయం అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పన్నులు ఎగవేస్తున్న, నిబంధనలను పట్టించుకోని ఆరు బస్సులను సీజ్ చేసి, 15 బస్సులపై కేసులు నమోదు చేశారు. -
డివైడర్‌ను ఢీకొన్న కారు... ఇద్దరికి తీవ్ర గాయాలు
శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గగన్‌పహాడ్ వద్ద శుక్రవారం స్విఫ్ట్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.