Gajwel Location Panchayat
-
వరాల వాన
► గజ్వేల్‌లో పత్తి, తూప్రాన్‌లో సాధారణ మార్కెట్‌యార్డులు ► మండల కేంద్రాల్లో మౌలిక వసతులకు రూ.కోటి ► పంచాయతీలకు రూ. 50 లక్షలు మదిరలకు రూ. 20 లక్షలు ► ప్రగతి భవన్ వేదికగా సీఎం కీలక నిర్ణయాలు గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై మరోసారి వరాల జల్లు కురిపించా రు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గజ్వేల్ నగర పం చాయతీ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ ముఖ్య నేతలతో ఆయన సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జేసీ హన్మంతరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి.... ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల వినతులపై సానుకూలంగా స్పం దించారు. పత్తి క్రయ విక్రయాల్లో రాష్ట్రంలోనే ప్రముఖ మార్కెట్‌గా గుర్తింపు సాధించిన గజ్వేల్‌లో కాటన్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తూప్రాన్‌లో సాధారణ మార్కెట్‌యార్డు నిర్మించనున్నామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తామన్నారు. నిధుల వెల్లువ.. మండల కేంద్రాలు, ఐదు వేల జనాభా కలిగిన పంచాయతీలలో మౌలిక వసతుల కల్పనకు రూ. కోటి, సాధారణ గ్రామ పంచా యతీలకు రూ. 50 లక్షలు, మధిరలకు రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ కో సం ప్రత్యేకంగా రూ. ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 750 జనాభా కలిగిన ప్రతి గ్రా మాన్ని ఇక నుంచి గ్రామ పంచాయతీగా పరిగణిస్తామన్నారు. ఈ ప్రక్రియను గజ్వేల్ నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంప్‌యార్డుల నిర్మా ణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధి దళిత వాడలనుంచే ప్రారంభం కావాలని మార్గనిర్దేశం చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి గ్రామాల్లో పాడుబడిన బావులు, వదిలేయడంతో పాడుబడిన ఇండ్లు కూల్చేయడంతోపాటు గ్రామాల్లో అపారిశుద్ధ్యాన్ని తొలగిం చడానికి ఉద్యమస్థాయిలో ప్రయత్నం జరగాలని సీఎం తెలిపారు. హరిత హారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే గాకుండా, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పటికీ అభివృద్ధి చేయకుండా మిగిలిపోయిన రోడ్లను వెంటనే ‘డబుల్’గా మార్చాలని, ఇందుకోసం నిధులు ఎన్నైనా ఇవ్వడానికి సిద్ధమ ని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇండ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లను, వేలాడుతున్న విద్యుత్ వైర్లను రెండు నెలల్లోపు సరిచేయాలని, అవసరమైతే పవర్‌డే నిర్వహించాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. గజ్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రికి మరో రెండు అంబులెన్సులను అదనంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులపై వెంటనే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. 11న గజ్వేల్‌లో మరోసారి సమీక్ష ప్రగతిభవన్‌లో మిగిలిపోయిన అంశాలకు సంబంధించి మరోసారి ఈ నెల 11న గజ్వేల్‌లో సమీక్ష నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీ క్షలో మంత్రి హరీష్‌రావుతోపాటు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జేసీ హన్మంతరావు ఉంటారని పేర్కొన్నారు. మరోసారి విస్తృతంగా చర్చ జరిపి నివేదికలను తనకు అందజేయాలని ఆదేశించారు. ఇంకా ఈ సమీక్షలో టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, వంటిమామిడి మార్కె ట్ కమిటీ చైర్మన్ జహంగీర్, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
నేడు సీఎం రాక
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు మోడల్ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలకూ.. మినీ ట్యాంక్‌బండ్‌గా.. పాండవుల చెరువుకు శ్రీకారం గజ్వేల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం గజ్వేల్ నగర పంచాయతీలో పర్యటించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత మార్చి 12న ఇక్కడ పర్యటించి పట్టణానికి కొత్తరూపు తీసుకురావడానికి పలు ప్రతిపాదనలకు ఆదేశించిన కేసీఆర్ వాటికి కార్యరూపమిస్తూ ఆ పనులకు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో మరోసారి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. వివిధ బలగాలు భారీగా మోహరించాయి. ఇదీ సీఎం పర్యటన షెడ్యూల్.. ► ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం గజ్వేల్ చేరుకుంటారు. ► తొలుత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్మించతలపెట్టిన వంద పడకల ఆసుపత్రికి, పాలశీతలీకరణ కేంద్రం వెనుక భాగంలోని స్థలంలో ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ► కస్తుర్బాగాంధీ పాఠశాల ప్రాంగణంలోని 20 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో బాలికల కోసం టెన్త్ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు, పాలిటెక్నిక్‌లోని 45 ఎకరాల ప్రాంగణంలో బాలుర కోసం టెన్త్ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు, హాస్టళ్లతో కూడిన ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి, హౌసింగ్ బోర్డు మైదానంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ► సంగాపూర్‌లో ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ వెనుక భాగంలో ఉన్న 68 ఎకరాల్లో మోడల్ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన. ► రూ.8.50 కోట్లతో అభివృద్ధి చేయనున్న పాండవుల చెరువు నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ► రాజిరెడ్డిపల్లిలోని రాజీవ్ రిక్రియేషన్ పార్కు సందర్శన.. విలేకరుల సమావేశం. ► మధ్యాహ్నం ఒంటిగంటకు ములుగు మండలం మర్కుక్ పీహెచ్సీ తదితర నిర్మాణాలకు శంకుస్థాపన. -
గజ్వేల్‌లో 20న సీఎం పాదయాత్ర
* అధికారికంగా కార్యక్రమం ఖరారు * వరంగల్ తరహాలో పర్యటన * అన్ని శాఖల అధికారులూ అప్రమత్తం గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నగర పంచాయతీలో ఈనెల 20న పాదయాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యుల్ అధికారికంగా ఖరారైంది. ఈ విషయాన్ని ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు ‘సాక్షి’కి తెలిపారు. తన సొంత నియోజకవర్గంలోని గజ్వేల్ నగర పంచాయతీని దేశంలోనే బంగారుతునకగా మారుస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసారం గ్రామాల్లో గల 20 వార్డుల్లో సీఎం పాదయాత్ర జరుపనున్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ప్రజల నుంచి స్వయంగా విజ్ఞప్తులను స్వీకరించనున్నారు. వరంగల్ పర్యటన తరహాలో ఈ కార్యక్రమం ఉండబోతోందని భావిస్తున్నారు. సీఎంగా ఎన్నిక కాగానే 2014 జూన్ 4న ఇక్కడ పర్యటించిన కేసీఆర్.. నగర పంచాయతీకి రింగు రోడ్డు, గోదావరి శాశ్వత మంచినీటి పథకం ప్రకటించిన సంగతి తెల్సిందే. అదేవిధంగా 2014 నవంబర్ 30న జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి భారీగా వరాలు కురిపించారు. ప్రత్యేకించి మండల కేంద్రా లు, గ్రామాలు, మదిర గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.50 కోట్లు, ఆర్అండ్బీ, పంచాయతీ రోడ్లకు సైతం విరివిగా నిధులు మంజూరు చేశారు. తాజాగా ఈనెల 20న గజ్వేల్ నగర పంచాయతీలో పాదయాత్రకు సన్నద్ధమవుతుండగా పట్టణానికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలో తమ శాఖల సంబంధించిన పనులు, ఫిర్యాదులపై ఆరా తీస్తున్నారు.