► గజ్వేల్‌లో పత్తి, తూప్రాన్‌లో సాధారణ మార్కెట్‌యార్డులు
► మండల కేంద్రాల్లో మౌలిక వసతులకు రూ.కోటి
► పంచాయతీలకు రూ. 50 లక్షలు మదిరలకు రూ. 20 లక్షలు
► ప్రగతి భవన్ వేదికగా సీఎం కీలక నిర్ణయాలు
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై మరోసారి వరాల జల్లు కురిపించా రు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గజ్వేల్ నగర పం చాయతీ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ ముఖ్య నేతలతో ఆయన సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జేసీ హన్మంతరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి.... ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల వినతులపై సానుకూలంగా స్పం దించారు. పత్తి క్రయ విక్రయాల్లో రాష్ట్రంలోనే ప్రముఖ మార్కెట్‌గా గుర్తింపు సాధించిన గజ్వేల్‌లో కాటన్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తూప్రాన్‌లో సాధారణ మార్కెట్‌యార్డు నిర్మించనున్నామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తామన్నారు.
నిధుల వెల్లువ..
మండల కేంద్రాలు, ఐదు వేల జనాభా కలిగిన పంచాయతీలలో మౌలిక వసతుల కల్పనకు రూ. కోటి, సాధారణ గ్రామ పంచా యతీలకు రూ. 50 లక్షలు, మధిరలకు రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ కో సం ప్రత్యేకంగా రూ. ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 750 జనాభా కలిగిన ప్రతి గ్రా మాన్ని ఇక నుంచి గ్రామ పంచాయతీగా పరిగణిస్తామన్నారు. ఈ ప్రక్రియను గజ్వేల్ నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంప్‌యార్డుల నిర్మా ణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధి దళిత వాడలనుంచే ప్రారంభం కావాలని మార్గనిర్దేశం చేశారు.
గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి
గ్రామాల్లో పాడుబడిన బావులు, వదిలేయడంతో పాడుబడిన ఇండ్లు కూల్చేయడంతోపాటు గ్రామాల్లో అపారిశుద్ధ్యాన్ని తొలగిం చడానికి ఉద్యమస్థాయిలో ప్రయత్నం జరగాలని సీఎం తెలిపారు. హరిత హారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే గాకుండా, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పటికీ అభివృద్ధి చేయకుండా మిగిలిపోయిన రోడ్లను వెంటనే ‘డబుల్’గా మార్చాలని, ఇందుకోసం నిధులు ఎన్నైనా ఇవ్వడానికి సిద్ధమ ని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇండ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లను, వేలాడుతున్న విద్యుత్ వైర్లను రెండు నెలల్లోపు సరిచేయాలని, అవసరమైతే పవర్‌డే నిర్వహించాలని ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. గజ్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రికి మరో రెండు అంబులెన్సులను అదనంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులపై వెంటనే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
11న గజ్వేల్‌లో మరోసారి సమీక్ష
ప్రగతిభవన్‌లో మిగిలిపోయిన అంశాలకు సంబంధించి మరోసారి ఈ నెల 11న గజ్వేల్‌లో సమీక్ష నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీ క్షలో మంత్రి హరీష్‌రావుతోపాటు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జేసీ హన్మంతరావు ఉంటారని పేర్కొన్నారు. మరోసారి విస్తృతంగా చర్చ జరిపి నివేదికలను తనకు అందజేయాలని ఆదేశించారు. ఇంకా ఈ సమీక్షలో టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, వంటిమామిడి మార్కె ట్ కమిటీ చైర్మన్ జహంగీర్, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
వరాల వాన
Published Tue, Mar 7 2017 12:13 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement